31, మార్చి 2018, శనివారం

సమస్య - 2637 (కాలికి కాటుక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"
(లేదా...)
"కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

71 కామెంట్‌లు:


  1. అదిగో బ్యాక్ ప్యాక్ మేధా రమణి దేశవిదేశాల తిరుగుచు తేలగిలబడెన్ !


    గోల తిరిగె గుండ్రముగా
    మేలగు జీవితము కొరకు మేధస్సదియే
    తేలగిలబడ మతిమరిచి
    కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకండీ పాపం అంతగా తిప్పుతున్నారావిణ్ణీ!?
      ఏమయినా..ఇక్కడ సరసపు విఱుపులలో మిమ్ములను మించిన వారు లేరు.
      🙏🏻💐

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి


    3. ఆహా జిలేబి అనగానే గుండ్రము గానుండును :) కావున గోల గోళాకారము గా తిరుగును !


      నెనరుల్స్ సహిత
      జిలేబి

      తొలగించండి
  2. వేలిమి బొట్టును పెట్టగ
    కాలికి , కాటుక కనులకు , గజ్జెల నుంచెన్
    బాలిక సంతస మొందిన
    లాలనముగ సద్దు జేసి లాస్యము జేయన్

    రిప్లయితొలగించండి
  3. బాలిక రంగులు వేసెన్
    కాలికి,కాటుక కనులకు,గజ్జెలనుంచెన్.
    లీలగ నాట్యంబాడగ
    మ్రోలను సంగీత వాద్యములు రవళింపన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. (ప్రియుడైన కర్పూరవసంతరాయలు కొమరగిరి ప్రభుని గురించి ఆలోచనాలోచన
      అయిన రాజనర్తకి లకుమాదేవి)

      వాలిన యూర్వశి బోలెడి
      యా లకుమయె కొమరగిరి మహాప్రభువరుని
      న్నాలోచనల న్నిలుపుచు
      కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్.

      తొలగించండి
  5. ఆలియె తా బారాణిని
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
    వాలుజడ కుచ్చులకు నవి
    మ్రోలుచు నాట్యంబు సేయ మోహమె పుట్టెన్

    రిప్లయితొలగించండి


  6. గోలల కెల్ల హైటెకు రగుల్కొన జీవిత మందు బోయెనే
    రాలుబడేను ముఖ్యమని రాసి జిలేబియు బెంగుళూరుకున్
    వేళకు తిండి లేకయు కవేలము చిక్కుచు సన్నవాఱుచున్
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపం! మరో జిలేబి ఎండమావులలో చిక్కుకు డస్సిపోయింది!! ప్చ్!!!
      😐

      తొలగించండి


    2. E- జిలేబి అన్న మాట :)

      బెంగుళూరు మహానగరే :)

      జిలేబి

      తొలగించండి

  7. కం
    లోలాక్షి రజిత మువ్వలు
    కాలికి,కాటుక కనులకు,గజ్జెలనుంచెన్
    మేలుగ కర యుగళములకు,
    హాళిగ హారములు కంఠమందు ధరించెన్

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    లీలలు చిత్తసీమ , మురళీస్వరముల్ చెవులన్ , మనోజ్ఞ గో...
    పాలుని రూపు దోప కనుపాపల , దన్మయమంది గోపికా
    బాల యొకర్తె దాల్చెను విపర్యయరీతిని సర్వభూషలన్
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాడాయనే చెలి గోపాలుడు..
      చూడ చక్కని వాడు తోడూ నీడే వాడు

      మైలవరపువారి గోపికాభిసారికా బాల అద్భుతము!
      🙏🏻

      తొలగించండి
    2. జిలేబీ గారికి.. సీతాదేవి గారికి... ప్రభాకరులకు ధన్యవాదాలండీ 🙏🙏

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. అత్తమీద కోపం...దుత్తమీద.. ( పాతసామెత)
      అత్తమీద కోపం.. అత్తమీదే... ( కొత్త సామెత )

      " *ఏలనొ ? కోడలంచు నను హింసనుబెట్టుచునుండె* , *నా పయిన్*
      *జాలియె లేదులేద*" ని విచారమునన్ *కసి బూని* రాతిరిన్
      లీలగ నత్త నిద్రగొన , నెమ్మది యందము భగ్నమై జనన్
      కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్ !!

