6, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2894 (పాలన్ దూరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"
(లేదా...)
"పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్"
(నిన్న ఆకాశవాణిలో ప్రసారమైన మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

140 కామెంట్‌లు:


  1. శంకరాభరణం... .
    05/01/2019 శనివారం

    నేటి సమస్య :
    ******* *** **
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    నా పూరణ  :     శార్ధూలము
    **** **** **** **** *** *** ***
    చాలున్!చాలిక! కోపతాపములు విస్తారంబు గల్గంగ! రో

    గాలన్ మిక్కిలి గల్గజేసి తనువున్ గావించు నాశంబునే!

    యేలన్ నాదగు మాటలన్ వినవు?నిన్నే రీతి నొప్పింతు? కో

    పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్


    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  2. రాలన్ బొమ్మలు జెక్కినన్ పలుకవే బ్రాంతిన్ మహాభాగ్యమౌ
    కాలున్ తన్నగ శంకరుండు వినయం బున్ సాగె సద్భక్తితో
    హేలన్ మాటలు తూలనాడి నభువిన్ యెన్నెమ్మ పూనంగ కో
    పాలన్ దూరము నందుఁ బెట్టినపుడే స్వాస్ధ్యంబు లభ్యం బగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యెన్నెమ్మ'?

      తొలగించండి
    2. ఎన్నెమ్మ = ఒక భూత విశేషము , పురిటిలో పిల్లల్ని ఆవహించు దుష్ట శక్తి

      తొలగించండి
    3. అనుకున్నాను. కాని అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  3. పాలన్ గ్రోలెను వెన్న దోచెనట గోపాలుండు రేపల్లెలో
    పాలన్ బట్టిరి యుగ్గుగిన్నెలను మా పాపాయి కేరింతలన్
    కాలం మారగ స్వచ్ఛభారతమునన్ కాలుష్యమొప్పారగా
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాలం' అనడ వ్యావహారికం. అక్కడ 'కాల మ్మేగగ...' అందామా?

      తొలగించండి
    2. 🙏

      ఈ పూరణ ఏలనో ఆకాశవాణిలో జారిపోయినది. బహుశా వ్యావహారికమొకటి దొర్లిన కారణం కామోసు...ఇబ్బంది లేదు

      😊

      తొలగించండి
    3. "ఎంత బాగుంది పాపాయి కేరింతలా! ""

      ...చిటితోటి విజయకుమార్

      తొలగించండి
  4. ఔ లే, మా గురజాడ నాటకము కన్యాశుల్క, మందున్న వా
    చాలుండైన గిరీశమే తెలిపె "వత్సా! ధూమపానమ్ము మేల్
    మే" లంచున్; దగనట్టి మాట యిది; సంభావింప బీడీల ధూ
    పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!

    రిప్లయితొలగించండి
  5. బాలా చెప్పెద నొక్కమాట వినుమా పాటింపగన్ జాతికిన్
    మేలౌనంచును చెప్పిరే యవనిలో మేధావులే పూర్వ మే
    వేళన్ శాంతిని వీడబోకుడనుచున్ విజ్ఞాపమున్ జేయ కో
    పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  6. మయసభలో జరిగిన పరాభవమునకు సుయోధనుడు కోపంతో రగిలి పోవుచుండ శకుని “సుయోధనా కోపము దూరముగా బెట్టుము సౌఖ్యము కలుగును మాలిమి చూపి పాండవులను నేలను కూల్చవలయను అలోచచించుము” అని పలుకుతాడు

    ఆలోచన చేయుము కో
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్,
    మాలిమి తోడ సుయోధన,
    నేలను కూల్చుమనుచు శకుని బలికె నపుడున్

    రిప్లయితొలగించండి


  7. ఏలన్ జెప్పెద నేటి ఘోరముల? నెన్నెన్నో విధంబుల్ సదా

    పాలన్ జేసిరి కల్తి దుర్మతి తతుల్  పైకంబు నార్జించగన్!

    మాలిన్యంబగు నట్టి క్షీరము కడున్ మానించు నారోగ్య; మా

    పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్


    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    చాలోయ చేసిన చేష్టలు
    వాలాయముగాను గలుగు వాసియు జాలున్
    ఏలా తొందర నీ పా
    పాలన్ దూరమునబెట్ట సౌఖ్యంబబ్బున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చాలయ' టైపాటు!

