8, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2896 (టీ వలన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"టీ వలన కవిత్వమే విలసిలు"
(లేదా...)
"టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"

73 కామెంట్‌లు:

  1. వినుడు మిత్రులార! విప్పి చెప్పెద నేను
    శంకరాభరణము పొంకమందు
    తెల్లవారుజాము వెల్లి విరిసిన పో
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  2. ఒక్క పెగ్గు వేసి పెక్కు రచన జేయ
    మక్కు వనుచు మగడు నిక్క మనగ
    చక్క నైన వనిత సరసంపు నీడ
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జీపీయెస్ వారు రాయవలసినది మీరు మీరు రాయవలసినది జీపీయెస్ వారు మార్చేసుకున్నట్టు న్నారు :)



      జిలేబి

      తొలగించండి
  3. ఆ.వె.
    బోరు కొట్టినపుడు బీరు త్రాగను నేను
    అట్టి మిత్రులెవరు నవని లేరు
    పూరణమ్ములన్ని పూరించ వచ్చును
    టీ వలన కవిత్వమే విలసిలు.

    రిప్లయితొలగించండి
  4. బాస వెలుగు నపుడు! వాసి కెక్కగలరు
    వర్ధమాన కవులు! స్పర్ధ వలన
    విద్య పెరుగు గాదె! యుద్యమ రీతి పో
    *"టీ వలన కవిత్వమే విలసిలు"*

    రిప్లయితొలగించండి
  5. మేటి కవియటంచు సాటివారెల్లరుల్
    పొగడి నంత కవియె మోదమందు
    నగ్రగణ్యుడగుచు నవనిలో నిలువ బో
    టీవలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి


  6. కాతర్యంబును వీడి యత్నమును సాకార్యంబు జేయంగ నీ
    వేతంబెత్తగ పద్యసౌరభములివ్వెక్కున్ సునాయాసమై
    రాతల్ మారును మేలు గాను కవితారావంబుగా!లెమ్ము!ధా
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    కవిని గావలెనని కన్నంబు వేయడే
    శబ్ద రత్నములకు శైలి కొరకు
    చూడజూడ;యదియ చోరకళయె లూ
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  8. నిన్నటి సమస్యాపూరణ.
    విభీషణ,రావణాసురసంవాదఘట్టము.

    "వినుమా సోదర! జానకీసతిని, నీ విఖ్యాతిభగ్నమ్ముకై
    గొని యేతెంచితె! వీడుమయ్య!" యనగన్ గోపించి వర్ణద్వయిన్
    నినదించన్ విదిశల్, దశాస్యములతో
    నిర్వార్యుడై బల్కెఁ, దా
    నన నానా నన నాన నాన నన నానా నాన నానా ననా.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  9. వ్రేతల్ దెచ్చిన గుమ్మపాలను గడున్
    వేడ్కన్ మరంగించుచున్ ;
    జేతోమోదము నిండ నేలకులనే
    జేర్పింప మోతాదుగా ;
    మ్రోతల్ జేసెడి నాలుకమ్మ కిక నా
    మూడౌ గులాబీలదౌ
    టీతో వచ్చు కవిత్వసంపదకు బో
    టీ లేదు ముమ్మాటికిన్ .

    రిప్లయితొలగించండి
  10. సమస్య :-
    "టీ వలన కవిత్వమే విలసిలు"

    *ఆ.వె**

    కలము పట్టి వాసి కవితలు వ్రాయగ
    పరుల తోడ పోటి పడవలయను
    పేరు దెచ్చునట్టి నారోగ్య మైన పో
    టీ వలన కవిత్వమే విలసిలు
    ....‌‌................✍చక్రి

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    "చేతోమోద కెఫీన"నంగ విషమే చేదోడువాదోడుగా
    పూతన్ బూయ తలంపుకున్ సరియ యీ పోతన్ మహానందమై
    కోతల్ గోయగవచ్చు నూపు గదురన్ కొంగ్రొత్త శబ్దాళినిన్
    టీతో వచ్చు కవిత్వ సంపదకు బోటీ లేదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  12. టీవలన దరిద్రమే వరించు హరించు
    పైకము నెద గాలు వ్యాధులున్ను
    బీపి షుగరటంచు వెజ్జనుడివెను నే
    టీవలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  13. అతివలకు జరిగెడి యందల పోటీల
    కులుకునడక తోడ జెలఁగుచు నట
    నెదను దోచుచు మును కదలుచున్నట్టి బ్యూ
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  14. పోటితో నిదుర సమూలముగా జెడు
    నీసుమోసులెత్తు నీకుశాంతి
    సున్న రిపులు హెచ్చు నెన్ననేపాటి పో
    టీవలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి

  15. శంకరాభరణం...
    08/01/2019 .మంగళవారం

    నేటి సమస్య.
    **** **** ***

    టీ వలన కవిత్వమే విలసిలు

    నా పూరణ : ఆ.వె
    *** *** ***

    తెల్లవారు జాము తేనీరు ద్రాగంగ

    తెప్పరిల్లి మదియె తేజమయ్యె

    పద్యపూరణలను వాసిగ జేసితి

    టీ వలన కవిత్వమే విలసిలు


    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    చేతంబొప్పదు నిద్రలేచుటకునీ శీతర్తువేళన్ , చలిన్
    భీతిన్ గల్గు , సమస్య యట్టియెడ కన్పించున్ , మదిన్ భావనల్
    పూతల్ పూయును , భార్య యప్పుడొక కప్పున్ చేతికందీయనా
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. మాతానీగృప గాళిదాస కవియే మాఘాది కావ్యంబులన్
    జేతంబేజిగురించ వ్రాసెనకటా శ్రీనాథవేమన్నలున్
    ఖ్యాతిన్బొందిరి సత్కవుల్ ప్రజల నాల్కన్నిల్వ నీనాడు నే
    "టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"

    రిప్లయితొలగించండి
  18. ప్రేమ పైన వ్రాయు పేరడీ కవితకు
    బహుమతుల నొసగెడు ప్రకటన గని
    కవుల యందు కలుగు కమనీయ మైన పో
    టీ వలన కవిత్వ మే విలసిలు

    రిప్లయితొలగించండి


  19. తాజ యయ్యె మనసె "తాజ్ మహల్" టీ చేత

    "పరుపు చాయి" త్రాగ పత్ని యివ్వ

    తన్నుకొచ్చె నాలొ తట్టెడు కయితలే

    టీ వలన కవిత్వమే విలసిలు

    😀😁😂 😖😖😞

    🍀 ☘ ఆకుల శాంతి భూషణ్ 🌿🌱

                        🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పరుపు చాయి :)

      దుష్ట 'సావాసాము' :)


      జిలేబి

      తొలగించండి
    2. "బెడ్డు టీ"ని త్రాగ పెండ్ల మివ్వ...

      ఇష్ట "ససావాసాము" అగునా ...
      జిలేబీ గారూ...

      తొలగించండి
    3. నమస్కారములు శాంతి భూషణ్ గారూ
      ఈ వారం ఆకాశవాణి వారి సమస్యను తెలుపగలరు
      మాపద్యాలు చదివారా ?

      తొలగించండి
  20. చక్కనైనకవిత లొక్కవేదికపైన
    చెప్పగానుచేర గొప్పగాను
    పండుగైనదట్టి మెండైన కవుల భే
    టీవలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  21. మహిత భావ మధుర మందార మకరంద
    తుందిలంపు పద్య తోరణములు
    వచ్చు నెపుడు పూల పరిమళమైన వా
    టీ వలన కవిత్వమే విలసిలు.

    రిప్లయితొలగించండి
  22. చేతమ్మందున లోతునుండి కవితల్ చిమ్మంగ మేలౌను;పో
    టీతత్వమ్మది పెంచుచుండు ప్రతిభన్ ఢీకొన్న మల్లుల్ వలెన్
    రాతల్మార్చియు వృద్ధి తోడ బెడగున్ రాణింప జేయంగ పో
    "టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"

    రిప్లయితొలగించండి
  23. స్పర్ధ వలన ప్రతిభ వర్ధిల్లు చుండును
    మెఱుగు పరుచ నగును మేలు గూర్చు
    హేల వలెను మిగుల లీలగా సాగు పో
    "టీ వలన కవిత్వమే విలసిలు"