      (కసి దీర... పాఠాంతరం)

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


    6. ఆహా మైలవరపు వారు కూడా జిలేబీయమై పోతున్నారు :)

      అదురహో గుండమ్మా :)


      జిలేబి

      తొలగించండి
    7. మురళీకృష్ణుల పద్యం చిన్నికృష్ణుని అల్లరిచేష్టలను గుర్తు తెచ్చింది!
      అత్తారోడళ్ళ జడలు ముడివేయడం, కోడలు మూతికి వెన్న రాయడం ....ఇత్యాది!
      చాల బాగుంది! అభినందనలు! 👏👏👏😊😊😊

      తొలగించండి
    8. లీలగ నిటలీదేశపు
      బాలిక మన కోడలయ్యె బంధుత్వముచే !
      నేలాగుననో తెలియక
      కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    9. ధన్యవాదాలండీ శ్రీ విట్టు బాబు గారూ నమోనమః 🙏🙏

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2637
    సమస్య :: *కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్.*
    కాలికి కాటుక పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది ఒక యువతి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మా ఇంటికి రా, మా ఇంటికి రా అని అంటూ కృష్ణుని గోపికలు ప్రతిరోజూ పిలిచేవారు. ఈ రోజు మీ ఇంటికి వస్తాను అని కృష్ణుడు ఒక గోపికకు మాట యిచ్చాడు.
    వెంటనే ఆ గోపిక కృష్ణుడు తన యింటికి వస్తున్నాడు గదా అన్న సంతోషంతో పారవశ్యాన్ని పొంది *నేను గబ గబ తయారుకావాలి* అని అనుకొని తొందరపాటు వలన గాజులను వేలికి తొడుగుకొన్నది. బొట్టును బుగ్గన పెట్టుకొన్నది. కాటుక కాలికి పెట్టుకొన్నది. గజ్జెలు కళ్లకు కట్టుకొన్నది అని విశదీకరించే సందర్భం.

    ఏలగ కృష్ణమూర్తి తన యింటికి వచ్చు నటంచు , గోపికా
    బాల సుపారవశ్యమున బాడుచు , తొందరపాటు చేత దా
    వేలికి గాజులన్ దొడిగి , వేడుక బొట్టును బెట్టి బుగ్గపై,
    *కాలికి కాటుకన్ బులిమి, గజ్జెలు కన్నుల గట్టె వింతగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (31-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అద్భుతః ! కృష్ణ తత్త్వము !


      జిలేబి

      తొలగించండి
    2. సహృదయులు
      జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కోట రాజశేఖర్.

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారూ! హృదయపూర్వక ధన్యవాదాలమ్మా.

      తొలగించండి
    4. వాసకసజ్జిక తన్మయత్వం!
      అద్భుతము కోటావారూ!
      🙏🏻💐

      తొలగించండి
    5. నేటి నా సమస్యాపూరణ పద్యానికి *శ్రీ చిటితోటి విజయకుమార్* గారి అనువాదం (సంస్కృత శ్లోకం)

      మాం ధన్యాం కురుతాదిమం మమ గృహం కృష్ణః పునీతం తథా
      కిం కుర్యామధునేతి గోపతరుణీ గానే స్థితా తన్మయా
      దంగుళ్యాం వలయే సుగన్ధ తిలకం గండస్థలే సంభ్రమాత్
      పాదే రంజక కజ్జలం చ విదధౌ నేత్రే సఖీ నూపురాన్.
      శ్లోక రచన :: *శ్రీ చిటితోటి విజయకుమార్ కలకత్తా.*

      తొలగించండి
    6. సహృదయులు శ్రీ విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  10. మేలగు చెప్పులు దేనికి?
    లీలగ నేదిడు సొబగును లీలావతికిన్?
    కాలికి నర్తకి సొంపుగ
    కాలికి; కాటుక కనులకు; గజ్జెల నుంచెన్.