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా, అది"చాలోయ్" అనే శబ్దము .టైపాటే జరిగినది.కృతజ్ఞతలు.

      తొలగించండి
  9. కృష్ణుడు సుయోధనుని తో ____
    ఆల ము మానియు సంధికి
    తాలిమి తో సమ్మతించి దైన్య ము మాన్ప న్
    మేలగు కురు రాజా ! కో
    పాలన్ దూరము బెట్ట సౌఖ్యం బబ్బున్

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఆలోకింపగ నీకు సత్త్వమిడునీ యాహారముల్ , కాని శా...
    పాలౌనీసునసూయలెన్నగను తాపక్రోధసంజాతముల్ !
    నీలోనుండి దహించు నిన్ గలచుచున్ నిత్యంబునా కోపతా....
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్"

    మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. చాలుం జాలును పెద్దవాడవు కదా జంజాట మో తండ్రి! నీ

    కేలన్ హాయిగ నీ వయస్సున? సదా క్రీడించుచుం బౌత్రుతో

    వేళం దిండియు నిద్ర జూచుకొనవో విత్తార్జనంబౌ కలా

    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఇదేదో నాగురించే వ్రాసినట్టున్నది!

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ. మీకా ధనార్జన కార్యకలాపాలతో పనిలేదుగా. నిష్కామ కర్మ గడిపేస్తూన్నారు జీవితాన్ని.

      తొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    మూలంబేదియొ సంకటంబులకు నీ మోమున్ గనన్ దెల్యదే
    గోలల్, రోష, మసూయ,పోటి జెలగన్ గోప్యంబుగా రక్త లో
    పాలే బెర్గగ శాంతి యుండదు నపారంబునౌ ద్వేష కో
    పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెల్యదే' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి


  13. వాలకపు పరిష్వంగము,
    గోలల చెంత సుఖముల బుగులుబుగులు సరా
    గాల నరుడ, హెచ్చగు తా
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. చాలింపన్ దగు బాలసమ్ము సఖియా సౌఖ్యంబులన్గాన నీ
    వీ లాలూచిని వీడి మంచి నడతన్ వెన్నంటి బోవన్ దగున్
    కైలాసంబును వాంఛచేయ వినవే కాంతామణీ నీవు కో
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక చూడఁ జక్కని నాట్యకత్తె సుతారముగ నాట్యము చేయుచు, మైమఱచి కొంచె మధికముగా కాలుసేతుల నాడించఁగా, నడుమునందు శూల యధికమై, భరింపరానిదయ్యెను. ఆమె వైద్యుని సంప్రదించఁగా, నాతఁడు "తల్పాలపై నిద్రించుట మాని, నెలపైఁ బరుండిన నిమ్మళించి, స్వాస్థ్యము చేకూరు" ననిన సందర్భము]

    కేలుం ద్రిప్పుచుఁ గాలు ద్రొక్కుచు వెసన్ గీతాలకున్ నాట్యమున్
    లీలన్ జేయుచునుండ రేఁగె వెనునన్ ద్రిక్కుల్ గరిష్ఠమ్ముగా;
    మ్రోలన్ వైద్యునిఁ గోరఁ జెప్పెనపు డంభోజాక్షికిన్ వెజ్జు "త
    ల్పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!"

    రిప్లయితొలగించండి


  16. రాలిన వెంట్రుకలు రుజువు
    యేలన్ సావాసము! సరియే కాదు సఖా,
    చాలించు బీడి! వడి ధూ
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రుజువు + ఏలన్ = రుజు వేలన్' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
    2. చాలా సుఖమ్ము బీడీ
      గ్రోలన్ మీకికను రావు రోగాలెపుడున్!
      చాలున్! జిలేబి! మీ శా
      పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!

      "As an example to others, and not that I care for moderation myself, it has always been my rule never to smoke when asleep and never to refrain when awake.

      - 70th birthday speech"


      http://www.twainquotes.com/Smoking.html

      తొలగించండి
    3. నిజమ..బీడిని గ్రోలిన రోగాలు రావు...
      అసలు మనిషుంటే గదా రావడానికి...😀😁😂

      తొలగించండి
    4. ఉన్నాను కదా డెబ్బై ఆరేళ్ళు చీకూ చింతా సుగరూ బీపీ కొలెస్టరాలూ వగైరా వగైరా లేకుండా వేలకొలదీ పూరణలుచేస్తూ...

