28, మార్చి 2018, బుధవారం

సమస్య - 2635 (పతి గళమునఁ దాళిఁ గట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"
(లేదా...)
"పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

105 కామెంట్‌లు:

  1. అతి జాతులు,తెగలు గల భ
    రతావనిన గల యొక తెగ లలనయె తెగ ప
    ద్ధతి ననుసరించి పెండ్లిన
    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భరతావనిని... పెండ్లిని..." అనండి.

      తొలగించండి

  2. అతికతము జిలేబిని గని
    పతి, గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
    సతియై రంపుమునన్ రా
    చి తిరిపరిగ మార్చెనంట చెకుముకి యనుచున్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అతి విప్లవ భావాల సు
    మతి తమ యాచారములను మరి ప్రక్కకు నె
    ట్టి తెగించి పెండ్లి తంతున
    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

    రిప్లయితొలగించండి
  4. అస్వస్థతతో నున్న భర్త ను సముదాయిస్తూ
    వెతలనుఁదీర్చెడు పతకం
    బతులిత సౌభాగ్యమిచ్చు హాయినిఁగూర్చున్
    రతనములెందుకు మనకని
    పతి గళమున తాళిఁగట్టె భామ ముదమునన్.

    తాళి=హార విశేషము శబ్ద రత్నాకరము

    రిప్లయితొలగించండి



  5. వ్రతతిగ గోముగా ముదిత, వాంఛిత రాణిని గాంచి సంతసిం
    చి తిరుగగా సదా వెనుక, చిక్కెను జాలము లో గదా మగా
    డు తిరిప జోగి తస్సదియ డుంటక డుంటక యే యికన్! రమా
    పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మితిమీరి నసరస మునరఘు
    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
    జతకూడె ననిమురి పెంబున
    వెతలను మైమరచి తాను వేడుక నొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "మితిమీరు సరసమున రఘు... జతగూడె నని మురిపెమున..." అనండి.

      తొలగించండి
    2. మితిమీరు సరసమున రఘు
      పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
      జతకూడె ననిమురి పెమున
      వెతలను మైమరచి తాను వేడుక నొందెన్
      ----------------------
      [పిలుపులో ఈమార్పు ?????????????????

      తొలగించండి
  7. శితికంఠుడు లలితో శ్రీ
    పతి గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
    సతిపతిని గూడ వారికి
    సుతుడయ్యప్ప జనియించె సుందర రూపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భామ ముదమునన్। పతితో గూడగ వారికి..." ఆనండి.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ


    పతికొక వ్యాధిసోకి పలు బాధల క్రుంగుచునుండ , పొంది తా...
    యెతు నొకదాని , భక్తి మదినెంచుచు దేవుని ., స్వాస్థ్యమందగా
    పతి గళమందుఁ గట్టె నొక భామిని ., తాళిని మోదమందుచున్
    గతి యిదె యంచు మ్రొక్కుకొని కళ్లకునద్దుకొనెన్ శుభంబుగా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2635
    సమస్య :: *పతి గళ మందు కట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.*
    భార్య భర్త మెడలో తాళిని కట్టింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలను భీష్ముడు తన పరాక్రమంతో గెలిచి నాడు కానీ వివాహం చేసికొనలేదు. అంబ ఎంతో బాధపడి పరమశివుని వరంతో మరు జన్మలో భీష్ముని చంపదలచింది. ద్రుపద మహారాజునకు కుమార్తెగా పుట్టి కుమారుడుగా పెంచబడింది. దశార్ణ దేశానికి రాజైన హేమవర్ణుని కుమార్తెను సూర్య భగవానుని సాక్షిగా వివాహమాడింది. అప్పుడు ఆమె పెండ్లికుమార్తె మెడలో తాళిని కట్టింది అని విశదీకరించే సందర్భం.

    చితియె దహింప, నంబ తన చింత దొలంగ, శిఖండి పేరునన్
    సుతగ జనించియున్ , ద్రుపద సూనుడుగా నిల వృద్ధి జెంది , సు
    వ్రతను దశార్ణ రాజ సుత పాణిఁ గ్రహించుచు సాక్షిగా నహ
    *ర్పతి , గళ మందు గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      శిఖండి పరిణయ వృత్తాంతంతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. "సతతము మాపై నురుముచు
    మితమనునది లేక పొగరు మీరి చరింపన్
    గతమది ; సములము మే " మని
    పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్ .

