12, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2435 (తమ్ముని కొడుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ"

76 కామెంట్‌లు:



  1. నమ్ముము! నిను వరించిన నల్ల వాడు
    తమ్ముని కొడుకు! పెండ్లికిఁ దగదు చనగ,
    పిండి, పప్పుబెల్లములని బేర మిచట
    వరునికి వలయు కట్నము వస్తుచయము !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. వమ్ము గాదట ప్రియముగ నమ్మి యున్న
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ !దగదు చనగ
    పెద్ద రికముల హోదాల సద్దు వలదు
    మంచి మరియాద లందున మసలు కొనగ

    రిప్లయితొలగించండి
  3. మఱచి రేమొనన్నని పోవ మనసు పడక
    తెలిసి దాక్షాయిణీ సతీ కలచి వేత
    పిలువనట్టి పేరంటపు వేదన విడ
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ!

    రిప్లయితొలగించండి
  4. తమ్ముని తనయునికి భార్య తాత గారి
    తమ్ముని తనయకు వదిన తల్లి సవతి
    తమ్ముని మనుమరాలికి తండ్రి గారి
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ;
    కులము వరుస సరియెగాని గోత్ర మొకటె!

    రిప్లయితొలగించండి
  5. ఉత్తరాభిమన్యుల గూర్చు యుపయమనము
    మనదు నజ్ఞాత వాసంపుటునికి తెలుపు
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
    ననియె ధర్మజుండు వినఁగ ననుజులచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...చనగ। ననిరి..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :
      ఉత్తరాభిమన్యుల గూర్చు యుపయమనము
      మనదు నజ్ఞాత వాసంపుటునికి తెలుపు
      తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
      ననియె ధర్మజుండు, వినఁగ ననుజులచట!

      తొలగించండి
    3. కర్తృపదం 'అనుజులు' బహువచనం. క్రియాపదం 'అనియె' ఏకవచనం. "అనిరి... అనుజులచట" అని కదా ఉండవలసింది!

      తొలగించండి
    4. గురుదేవులకు ప్రణామములు. విరామ చిహ్నము నుంచి ధర్మజుని కర్తృపదముగా సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

      తొలగించండి
    5. నిజమే... విరామ చిహ్నాన్ని గమనించలేదు. ఇప్పుడన్ని విధాల మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
    6. సహదేవుఁడు గారు మీ పూరణ బాగుంది.
      ఉత్తర గోగ్రహణ నివారణానంతరము జరుగుతుంది ఉత్తరాభిమన్యుల పెండ్లి. అప్పటికి పాండవుల యజ్ఞాత వాసము పరిసమాప్త మవుతుంది.

      తొలగించండి
    7. సహదేవ సారూ! ఇది ఎవరు వ్రాసిరి?


      సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా
      సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్
      రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై
      సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !

      తొలగించండి
    8. 🙏🙏🙏🙏
      నూతన ఛందపు సృష్టికి
      చేతన 'మేల్చూరి' వారు చిందించుచు చే
      యూతగ ప్రశంస నిడుచున్
      ప్రీతికరముగ నొలికించ వెలువడె నయ్యా!

      తొలగించండి
    9. కామేశ్వరరావు గారికి ధన్యవాదాలు. తమరి సమాచారమునకు ధన్యుడను.

      తొలగించండి
    10. అది సరే కానీ ఆ పద్యమును వ్రాసిన వారు డా. విష్ణునందన్...

      తొలగించండి
    11. మన్నించండి. ఏల్చూరి మురళీధరరావుగారు కూడా
      ఒక పద్యమును వ్రాసినట్లుంది. పొరబడ్డాను.

      తొలగించండి
  6. వధువు నెచ్చెలి కూతురు వైభవముగ
    జరుగు పరిణయ మందున నరుగ బూను
    పడతి కనె భర్త వరుడందు వైరి కగును
    తమ్ముని కొడుకు, పెండ్లికిఁ దగదు చనగ

    హ.వేం.స.నా.మూ

    రిప్లయితొలగించండి
  7. భార్యను వదలి, బంధువుల్ వద్దనంగ
    వచ్చి వృద్ధాశ్రమమ్మునఁ బడితి, నేడు
    తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ,
    మరల యింటికి నన్ను రమ్మంద్రు గనుక!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదంలో నాకిష్టం లేని అఖండయతిని వేయవలసి వచ్చింది!

      తొలగించండి

    2. యతిని, అఖండ జీవనం రమ్మంటుందేమో నండి :)

      మరల రమ్మందురేమో మమతల బడికి

      జిలేబి

      తొలగించండి



    3. జోహారుల్ కవి! శంకరాభ రణ తేజోమూర్తి ! శ్రీ శంకరా
      ర్యా ! హారమ్ముగ నిచ్చటన్, పసిగొనన్ యావత్కవుల్ సర్వదా,
      బాహాస్ఫాలనమాచరించి, జనులన్ పద్యమ్ము లన్ వ్రాయను
      త్సాహంబుల్ నెలగొల్పి నెక్కొన, భళీ స్తైమిత్యమై నిల్చిరీ !

