18, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2905 (చరణముతో భర్తృసేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"
(లేదా...)
"చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్"

66 కామెంట్‌లు:


  1. కలరో జిలేబీ వలె సధవలిలలో :)

    సెల్ఫు డబ్బా :)

    అరయగ సధవ జిలేబియె!
    పరమాత్ముని రూపమైన పతిని కొలుచుచున్
    గురువువలె చూచి, తానను
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. తరుణము వెదకుచు మానిని
    పరమార్ధము దెలిసి భక్తి భగవం తునిపై
    యరకొర యటునిటు గురువని
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గురువని చరణముతో'...?

      తొలగించండి
  3. తరుగని ప్రేమకు తోడుత
    విరివిగ నాయువును కోరి ప్రీతిగ తమితో
    ధరణిజ పార్వతి వ్రతమా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    రిప్లయితొలగించండి


  4. పరిచయ మైన వేళన గభాలున గట్టిగ కట్టి వేసె తా
    పిరియము తోడు పెన్మిటిని భీరువు మమ్మరె! తల్లితోడగా
    నరయ చిరంటి, జామి, ముసలావిడ రూపసి సర్వదా సదా
    చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి! వేడుకన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పరమపతివ్రత గాథలు
    నిరతము పఠియించునట్టి నెలతయె తానున్
    మరువక సనాతన సదా
    చరణము తో భర్తృసేవ సతియొనరించెన్.

    రిప్లయితొలగించండి
  6. ( కాటమరాజు సైన్యంతో యుద్ధం చేస్తూ అలసట తీర్చుకొని
    వెళ్లుదామని వచ్చిన ఖడ్గతిక్కనకు సతీమణి చానమ్మ
    సలిపిన సత్కారం )
    బిరబిర ఖడ్గతిక్కనకు
    పెద్దది నుల్కల మంచమిచ్చుచున్ ;
    కెరలు పసుంపుముద్దనిడి ;
    కేరుచు చీరను కట్టబెట్టుచున్ ;
    విరసపు బల్కులన్ బలికి ;
    విర్గిన పాలను బోసి ; వింత యా
    చరణము తోడ భర్తృ పరి
    చర్య యొనర్చె లతాంగి వేడుకన్ .
    ( కెరలు - అతిశయించు ; కేరుచు - నవ్వుచు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      విపరీత పరిచర్యల మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. నిరతము పూజలు సేయుచు,
    వరలుచు పరమాత్మ భావ పరిణతి గల్గన్
    నిరతము భక్తిన్ స్తుత్యా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్.

    రిప్లయితొలగించండి


  8. మరిమరి నిన్నే కొలుతును
    మరియాదకు మారుపేరు మహిళిను మగడా
    సరిబండయే తగు! ననా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహిళిను/మహిళను'?

      తొలగించండి


  9. సరి! దేశమ్మున కై మో
    డి,రాణిని నను విడిచితివి డిమ్మరి ! నే వా
    తెఱ తెరువననుచు శిష్టా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కైమోడ్చి' అనండి.

      తొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఈ సమస్య 21.10.2017 నాడు ఇవ్వబడినది.. ఆనాటి నా పూరణద్వయం..

    నరకాసురసంహారము
    జరుపునపుడు కృష్ణుడలయ , సత్యయు విల్లున్
    శరములఁ గొని యమరులు మె...
    చ్చ ., రణముతోఁ బతికి సేవ సలిపెను సతియే !!

    సరసుడు శంకరాభరణసత్కవి రాతిరి చింతజేయుచున్
    సరసతనెంచి భామిని కుచమ్ములపైనొక పద్యమల్లగా
    చరణములయ్యె *మూడు* ., గని చక్కగ నల్లియు దాఁ దురీయమౌ
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్ !!

    ( భర్త కష్టపడుతుంటే భార్య చేసే ప్రతి సహాయము సేవయే.. అనే ఆలోచనతో..)

    తురీయము =నాలుగవ
    చరణము = పద్యపాదము

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి రెండు పూరణలు మనోహరంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  11. అరయగ జానకి రాముని
    శరాసనమునెక్కిడ తను సతియై చేరెన్
    తిరుమాళిగవలదని నను
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. విరి తన కొస గ ని కృష్ణుని
    చరణ ము తో భర్తృ సేవ సతి యొనరించెన్
    పరి పరి విధముల వేడుచు
    తరు ణిని శాంతింప జేసె దామోదరు డు న్

    రిప్లయితొలగించండి


  13. కొరకొర చూచెను శ్రీపతి
    ని,రతగురువును, విడువంగ నియతిని; పెండ్లా
    మరరే దిగ్గున లేచెన్
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  14. కొరియా దేశపు పిల్లయె
    వరునిగ తెలగాణ మగని వరముగ పొందెన్
    సరి తెలుగు నేర్చి యుచ్చా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. హరియే త్రొక్కెను బలినే ;
    పరమ పవిత్రమగు విధియె పడతికి భువిలో ;
    తరుగని సేవలు పతికిని ;
    చరణముతో ; భర్తృసేవ ;సతి యొనరించెన్ !

    రిప్లయితొలగించండి


  16. చరణంబుద్రొక్కె నతడు
    వరునిగ, తమకంబు హెచ్చి పతిని విటుడి తో
    డు రహస్యముగా చంపి ప
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిహరనలువయటంచును
      వరునిన్సతిదల్పవలయు ,పతిశుశ్రూషల్
      వరమగు నువిదకనగ నుప
      "చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

      తొలగించండి
    2. చరణంబును అనండి. గణం సరిపోతుంది.

