1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2453 (తరువులన్ రక్ష సేయుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తరువులన్ రక్ష సేయుట తగని చర్య"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

  1. విరుపులన్ జేయకుండుట మరువ కయ్య
    తరువులన్; రక్ష సేయుట తగని చర్య
    యతుల ప్రాసల దోషముల్ మితులు మీర
    శంకరాభరణమ్మున వంక లేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. విరుపుతో పూరణలు చేస్తున్నా కవులు మాత్రం శంకరాభరణంతో అతుక్కుపోతున్నారు కదా!"

      ...కంది శంకరయ్య

      అది శంకర మహిమ. "న భూతో న భవిష్యతి"...

      ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
  2. ప్రాణవాయువు నిచ్ఛెడు పలురకముల
    చెట్లునాటుట,పెంచుట,చేయఁదగును
    ముండ్లకంపలతోఁగూడి ముప్పుఁదెచ్చు.
    తరువులన్ రక్షసేయుట తగనిచర్య

    రిప్లయితొలగించండి
  3. గాలి వానకు నగరమ్ము కదలి పోయె
    గొప్ప చెట్లెన్నొ నేలకు కూలి పోయె
    వృక్ష రక్షకులార! జీవించ లేని
    తరువులను రక్ష చేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  4. పరువపు ప్రాయమందున బాలలకును
    మరులు గొలిపించి తలపుల మత్తునకును
    మూలమైనట్టి గంజాయి బోలునట్టి
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "పరువపుం బ్ర్రాయమందున..." అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు. పు గురువా కాదా అని తర్జన భర్జన పడి, ఏక సమాసమే కదా అని వ్రాశాను. మీ తీర్పు తర్వాత లఘువే అని రూఢి అయినది.

      తొలగించండి
  5. ధరణిపై నున్న నరులకు దప్పని పను
    లివ్వి;ప్రాణరక్షణ కేమి సేయవలయు?
    నగరవృద్ధికై చెట్లను నరకుచుంట?
    తరువులన్ రక్షసేయుట; తగనిచర్య.

    రిప్లయితొలగించండి
  6. అడ్డ దారిని పొందగ నధిక ధనము
    అడ్డు లేకుండ సాగింప నవని యందు
    వర్తకంబు చేయుచునున్న వారి భంగ
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  7. చెలిమికలిమియౌ పువ్వుతీవియలఁ నరకి
    ధర్మరతియను గంధిచందనమునుడిపి
    ప్రాణినిష్కరుణాఖ్యదుర్భావవిషపు
    తరువులన్ రక్షఁజేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  8. ప్రథమ కర్తవ్యమదియేను వసుధ జనుల
    తరువులన్ రక్ష సేయుట, తగని చర్య
    పట్టణముల నిర్మాణపు పనుల పేర
    నడవుల తెగ నరకుటయె, హాని కరము


    ప్రాణ వాయువు నిచ్చు సత్ఫలము లిచ్చు
    నీడ నిచ్చుచు నిరతమ్ము నిన్ను గాచు
    తరువులన్ రక్షసేయుట తగని చర్య
    యనుచు తలచుటె మూఢత్వ మదియె నిజము

    రిప్లయితొలగించండి
  9. గురువుల నవమానించుట గొప్పగొనుచు
    పరువు దీయగ రాముని పౌరుషమును
    కరకు మాటలు నిండిన కావ్యములను
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య!

    రిప్లయితొలగించండి

  10. వరముగ నిలిచె భువిలోన వనము లన్ని
    నీవు నిలువ, కర్తవ్యము నీరజాక్షి
    తరువులన్ రక్ష సేయుట,తగని చర్య
    వాటిని పడగొట్టుట లేమ, వలదు వలదు!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శ్వాసకోశపు ర౦ధ్రాల చావు తెచ్చు ;

    కేన్స రను పు౦డు చే వడకి౦చి చ౦పు ;

