13, జూన్ 2016, సోమవారం

న్యస్తాక్షరి - 34 (జ-న్మ-భూ-మి)

అంశము- భారతమాతృ స్తుతి
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘జ - న్మ - భూ - మి’ ఉండాలి.

71 కామెంట్‌లు:

  1. జనని భరత మాత జయము జయమ్ము; జ
    న్మమిట గలుగుటనది మాదు వరము
    భూరి సంపదలును పొంగారగా మాకు
    మిగుల కీర్తి నిచ్చు మగువ వీవు!

    రిప్లయితొలగించండి
  2. జనని కంటె మిన్న జనియించు దేశము
    న్మన సుతోన దెలిపె మధుర మనుచు
    భూమి జనుల కెల్ల బోధించె రాముడు
    మిగుల ప్రీతి గొలుపు మేల నంగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా, మీ పూరణ బాగుంది.
      కొంత అన్వయదోషం ఉంది. ‘జననికంటే మిన్న జన్మభూమి యని స|న్మతిని దెలిపె నదియె మధుర మనుచు’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. క్షమించాలి
      ముందుగా " జన్మభూమి " అనేరాసాను కానీ రెండు మాట్లు వస్తుంది గదా అని మళ్ళీ మార్చాను .ఈ మధ్య కొంచం మనస్సాంతి లేక అస్సలు రాయలేక పోతున్నను . సవరణ జేసినందుకు ధన్య వాదములు

      తొలగించండి
    3. జనని కంటె మిన్నజన్మభూమి యనిస
      న్మతిని దెలిపె నదియె మధుర మనుచు
      భూమి జనుల కెల్ల బోధించె రాముడు
      మిగుల ప్రీతి గొలుపు మేల నంగ

      తొలగించండి
  3. గురువుగారూ, ఛందస్సు కి భంగం లేకుండా వ్రాయడం సాధ్యమేనా.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ, న్మ కి ముందు అక్షరం మొదటి పాదంలో గురువు అవ్వాలి కదా. అప్పుడు చివరన సూర్య గణం కుదరదు. ఒకే పదంలో పాదం మారినా, సంయుక్తాక్షరానికి ముందరి అక్షరం గురువు అవుతుందని భావించి అడిగాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవెలదిలో మొదటిపాదం చివర ఇంద్రగణమే ఉంటుంది. రగణం (UIU), నగం (IIIU) చివరి అక్షరాలు గురువులే కదా! అందువల్ల రెండవపాదం మొదటి అక్షరం సంయుక్తాక్షరమైతే ఇబ్బంది లేదు.

      తొలగించండి
    2. గురువుగారూ, క్షంతవ్యుడను. మీరు చెప్పేవరకు, దృష్టి ఆటవెలది అని చదువుతోంది. మెదడు తేటగీతి గణాలనే భావిస్తోంది. ఈ రోజు బుఱ్ఱ సరిగా పని చేయలేదు. మన్నించండి.

      తొలగించండి
  5. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ.....

    జగడము వలదనెడి శాంతి దేశము నందు జ
    న్మము గలుగ తరించె నాదు తనువు
    భూనభోంతరమున పుణ్యమౌ కర్మ భూ
    మి,యిది నిజము నిజము వినుడి జనులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  6. జయము జయము తల్లి జన్మభూమీ లస
    న్మయ సుశోభిత మహిమాను వర్తి!
    భూ నభోంతరముల బుణ్యంపు చరితతో
    మిసిమి వెల్గు లీను వసుధ వీవు!

    రిప్లయితొలగించండి

  7. జనని భరత భూమి జగతికే వెలుగు!; త
    న్మయము తోడ జనము మసల వలయు!
    భూమి మట్టి మహిమ పుణ్యంబు నెరుగుచు
    మిళిత మవగ జనులు మేలు గలుగు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      చివరిపాదాన్ని ‘మిళిత మైన జనులు మేలు గంద్రు’ అంటే బాగుంటుందేమో? ‘అవగ’ అన్నది సాధువు కాదు.

      తొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. జగదభి నుత ధర్మ సత్యాను చరిత త
    న్మయుల కాలవాలమ యిది రత్న
    భూషితాంబుధి వృతము విమల పుణ్య భూ
    మి మన భారతావని మరువకుము

    రిప్లయితొలగించండి
  10. న్యస్తాక్షరి..జ న్మ భూ మి-ఆటవెలది-భారతమాత
    --
    జననితుల్యమగుటసకలముబొందుజ న్మబడయుకతనదనుమనకునెపుడు భూరితనముగూర్చుపుడమితల్లికిదియే మిక్కుటమగునతులుసక్కజేతు

    రిప్లయితొలగించండి
  11. జగతి లోన సకల జ్ఞానులు ఋషులు జ
    న్మమ్ము నొంది ధర్మ మార్గ మొసగ
    భూత నాథు డున్న పూజిత భరత భూ
    మి స్తుతి౦తు మెపుడు మేలు గల్గ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మి స్తుతింతు' మన్నపుడు మి గురువు కాదు. 'మిని స్తుతింతు' మనండి.

      తొలగించండి
  12. జన్మభూమి ఘనము సతతముఁబ్రజకు జ
    న్మనిడి పెంచినట్టి మాతకన్న
    భూమిపైవసించు బుధులెప్డు పుట్టిన
    మిట్టిలోకలువ భ్రమించుచుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. న్మనిడిపెంచినట్టి జనని కన్న

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      తెలుగులో మిట్టి పదం ఉందా? నాకు సందేహమే. 'మట్టిలో కలువ భ్రమం బడుదురు' అంటే?

      తొలగించండి
    3. గురువర్యులకు నమస్సులు. చివరిపాదం "మి" తో మలవ్వాలిగదా.
      జన్మభూమి ఘనము సతతముఁబ్రజకు జ
      న్మనిడి పెంచినట్టి జననికన్న
      భూరి కీర్తిఁగొన్న బుధులు కన్న భూ
      మిపొరలో కలువ భ్రమించుచుంద్రు

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కారం? అర్జునుడి ధ్వజంపై గరుడుని చిహ్నమా?

      తొలగించండి
  14. జనహితైషులైన శాంతిదూతలకుజ
    న్మనొసగితివి ప్రేమమయులువారు
    బూనిజ్ఞానసిరులమోఘంబుగాపంచ్రి
    వినతిభారతాంబఘనచరిత్ర ఐతగోని వేంకటేశ్వర్లు.నల్లగొండ
    వినుతి గాంచితీవుభారతాంబ

    రిప్లయితొలగించండి
  15. జనహితైషులైన శాంతిదూతలకుజ
    న్మనొసగితివి వారు నవ్యపథము
    భూరికృషిని సలిపి భారతాంబరొమీకు
    మిగులకీర్తొసగిరివివిధములుగ
    ఐతగోని వేంకటేశ్వర్లు..నల్లగొండ
    సరిచేసినమీద

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఐతగోని వేంకటేశ్వర్లు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అన్ని విధాల మొదటి పూరణ బాగున్నది. అందులో 'వినుతి గాంచి తీవు భారతాంబ' అన్న అదనపు పాదంలో యతి తప్పింది. మీ రెండవ పూరణలో 'కీర్తి + ఒసగిరి' అన్నప్పుడు సంధి లేదు. కీర్తి నొసగిరి... లేదా కీర్తి యొసగిరి అని ఉండాలి. నాలుగవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. జగతి హితము గోరి జానకీపతికి-జ
      న్మనిడె దశరథుంండమల యశుంండు.
      భూరి రత్న గర్భ పున్నెంంపు భరత-భూ
      మి ఘనతయన స్వరము మీరిపోవు.

      తొలగించండి
  18. జన్మనిచ్చు తల్లి జననికో ఋణము జ
    న్మమొనరు భువి భరతమాతకొకటి
    భూమి భాషలెల్ల పొంగు తేనె తెలుగు
    మిగులు యీ ఋణమ్ము మిగులు వరకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      జననికి... అనండి. ఒకను ఓ అనరాదు. అలాగే 'మిగులు నీ ఋణమ్ము' అనండి.