    రిప్లయితొలగించండి

  24. కందివారికి శంకరాభరణ కవివరులకు జాల్రా వేయుచు :)



    తోయముగను కవులు దూయుముడివలె వి
    ప్పుచు సులభము గాను పూరణగొన,
    మీ వలన కవివర మిక్కిలి మీదు పో
    టీ వలన కవిత్వమే విలసిలు !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    నిన్న వరంగల్ నుండి హుస్నాబాదులో మా అక్కయ్య ఇంటికి వచ్చాను. ఇక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. అందువల్ల ఈరోజు కూడ బ్లాగుకు అందుబాటులో ఉండను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    చిదువులమ్మఁ దలచ చక్కని చదువబ్బు |

    పలుకులమ్మఁ దలచ భావ మబ్బు |

    శారదాంబను దలచ వలయు | వాగ్వధూ

    టీ వలన కవిత్వమే విలసిలు |


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    చిదువులమ్మఁ దలచ చక్కని చదువబ్బు |

    పలుకులమ్మఁ దలచ భావ మబ్బు |

    శారదాంబను దలచ వలయు | వాగ్వధూ

    టీ వలన కవిత్వమే విలసిలు |


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  28. "టీ" తోతగ్గును నిద్రమత్తుకద ధీటేలేని యందమ్ము నై
    టీతో యౌవన వంతులౌయువతులాంటీలైననొంది నా
    టీ తత్వంబగు నాంగ్లమందు పదముల్ టీయాంతముల్ లోన బ్యూ
    *"టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ :
      "టీ" తోతగ్గును నిద్రమత్తుకద ధీటేలేని యందమ్ము నై
      టీతో యౌవన వంతులౌయువతులాంటీలైన తామొంద నా
      టీ తత్వంబగు నాంగ్లమందు పదముల్ టీయాంతముల్ లోన బ్యూ
      *"టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"*

      తొలగించండి
  29. పోతన సరి గావ పోటీ పడవలెను
    శ్రీనివాసరావు శీఘ్ర గతియు
    ఎర్రన వలెనెదగి నేవ్రాయ ఆరభ
    టీ వలన కవిత్వమే విలసిలు

    రిప్లయితొలగించండి
  30. పత్రచూర్ణజలము బాగుగా మరిగించి,
    పాలు పోసి కలిపి పంచదార,
    మారు మారు త్రాగ మనసు విచ్చేనయా,
    టీవలన కవిత్వమే విలసిలు..

    రిప్లయితొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    ప్రాతఃకాల విశేష పఠ్య సుమహద్రామాయణోద్గ్రంథమున్
    జేతంబందున నిల్పి యందనగు నిశ్చింతన్ గవిత్వాప్తులన్!
    మాతన్ వాణినిఁ గొల్వకే, గ్రథన సంప్రజ్ఞానముం బొంద, కే
    "టీ"తో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూఁడో పాదంలో చిన్న మార్పుతో...

      ప్రాతఃకాల విశేష పఠ్య సుమహద్రామాయణోద్గ్రంథమున్
      జేతంబందున నిల్పి యందనగు నిశ్చింతన్ గవిత్వాప్తులన్!
      మాతన్ వాణినిఁ గొల్వ, కే గ్రథన సంప్రజ్ఞానముం బొంద, కే
      "టీ"తో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్?

      మధురకవి గుండు మధుసూదన్

      తొలగించండి
  32. చేతంబే యిగురొత్త భావనల సచ్ఛీలాత్మ భాసిల్ల శ్రీ
    మాతాశీస్సులు జాలువార గవనంబానందవైభోగమై
    వ్రాతల్శాశ్వతమై జెలంగు రుచిరాద్వైతార్థ వాగర్థ శా
    *"టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"*
    (జగద్గురు శంకరాచార్య నుద్దేశించి ఊహించి రాశాను)