    ప్రాణములు పోవును పొగాకు వలన | నట్ట

    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  12. సకలజనులకర్తవ్యము సంతతమ్ము
    తరువులన్ రక్షచేయుట, తగనిచర్య
    ప్రకృతినాశము చేయుట వసుధలోన

    తెలిసి వసియించుడీభువితీరుగాను

    Asnreddy

    రిప్లయితొలగించండి
  13. పచ్దద న ము ను పెంచంగ ప్రతిన బూని
    మొక్క ల ను నాటి పోషింప ముద ము గూర్చు
    తరు వు ల ను రక్ష సే యు ట ;త గ ని చర్య
    వృక్ష ము ల న ర కు టి ల కు వె త ల నిచ్చు

    రిప్లయితొలగించండి
  14. విషపుగాలుల వెదజల్లు వృక్షములను
    ఫలములను నీడ నీయని పాదపముల
    పెక్కు భూగర్భజలమును పీల్చునట్టి
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.

    హరిత వనముల తలపించు తరుల
    తతులు
    ప్రాణ వాయువు నిచ్చి కాపాడుచున్న

    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    యనుచు పలుకు వారిని మూర్ఖులనుట
    చెల్లు.

    రిప్లయితొలగించండి
  16. యువత మాదక ద్రవ్యాల యుచ్చులోన
    చిక్కి సృజనాత్మకత వీడి చిదిగి పోవ
    నైచ్యమది జనావాసాల నడుమ భంగి
    తరువులన్ రక్ష సేయుట, తగని చర్య!

    రిప్లయితొలగించండి
  17. మంచి యారోగ్యమివ్వంగ మౌనివలెను
    బెంచ రక్షించు భువనమ్ము నెంచగాను
    తరువులన్; రక్ష సేయుట తగని చర్య
    ప్రాణహానిని గూర్చెడు పాదపముల!

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పౌరులెల్లర కిప్పుడు బాధ్యతయ్యె
    పుడమి వాతావరణము కాపుగడ జేయు
    తరువులన్ రక్ష సేయుట; తగని చర్య
    గాదె కల్పవృక్షమ్ముల కడపు టదియ?




    రిప్లయితొలగించండి
  19. పరుల మేలు కొరకు పుట్టె దరువు లన్ని
    సకల ఫలముల నిచ్చుచూ సాకు చుండు
    ప్రాణ వాయువునిచ్చుచూ బ్రతుకు నిలుపు
    మండు టెండలో కాపాడు నీడ నిచ్చి
    గొడుగు వోలె రక్షణనిచ్చు కుంభ వృష్టి
    యందు, మనుజుల బాధ్యత యనగవచ్చు
    తరువులన్ రక్షసేయుట , తగని చర్య
    దరణిలో మానవాళికి తరువు ఉసురు
    దీయ, ఘోర తప్పిదముది ,తెలుసు కొనుము
    తల్లి రొమ్మును తన్నెడు దనయు వోలె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇచ్చుచూ' అనడం గ్రామ్యం. "ఇచ్చుచు/ ఇచ్చుచున్" అనండి.

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పసిమి లేక మోడుగ నౌచు పండనట్టి
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య
    పచ్చదనము ఫలములతో పరిఢవిల్లు
    పాదపమ్ముల బెంచుచు పర్వు మెపుడు




    రిప్లయితొలగించండి
  21. తే.గీ.వేని పోషింప ప్రగతియె వెల్లి విరియు ?
    పాలకులు చేయదగు తొలి పనియదేది ?
    దైవ దూషణ యెపుడైన ధరణి లోన
    తరువులన్ ; రక్ష సేయుట ; తగని చర్య.

    రిప్లయితొలగించండి
  22. తరువు మూలాన లాభాలు దండి గలుగ
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య
    యనుట నుచితమే ?మీకునో యమ్మ ! యరయ
    పెంచ వలయును వాటిని నంచితముగ

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేటి పోషింప దాపులు వెలయు చుండు?
    రక్షణభటులకు తగు కర్తవ్య మేది?
    నమ్ము వారికి వంచన నడపుటేమి?
    తరువులన్, రక్షసేయుట, తగనిచర్య





    రిప్లయితొలగించండి
  24. స్వార్థమెంతయో పెరుగుచున్ వనము లందు
    వర్ష కారకమ్మని దెల్సి పచ్చదనము
    రాజకీయాశ్రయమ్ములుఁ బ్రబలి నరుకఁ
    దరువులన్, రక్ష సేయుట తగని చర్య!