    రిప్లయితొలగించండి

  11. మహిళా మండలి జిందాబాద్ :)

    సతతము మగరాయుండ్లే
    నతివలకది కట్టుటేల ! నప్పదు మాకోయ్ !
    లతకూనలు పిలుపివ్వగ
    పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మహిళల తిరుగుబాటుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మగరాయులె తా। మతివల కది..." అనండి.

      తొలగించండి
  12. ప్రతినిధియౌచున్ సీతా
    పతి,గళమున దాళిగట్టె భామ ముదమునన్
    సతిసీతకు, సతులెల్లరు
    రతిమీరగ జేయురమ్య ప్రతిమల
    పెండ్లిన్!

    రిప్లయితొలగించండి
  13. రతిఁ బోలిని వధువును గని
    పతి, గళమున తాళిఁ గట్టె, భామ ముదమునన్
    పతి యందముగనుచు మురిసె
    నతివైభవమందు వేడ్క లంబర మంటెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రతిఁ బోలిన" ... టైపాటు.

      తొలగించండి
  14. అతివకు కుజదోషమ్మని
    మతిపోయిన పండితుండు మంత్రమ్ములతో
    ప్రతిమను వరునిగ జేయగ
    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

    రిప్లయితొలగించండి


  15. వెత! స్వస కగ్రేదిధిషూ
    పతి గళమునఁ దాళిఁ గట్టె; భామ ముదమునన్
    పతిని వెతుక! జీవితమున
    సతతము మనదైన రీతి సాధ్యంబగునే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      క్షమించాలి. పూరణ పూర్వార్ధం అర్థం కాలేదు.

      తొలగించండి

    2. ఈ రోజేదో అయ్యింది :)


      అగ్రేదిధిషూపతి - చెల్లెలి మొగుడు
      స్వస - చెల్లి

      అప్ప కై భర్తను వెతుకుచుండగ వచ్చిన వాడు చెల్లిని పెండ్లియాడి అగ్రేదిధిషూపతి అయితే వెత యే కదా !


      జిలేబి నీ పద్యాలకు నీవే భాష్యం రాసుకోవాల్సిన రోజులు దాపుల్లోనే వున్నాయి :)


      జిలేబి

      తొలగించండి
  16. వ్రతముగ చేయనెంచుచు సువాసిను లెల్లరు దైవ కార్యమౌ
    ప్రతిమల పెండ్లి సేసిరట భక్తిగ కోవెల లోన, వేసెనే
    యతిరథు లెల్ల గాంచుతరి యర్చకు లిచ్చిన మాలఁ జానకీ
    పతి గళమందు, గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్
    సతియగు సీతకంఠమున, చక్కగ సాగగ మెచ్చి రెల్లరుల్

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టాసత్యనారాయణ
    పతి సతు "లథిలెట్ల"వ్వన్
    సతి గళమును వంచలేక సయ్యాటాడ
    న్నతి వేగమె గెలిచిన సతి
    పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్!

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. "హిత మెంచగ కష్టమాయె..." అందామా? "పతి యస్వస్థత" టైపాటు.

      తొలగించండి
    2. పతికట్ట ప్రేమ తాళిని
      హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
      పతి యస్వస్థత బాగవ
      పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

      తొలగించండి
    3. పతికట్ట ప్రేమ తాళిని
      హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
      పతి యస్వస్థత బాగవ
      పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

      తొలగించండి
    4. పతికట్ట ప్రేమ తాళిని
      హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
      పతి యస్వస్థత బాగవ
      పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్

      తొలగించండి
  19. కందం
    చితిలో సైతము తోడనె
    పతి గళమునఁ! దాళిఁ గట్టె, భామ ముదమున
    న్నితఁడే తనకున్ సరిపడు
    జతగాడని దనరుచు కనుసైగల మ్రొక్కెన్