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. సవరణతో

      శ్రోతృద్వంద్వనిపేయశైలిఘటనాశోభాపురస్కృత్యమై,
      చేతోమోదరసార్ద్రనవ్యకవనశ్రేయస్కరీభాసమౌ
      నేతత్పద్యకవీశవర్గలసితస్వేచ్ఛాస్పదంబైన,భే
      టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీలేదు ముమ్మాటికిన్.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పోతే పోయెను నిద్ర కొంచెము మహాపుణ్యంబు చేకూరుగా
    తాతా మన్మడు నత్త మామలకు ప్రాతఃకాలమందున్నహా
    మోతాదౌ పరమౌషధమ్మిదియెగా ముమ్మారు త్రాగంగ నీ
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  35. యా ముని వరుఁ గనమె రామాయణమ్మును
    వ్రాయ భాసిలంగ వసుధ మాన
    సమ్మునఁ గలిగిన విషాద పుంజమ్ము, బో
    టీ, వలన కవిత్వమే విలసిలు


    శీతాంశుద్యుతి సన్ని భాస్య జయముం జేకూర్చు నీ ధైర్యమే
    వీతత్రాసఁ జెలంగు మయ్య ధృతి నిర్వీర్యుండు నీ శత్రువే
    యే తావుం బరికించినం బుడమి నీవే మిన్న నీ తోటి పో
    టీతో వచ్చు, కవిత్వసంపదకుఁ, బోటీ లేదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  36. కవికి కవికి మధ్య గలిగెడు గట్టిపో
    టీవలన కవిత్వమే విలసిలు
    కవన మయ్యదియొక కళయండ్రు పెద్దలు
    దానివలన గలుగు దైవభక్తి

    రిప్లయితొలగించండి
  37. ఆటవెలది
    పూరణమ్ము వ్రాయ పోటీయె నిత్యము
    భార్య టీ యెసంగ పారె నిద్ర
    మదినిఁ దలఁచి నంత కదిలించు పలుకు బో
    టీ వలన కవిత్వమే విలసిలు!

    రిప్లయితొలగించండి
  38. చాతుర్యంబుగ వ్యంగ్య హాస్యములతో సామాజికంబౌ దురా
    ఘాతంబుల్ గని సద్విమర్శనమునే ఘాటించి గుప్పించు ని
    ర్భీతుండౌ కవిపుంగవుండు తనదౌ రీతిన్ సమర్పించు భే
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్ ౹౹

    రిప్లయితొలగించండి
  39. నవ్వురువ్వు రంగు!కవ్వింతలొసగెడి
    పూలగంధ మొసగ?పులకరింత
    గనిన కవుల హృదయ గళమున వినెడి పో
    టీవలన కవిత్వమేవిలసిల్లు!

    రిప్లయితొలగించండి
  40. జాతిన్ మేల్కొలుపన్, సదావలయు భాషాయోష యాశీస్సులున్
    చేతంబందున బ్రహ్మ కన్నిక దృతిన్ చేరంగ నాపల్కుబో
    టీ తో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్
    ఖ్యాతిన్ వచ్చును పండితాగ్రణికి సంఘమ్మందవస్యమ్ముగా

    రిప్లయితొలగించండి
  41. శీతాకాలము నైంటి, యాంటి సొగసున్, శృంగారమందుండ నే
    రీతిన్గైతలదారిదోచు బొగతోగ్రీన్టీ లతోధీజెడన్
    ప్రాతఃకాలసమస్యలిక్షుగడలైశ్రద్ధాళికిన్ మావధూ
    "టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"

    రిప్లయితొలగించండి
  42. ఆటవెలది:
    సవివరంగ నేను సాహిత్య మెలకువల్
    తెలియపరుచు మనుచు తెలుగు నున్న
    సుప్రసిద్ధ మైన సుకవుల తోడ భే
    టీవలన కవిత్వమే విలసిలు

    గొర్రె రాజేందర్
    సిద్దిపేట

    రిప్లయితొలగించండి
  43. కవిపండితునితో శ్రీమతి సంవాదము :

    శార్దూలవిక్రీడితము
    శ్రీతానబ్బగ మీరు పండితులతో జేయంగ సద్ఘోష్టి భే
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్
    జీతంబా తమకెంత నేనెరుగనే? చింతించి సంపాదనా
    రీతుల్ జూడక బిడ్డ పెళ్లి యెటులౌ? శ్రీలంద యోచింపుమా!

