3, జనవరి 2019, గురువారం

సమస్య - 2891 (మల్లెల వాసనల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"
(లేదా...)
"మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే"
(డా. మునిగోటి సుందరరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

111 కామెంట్‌లు:

  1. ఎల్లవేలల కొట్టుచు నెపుడు సుంత
    పేర్మి కురుపించని మొరటు పెనిమిటి మరు
    మల్లెలను సంత కొని తన మహిళ కివ్వ
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  2. ప్రియుని కై నిరీక్షిoచె ను ప్రేమ తోడ
    మల్లియలు గుబాళించగ ; మహిళ రోసె
    కడు నిరాశ పరచ గ తా కలత చెంది
    రువ్వె విరుల ను బయటికి రోష ముగను

    రిప్లయితొలగించండి
  3. కొల్లలుగ చూసిమురిసెను చెల్లి తెల్ల
    మల్లియలు గుబాళించఁగ:...మహిళ రోసె
    క్రుళ్ళి పోయిన నుల్లులు త్రుళ్ళు చుండ
    వంట నింటికి జల్లుచు వాసనలను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '....మహిళ రోసె
      నుల్లిపాయలు క్రుళ్ళిన తల్లడిలుచు
      వంటయింటను నిండ దుర్వాసన లయొ!' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  4. చల్లని కైతలన్ సభను
    జల్లుచు , నందరి మెప్పు నందుచున్
    మల్లెలు రాని కాలమున
    మంచిగ వల్లభు డిల్లు జేరగా
    తెల్లని ప్లాస్టి "కంపు " పువు
    తీరుల కృత్రిమదోషజుష్టమౌ
    మల్లెల వాసనల్ సెలగ
    మానిని రోయుచు ముక్కుమూయదే ?

    రిప్లయితొలగించండి
  5. చల్లని వెన్నె లందున చక్క నైన
    చెలియ చెంతను హాయిగ చింత లేక
    మనుసు పడునట్టి సతికోర్కె మంట గలుప
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "చల్లనైన వెన్నెలలోన చక్కనైన" అనండి.

      తొలగించండి
    2. చల్లనైన వెన్నెలలోన చక్కనైన
      చెలియ చెంతను హాయిగ చింత లేక
      మనుసు పడునట్టి సతికోర్కె మంట గలుప
      మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    *పట్నం పిల్ల*

    అల్లన శైత్యయంత్రముల హాయిని పొందుచు , నింపుసొంపు మే..
    నెల్లను జల్లుకొంచు పులకించును కృత్రిమమౌ సుగంధముల్ !
    పల్లెల పైరగాలి యన పట్టదు , గిట్టదు సాజమైనవౌ
    మల్లెల వాసనల్ , సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. తాళి గట్టిన మరునాడె తరుణి విడిచి
    కడలి దాటుచు మగడేమొ కదలి పోగ
    కామ వాంచలె తనువంత కాల్చువేళ
    మల్లియలు గుబాళించగ మహిళ రోసె.

    రిప్లయితొలగించండి

  8. కొల్లగ ద్రాగి కోపమున గొట్టుచు దిట్టుచు నెల్లవేళలన్

    ఘొల్లున నేడ్చి యల్గినను గూరిమి బేరిమి సుంత జూపకన్

    దెల్లని మల్లియల్ పతియె తెచ్చియు గొప్పున జుట్ట బోవగన్

    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  9. అల్లనఁ జేరవత్తు నటకంచుఁ బ్రియుండన సంతసించి తా
    నుల్లము పల్లవింపఁ దగు నోపికవట్టు నిరీక్షఁ జేసె, మే
    నెల్లదహించ రాడని ధరించిన పూలు గిరాటు వేయుచున్,
    మల్లెల వాసనల్ సెలగ మానిని రోయుచు ముక్కు మూయదే

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  10. కల్లలెఱుంగనట్టి పుర గణ్య వరాంగన. ముద్దరాలహో
    పల్లియకాంత. సత్ప్రకృతి భాసిలు నైజమునందునెప్పుడున్.
    కుళ్ళిన భావనల్ గలుగు గోముఖ వ్యాఘ్ర సమాజమందు యీ
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చింతా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గోముఖ వ్యాఘ్ర' మన్నపుడు 'ఖ' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
  11. ఉల్లమును కొల్లగొట్టిన ఉవిద చెంత
    హర్ష పులకిత గాత్రుడై యతడు నిలచె
    మల్లియలు గుబాళించగ; మహిళ రోసె
    అత్త పిలుపుల కాగ్రహ మంది యామె