      తొలగించండి
    5. "The recent decision by the Food and Drug Administration to label cigarettes a nicotine delivery system has drawn cheers from many in the scientific community, including Colleen McBride, director of the cancer prevention, detection and control program at Duke University Medical Center. McBride says there is a growing body of evidence that nicotine actually relieves some symptoms of Parkinson's and Alzheimer's disease, and appears to help those with severe depression focus."

      తొలగించండి


    6. కోలాహలముగను జిలే
      బీలా బతుకన్ విడువకు బీడీలన్ యి
      న్నేలా! సాక్షి ని నే! ధూ
      పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?


      జిలేబి :)

      తొలగించండి
    7. 🙏

      సరదాకి...జిలేబి గారి కొరకు వ్రాసిన పద్యమది...

      "Smoking is injurious to health!"

      తొలగించండి
  17. ( భిక్ష లభించలేదని కాశీక్షేత్రాన్ని శపింపబోయిన వ్యాసుడు)
    కేలన్ దండకమండలంబులును , సు
    గ్రీవాన రుద్రాక్షలున్ ,
    మేలౌ రీతి ధరించు వ్యాసముని , నె
    మ్మేనెల్ల కంపింపగా
    కైలాసంబును బోలు కాశిక నెదన్
    గైకోక నిందించె ; శా
    పాలన్ దూరమునందు బెట్టినపుడే
    స్వాస్థ్యంబు లభ్యంబగున్ .

    రిప్లయితొలగించండి


  18. ఏలన్ మూర్ఖత? యంత
    ర్జాలములో చదివినావ? సరికాదు సుమా
    పాలనగ శక్తి కద! యే
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. కాలముకల్తీమయమై
    బాలలకారోగ్యమొసగెఫలములుబాలున్
    మలినంబాయెను డబ్బా
    పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  20. చాలీచాలనిజీతము
    నేలనుశయనించునడకనిత్తెము రోగా
    లేలీలగలుగు ప్రిడ్జీ
    పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      'చాలీ' అనడం వ్యావహారికం "చాలియు చాలని" అనండి.

      తొలగించండి


  21. లైలాని నీకు, ప్రియుడా!
    రాలిన పువ్వువలె చూడ రమణిని తగునా?
    కాలెను మదియు, సరసి తా
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యాపాదాన్ని యతిదోషంతో ఇచ్చాను. మన్నించండి.

      తొలగించండి
  22. వేళకు వ్యాయామంబును
    మేలగు సిరిధాన్యములను మెక్కినరోగం
    బేలీలనె *ఖాదరు* త
    ల్పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  23. మాలిన్యంబు నొదల్చగా యుదయమున్; మధ్యాహ్న వేళన్ క్షుధన్;
    నాలో కామముబుట్టు చుండగ నిశిన్; నానా వికారంబులే
    చాలన్ మేకొన నే విచార పడితిన్, సద్బుద్ధి దక్కంగ తా
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదల్చు'ను 'ఒదల్చు' అన్నారు. "మాలిన్యంబు వదల్చగా నుదయమున్" అనండి.

      తొలగించండి
  24. మేలౌ సేవలతో పతిన్ సతతమున్ మెప్పించుచున్ వాని లో
    పాలన్ దిద్దుచు ప్రేమఁ బంచుచును దీపంబై ప్రకాశించు నా
    లోలాక్షిన్ రహితోడఁ గాంచి తనలో లోపాలఁ జూపించు కో
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  25. [2]

    [ఒక హృద్రోగి యెల్లప్పుడును కోపముతో ఱోలు రోఁకండ్లను చేతఁబూని, పోట్లాటలకు దిగుచుండఁగా, నతని హితైషి యొక్కఁ డాతనికిఁ దగిన సలహా నొసఁగిన సందర్భము]

    "ఱోలున్ రోఁకలిఁ బట్టనేల సఖ, హృద్రోగమ్ము నీ కుండఁగా?
    నేలన్ నింగినిఁ జేర్చనేల దరికిన్? నీకున్న రోగమ్ముచే
    మ్రోలం గందువు నైతలమ్ము భువిపై! మోదాన నీ కోప తా
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్!"