    రిప్లయితొలగించండి


  20. అతికతతము రమణిని గని
    పతి, గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
    సతియై రంపమునన్ రా
    చి తిరిపరిగ మార్చెనంట చెకుముకి యనుచున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. సతి పతి భేద భావము లు సన్మతు లై విడనాడి దంపతుల్
    సతత ము నొ oడొ రు ల్ వలపు సఖ్యము నన్ సరసాన మె ల్గుచు న్
    చతుర త మీర ప ల్కుచు ను జాణ గ పెక్కగు చేష్టల దు తా
    పతి గళ మం దు కట్టె నొక భామిని తాళి ని మో ద మం దు చు న్

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టాసత్యనారాయణ
    "అతి చరితవ్యమంట"నని హాయిగ బల్కి వరావధానియే
    శ్రుతి గతి దప్పి దిర్గగ సుశోభితుడాయెను షష్టి పూర్తినిన్
    జతనపు మాల మార్పులను జార్చిన యా సతి తాళిబొట్టునే
    వెత నటు గట్టె భర్తనెటు వెళ్ళక నాపగ;సంతు జూడగా
    పతి గళమందు గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్!!

    రిప్లయితొలగించండి
  23. జాతకమున గలిగిన దోషమును బాప
    గ నజపతిగళమునఁ దాళిఁ గట్టె నొక్క
    భామ ముదమునన్ తనయొక్క భర్త మేలు
    గోరుచు మనువుకు మునుపు కూర్మి తోడ

    రిప్లయితొలగించండి
  24. జాతక దోష నివ్రత్తి కొరకు కొన్న ప్రాంతములలో మగవానిచేత అరటి చెట్టుకు పెండ్లి మగ మేకకు ఆడ వారిచేత పెండ్లి జరుపు సంప్రదాయము కలదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చే మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని సమస్యలో లేని 'నొక్క' అన్న పదాన్ని చేర్చడం సంప్రదాయం కాదు. కనుక కందపద్యాన్నే ప్రయత్నించండి.

      తొలగించండి
    2. Nokia tappu ayinadi. Khsa minchndi. Padanni alage unchi purimchatamu tappu kadu gada

      తొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    "అతివ గళమ్మునన్ మగఁ డహమ్మునఁ దాళినిఁ గట్టు నెప్పు, డా
    పతుల కరమ్మునన్ ఘన శుభమ్మిడు పుస్తియ యుండనౌనె? మా
    సతులకు లేదె హక్కు, జన సమ్మత మందుచుఁ దాళిఁ గట్ట? నె
    న్నితి నిదె యీ దినమ్ముననె నిక్కముగాఁ గదియింతు" నంచు నా
    పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోద మందుచున్!

    రిప్లయితొలగించండి
  26. సతిపతుల పథములమరగ
    పతి గళమునఁదాళిఁగట్టె, భామముదమునన్
    పతినట చూచెను ప్రేమగ
    సతిపతులముదమున జనులు శాంతిని పొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కర్తృపదం జనులు బహువచనం. క్రియాపదం పొందెన్ ఏకవచనం. అక్కడ "జనులు శాంతి గని రటన్" అందామా?

      తొలగించండి
  27. స్తుతమతి విద్యాధిక భూ
    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
    నత శిరయై భాసిల్లఁగ
    నతి సుందరముగ వరుండె యానందమునన్


    సతతము ప్రీతి పాత్రమగు చక్కని పల్కులఁ గారవించెడిన్
    వితరణ శీలియై జనుల ప్రేమకుఁ బాత్రతఁ బొంది నట్టి యీ
    యతులిత సుందరుండు పతి యౌట మదీయ సుభాగ్య మంచుఁ దా
    పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్

    [తాళి = హారము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. అతియోగ్యుం డుత్తముడు న
    పతి గళమునఁ దాళిఁ గట్టె! భామ ముదమునం
    దతనిని తోడ్కొని జనె తిరు
    పతి వేంకటనాథుని కడు భక్తిగ చూడన్ ౹౹

    రిప్లయితొలగించండి
  29. అతి కుతుకముతో సీతా
    పతి గళమున తాళిగట్టె ; భామ మదమునన్,
    గతి తప్పగ గుండె లయయె,
    మితి మీరిన హర్షమొందె మేన్పులకింపన్