    రిప్లయితొలగించండి
  11. అవధానుల బాటలో 🙏🙏🙏

    సాలంకృతయై వనమున
    లీలామోహను గలియగ రేగినకోర్కెన్
    దూలుచు మైమరచి యువిద
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్

    రిప్లయితొలగించండి
  12. మేలము లాడుచు మరదలు
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్,
    మేలుగ మెట్టిన వదినకు,
    గోలగ నలుగురును జేరి గొల్లున నవ్వన్.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. తోలు అగనాళ్ళు వేటికి?
    లోలనయన మోమునకు వెలుగు నిడు నేదో ?
    కాలికి నటి యేముంచెన్ ?
    "కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్

    రిప్లయితొలగించండి
  15. మేలౌ లక్ష్మిని జేయుచు
    బాలిక టెంకాయ నొకటి బహురూపిణిగా
    వ్రేలికి గాయమ్మవగా
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్

    రిప్లయితొలగించండి
  16. ఫ్యాషన్! ఫ్యాషన్!! ఫ్యాషన్!!!

    కంటికేం ఖర్మ! పొట్టమీద నాలుక మీద ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటున్నారు గజ్జెలు 🤣

    లీలలె జూడుమా నవియె లేమల చిత్ర విచిత్ర పోకడల్
    చేలపు పీలికల్ సొగసు చిందునటంచు ధరించు రీతులన్
    మేలని జెప్పుచున్ తనువు మీదను ముద్రలు వేసుగొంచు నా
    "కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్"

    రిప్లయితొలగించండి
  17. లాలనగా నొకతె చెలికి
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
    "లీలావతి"మానసిక రు
    జాలయ మందున నదేమి యచ్చరువౌనా?
    ***)(***
    {మానసిక రుజాలయము = పిచ్చాసుపత్రి}

    రిప్లయితొలగించండి
  18. మాలిని ధరించి లత్తుక
    కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
    మ్రోలను నటరాజ ప్రతిమ
    మేలగు నర్తనము జేయు మిన్నగు కాంక్షన్

    రిప్లయితొలగించండి
  19. మేలుగ పారాణి నలది
    కాలికి - కాటుక కనులకు -గజ్జెల నుంచె న్
    బాలిక నాట్యము నాడగ
    రా లె ను కుసుమాలు మీద రంజిలు భంగి న్

    రిప్లయితొలగించండి
  20. నేటి నా సమస్యాపూరణ పద్యానికి *శ్రీ చిటితోటి విజయకుమార్* గారి అనువాదం (సంస్కృత శ్లోకం)

    మాం ధన్యాం కురుతాదిమం మమ గృహం కృష్ణః పునీతం తథా
    కిం కుర్యామధునేతి గోపతరుణీ గానే స్థితా తన్మయా
    దంగుళ్యాం వలయే సుగన్ధ తిలకం గండస్థలే సంభ్రమాత్
    పాదే రంజక కజ్జలం చ విదధౌ నేత్రే సఖీ నూపురాన్.
    శ్లోక రచన :: *శ్రీ చిటితోటి విజయకుమార్ కలకత్తా.*

    రిప్లయితొలగించండి
  21. బాలిక పారాణి నిడుచు
    "కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"*
    మేలుగ మడమల చెంతన్
    తాలయకారునివలెనట తాండవమాడెన్


    ఆలియు దాల్చుచు మువ్వలు
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
    మేలగు వడ్డాణమునకు
    లీలగ నాట్యమునుచేయ లీలావతియున్


    కేలుకు గాజులు,మట్టెలు
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్
    వాలుజడలోన ముదిత
    పూలను దాల్చి తలపైన భూషణముంచెన్

    రిప్లయితొలగించండి
  22. కందం
    బాలిక కరమాన్చుచు మో
    కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
    వాలుగఁ గూర్చొని కాళ్లకు,
    పూలను దలఁ దురిమె 'బాపు బొమ్మ' యనంగ!