    రిప్లయితొలగించండి
  12. చేపలమ్ము కొని బ్రతుకు చెలువ యొకని
    భార్యగా వచ్చి తొలిరేయి పాన్పు మీద
    వాలి క్రొత్త వాసన యలవాటు లేక
    "మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"
    ***)()(***
    (బాల్యము నుండి చేపల వాసన కలవాటు పడిన యావిడ మల్లెల వాసన క్రొత్తగా యుండి భరించలేక పోయింది.)

    రిప్లయితొలగించండి
  13. తెల్లని చీరగట్టి దన తీయని ప్రేమను చాటిచెప్పగా
    జల్లుచు పాన్పుపై మిగుల చక్కని పూవుల వేచియుండగా
    మల్లియ వాసనల్ సెలగ; మానిని రోయుచు ముక్కుమూయదే
    కల్లును ద్రాగి మైకమున కాలిడ నింటను కాంతుడయ్యయో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  14. కామక్రీడలదేలెనుగామరాజు
    మల్లియలుగుబాళించగ,మహిళరోసె
    త్రాగివచ్చినబెనిమిటితంతుజూసి
    భర్తప్రేమనేగోరునుభార్యయెపుడు

    రిప్లయితొలగించండి
  15. తొల్లి సనాథ తాను వెడ తోటకు బూవులు తేవ పూజకే
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే
    వెల్లువ ధారలన్ గనుల వెంటను గారగ భర్త గుర్తులన్
    సల్లపనంబులన్ దలచి, సద్యము తేరుకొనెన్ వెడెన్ యదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని భావం సుబోధకంగా లేనట్టున్నది. 'వెడెన్'? 'వెడెన్ + అదే = వెడె నదే' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నవనవానంద బృందావనమ్ము చెంత
    కలియుదమని రావించిన కామనుండు
    నాగమించని వేళలో నాగ్రహించి,
    మల్లియలు గుబాళించిన, మహిళ రోసె.

    రిప్లయితొలగించండి
  17. ఒక్క సాయంసమయమునఁ జక్క నైన
    చుక్క యొక్కతి పతి నెకసెక్కెము లట
    వేడ్క నాడుచు నుండంగ వెక్కసముగ
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    [రోయు = వెదకు]


    ఉల్లసనమ్ము క్రమ్మికొన నుల్లము నందు విహార యాత్రకై
    చల్లని వేళ సాగుచు విశాలపుఁ గుల్య గలట్టి పెద్దదౌ
    పల్లెకు పోయి చేర నొక ప్రాంగణ మచ్చట నిల్వకుంటి మే
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే

    [మేము + అల్లెల = మేమల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా, వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. [ఏము + అల్లెల = ఏ మల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]

      తొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    .................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    సందర్భము: నాగరికత వెఱ్ఱితలలు వేయడంవల్ల ఆడతనానికి హుందాతనం కనిపించకుండా పోతున్నది. మహిళల సింగారాలు నిరర్థకా లైపోతున్నాయి. చూడండి....
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "గాజులు పెట్టవే గడుసుదానా!" యన్న
    "మోజు లే" దని నవ్వు ముదిత యొకతె..
    "కురులు కట్టుకొనవే కులుకులాడీ!" యన్న
    "విరబోసికొందు"నన్ వెలది యొకతె..
    "చీరఁ గట్టుకొనవే చారు లోచన!" యన్న
    "జారు నేమో!" యను నారి యొకతె..
    "తిలకము దిద్దవే కలువకంటీ!" యన్న
    "సమయ మేదీ?" యను జాణ యొకతె..
    పిచ్చి నాగరికత లేవొ పెచ్చుపెరిగె..
    పూల నిష్టపడరు నేటి పొలతు లయ్యొ!
    "తురుముకొను మందురో!" యని తోటలోన
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    3.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చాలా అద్భుతంగా చెప్పారండీ.

