12, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2435 (తమ్ముని కొడుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ"

76 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



నమ్ముము! నిను వరించిన నల్ల వాడు
తమ్ముని కొడుకు! పెండ్లికిఁ దగదు చనగ,
పిండి, పప్పుబెల్లములని బేర మిచట
వరునికి వలయు కట్నము వస్తుచయము !

జిలేబి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వమ్ము గాదట ప్రియముగ నమ్మి యున్న
తమ్ముని కొడుకు పెండ్లికిఁ !దగదు చనగ
పెద్ద రికముల హోదాల సద్దు వలదు
మంచి మరియాద లందున మసలు కొనగ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మఱచి రేమొనన్నని పోవ మనసు పడక
తెలిసి దాక్షాయిణీ సతీ కలచి వేత
పిలువనట్టి పేరంటపు వేదన విడ
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

తమ్ముని తనయునికి భార్య తాత గారి
తమ్ముని తనయకు వదిన తల్లి సవతి
తమ్ముని మనుమరాలికి తండ్రి గారి
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ;
కులము వరుస సరియెగాని గోత్ర మొకటె!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్తరాభిమన్యుల గూర్చు యుపయమనము
మనదు నజ్ఞాత వాసంపుటునికి తెలుపు
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
ననియె ధర్మజుండు వినఁగ ననుజులచట

vsnmhari చెప్పారు...

వధువు నెచ్చెలి కూతురు వైభవముగ
జరుగు పరిణయ మందున నరుగ బూను
పడతి కనె భర్త వరుడందు వైరి కగును
తమ్ముని కొడుకు, పెండ్లికిఁ దగదు చనగ

హ.వేం.స.నా.మూ

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...చనగ। ననిరి..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

భార్యను వదలి, బంధువుల్ వద్దనంగ
వచ్చి వృద్ధాశ్రమమ్మునఁ బడితి, నేడు
తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ,
మరల యింటికి నన్ను రమ్మంద్రు గనుక!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :
ఉత్తరాభిమన్యుల గూర్చు యుపయమనము
మనదు నజ్ఞాత వాసంపుటునికి తెలుపు
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
ననియె ధర్మజుండు, వినఁగ ననుజులచట!

కంది శంకరయ్య చెప్పారు...

చివరి పాదంలో నాకిష్టం లేని అఖండయతిని వేయవలసి వచ్చింది!

కంది శంకరయ్య చెప్పారు...

కర్తృపదం 'అనుజులు' బహువచనం. క్రియాపదం 'అనియె' ఏకవచనం. "అనిరి... అనుజులచట" అని కదా ఉండవలసింది!

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(అంగదుని వివాహ సందర్భం - వెళదామంటున్న భార్య రుమతో సుగ్రీవుడు )
అంగదుని పెండ్లి కెటుపోదు మతివ చెపుమ ;
అపుడు దుందుభిని వధించి నట్టి వాలి
నాటి నుండి చంపగ నెంచె నన్ను; తనదు
తమ్ముని; కొడుకు పెండ్లి కి దగదు చనగ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ప్రణామములు. విరామ చిహ్నము నుంచి ధర్మజుని కర్తృపదముగా సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

Zilebi చెప్పారు...


యతిని, అఖండ జీవనం రమ్మంటుందేమో నండి :)

మరల రమ్మందురేమో మమతల బడికి

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

నిజమే... విరామ చిహ్నాన్ని గమనించలేదు. ఇప్పుడన్ని విధాల మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

Zilebi చెప్పారు...




జోహారుల్ కవి! శంకరాభ రణ తేజోమూర్తి ! శ్రీ శంకరా
ర్యా ! హారమ్ముగ నిచ్చటన్, పసిగొనన్ యావత్కవుల్ సర్వదా,
బాహాస్ఫాలనమాచరించి, జనులన్ పద్యమ్ము లన్ వ్రాయను
త్సాహంబుల్ నెలగొల్పి నెక్కొన, భళీ స్తైమిత్యమై నిల్చిరీ !

జిలేబి

Unknown చెప్పారు...

తమ్ముని కొడుకు పెండ్లి కి ద గ దు చ న గ
కట్నకాన్కలు గై కొ ని ఘ న త జూ ప
హంగు లార్భా ట ము లు జేరనింగి న న గ
నేహ్య భావము పుట్టించునె వ రి కై న

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
ధన్యవాదాలు. 'నిల్చిరే' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

బాపూజీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

శత్రువులకను నిత్యము సాయపడుచు
దేశ సంక్షేమమున్ వీడి తిరుగుచున్న
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ
ఖలుని విషయము ప్రభుతకు తెలుపవలయు

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...