    రిప్లయితొలగించండి
  26. నా ప్రయత్నం :
    తాళఁగ లేనే సతి నీ
    లాలనలు విడచి భయద విరహము భరించన్
    జాలను, బింబానన కో
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    అత్తగారింటికి వెళ్లే కూతురుతో తల్లి...
    శార్దూలవిక్రీడితము
    మాలా! భర్తకు నత్తమామలకు సంభావమ్ము గూర్చంగ నే
    వేళైనన్ విడనాడబోకు మదిలో ప్రేమించు మవ్వారినిన్
    శ్రీలన్ గూర్చ గృహంబునందు సతమున్ శ్రీలక్ష్మిఁ బోలంగ కో
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  27. ఏల కినుకబూనెదవో
    బాలా! శాంతిసహనమ్మె పాటించినన్
    మేలౌ గాదే యిక కో
    పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి


  28. మాలలు, జపమాలలు, పూ
    మాలలు, తోమాలలు పరిమళ సౌగంధం
    బాలివ్వవు సుఖముల! కో
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  29. మూలాధారము నుండి క
    పాలపు కొపురు వరకున్ తపస్సును జేయన్
    స్థూలముగ యక్కసుల , తా
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  30. ఈలోకమ్మున ముఖ్యమైన దొకటే !యింపైన స్వాస్థ్యమ్మెగా!
    యాలోచింపగ నన్యమైన దెదిరా?యారోగ్యమున్ మించగా
    నేలాగై నను కష్ట నష్టము లనే యీడేర్చి కోపాల,తా
    పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యమ్ము సాధ్యంబగున్!

    రిప్లయితొలగించండి
  31. ఆలోకించగ కామక్రోధమద మోహాహంపుషడ్వర్గమే
    నీలో నిత్తెమశాంతిబీజముల, గన్నీరొల్కు దుశ్చేష్టలన్,
    గాలాధీనమటంచువిస్మృతిని ముక్కాలంబులన్ గూర్చె గో
    *"పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్"*

    రిప్లయితొలగించండి
  32. కాలనియమాలమీరక
    కాలములోవచ్చుఫలము గల్గినదానిన్
    మేలని తలచుచుదిని కో
    పాలన్ దూరమున బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  33. యతిమైత్రి కుదుర్చుకోవటం పూరించే వారి బాధ్యత గా భావించి యీవిధంగా పూరించినాను.
    ****)()(****
    ఏలిన వారికి మనవిది
    బాలలెగా భవితలోన పౌరులనంగన్
    బాలల కన్నులలో భా
    ష్పాలను దూరమున బెట్ట సౌఖ్యంబబ్బున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      యతి దోషాన్ని పరిహరిస్తూ మీరు చేసిన పూరణ మిక్కిలి బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  34. లోలాక్షి! జిలేబీ! లల
    నా! లావణ్యవతి! రావె! నాదు ప్రియ సఖీ
    మాలిని! గుబులేలా! తా
    పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  35. గు రు మూ ర్తి ‌ ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    { జాంబవంతుడు కపివర్గముతో అన్నమాటలు }



    సాంద్ర దయాగుణాంచితుడు , చండతరానయ నాశకుండు , మౌ

    నీంద్రనుతుండు , సారసదళేక్షణుడున్ , దిననాథవంశపున్

    జంద్రుడు వచ్చె జూడుడు ప్రచండ విభాకరుడై దినమ్మునన్ |

    జింద్రము చేసివేయు రజనీచర వర్గము నీ క్షణంబునన్ |

    జంద్రుని ముందు తళ్కు మనునా చిన చుక్క లవెన్ని నిల్చినన్ |



    ( చింద్రము = ఖండము )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  36. హేలన్జీవితమంతహాసమొదవన్నీశానుడే మేలనున్.,
    కాలంబొక్కొక తీరుమారి హృదిలో కంగారు హెచ్చించగా.,
    లీలన్ భీకరకోపతాపగణముల్లేవంచు రూపింపకో
    పాలన్ దూరమునందు బెట్టినపుడేస్వాస్ధ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    సందర్భము: సులభం. సమస్యను రెండవ నాల్గవ పాదాలలోను వుంచి పూరించడం విశేషం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లీలగ.. పాపాలను, లో
    పాలన్ దూరమునఁ బెట్ట
    స్వాస్థ్యము దక్కున్..
    మే లగు.. కోపాలను, తా
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  38. బాలల బీడించురుజలు
    పాలను దూరముగబెట్ట;స్వాస్థ్యంబబ్బున్
    మేలగు మాతృక్షీరము
    గ్రోలగ,సహజాతమైన గూరిమితోడన్

    రిప్లయితొలగించండి
  39. లీలామానుష విగ్రహున్ మనమునన్ రేయిన్ బవల్ నిష్ఠచే

    కాలంబుచ్చుట జన్మ ధన్యమవదే!కామ్యార్థముల్ గల్గవే!