      జిలేబి

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      ధన్యవాదాలు. 'నిల్చిరే' అనండి.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      “మరల యింటికి నన్నువే తరలు మనరె” అనిన నెట్లుండును?

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      చాలా బాగుంటుంది. ధన్యవాదాలు!

      తొలగించండి
  8. (అంగదుని వివాహ సందర్భం - వెళదామంటున్న భార్య రుమతో సుగ్రీవుడు )
    అంగదుని పెండ్లి కెటుపోదు మతివ చెపుమ ;
    అపుడు దుందుభిని వధించి నట్టి వాలి
    నాటి నుండి చంపగ నెంచె నన్ను; తనదు
    తమ్ముని; కొడుకు పెండ్లి కి దగదు చనగ

    రిప్లయితొలగించండి
  9. తమ్ముని కొడుకు పెండ్లి కి ద గ దు చ న గ
    కట్నకాన్కలు గై కొ ని ఘ న త జూ ప
    హంగు లార్భా ట ము లు జేరనింగి న న గ
    నేహ్య భావము పుట్టించునె వ రి కై న

    రిప్లయితొలగించండి
  10. శత్రువులకను నిత్యము సాయపడుచు
    దేశ సంక్షేమమున్ వీడి తిరుగుచున్న
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
    ఖలుని విషయము ప్రభుతకు తెలుపవలయు

    రిప్లయితొలగించండి





  11. వనిత రో విను నామాట వాసి గాను

    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

    వట్టి చేతుల తోడను వడిగ తెమ్ము

    నుంగరమ్మునొ గొలుసునొ నుత్సుకతన.



    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

    వినుము వారలిడిన యట్టి వెతల నెల్ల

    మరువ గాలేను తలచిన మరల దుఃఖ

    మొదవు నయ్య నెటుల వచ్చు నుత్సుకతయు.



    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

    ననుట భావ్యము గాబోదు నన్నదమ్ము

    లందు   వచ్చిన తగవుల నన్ని మరచి

    చనుట సరియైన దనుమాట సమ్మతంబు.


    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

    చనిన మనగుట్టు రట్టగు జగతి యందు

    జరుపును జనార్ధనుండట చక్కగాను

    ననుచు నర్జును తోపల్కె నన్న యపుడు.

    రిప్లయితొలగించండి
  12. అరి సెగలు గ్రక్కు శరమును
    గురిజూచుచువేయ వడకె కోతులు చెమటల్
    మరిగారె రామ శరణని
    పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్.

    రిప్లయితొలగించండి
  13. తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
    నెందు లకుదగ దు చనగ ? నెప్పు డైన
    మిమ్ముల నవ మానించె నా ? మిక్కిలిగను
    గాని యెడల నే గుట బాగు గాదలంతు

    రిప్లయితొలగించండి


  14. అన్న దమ్ముల యనబంధ మణగ ద్రొక్కి
    చేరె ప్రతిపక్ష పార్టిలో చెనటి వాడు
    పదవి సొమ్ముల నాశించి పార్టి వీడు
    తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ.

    రిప్లయితొలగించండి
  15. తే.గీ. 'పెద్ద నాన్నా' యనుచు బ్రీతి పిలుచు నెవడు?
    పిలిచి నంతనె పోవలె ప్రేమ మీర
    తరచు కలహాలు జరిగెడి తావు దరికి
    తమ్ముని కొడుకు;పెండ్లికి;దగదు చనగ.
    -- గుఱ్ఱం జనార్దన రావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.

    ( భార్యతో భర్త )

    మనకు, వారికి లేవుగా మాటలనుచు

    " తమ్ముని కొడుకు పెండ్లికి తగదు
    చనుట"
    యనవలదు; వారు వచ్చి యాహ్వాన
    మిడిరి
    తెగిన బంధము లతుకును తిరిగి
    యిపుడు
    కలహము లశాశ్వతమ్ములు తెలుసు
    కొనుము.

    రిప్లయితొలగించండి
  17. ధర్మజుడు ఉత్తరాభిమన్యుల వివాహమునకు ఆహ్వానము పంపగా, దుర్యోధనుని తలపు.

    కోరి గోగ్రహణంబున పోరి యకట
    నొక్కడుండగ పార్థుని నుక్కడచయు
    చేత గాక నేడిచట నే చింతనుంటి
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

    రిప్లయితొలగించండి
  18. తప్పక జనవలె నతి ముదమ్ముతోడ
    నాలుబిడ్డల గూడుచు నాసరాగ
    తమ్ముని కొడుకు పెండ్లికి; తగదు చనగ
    తగిన మర్యాదదొరకని తావునెచట!