    రిప్లయితొలగించండి
  23. లోలాక్షి నిదుర నుండగ
    లీలామానుషుడగుహరి ప్రేముడితోడన్
    చేలముల తొలుగ జేయుచు
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్

    రిప్లయితొలగించండి
  24. డా.పిట్టాసత్యనారాయణ
    ఆలము నల్ల భాగ్యపపహాస్యము కై తగు చర్య గైకొనన్
    బాలముకుందునట్లు ప్రతిభన్ గనబర్చ విదేశ దేశపుం
    చేలము మార్చి బర్యటన జేసిన తత్పరతన్ గనంగ తా
    కాలికి కాటుకం బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    బాలుని గ్రమపుటలంకా
    రాలను జొప్పించ గురువు;"రాయడు"(శిష్యుడు)బల్కెన్
    "మేలగు నక్రమ మరయన్-
    "కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"
    (గురువుగారు, అక్రమాలంకారము ఉండదని తెలుప వలసి యుండెను.తరగతిలో'క్రమాలంకారమునకు ఉదాహరణలు యిచ్చిన తరువాత జరిగిన సన్నివేశము)

    రిప్లయితొలగించండి
  26. మ్రోలను జేరి సరాగము
    హేలా లీలా వినోదియె ప్రమోదముగం
    జూలాలికిఁ దా నాలికిఁ
    గాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్


    వాలుగ కంటి మానవతి పాటలగంధి మనోధి నాథుఁడే
    శీలుఁడు నాదు మిత్రుఁడును జెప్పెద నాతని ప్రేమ గాధ నీ
    కాలికి కాటుకం బులిమి గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్
    వీలుగఁ బాద యుగ్మమున వేనలి పైనను గారవమ్మునన్

    [నీకు+ఆలికి =నీకాలికి; కన్ను = నెమలి పురి కన్ను]

    రిప్లయితొలగించండి
  27. మేలుగ పారాణిని తన
    కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్
    ౙాలుగ, జూడగ లీలగ
    బోలుచు నటరాజు భంగి పొసగి నటించెన్!

    రిప్లయితొలగించండి
  28. లీలల జూపగన్ భువికి శ్రీపతి వచ్చెను కృష్ణు రూపుడై
    పాలను వెన్నలన్ గొనుచు వల్లవ కాంతల తోచరించుచున్
    శాలలలోన నిద్రగొను చక్కని భామల, నవ్వులాటకై,
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    రిప్లయితొలగించండి
  29. ఉత్పలమాల
    తాళగ లేక రుక్మిణికి దక్కెను పారిజమంచు కుందుచున్
    వాలఁగ శయ్యపై నలిగి భామిని, కృష్ణు శిరంబు తాకఁగన్
    గాలికి, కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగ
    న్నాలియటంచు సత్య నయనాళి వినంబడె యశ్రు గర్జనల్!

    (అన్వయము సరియేనా అన్న విషయము బుధజనులు పరిశీలించి తెలియజేయ ప్రార్థన)

    రిప్లయితొలగించండి
  30. నీలిమ” కమ్మబొమ్మగొన?నిత్యసుఖాలను బంచుయమ్మలా|
    జాలిగాముద్దులున్ నిడుచు చక్కటి రూపును మార్చనెంచియున్
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలుకన్నులగట్టె వింతగా
    మాలిని నవ్వగా?దెలసి మామకు జూపెను మౌన భాషతో|

    రిప్లయితొలగించండి

  31. కాలము సానుకూలమయి కర్షక జీవులు కాడిపట్టగా
    చేలవి గాలికూగుచును చిక్కని కంకుల
    భారమవ్వగా
    తేలుచు సంబరం బునను దీరుగ
    రైతులు యెడ్లబండికిన్
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్!

    బండి కాలు= చక్రము
    కన్ను = బండి చక్రము
    కాటుక = కందెన
    చక్రమునకు మధ్యలో నల్లని కందెన రాసి గజ్జెలు కడతారు!

    రిప్లయితొలగించండి
  32. మిత్రులందఱకు నమస్సులు!