      తొలగించండి
  19. సార్ మిగులకీర్తినొసగి వేవిధములు గా నాల్గవపాదాన్ని
    సార్ మకు వకు సంభావనాయతి యున్నదిగదా? ఐతగోని వేంకటేశ్వర్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనుస్వారంతో కూడిన వకారానికి మకారంతో యతి చెల్లుతుంది. మ-వ లకు యతి చెల్లదు.

      తొలగించండి
  20. సంభావనావడి ని మరోసారిపరిశీలించండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంభావనాయతి అనేది లేదు. కోవెల సంపత్కుమారాచార్యుల తెలుగు ఛంద:పదకోశమును పరిశీలించాను.

      తొలగించండి
  21. సార్ తెలుగులో ఛందోవిశేషాలనే గ్రంథాన్ని ఇటీవలే చదివాను.అక్కడ సంభావనావడి అని కేవలం మకు వకు..అలాగే స్నానశబ్ధయతి అని...
    మహాభారతపద్యమని..ఒకచంపకమాల చరణం..
    మదిమదినుండి యేను బలవంతుడనై..ఉదాహరణనిచ్చారు.
    ధన్యవాదములు..మీతో చర్చించేంత పండితుడ గాను.సహృదయతతో స్వీకరిస్తారని....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘తెలుగులో ఛందోవిశేషములు’ అన్న పుస్తకం నావద్ద ఉన్నది. మీ వ్యాఖ్య చూసిన తర్వాత ఆ గ్రంధాన్ని పరిశీలించాను. 159, 160, 161 పేజీలలో యతిభేదాల పట్టిక ఇచ్చారు. అందులో మీరు చెప్పిన సంభావనాయతి లేదు. అలాగే స్నానశబ్ద యతి కూడా లేదు. మీ వద్ద ఉన్న పుస్తకం వేరొక రచయితదై ఉంటుంది. కోవెల వారి ఛందఃపదకోశం లోను లేవు.

      తొలగించండి
    2. చ.మద మడఁగించి భూపతిసమాజము నెల్లను నిన్నుఁ గొల్వఁజే
      యుదునని పూని దిగ్విజయ మున్నతిఁజేసి మహావిభూతితో
      మదిమదినుండ నీ సుతుఁడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
      పద గొని యంతఁ బోవక సభన్‌ ద్రుపదాత్మజ భంగపెట్టరే. భా. ఉద్యో. 3.280

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      సరియైన పాఠం ఇచ్చి సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా దగ్గర ఉద్యోగ పర్వము వరకే మహా భారతముంది. అంతవరకు శోధించిన దొరకిన పద్య మిది.

      తొలగించండి
  22. జగతి,ప్రగతిగూర్చుజన్మభూమి|మన-జ
    న్మతలిదండ్రి ,గురువు మరలపంచ
    భూతములను మరువ పుట్టుకేది?
    మిహిరుడున్నఫలమ?దహనమగుటె|

    రిప్లయితొలగించండి
  23. జయము జన్మ భూమి! జనయిత్రి వీవు, జ
    న్మ నిడు తల్లి తోడు మహిత వీవె!
    భూమి యందు భరత భూమియే దివి కన్న
    మిన్న యౌనటంచు సన్నుతింతు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పై పద్యము లోని మూడవ పాదం లోని 'యందు ' కు బదులుగా 'పైని ' అని మార్చి వ్రాశాను. ఇలా వుంటేనే బాగుంటుందేమో, పరిశీలించి సూచింప కోరుతున్నాను. ("స్వర్గ లోకం కన్నా భూలోకం లోని భరత భూమియే గొప్పది" అని చెప్పాలన్నది ఉద్దేశ్యం.) ధన్యవాదములు.
      జయము జన్మ భూమి! జనయిత్రి వీవు, జ
      న్మ నిడు తల్లి తోడు మహిత వీవె!
      భూమి పైని భరత భూమియే దివి కన్న
      మిన్న యౌనటంచు సన్నుతింతు!