వనిత రో విను నామాట వాసి గాను

తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

వట్టి చేతుల తోడను వడిగ తెమ్ము

నుంగరమ్మునొ గొలుసునొ నుత్సుకతన.



తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

వినుము వారలిడిన యట్టి వెతల నెల్ల

మరువ గాలేను తలచిన మరల దుఃఖ

మొదవు నయ్య నెటుల వచ్చు నుత్సుకతయు.



తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

ననుట భావ్యము గాబోదు నన్నదమ్ము

లందు   వచ్చిన తగవుల నన్ని మరచి

చనుట సరియైన దనుమాట సమ్మతంబు.


తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

చనిన మనగుట్టు రట్టగు జగతి యందు

జరుపును జనార్ధనుండట చక్కగాను

ననుచు నర్జును తోపల్కె నన్న యపుడు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

chakkani padyam .nijamaina nijam. sOdaraa !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అరి సెగలు గ్రక్కు శరమును
గురిజూచుచువేయ వడకె కోతులు చెమటల్
మరిగారె రామ శరణని
పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్.

subbarao చెప్పారు...

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
నెందు లకుదగ దు చనగ ? నెప్పు డైన
మిమ్ముల నవ మానించె నా ? మిక్కిలిగను
గాని యెడల నే గుట బాగు గాదలంతు

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...



అన్న దమ్ముల యనబంధ మణగ ద్రొక్కి
చేరె ప్రతిపక్ష పార్టిలో చెనటి వాడు
పదవి సొమ్ముల నాశించి పార్టి వీడు
తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ.

gurram.jana@gmail.com చెప్పారు...

తే.గీ. 'పెద్ద నాన్నా' యనుచు బ్రీతి పిలుచు నెవడు?
పిలిచి నంతనె పోవలె ప్రేమ మీర
తరచు కలహాలు జరిగెడి తావు దరికి
తమ్ముని కొడుకు;పెండ్లికి;దగదు చనగ.
-- గుఱ్ఱం జనార్దన రావు.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.

( భార్యతో భర్త )

మనకు, వారికి లేవుగా మాటలనుచు

" తమ్ముని కొడుకు పెండ్లికి తగదు
చనుట"
యనవలదు; వారు వచ్చి యాహ్వాన
మిడిరి
తెగిన బంధము లతుకును తిరిగి
యిపుడు
కలహము లశాశ్వతమ్ములు తెలుసు
కొనుము.

ఫణి కుమార్ తాతా చెప్పారు...

ధర్మజుడు ఉత్తరాభిమన్యుల వివాహమునకు ఆహ్వానము పంపగా, దుర్యోధనుని తలపు.

కోరి గోగ్రహణంబున పోరి యకట
నొక్కడుండగ పార్థుని నుక్కడచయు
చేత గాక నేడిచట నే చింతనుంటి
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ

seethadevi gurram చెప్పారు...

తప్పక జనవలె నతి ముదమ్ముతోడ
నాలుబిడ్డల గూడుచు నాసరాగ
తమ్ముని కొడుకు పెండ్లికి; తగదు చనగ
తగిన మర్యాదదొరకని తావునెచట!

Unknown చెప్పారు...

. ప్రేమపెంపున తలిదండ్రి పెద్దజేయ?
కామవాంచాయు కళ్ళకు గంతగాగ|
పెళ్లి కార్యాలయము నందుబెట్టుకొనగ|
తమ్ముని కొడుకు పెళ్లికితగదు చనగ
అన్నకవమాన మనియెంచి మిన్నకుండె.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

బంధు మిత్త్రుల నెల్లరఁ బరమ మోద
మునఁ బిలిచి కలహము లున్నఁ బుత్త్ర నిభునిఁ
బేర్మి మీఱ మానసమునఁ బిలువ కుండ
తమ్ముని, కొడుకు పెండ్లికిఁ దగదు చనఁగ

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
“మరల యింటికి నన్నువే తరలు మనరె” అనిన నెట్లుండును?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సహదేవుఁడు గారు మీ పూరణ బాగుంది.
ఉత్తర గోగ్రహణ నివారణానంతరము జరుగుతుంది ఉత్తరాభిమన్యుల పెండ్లి. అప్పటికి పాండవుల యజ్ఞాత వాసము పరిసమాప్త మవుతుంది.

కంది శంకరయ్య చెప్పారు...

ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జనార్దన రావు గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కామవాంచయు' టైపాటు...

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
చాలా బాగుంటుంది. ధన్యవాదాలు!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

సహదేవ సారూ! ఇది ఎవరు వ్రాసిరి?


సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా
సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్
రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై
సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !

pks kumar చెప్పారు...