    నేలను నున్న మట్టిఁ దిని, నెమ్మదిగా నడయాడు తమ్ముఁ డా
    మ్రోలను నాడుచుండఁ గని రోహిణి సూతి యశోదఁ జేరియున్
    మాలిమిఁ దెల్పఁగా, హరి యమాయకునట్లు నటింప నేడ్చుచున్
    గాలికిఁ గాటుకన్ బులిమి, గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పై పూరణమునకే కొన్ని సవరణములు చేసి, మఱలఁ బ్రకటించుచుంటిని:

      నేలను నున్న మట్టిఁ దిని, నెమ్మదిగా నడయాడి, కృష్ణుఁ డా
      మ్రోలను నాడుచుండఁ, గని రోహిణి సూతి, యశోదఁ జేరియున్,
      మాలిమిఁ దెల్పఁగా, హరి యమాయకునట్లు భ్రమింప నేడ్చుచున్,
      గాలికిఁ గాటుకన్ బులిమి, గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్!

      తొలగించండి
  33. లీలలు జెప్పగా తరమ,రీతి రివాజులు మారెగా, సినీ
    మాలవి సాంప్రదాయముల మట్టిని గల్పగ నేడు ముగ్ధలే
    వేలము వెఱ్ఱిగా తమదు వేషము మార్చిరి వింతరీతులన్
    *కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  34. [ప్రియునిఁ జేర నువ్విళులూరుచున్నట్టి మాలతియను నొక ప్రియురాలి కృత్యము]

    (2)
    మాలతి యిడె నూనియ లల
    కాలికిఁ, గాటుకఁ గనులకు; గజ్జెల నుంచెన్
    గాలికి; విరహమ్మోపం
    జాలక ప్రియ సంగమేచ్ఛఁ జనె సన్నిధికిన్!

    రిప్లయితొలగించండి
  35. మేలుగ నిడె పారాణిని
    కాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచె
    న్నాలి పదములకు, మానిని
    నీలి కురులకు విరజాజి నిక్కుల తొడిగెన్!

    రిప్లయితొలగించండి
  36. *31-3-18* సమస్య
    కాలికి కాటుకన్ బులిమి
    గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    *నర్తకీ మణి*

    సందర్భము: ఒక నర్తకి యే విధంగా ధరించిం దని ఒక బాల మరొక బాలికను అడిగింది వెంట వెంటనే. ఐనా ఆ చిల్లపిల్ల చకచకా తడుముకోకుండా సమాధానం చెప్పింది తన దారిలోనే.. సంభాషణ మెలా సాగిందో చూడండి.

    "పూసి లత్తుకన్ గాలికి, కాటుకన్ బులిమి..."
    "గజ్జెలు?"
    " కన్నులఁ.. గట్టె వింతగన్ గాలికి"

    చిన్నపిల్ల క్రమంగానే జవా బిచ్చింది. "కాటుకన్ బులిమి.." అనగానే చెప్పే జవాబును వినకుండానే గజ్జెల విషయం అడిగింది బాల. ఐనప్పటికీ కాటుక పులిమిం దెక్కడనో చెప్పిగాని మరో అంశాన్ని చెప్పా లనుకోలేదు బాలిక. అందుకే "కన్నుల.." అని చెప్పిన తరువాతనే "గజ్జెలు?.." అన్న ప్రశ్నకు "కట్టె వింతగన్ గాలికి" అని తడుముకోకుండా చెప్పింది.
    అంటే ప్రశ్నించేవాళ్ళు హడావుడి పడుతున్నా చెప్పింది పూర్తిగా వినకుండానే మరో ప్రశ్న సంధిస్తున్నా తాను మాత్రం నింపాదిగా సరిగ్గా జవాబు చెబుతూనే వుంది ఆ చిన్నారి. భేష్!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లీలగ నర్తకీమణి "ధ
    రించిన దె?" ట్లని వెంట వెంటనే
    బాల యొకర్తు తా నడిగె..
    భాషణ మిట్టిది.. " పూసి లత్తుకన్
    గాలికి, కాటుకన్ బులిమి..."
    "గజ్జెలు?", " కన్నులఁ.. గట్టె వింతగన్
    గాలికి"... సక్రమంబుగనె
    కాదె జవా బిడె చిన్న పిల్లయున్!..