    రిప్లయితొలగించండి


  25. సత్వరముగ ఫలములను సతము నొసగు

    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    యనుట భావ్యము గాబోదు నవని యందు

    ప్రాణ వాయువు నిచ్చున వవియె సుమ్మి.


    వసుధలో నుత్తమంబైన పనియు నిదియె

    తరువులన్ రక్ష సేయుట ;తగని చర్య

    మనకు నీడ నొసంగెడు మానుల నటు

    కొట్టి వేయ హాని కలుగు కువలయాన.

    వర్ష మొసగిప్రజల కాచు పచ్చనైన

    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    యనుట సరికాదు గనుడయ్య యవని యందు

    ప్రాణవాయువు నిచ్చి కాపాడు నవియె.


    భవన నిర్మాణములకని వనము లోని

    చెట్లను నరకు టెప్పుడు శ్రేయమవదు

    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    లనెడి వారలు మూర్ఖులే యవనియందు.

    రిప్లయితొలగించండి
  26. చిత్త మెల్లఁ జెఱచుఁ గన నత్తల మగు
    దేహ లాఘవమున కింక దిటవు వోవు
    మత్తు గలిగించు నాకుల నిత్తెఱంగు
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      ..నిత్తెఱంగుఁ/దరువులన్ గా చదువ గోర్తాను. “తెఱఁగు” ఉదంత స్త్రీ సమమని భావించి చేసిన సవరణ.

      తొలగించండి
  27. పెద్ద కార్యమొకటి తలపెట్టి నంత
    కొలది నష్టము లెక్కింప కూడదయ్య
    కడలి దాటెడి హనుమతో కలసి వచ్చు
    తరువులన్ రక్షసేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  28. చెట్లు చిగురించ?హృదయాలు చిగురు దొడుగు|
    పువ్వు నవ్వగ?మనసులు పులకరించు|
    కాయ,పళ్ళుంచ?తినుటచే “నాయువొసగు
    తరువులన్ రక్ష సేయుట”తగనిచర్య
    పెంచ బూనక ద్రుంచుట?వంచనంబె|
    2.భుక్తి,శక్తికి రక్తికి పూర్తిగాను
    వర్షధారను,గాలిని,పంట లిడెడి
    జీవ నాధార మౌనట్టి భావననుచు
    తరువులన్ రక్ష సేయుట|”తగనిచర్య
    కొట్టివేయుట,గంజాయిపెట్టుకొనుట.

    రిప్లయితొలగించండి
  29. .కరగి పోవునుకరువులు మరలిరావు
    ఆయురారోగ్య మందించు హాయినొసగు
    తరువులన్ రక్ష సేయుట”తగనిచర్య
    పెంపు జేయవ చెట్లను?కొంపలార్పు
    4.జీవ రాశికి చెట్లు సంజీవి గాన
    భావజాలపు పూల ప్రభావ మనుచు
    తరువులన్ రక్షసేయుట|తగనిచర్య
    చెట్లు గొట్టంగ?పాట్లన్నిబంచు మనకు.