    వాలాయంబుగ కామ, క్రోధ,మదమున్ వారించియున్ మోహ తా

    పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!


    ఆకుల శివరాజ లింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజ లింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కామ క్రోధ మదముల్' అని ఉండాలి కదా?

      తొలగించండి
  40. కవిమిత్రులు మన్నించాలి.
    ఉదయం పొరపాటున కందపాద సమస్య "పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్" అని ఇవ్వడం జరిగింది. పోచిరాజు సుబ్బారావు గారు పోను చేసి పొరపాటును తెలియజేసారు. వారికి ధన్యవాదాలతో సమస్యాపాదాన్ని సవరించాను.

    రిప్లయితొలగించండి
  41. పాలను తాగిన చేకురు
    బాలలకు బలమ్ము గాంతి బాగుగ విజయా
    పాలను క్రయించు కల్తీ
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  42. లీలామానుష విగ్రహు
    నాలయ ప్రాంగణముజేరి యారాధనకై
    వాలాయమ్ముగ మనకో
    పాలన్దూరమునబెట్టస్వాస్ధ్యముదక్కున్

    రిప్లయితొలగించండి
  43. బాలుడ వద్దుర పూతన
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్
    నీ లీలలు చాలించర
    ఏలర కష్టములు నీకు ఎందుకు బాధల్

    రిప్లయితొలగించండి
  44. కాలంబెంతగ మారెనో యకట! యాకాశమ్మె తోడయ్యె! పా
    పాలన్ జేసితినేమొ, బాధల గొనన్ వ్యాధుల్ వరించేను! శా
    పాలేలన్ గలవో! రసాయనములన్ పట్టించి త్రాగేటి యా
    పాలన్ దూరము నందు పెట్టినపుడే స్వాస్థ్యంబగున్!

    రిప్లయితొలగించండి
  45. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.. .

    కాలాయాపన జేయకుండగ రమాకాంతున్ సదా భక్తితో
    లీలామానుషుడైన శేషశయనున్ లేలెమ్ము సేవించ యిీ
    భూలోకమ్మున నీవు చేసిన మహా మోహంపు దుస్కార్య పా
    పాలన్ దూరము బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.

    రిప్లయితొలగించండి
  46. గోలా తటిఁ జెలరేఁగఁగ
    గోల త్రుటినిఁ బాల కొఱకుఁ గూర్పఁగ సంధిన్
    గోలను సతిని ననుచు ను
    ష్పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్

    [గోల = గోదావరి, కలకలము, ముగ్ధ ]


    ఏలా మానవు లెల్లరుం జలమునున్ హేయంపు రీతిం గతం
    బాలోచించక పూన నేర్తు రకటా యాశ్చర్యమే తల్చఁగన్
    జ్వాలా రూపము దాల్చి కాల్చవె మదిన్ శాంతంబునం గోప తా
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  47. రిప్లయిలు
    1. హీలా గతినిం జూచితి
      వేలా యీయి ల్లకట సవిస్తరమైనన్
      లీలగ వాసమునకు మును
      పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్ధ్యము దక్కున్

      [మునుపు + ఆలన్ = మును పాలన్; ఆలన్ = ఆవులను]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  48. స్త్రీలున్వృద్ధులు బాలబాలికలు నిస్తేజంబునన్జవ్వను
    ల్లీలామానుష విగ్రహంబులన నేలీల న్బ్రశంసింతురో
    వేళాకోలమొ తీపిబీపిగవచంబేభద్రమా గోపతా
    *పాలన్ దూరము నందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్*


    ఏలీలన్నురుభాగ్యమబ్బుయువతన్నేలీలరక్షింతురి
    క్కాలంబందుభుజించెటోగిరముదుగ్ధంబాపమున్ గల్తియై
    గాలాధీనపు దీపిబీపియిరు దుష్కర్మాంతమై గోపతా
    *పాలన్దూరమునందుబెట్టినపుడేస్వాస్థ్యంబు లభ్యంబగున్*

    రిప్లయితొలగించండి
  49. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    లాలూ ఉవాచ:👇

    పాలన్ గ్రోలిన శక్తి వచ్చు భళిగా పాలింప బీహారునున్
    గాలింపంగను గ్రోలవచ్చు ధనమున్ గ్రాసమ్ము మేయంగహా...
    కాలమ్మేగగ కోలుపోవ కురిసీ ఖైదీగ బంధింతురే!
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్!