    మరొక పూరణము:--

    ..సమస్య
    కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్

    సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టుకోబోయింది.
    "బేలా! ఇ దేల?" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది. నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బాలిక కృష్ణుని మది నిడి,

    *కాలికి కాటుక, కనులకు గజ్జెల నుంచెన్..*

    "బేలా! యేల?" యన "కళా

    లోలునికే యెఱుక!" యనియె లోలాక్షి వెసన్..

    రిప్లయితొలగించండి
  37. 31-3-18...సమస్య
    కాలికి కాటుకన్ బులిమి
    గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    సందర్భము: ఆ గోపికకు మాధవుని మీద మనస్సు నిలిచి పోయింది. మరలిరా నన్నది. పరధ్యానంలో.. ఏమరుపాటుతో ఆ నర్తకి కాలికి కాటుక పెట్టుకున్నది. కన్నులకు గజ్జెలు కట్టింది.
    "బేలా! ఇ దేలనే!" అంటే "నా మది గోపాలునిమీదనే నిలిచిపోయింది" అన్నది.
    "ఇది తగునా!" అంటే "నా కేం తెలుసు? ఆ కళాలోలునికే తెలుసు." అన్నది.
    నేను కేవలం కళాకారిణిని మాత్రమే! ఆ కళను ఏనాడో భగవదర్పితం చేశాను. కళతో ఆనందించేవాడు కృష్ణుడే గనుక అతనికే తెలుసు.. అని ఆమె ఆంతర్యం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కాలికి కాటుకన్ బులిమి
    గజ్జెలు కన్నుల గట్టె వింతగన్
    బాలిక.. "యేలనే!" యనగ
    "పన్నుగ నా మది నిల్చిపోయె గో
    పాలుని మీదనే!" యనియె..
    "పాడియె నీ కిది!" యన్న " నా కళా
    లోలునికే కదా యెఱుక!
    లో టెది నా?" కనె.. కృష్ణ చింతనన్..

    మరొక పూరణము:--

    సందర్భము: లోకంలో వుండే కళ లన్నింటికీ మూలం పరబ్రహ్మమే! ఆనం దాన్వేషణలో నరుడు క్రమంగా కొన్ని దశలు దాటి లలిత కళల నాశ్రయిస్తాడు. ఐహిక సుఖా లన్నిటినీ అవి మరపిస్తాయి.
    అక్కడే ఆగకుండా క్రమంగా ముందుకు వెళితే ఏ కొద్దిమంది పుణ్యాత్ములకో పరతత్వంలో రుచి దొరుకుతుంది. అందులో ఆనందించడం అలవాటైతే సరసంగా అంతవరకు కనిపించిన కళ లన్నీ నీరసంగా కనిపించడం మొదలు పెడుతాయి. లౌకికము లన్నీ నిస్తేజములుగా కనిపిస్తాయి. పరతత్వ మొక్కటే జగజ్జేగీయమానంగా వెలుగుతూ వుండగా జీవుడు లోకా న్నంతా విస్మరించడం జరుగుతుంది.
    ఎందుకంటే అనుక్షణం ఆత్మానందంలో మునిగి తేలుతూ వుంటాడు. తానే ఆనంద స్వరూపు డైపోతున్నాడు కాబట్టి ఆనందంకోసం మరొక దాన్ని ఆశ్రయించడం కుదర దప్పుడు.
    అందుకే గోపిక కాలికి కాటుక పులిమిన దని, కన్నులకు గజ్జెలు కట్టిన దనీ పేర్కొనబడింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మూలము లోకమందు గల
    భూరి కళావళి కెల్ల బ్రహ్మమే!
    మేలుగ బ్రహ్మమందున ర
    మింపగ నేర్చిన వాని కీ కళల్
    చా లనిపించు నీరస ద
    శన్ బ్రకటించును గోప కాంత తాఁ
    గాలికి కాటుకన్ బులిమి
    గజ్జెలు కన్నుల గట్టె వింతగన్..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  38. మేలగు కన్నియన్ వలచి మెచ్చుచు దెచ్చుచు రోమునుండి తా
    కూలుగ హస్తినాపురికి కోడలి వంచును తల్లిజూపుచున్
    బాలుడు భారతీయతను వందన మిమ్మన పోపులమ్మ తా
    కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్

    రిప్లయితొలగించండి