అకిలేష్ యాదవ్ తమ్ముడు ప్రతీక్ యాదవ్ గ్రహ ప్రవేశమునకు పిలువ వెళ్ళ వలదు అని భార్య మాలతీ యాదవ్ కు చెప్ప్పు సందర్భము
కోరి పిలచెప్ర తీకుడు కూర్మి తోడ
కొత్త సౌధ ప్రవేశము కొరకు యిపుడు,
మాలతీ వాడు శత్రువు, మరువ వలదు
వాడి నీచపు బుద్ధులు వాడి యిoటి
కెపుడు వెళ్ళవలదు సుమా, యెపుడు, నాదు
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ"
యనుచు అఖిలేష్ పలికె ప్రో యలు గాంచి

gurumoorthy చెప్పారు...

………………………………………………
గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


శల్యు డిట్లనె కౌరవేశ్వరుని గా౦చి :-

ఫల్గుణ సుతుని యొక్క వివాహమునకు =

తమ్ముని కొడుకు పె౦డ్లికి దగదు చనగ |

తక్కు లాడైన యా ఘటోత్కచుడు , మాయ

గాడయిన నల్లవాడు చుల్కన యొనర్చి

నారలు మన లక్ష్మణు నలనాడు క౦టె ! !

{ ఫల్గుణ సుతుడు = అభిమన్యుడు

తక్కులాడు = టక్కులాడు = మోస గాడు ; }

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మొ ద టి పా ద ౦ స వ ర ణ ::

శకుని యిట్లనె కౌరవేశ్వరుని గా౦చి

Bhagavatula Krishna Rao చెప్పారు...

మేనరికములు తగవని మేధనుంచి
తనయ నీయగ దలచిన తమ్మునంపి
యే ముఖమ్మున నే గెద విందువదన
తమ్ముని కొడుకు పెండ్లికిఁ ? దగదు చనగ

నిన్నటి దత్తపది కి నా పూరణ

అశ్రు పూరిత నయనను హనుమ గనుచు
నరి సెగలు గ్రక్కి పారగ నగ్ని రగుల
దైత్యులాకాన వడకగ తగుల బెట్ట
గర్వమడ గారె రాజుకు గాంచినంత

BVVHBPrasadarao చెప్పారు...

వాడు పాశ్చాత్యదేశ సంబంధియయ్యె
తెల్లపడుచును చేపట్టె తెగువఁజూపి.
దూరభారము!భరియించు తీరులేదు!
తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ

BVVHBPrasadarao చెప్పారు...

మరియొక భావన.

(భర్త భార్యతో)
కలికి!నాచేతిలో చిల్లిగవ్వ లేదు.
అప్పు చేయుట సరియౌనె!తప్పుతప్పు!!
ఎంత మమకారమున్న నేనేమిసేతు.
తమ్ముని కొడుకు పెండ్లకి తగదు చనగ.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

లగ్నమొకటె పెళ్లిల్లు చూడ మరి రెండు
తరుణి! నాదు మాట వినుము! తగును నాదు
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దరల, నీదు
తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ!!

Unknown చెప్పారు...

వలసబోయి యమేరికావాసుడయ్యె
తంబి.యతని సుతునకు నుద్వాహ మచట
రాను పోను యనుమతి పత్రములు లేక
తమ్ముని కొడుకు పెండ్లికి తగదు చనగ

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొరకు నిపుడు.. చనగ ననుచు నఖిలేశ్... ప్రోయాలు..' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదాలు

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదాలు

Unknown చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
ననుచు తనకత డొనరించిన కటకటల
నేకరువు పెట్టు సతినాపి నిండు మనము
నన్ని మరచి యేగెను పేర్మి యావహింప

Unknown చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
ననుచు తనకత డొనరించిన కటకటల
నేకరువు పెట్టు సతినాపి నిండు మనము
నన్ని మరచి యేగెను పేర్మి యావహింప

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏🙏🙏🙏
నూతన ఛందపు సృష్టికి
చేతన 'మేల్చూరి' వారు చిందించుచు చే
యూతగ ప్రశంస నిడుచున్
ప్రీతికరముగ నొలికించ వెలువడె నయ్యా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కామేశ్వరరావు గారికి ధన్యవాదాలు. తమరి సమాచారమునకు ధన్యుడను.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

అది సరే కానీ ఆ పద్యమును వ్రాసిన వారు డా. విష్ణునందన్...

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

http://kandishankaraiah.blogspot.in/2013/02/977.html?m=1

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మన్నించండి. ఏల్చూరి మురళీధరరావుగారు కూడా
ఒక పద్యమును వ్రాసినట్లుంది. పొరబడ్డాను.