    రిప్లయితొలగించండి
  30. మతిచెడినట్టి యింతి ముదమారగ బెండ్లిని జూచు వేడుకన్
    కుతుకము తోడ చేరెను ప్రకోపము చెందిన వ్యాధి తీవ్రతన్
    సతమతమౌచు పీఠమున చక్కగనున్న వరుండు వీరభూ
    పతి గళమందు, గట్టెనొక భామిని తాళిని మోదమందుచున్

    రిప్లయితొలగించండి
  31. అతులితముగ నచటి తెగల
    నతివయె మగవాని మెడను యందరుమెచ్చన్
    కుతుకమున పుస్తె కట్టగ
    పతి గళమున తాళిగట్టె ; భామ మదమునన్,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మెడను + అందరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  32. అతులిత బలధాముడు శ్రీ
    పతి గళమున తాళిఁ గట్టె, భామయె ముదమున్
    శితికంఠుఁ ధనువు విరిచిన
    క్షితినాథునిగాంచి సీత సిగ్గిలె నపుడున్

    రిప్లయితొలగించండి

  33. కం.
    సతి వేసె పురుష వేషము
    పతియే మారెను వధువుగ పరిణయ మందున్
    అతి చేయు జబర్దస్తున్
    పతి గళమున దాళి గట్టె
    భామ ముదమునన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పరిణయమున దా। మతి సేయు..." అనండి.

      తొలగించండి
  34. సార్! నిన్నటి సమస్యకు నా బెంగాలీయుల పూరణ:

    రంగుల పండుగ దినమున
    భంగును త్రాగుచు ముదమున వాచాలుండై
    గంగోపాధ్యాయుడనియె
    నంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్

    రిప్లయితొలగించండి
  35. రవీందర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. జాతకమున గలిగిన దోషమును బాప
    గ నజపతి గళమున తాళి గట్టె భామ
    ముదము గన్ పెండ్లి మంటపమున మనువుకు
    మునుపు బంధు జనుల బృందము గనుచుండ

    గురువు గారు మార్చి వ్రాశాను సలహా ఇవ్వండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      సవరించిన మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అతివేలము నామెకు నా
    పతి గళమున తాళిగట్టె; భామ ముదమునన్
    పతి తీర్చిన యాపుస్తిని
    నుతించి తన కండ్ల కద్దె నుత్సాహముతో

    రిప్లయితొలగించండి
  38. మతిలేని సతి గ నొక్క తె
    సతత ము తను తోచిన ట్లు సైపని పనుల న్
    సు తి మెత్త గ నొ న రించు చు
    పతి గళ ము న తాళి కట్టె భామ ముద ము న న్

    రిప్లయితొలగించండి
  39. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా "జంబలకిడిపంబ" చిత్రంలో మగవారు ఆడువారిలాగ ఆడువారు మగవారు లాగ వ్యవహరిస్తారు. ఆచిత్రంలో పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి తాళి కడుతుంది. 🤣

    మితిలేదుగ హాస్యమునకు
    పతి సతియౌ జంబలకిడిపంబను పటము
    న్నతిశయమున చిత్రముగను
    "పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కదా' అనే అర్థంలో 'గ' ప్రయోగం సాధువు కాదు. "మితి లేదట హాస్యమునకు" అనండి.

      తొలగించండి



  40. అతిహితమున సభలో రఘు

    పతి గళమునఁ దాళిఁ గట్టె ,భామ ముదమునన్

    రతిపతి పితను తలంచుచు

    .నతిహితముగ పతికి మ్రొక్కె నతులిత ప్రేమన్

    రిప్లయితొలగించండి
  41. "అతిగా వరకట్న మిడుట
    పతిగళమున తాళి"!"గట్టెభార్యముదమునన్
    శ్రుతి మెత్తగ నత్త,మగని
    మితిమీరిన వారినోరు"మింగుడుబడకన్*

    రిప్లయితొలగించండి
  42. మతిలేనిదాని కొక్కడు
    పతిగా పెళ్ళాడ నెంచ?పందిటయందే
    నితరులు జూచుచు నండగ
    పతిగళమున తాళిగట్టె భార్య ముదమునన్*