      తొలగించండి
    3. 👏👏👏👏
      వెలుదండవారి భావాన్ని కందంలో
      నేటి వనిత
      నొసటను తిలకము నుంచదు
      విసుగొందును కురుల ముడువ విరులను దాల్చన్
      కసురును గాజుల దొడగగ
      నసుగును ధరియింప జీర నచ్చగ జీన్సే!

      తొలగించండి
  19. నారిముగురమ్మలకునమ్మనమ్మివేసె
    మల్లియలుగుబాళించంగ;మహిళరోసె
    పూలువాడినగనియెదబోరుమనియె
    మంగళముగాదుమగని కమంగళమని

    రిప్లయితొలగించండి
  20. ఎల్లలులేనిప్రేమనిలువెల్లనుగన్నులుగాగవేచెలే
    *"మల్లెల వాసనల్ సెలఁగ మానిని ;రోయుచు ముక్కు మూయదే"*
    క్రుళ్లినకంపువాహనపుగుంపునుగుప్పగనీచగంధమున్
    యల్లదెవల్లభుండు హృదయం బునుజెప్పెను వాడియూసులన్

    రిప్లయితొలగించండి
  21. మెల్లగమంచమెక్కెనటమేకలనాగినిసంబరంబున
    న్మల్లెలవాసనల్సెలగ,మానినిరోయుచుముక్కుమూయదే
    గల్లునుద్రాగివచ్చిదనకాంతకుమీదికిబోవుచుండగా
    నల్లదెవాసనల్దగులనాయమయట్లుగముక్కుమూసెనే

    రిప్లయితొలగించండి
  22. అందమైనపెరటిమల్లెహాయినీయ
    ముడిచిపెట్టత్రెంపెముదిత;పుణ్యతీర్థ
    యాత్రలోశిరోముండనమరయమిగని
    మల్లియలు గుబాళించగమహిళరోసె

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జల్లులు వేసవిన్ కురియ జానకి త్రుళ్ళెను పర్ణశాలనున్
    మల్లెల వాసనల్ సెలఁగ;...మానిని రోయుచు ముక్కు మూయదే
    చెల్లియొ చెల్లకో తరుణి చెవ్వులు ముక్కును కోలుపోవుచున్
    గొల్లున కేక బెట్టుచును ఘోరపు నిందల నెత్తిపోయగా

    చెవ్వు = చెవి (శ్రీహరి నిఘంటువు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. మల్లెల వాసనల్ సెలగ మానుగ ముక్కుపుటాల బెంతుమే
    కల్లలు కాదు నా పలుకు కాంత! నిజమ్మిది ప్రక్క యింటిలో
    పిల్లకు మల్లె పూ వనిన పెద్ద వికారము వింత కాదె యా
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే.

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    చెల్లి!యా బాపు బొమ్మవై చెలగ లేవు
    తల్లి వెంట్రుక లిచ్చినా తరుగు చుంద్రు
    కొప్పులెక్కడ? విరబోయు కురులు దప్ప;
    మల్లియలు గుబాళించగ మహిళ రోసె

    రిప్లయితొలగించండి
  26. కల్లయిదేమిచిత్రమగుకామినులెల్లరునుల్లసిల్లగన్
    మల్లెలుచందనాగరులుమానినికొప్పుననొప్పుగాకనొ
    ల్లెల్లనుపద్మినీయనగలేమలుబూలకుదాసులేగదా
    యుల్లముపల్లవించవిభుడొద్దికచెంతనలేడొకోకటా
    *"మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే"*

    రిప్లయితొలగించండి
  27. డా.పిట్టా సత్యనారాయణ
    ఉల్లము మీది కొంగు నట నూరక దీయగ నూన్చ వన్నెయౌ
    చల్లగ వీడిరా కొనల చానల-చీరల సోకు లేదు; స్త్రీ
    లల్లన నన్య దేశమున హాయిని నున్నతమౌ (యు)నుపాధినిన్
    జెల్ల,సుగంధ పూతలను జేర్చగ;దివ్య పరీమళంబునౌ
    మల్లెల వాసనల్ సెలగ"మానిని" రోయుచు ముక్కు మూయదే

    రిప్లయితొలగించండి
  28. కొత్త పెళ్ళి కూతురు కోరి కొల్లలుగను
    పూల చెండులన్ కడుప్రేమ పొటకరించ
    చేర తనపతి చెంతకున్ చెదరెను కల
    *"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*

    రిప్లయితొలగించండి
  29. జ్యేష్ట మాసాన బెండ్లిని జేసినారు
    వెంటనే వచ్చె నాషాఢ విరహబాధ
    మదిని గదలాడె యూహల మధుర తలపు
    "మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గదలాడె నూహల..' అనండి.