    రిప్లయితొలగించండి
  44. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అలసి సొలసి యింట నడుగు పెట్టినయంత
    ప్రేమ తోడుత సతి వేగిరముగ
    నంద జేసి నట్టి యల్లంపు రుచిగల
    టీ వలన కవిత్వమే విలసిలు.

    రిప్లయితొలగించండి
  45. లలితకళలయందు నలతికాలమునుండి
    చిత్రలేఖనమ్ము శిల్పము లిల
    గౌరవమునుదెచ్చె, కవుల పాండితిన యి
    "టీవలన కవిత్వమే విలసిలు"

    రిప్లయితొలగించండి
  46. మేక తోక యనుచు మెరిపించె కవితలు
    రామ లింగ డొకచొ రమ్య ముగను,
    కావ్య చర్చ కొరకు కలయుకవివరభే
    టీ వలనకవిత్వమేవిలసిలు
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
  47. తేనెలొలికెడి మన తెనుగు భాషకు పూర్వ
    వైభవమ్ము తిరిగి వచ్చు, కవుల
    నడుమన కొనసాగు నాణ్యమైనట్టి పో
    టీ వలన! కవిత్వమే విలసిలు!

    రిప్లయితొలగించండి
  48. ఖ్యాతిన్ పొందిన సత్కవీంద్రుని మహాకావ్యమ్మునే మించి తా
    మాతన్ గొల్చివరమ్ముపొంది జన సమ్మానార్హమౌ కావ్యమున్
    భీతిన్ వీడుచు వ్రాయనెంచగ సతి చెప్పెన్ వేడి యైనట్టి యో
    టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీలేదు ముమ్మాటికిన్.

    రిప్లయితొలగించండి
  49. ప్రాతఃకాలము నందు లేచి వడిగా పాటించి స్నానాదులన్
    ప్రాతఃప్రార్థనలన్ ముగించి మదిలో భావించి వాగ్దేవినిన్
    చేతోమోదము తోడ చిందులిడగా జిహ్వన్ బలే పచ్చనౌ
    టీ తో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్.

    రిప్లయితొలగించండి


  50. 1.పద్యకావ్యమిలను వ్రాయబూనిన యంత
    వచ్చి చేరె యతులు ప్రాసలెల్ల
    కుదర లక్షణములు క్రొత్తగా కావ్యవ
    టీ వలన కవిత్వమే విలసిలు.*


    2. తెల్ల వారక మునుపె తెలుగు కవులిచట
    నొకరికంటె నొకరు నుత్సుకతను
    బూని వ్రాయ చుండ ప్రోత్సాహకరపు పో
    టీ వలన కవిత్వమే విలసిలు.*


    3.కంది శంకరులిట కమ్మనైనసమస్య
    లిడుచు నుండ మెచ్చు చెల్ల వారు
    వ్రాయు చుండ పెరుగ వడిగాను మంచిపో
    టీ వలన కవిత్వమే విలసిలు.*


    4.కవులు నొక్క చోట కమ్మగా చేరుచూ
    నవరసభరితమగు నవ్య కావ్య
    ములను వ్రాయ క్రొత్త మోజుతో పరుల భే
    టీ వలన కవిత్వమే విలసిలు.*


    5. కవిత వ్రాయదలచ కాయము వేడెక్క
    కోరె సతిని తాను కూర్మి తోడ
    తెమ్ము వేగ వేడి తేనీరు నిటకు నా
    టీ వలన కవిత్వమే విలసిలు.*

    రిప్లయితొలగించండి
  51. కవిత వ్రాయబూని కలము చేగొనగను
    భావమేది మనసు బోవదాయె!
    మనసెరిగినమగువ మంచి తేనీరివ్వ
    *"టీ వలన కవిత్వమే విలసిలు"*

    రిప్లయితొలగించండి
  52. గురుదేవులకు వినమ్రవందనములు , సరదగా మహానటి పై
    ============*******============
    అనుకరించె నిపుడు నలవోకగను మహా
    నటిని సకల జనులు నటన మెచ్చె
    డభినయమున మేటి యా మళయాళ కు
    ట్టీ వలన కవిత్వమే విలసిలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మహానటి సావిత్రి గురించేనా?
      పదహారణాల తెలుగు పడుచు కాదూ ?


      జిలేబి

      తొలగించండి