    రిప్లయితొలగించండి
  43. అతివనట దేవ దాసిగ
    పతితగ మార్చెడు కుతంత్ర పర్వము నందున్
    క్రతువగు పెండ్లిన యుండడు
    పతి, గళమున తాళిఁ గట్టె భామయె ముదమున్

    రిప్లయితొలగించండి
  44. చంపకమాల
    వెతలు భరించలేననుచు వేడుక లేదని జీవితమ్మునన్
    సతి విలపించ భర్త తన సాధ్విని ప్రేమగ వేంకటాద్రికిన్
    జతగొనె షష్టి పూర్తికని, స్వామి పవిత్ర నగంపు వేదిపై
    పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్

    తాళి = హారం


    రిప్లయితొలగించండి
  45. *28-3-18*..సమస్య

    పతి గళమునఁ దాళిఁ గట్టె భామ
    ముదమునన్

    *శ్రీ సీతారామ కళ్యాణం*

    సందర్భము: సులభ పూరణము.
    శుభ ప్రారంభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నుత గుణ సీతను గని రఘు

    పతి గళమునఁ దాళిఁ గట్టె..

    భామ ముదమునన్

    బతి పాద కమలములకును

    నతి ప్రేమను దండ మిడియె నందరు చూడన్

    2 వ పూరణము:--

    ...........సమస్య
    పతి గళమందుఁ గట్టె నొక
    భామిని తాళిని మోదమందుచున్

    *అంతా తారుమారే*

    సందర్భము: ఒక పెండ్లి ఘనంగా జరుగుతున్నది. పుట్టింటివారు ఒక పెద్ద అద్దాన్ని (డ్రెసింగ్ టేబుల్) వధువుకు బహూకరించారు. ఇ దేమి టన్నాడు వరుడు.
    పెండ్లి కూతురు చెల్లెలు పరిహాస మాడుతూ " ఆఁ! ఏమీ లేదు బావా! ఈ అద్దంలో భర్త మెడలో ఒక భామ తాళి కట్టుతూ వున్నట్టు కనిపిస్తుం దంతే!" అన్నది.
    అద్దంలో తారుమారుగా కనిపించడం సర్వ సామాన్యం. కాని ఈ అద్దంలో ఇంకా విశేష మే మంటే ఇలా కూడా కనిపిస్తుం దని, ఆమాత్రం తెలియదా! అని.. ఆ చిన్నారి అంతరంగం.
    ~~~~~~~~~~~~~~~~~~~~
    అతులితమైన పెండ్లి నొక
    యద్దము పెద్దది పుట్టినింటి వా

    రతి ప్రియమారగా నొసగి,
    రంత వరుం "డిది యేమి" టన్న నం

    చితముగ నిట్లనెన్ వధువు
    చెల్లి.. " కనంబడు బావ! దీనిలో

    పతి గళమందుఁ గట్టె నొక
    భామిని తాళిని మోద మందుచున్ "

    3 వ పూరణము:--

    *మంగళ సూత్రం*

    సందర్భము: వధూ వరుల మధ్య పవిత్రమైన బంధాన్ని పాదుకొలిపేది మంగళ సూత్రమే అంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తల నడుమ జీవన బంధాన్ని పట్టి నిలిపేది మంగళ సూత్రమే అంటే సత్యదూరం కాదు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సతికిని కొత్తతీరుగను
    చక్కిలిగింతలు గల్గ తాళి నా
    పతి గళమందుఁ గట్టె ;... నొక
    భామిని తాళిని మోద మందుచున్
    కుతుకము మీర కన్నుగవ
    కున్ నను మెత్తగ నద్దుకొన్న... దీ
    పతి సతి మధ్య నేర్పడిన
    పావన బంధము తాళి వల్లనే!...
    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  46. అతివయె త్రాగి మద్యమును హాయిగ తీయగ నాటలాడుచున్
    మతి తొలగించి భర్తకును మంగళ సూత్రము తీసివేయుచున్
    కితకితలొల్లి మంచమున క్రిందను మీదను దొర్లుచుండగా
    పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్

    రిప్లయితొలగించండి