      తొలగించండి


  30. పైక మార్జించగా నెంచిపతియు సాగ
    దూరదేశమ్ము సతియు తీ దుఃఖ పడుచు
    విరహ వేదన నొందంగ పెరటి లోని
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*
    రెండవ పూరణ.

    కొల్లలుగ పూసినట్టియా మల్లెల గని
    మురిసి మగువ పతికొరకు మోజు తోడ
    వేయి కనుల నెదురు జూచి నిభుని తలచ
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీ దుఃఖపడుచు'...?

      తొలగించండి
  31. సానికొంపల లోచేరి సంతసమున
    పవలు రేత్రులు నచ్చటే పవ్వళించి
    మరల యిక్కకు వచ్చిన మగని చేతి
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    రిప్లయితొలగించండి
  32. ముద్దురాలు కొనంగను మూర పూలు
    మిన్నులన్ తాకె మూల్యము; మిగుల పేద
    నయ్య వల్ల గాదంచును నసిగె విసిగె
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతిదోషం. సవరించండి.

      తొలగించండి
    2. కలలు సాకార మగుచు కల్యాణ మాయె
      కలత లేని కాపురమును కన్నె గోరె
      చిరుకలహపు చికాకుల చింత హెచ్చ
      మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

      తొలగించండి
  34. కల్లలెరుంగ నట్టి యొక కన్నియ పొందగ మంచి భర్త తా
    నుల్లము పద్మనాభుపయి నుంచి భజించగ చిక్కె భర్తగా
    కల్లరి, సానితోఁ గొని సుఖమ్ముల క్రమ్మర, వాని మేనిపై
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే

    రిప్లయితొలగించండి
  35. రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కన్నె కప్పు।డిష్టమైన...' అనండి.

      తొలగించండి
    2. కష్టసుఖములు దెల్పిరి కన్నె కప్పు
      డిష్టమైన చెలుని చేయి బట్టి సాగె
      పక్షి రెక్కలు గట్టిన పంజరాన
      మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

      తొలగించండి
  36. ఎల్లలులేనిప్రేమవిటుడేయెదకోవెలపూజలందగా
    *"మల్లెల వాసనల్ సెలఁగ మానిని ;రోయుచు ముక్కు మూయదే"*
    నల్లనికారుచీకటులనక్కడ వ్యర్థమలంబుబారగ
    న్నల్లదెజుమ్మికాడు హృదయం బుపయోధరమూరరెచ్చగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి రెండు పాదాల భావం అర్థం కాలేదు.

      తొలగించండి


  37. గల్ఫునకు వెళ్ళినట్టి మగండు జ్ఞాప
    కమున కరుగుదెంచి యెలమిగ కవగొనెను
    మల్లియలు గుబాళించఁగ,మహిళ రోసె
    తన పరిస్థితి గాంచి వెతలను నొంది !


    నూతన వత్సర శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారూ! పునః స్వాగతం! నూతన సంవత్సర శుభాకాంక్షలు!
      మీ ఆరేగ్యమిప్పుడు పదిలమనుకొంటాను!

      తొలగించండి

    2. సీతాదేవి గారికి
      నెనరులు ఉభయకుశలోపరి :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారూ,
      స్వాగతం! ఇప్పుడు మీ కన్ను ఎలా ఉంది?
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  38. భావుకతనునింపుకొనిన భామ యెదను
    కదలి యాడ 'పుష్పవిలాప కావ్యమొకటి ',
    చెంతగా వచ్చి నిలచిన యింతి తలను
    మల్లియలు గుబాళించగ మహిళ రోసె!