    రిప్లయితొలగించండి
  19. . ప్రేమపెంపున తలిదండ్రి పెద్దజేయ?
    కామవాంచాయు కళ్ళకు గంతగాగ|
    పెళ్లి కార్యాలయము నందుబెట్టుకొనగ|
    తమ్ముని కొడుకు పెళ్లికితగదు చనగ
    అన్నకవమాన మనియెంచి మిన్నకుండె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కామవాంచయు' టైపాటు...

      తొలగించండి
  20. బంధు మిత్త్రుల నెల్లరఁ బరమ మోద
    మునఁ బిలిచి కలహము లున్నఁ బుత్త్ర నిభునిఁ
    బేర్మి మీఱ మానసమునఁ బిలువ కుండ
    తమ్ముని, కొడుకు పెండ్లికిఁ దగదు చనఁగ

    రిప్లయితొలగించండి
  21. అకిలేష్ యాదవ్ తమ్ముడు ప్రతీక్ యాదవ్ గ్రహ ప్రవేశమునకు పిలువ వెళ్ళ వలదు అని భార్య మాలతీ యాదవ్ కు చెప్ప్పు సందర్భము
    కోరి పిలచెప్ర తీకుడు కూర్మి తోడ
    కొత్త సౌధ ప్రవేశము కొరకు యిపుడు,
    మాలతీ వాడు శత్రువు, మరువ వలదు
    వాడి నీచపు బుద్ధులు వాడి యిoటి
    కెపుడు వెళ్ళవలదు సుమా, యెపుడు, నాదు
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ"
    యనుచు అఖిలేష్ పలికె ప్రో యలు గాంచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొరకు నిపుడు.. చనగ ననుచు నఖిలేశ్... ప్రోయాలు..' అనండి.

      తొలగించండి
  22. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    శల్యు డిట్లనె కౌరవేశ్వరుని గా౦చి :-

    ఫల్గుణ సుతుని యొక్క వివాహమునకు =

    తమ్ముని కొడుకు పె౦డ్లికి దగదు చనగ |

    తక్కు లాడైన యా ఘటోత్కచుడు , మాయ

    గాడయిన నల్లవాడు చుల్కన యొనర్చి

    నారలు మన లక్ష్మణు నలనాడు క౦టె ! !

    { ఫల్గుణ సుతుడు = అభిమన్యుడు

    తక్కులాడు = టక్కులాడు = మోస గాడు ; }

    రిప్లయితొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మొ ద టి పా ద ౦ స వ ర ణ ::

    శకుని యిట్లనె కౌరవేశ్వరుని గా౦చి

    రిప్లయితొలగించండి
  24. మేనరికములు తగవని మేధనుంచి
    తనయ నీయగ దలచిన తమ్మునంపి
    యే ముఖమ్మున నే గెద విందువదన
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ ? దగదు చనగ

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    అశ్రు పూరిత నయనను హనుమ గనుచు
    నరి సెగలు గ్రక్కి పారగ నగ్ని రగుల
    దైత్యులాకాన వడకగ తగుల బెట్ట
    గర్వమడ గారె రాజుకు గాంచినంత

    రిప్లయితొలగించండి
  25. వాడు పాశ్చాత్యదేశ సంబంధియయ్యె
    తెల్లపడుచును చేపట్టె తెగువఁజూపి.
    దూరభారము!భరియించు తీరులేదు!
    తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ

    రిప్లయితొలగించండి
  26. మరియొక భావన.

    (భర్త భార్యతో)
    కలికి!నాచేతిలో చిల్లిగవ్వ లేదు.
    అప్పు చేయుట సరియౌనె!తప్పుతప్పు!!
    ఎంత మమకారమున్న నేనేమిసేతు.
    తమ్ముని కొడుకు పెండ్లకి తగదు చనగ.

    రిప్లయితొలగించండి
  27. లగ్నమొకటె పెళ్లిల్లు చూడ మరి రెండు
    తరుణి! నాదు మాట వినుము! తగును నాదు
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దరల, నీదు
    తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ!!

    రిప్లయితొలగించండి
  28. వలసబోయి యమేరికావాసుడయ్యె
    తంబి.యతని సుతునకు నుద్వాహ మచట
    రాను పోను యనుమతి పత్రములు లేక
    తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
    ననుచు తనకత డొనరించిన కటకటల
    నేకరువు పెట్టు సతినాపి నిండు మనము
    నన్ని మరచి యేగెను పేర్మి యావహింప

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
    ననుచు తనకత డొనరించిన కటకటల
    నేకరువు పెట్టు సతినాపి నిండు మనము
    నన్ని మరచి యేగెను పేర్మి యావహింప

    రిప్లయితొలగించండి