    రిప్లయితొలగించండి
  50. నిగమశర్మతో అక్క
    వేలల నంటించుకొనుచు
    కూలగ కాపురము సానికొంపల దిరిగే
    వేలర?శర్మా, నీ తా
    పాలను దూరముగబెట్ట స్వాస్ధ్యంబబ్బున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవపాదమున శర్మాకు బదులు తమ్ముడ గా చదువ ప్రార్ధన

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిరిగేవు' అన్నది వ్యావహారికం. అక్కడ "తిరుగం బోలునె" అందామా?

      తొలగించండి
  51. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆలక్షించుచు నుంటి నేను సఖుడా! నన్యాయమైనట్టి వౌ
    ప్రేలాపమ్ములతోడ లోకుల యెడన్ పేట్రేగి రోషమ్ముతో
    కాలమ్మెంచుచు నుంటివేమి? తగునా? కావేషముల్ త్రోసి కో
    పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్.

    రిప్లయితొలగించండి
  52. ఇది సరదా కొరకే గురువు గారు
    పాలన్ద్రావితి పండ్లుమెక్కితి సదాపద్మాసనంబందునన్
    శూలిన్మ్రొక్కితి బూదిబూసితి మహాశుద్ధోత్తరీయంబులన్
    లీలన్మేనునదాల్చి దిర్గితి శివా!శ్రీనాథుడెంచెన్ కలా
    *పాలన్ దూరమునందు బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్*

    సరదాగా శ్రీనాథకవి ఇలా పూరించే వాడేమొ..

    రిప్లయితొలగించండి
  53. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉల్లాస మమరదిల మురి
    పాలన్ దూరమున బెట్ట; స్వాస్థ్యము దక్కున్
    వాలయ మంతయు ననువగు
    శీలముతో నొప్పిదముగ చెలగుచు నుండన్.

    రిప్లయితొలగించండి
  54. ఆలోకింపుడు కోపము
    లేలా మనతోటివారి గించపరుపగా
    జాలున్ జాలిక మీ కో
    "పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్"

    రిప్లయితొలగించండి
  55. కందం:
    పాలను సేవించినచో
    మేలును జేయును నిరతము మేనికి యెపుడున్
    హాలహలమైన కల్తీ
    "పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"


    కందం:
    పాలన జేసెడి మారుతి
    వేలుపును మనమున నిలుపి వేడుక తోడన్
    మాలను ధరించి నీ పా
    "పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"

    గొర్రె రాజేందర్
    సిద్దిపేట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేందర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "మేనికి నెపుడున్... మనమున నిలిపి..." అనండి.

      తొలగించండి
  56. తూలుచు గర్వితు డగుచు
    న్నాలిని హింసించెడి క్షణి కానందము కై
    బాలల చెఱచుచు కడు పా
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెఱచెడి' అంటే బాగుంటుం దనుకుంటాను.

      తొలగించండి
  57. శార్దూలవిక్రీడితము
    పాలించన్ ప్రజ నెంచి వారలకిలన్ స్వచ్ఛంపుదౌ భారత
    మ్మాలోకించి విశాల దృక్పథమునన్ మాన్యమ్ముగా విద్యవై
    ద్యాళిన్ గూర్చుచు పేదలన్ మురికి ప్రాయంబైన లోగిళ్ల కూ
    పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  58. పీలుచు ధూమము నిన్నే
    చాలించుము చెప్పుచుంటి "చైన్ స్మోకర్ వే"
    మేలగురా "సిగరెట్" ధూ
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  59. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    సందర్భము: సులభం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మేలుగ మంత్రములఁ జదువ
    గాలేరె పురోహితాళి! కన్నుల గ్రమ్మున్..
    జాలగ ధూమ మెగయు ధూ
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  60. పాలు నవనీతముల గో
    పాలుని పూజించి, దినము భగవద్గీతన్
    పాలించి నసూయాకో
    పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్

    ఈ బ్లాగ్ లొ ఇది నా మొదటి పద్యం తప్పులుంటె సరిదిద్దమని ప్రార్ధన

    రిప్లయితొలగించండి