    రిప్లయితొలగించండి


  39. ఉల్లపు కోరికల్ చెలికి నొప్పవు! పెట్టుకొనంగ కొప్పులో
    మల్లెల నోకరింతయగు! మాడ్రను గర్లు జిలేబి, సోదరా!
    పల్లెల కెప్పుడైన మరి భామిని పోయెనకో ?గుభాళిగా
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. పెండ్లి జరిగిన మరునాడె పెనిమిటి కొక
    జాడ్య మున్నటు తెలియగ జారుడనుచు.
    పాన్పు పై వాల దుఃఖము పట్టలేక
    మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె

    నిన్నటి సమస్య కు నా పూరణ

    కూతు నల్లుని బిలువక కోరి జేయ
    దక్ష యజ్ఞము జూడగ దగదటన్న
    పతిని విడిజని భగ్నమై సతిగ జేర
    పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె

    రిప్లయితొలగించండి
  41. అల్లుకొన్నట్టి యాశలు,మల్లియలట
    నలుగ?శోభనమందున విలువతగ్గ!
    మగని మాంగల్య సుఖమంతతగనిదైన?
    మల్లియలుగుభాళించగ మహిళరోసె!

    రిప్లయితొలగించండి
  42. అల్లరి పిల్లయంచు జనులందరు పిల్చెడు చిన్నదాననే
    నల్లని పిల్లవాడొకడు నచ్చివివాహముఁ జేకొనంగ నా
    పిల్లకు వచ్చె గర్భమట పెక్కుగఁ గోరెను చింతకాయలన్
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కుమూయదే.

    రిప్లయితొలగించండి
  43. నల్లని భర్త మీసములు నాతి
    కపోలముఁ గ్రుచ్చుచుండగా
    నల్లరి పిల్ల మోముఁ దరహాసము చిందెడు దృశ్యమున్ గనన్
    చల్లని వెన్నెలే సతికి చండమయెన్ విరహమ్ము పెర్గగన్
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కుమూయదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'విరహమ్ము హెచ్చగన్' అనండి.

      తొలగించండి
  44. అల్లరియేలనోయతివలందరినిన్ పలుకు ల్మరేలనో
    యెల్లలెరుంగదోమరుడునెక్కిడడోమగవారలైననా
    యుల్లముమెల్లమెల్లగమయూరమునైనటనంబొనర్చదో
    కల్లలుగాగగొల్లనరెకాంతులుగామినులంతనొక్కటే
    *"మల్లెల వాసనల్ సెలఁగ మానిని(మాన్యుడు) రోయుచు ముక్కు మూయదే(డే)"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దయచేసి మీరు పద్యాన్ని టైపు చేసేసమయంలో పదాల మధ్య వ్యవధానం ఉంచండి.

      తొలగించండి
  45. ఉత్పలమాల
    ఉల్లము నందు రాముని మహోన్నత రూపము నిండి యుండ నా
    చల్లని మూర్తికై వగచు సాధ్వి ధరాత్మజ చెంత పోచకున్
    జెల్లని వాడు రావణుడు చిత్తము మార్చగఁ జేర వచ్చెడున్
    మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే?

    రిప్లయితొలగించండి
  46. ఉ. మెల్లని చూపులన్ మగని మేనుని తాకుచు యింతురెల్లరున్
    చల్లనిగంధమద్దనొక చారిణిమద్యముగొంతునింపగన్
    ఎల్లలులేనిహాయిగొనియేమఱపాటునవాంతులీను, భా
    మల్లెల వాసనల్ సెలఁగ, మానిని రోయుచు ముక్కు మూయదే.

    Note: ఇక్కడ భామలందరు పరిపరి విధాలా పరిమళాలు వెదజల్లారు అన్న అర్ధం ప్రయోగించితిని

    రిప్లయితొలగించండి
  47. తేటగీతి
    పెళ్లి చూడగ వచ్చియు గిల్లు కొనుచు
    వర్గ పోరుతో నలిగెడు వైరులచట
    నుడికి పోవుచు తిట్లతో నొకరికొకరు
    పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!

    ఉత్పలమాల

    ఇద్దరి వర్గపోరు బెదిరింపుల రేగుచు సద్దుమన్గియున్
    పెద్దల పెండ్లివేడుకల విందున బైల్పడ గిల్లుకొంచుఁ బెన్
    గుద్దులతో చెలంగి గుమి గూడఁ బరస్పర దూషణమ్ములన్
    శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

    రిప్లయితొలగించండి