      తొలగించండి
    2. మరి కొన్ని మార్పులతో మరొక పద్యము వ్రాశాను. చూడ గోరుతాను. ధన్యవాదములు.
      జయము జన్మ భూమి! జనయిత్రి వీవు, జ
      న్మ నిడు తల్లి తోడు మహిత వీవె!
      భూమి పైని భరత భూమియే యగుచుండు
      మిన్న, మీద యున్న మిన్ను కన్న!

      తొలగించండి
    3. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భూమిపైన... మీద నున్న...’ అనండి.

      తొలగించండి
  24. జన్మభూమి కన్న చదలు లేదనుచు త
    న్మయముగనెలు గెత్తి జయములిడుచు
    భూరిజమును బొగడ బులకించగా మేను
    మిన్న యౌపుడమిని సన్నుతింతు!!!

    చదలు = స్వర్గము

    రిప్లయితొలగించండి
  25. జన్మ భూమి నాది కర్మ భూమి నిట జ
    న్మ నిడుటయును గొప్ప నంద మయ్యు
    భూనభోంతరాళ భూరిదైనట్టియు
    మిక్కుటంబు నైన మిట్ట భూమి

    రిప్లయితొలగించండి
  26. జనని ఋణము దీర్చ సచ్ఛీలు లందరు
    న్మరణ మొందు దనుక మరువ రాదు .
    భూమి పంట నిడుచు కామితముల దీర్చ
    మిగుల సంతసించి బొగడ దగును

    రిప్లయితొలగించండి
  27. భరతమాతా!
    జనత పుడమి పైన జైకొట్టు నీకు!జ
    న్నమిల పొంది నట్టి మనుజు డెపుడు
    భూమిఁ జచ్చు లోపు పులకింతు నను నీదు
    మిత్తికఁ దన నుదురు హత్తినంత!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జన్మమిల’... ‘జన్నమిల’ అయింది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో:
      భరతమాతా!
      జనత పుడమి పైన జైకొట్టు నీకు!జ
      న్మమిల పొంది నట్టి మనుజు డెపుడు
      భూమిఁ జచ్చు లోపు పులకింతు నను నీదు
      మిత్తికఁ దన నుదురు హత్తినంత!

      తొలగించండి
  28. జయము నొందు నెపుడు జగతిలో నాకు జ
    న్మమ్ము నిచ్చినట్టి నాదు పుడమి
    భూరిసిరుల తోడ భూతలమందున
    మిన్న గాను నిలిచె మిక్కుటముగ

    జనుల లోన భరత జాతిలో నరులు జ
    న్మమును పొంద ఘనము మనదు దేశ
    భూరి సంస్కృతదియె పుడమిలోనవెలుగు
    మిన్నగాను జూడ మేటి యదియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సంస్కృతి+అదియె’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘సంస్కృతి యది’ అనండి.

      తొలగించండి
  29. 1జనని భారతమ్మ జన్మమెత్తితిమి,స
    న్మతిని యొసగి కావుమమ్మ మమ్ము
    భూరి సంపదున్న పుడమిలో నీచెంత
    మిగుల నిమ్ము చాలు మేలు కలుగు.

    2.జయము నొసగు మమ్మ జగతిలో ప్రజకు,స
    న్మనము నొసగవమ్మ మంగళాంగి
    భూమిలోన నిన్ను పొగడంగ తరమౌన
    మిగుల ప్రేమతోడ మేలు చేయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సన్మతి నొసంగి... సంపద గల’ అని మొదటిపూరణలో, ‘..నొసగుమమ్మ...మే లొసంగు’ అని రెండవపూరణలో వ్రాయండి.

      తొలగించండి
  30. జనగణమది నుత విశాల ధాత్రి, స్థిరస
    న్మతి శుభప్రదాత్రి , మహిత చరిత
    భూషిత జన కీర్తి ,పుణ్యాబ్ది భరత భూ
    మి నిజమోక్ష గామి మేటి స్ఫూర్తి

    రిప్లయితొలగించండి