    రిప్లయితొలగించండి
  30. దాగి జీమూత ములలోన ధనము కొఱకు
    పాంధులను బాల వృద్ధుల బట్టి కొట్టి
    దోచువారలు దాగెడి తొఱ్ఱలు గల
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    నిన్నటి సమస్యకు నా పూరణ

    పరువు ప్రతిష్టలు గలిగిన
    పుర వాసుడు పండితునొక పురి చట్టు గనన్
    సుర గ్రోలగ నడుగులిడుచు
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    చట్టు = శిష్యుడు

    రిప్లయితొలగించండి
  31. వరద వెల్లువ దెచ్చిన వానలోన
    వేరు లూడుచు నేలన వీగిపోవు
    తరువులన్ రక్షించుట తగని చర్య
    ప్రజల నెత్తిన కూలెడి భయము కలదు

    రిప్లయితొలగించండి
  32. వరద వెల్లువ దెచ్చిన వానలోన
    వేరు లూడుచు నేలన వీగిపోవు
    తరువులన్ రక్షించుట తగని చర్య
    ప్రజల నెత్తిన కూలెడి భయము కలదు

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమోవాకము లు.
    చిపుకొ వు ధ్య మ స్ఫూర్తిన్ ర చి o ప నo శ
    మేది? త రుణ ల ప్రాణ o బు మే మి కోరు?
    ప్రాస య తు ల దోష కవనo పాడి యే న?
    త రువులన్, రక్షసేయుట ,తగనిచ ర్య.
    మొద టీ పాదము లో టైపింగ్ దోషము కలదు.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  34. గురువు గారికి నమోవాకము లు.
    చిపుకొ వు ధ్య మ స్ఫూర్తిన్ ర చి o ప నo శ
    మేది? త రుణ ల ప్రాణ o బు మే మి కోరు?
    ప్రాస య తు ల దోష కవనo పాడి యే న?
    త రువులన్, రక్షసేయుట ,తగనిచ ర్య.
    మొద టీ పాదము లో టైపింగ్ దోషము కలదు.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  35. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమ స్సు లు
    వ్యాకరణ నియమ నిబంధనలన్నీ తెలియజేసినందుకు పెద్దలు కామేశ్వరరావుగారికి మరొక్కమారు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  36. ప్రాణవాయువు నందించి మానవాళి
    మనుగడకు సాయబడుచు సేమమిడుచున్న
    తరువులన్ రక్షసేయుట తగనిచర్య
    యనిబలుకువారు మూఢులె యవనిలోన !!!

    రిప్లయితొలగించండి
  37. నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
    తరువులన్ రక్ష సేయుట, తగని చర్య
    చేయ కెప్పుడు నరుకుచు జేతులార
    ముప్పుగొని తెచ్చుకోకోయి! ముందుముందు.

    రిప్లయితొలగించండి
  38. నరుడ! తగునయ మనుటకు నాటి యిట్టి
    తరువులన్ రక్ష సేయుట, తగని చర్య
    చేయ కెప్పుడు నరుకుచు జేతులార
    ముప్పుగొని తెచ్చుకోకోయి! ముందుముందు.

    రిప్లయితొలగించండి
  39. ప్రకృతిపర్యావరణము కాపాడుకొనగ
    వృక్షములు పెంచవలయును రక్ష సేసి,
    కాని పథమున కడ్డమౌ కంటకయుత
    తరువులన్ రక్ష సేయుట తగని చర్య

    రిప్లయితొలగించండి
  40. ఆడ మగ,పిన్న పెద్దల యంద రిపని
    తరువులన్ రక్షసేయుట ,తగనిచర్య
    యాకు పిందెలు గాయలయలరినట్టి
    కొమ్మ నరకుట యేరికి సుమ్ము సామి!

    రిప్లయితొలగించండి
  41. మిత్రులందఱకు నమస్సులు!

    సత్య! పారిజాతమునకై చవిఁ దవిలియుఁ,
    బట్టుదల దాని నాశింపవలదు నీవు!
    సురలకుం దగు నది! మనుజులకు వేల్పుఁ

    దరువులన్ రక్ష సేయుట తగని చర్య!!

    రిప్లయితొలగించండి

  42. వేని పెంచ వానకురియు విరివిగాను
    నేతల పని సతతమేది నిలను చూడ
    మద్యమెప్పుడు త్రాగుట మానవులకు
    తరువులన్ ,రక్ష చేయుట, తగని చర్య.
    (క్రమాలంకారంలో ప్రయత్నించాను)

    రిప్లయితొలగించండి