      తొలగించండి
  17. పరిపరి తిట్టిపోయుచును , బాధల బెట్టుచు, కర్మ కాలె నం
    చరచుచు, దెప్పుచున్ మనమునందున క్రౌర్యము నిండినట్టి నీ
    చ రణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి - వేడుకన్
    తరుణమునందు ప్రేమభరితమ్ముగ బొందిన సొమ్ము నెంచకన్
    (నీచరణము=నీచమైన రణము. ఆమె సేవ చేసింది కానీ కర్మ అనుకుంటూ తిట్టుకుంటూ చేసింది . వార్ధక్యం లో ఇలాంటి ప్రవర్తనలూ ఉంటాయి. )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరులను సోదరుల వలెను,
      వరుని మరుహరుని గరణిని,వల్లభ శిష్టా
      చరణముతోగులసతి యా
      *చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్*

      తొలగించండి
    2. చరితమెసాధ్విశీలము ప్రసంగ ము,సంచరణంబువీడి యా
      చరణము మేలుమేలనగ సాని విచారమువీడి బేరు ను
      చ్చరణము సేయకన్వరుని సాంబుడ టంచెదనెంచి మంగళా
      *చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్*"

      తొలగించండి
  18. గురువచనమ్ముల పైనే
    గురి గలిగియు జగతిన పతి గొప్పగు, విలువౌ
    సిరియని తలచియు చక్కని
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్ !
    **)(**
    ( చరణము = నడవడి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తరుణి వరుండె దేవుడని దల్చి విచారముసల్పిదాసిగా
      యరమరలేనిమంత్రిగనునమ్మగసారథిగాచరించుచున్
      మరులిడురంభయైవరలమానినికిన్దపమేలనో సదా
      *చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్*

      తొలగించండి


  19. తిరుమల శ్రీవారిని తా
    పరమ పవిత్రముగ కొలిచి బ్రమరు పతిని సా
    దరముగ చూచి యతని శ్రీ
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    (యెవరమ్మా ఆ శ్రీరంగరాయడు?)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. వరమయి దొరికిన భర్తయె
    నిరతము ప్రేమానురాగ నిసర్గు డౌటన్
    సరిపడు విధమున కర్మా
    చరణముతో భర్తృ సేవ సతి యొనరించెన్!

    సరిపడు=అనుకూలమగు

    రిప్లయితొలగించండి
  21. పరమ విరక్తుడు పతికిన్
    నిరుపమ పాతివ్రతమును నిష్ఠను అంతః
    కరణ శుచి కలిగి కర్మా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    రిప్లయితొలగించండి
  22. ఈ రోజు శంకరా భరణము సమస్య
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    కోరగ నాధుడు కోర్కెను తీర్చునో లేదో తెలియదు, యీ లేమ మాట
    వినకున్న పరువు పోవును గద యని సత్యభామ నెక్కె నలుక పానుపు, గిరి
    ధారి పరిపరి విధముల వేడి తన వదనమును వంచగ తన్నె నతని
    తుండము చరణముతో, భర్తృ సేవ సతి యొనరించెన్గద, దేవ దేవు

    డీ పగిది భార్య తోడ బడిసెను వదన
    తాడనము , విధి లీల చిత్రముగద యని
    నారదుండు తలచి తన నోరు నొక్కు
    కొని పయనమాయెగా శబ్ద గుణము నందు

    శబ్ద గుణము = ఆకాశము తుండము = ముఖము

    రిప్లయితొలగించండి
  23. పరమాత్ముని గాధలు విని
    నిరతముదాభక్తితోడ నెనరగ మిగులన్
    హరిసదృశుపతినిభక్త్యా
    చరణముతోభర్త్రసేవ సతి యొనరించెన్

    రిప్లయితొలగించండి
  24. విరియది పారిజాతమును ప్రీతిగ రుక్మిణి కిచ్చెనంచు నా
    తరుణియెఱంగి కోపమున తన్నెను కృష్ణుని సత్యభామయే
    చరణము తోడ, భర్త పరిచర్యయొనర్చె లతాంగి వేడుకన్
    స్థిరముగ రుక్మిణీ సతి పతివ్రత గా యెనలేని భక్తితో.

    రిప్లయితొలగించండి
  25. పరమ పురాతన ఛాందస
    పురుషాధిక్యత సహించ పుణ్యంబా నే
    విరచించెద చరితయనుచు
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    రిప్లయితొలగించండి


  26. పరిచయ మైన నిమేషము
    సరి యితడే మగడనుకొని సతియై యోడం
    గ రణమున బుస్సనుచు తా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. వరమై యొప్పదె యిందీ
    వరాక్షి లభియింపఁ బురుష వరులకు నట్లుం
    గరిగమన నడుము నొత్తుచుఁ
    జరణముతో భర్తృసేవ సతి యొనరించెన్


    ధరణిజఁ బోలు కూర్మి వసుధాభ ఘనక్షమ నిత్య సౌమ్య వా
    గ్ఝరులును భాసిలంగ మఱి సాగుచు బంధు జనవ్ర జామి తా
    దర కరణైక సక్త గుణ తత్పర స్వీయ నికేతన క్రియా
    చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి


  28. మురిపెమ్ముగ ముద్దులతో
    వరించి పెన్మిటికి వలయు వసతిని కల్పిం
    చి రతీదేవివలె సదా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  29. హరియొక్కడెపతి యగునె
    ల్లరికి తతిమ్మా పడతులె లావణ్యవతీ!
    హరిపూజయె మేలన నను
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తరుగని ప్రేమ చిహ్నముల త్రవ్వుచు తీయగ జీన్సు ప్యాంటులో...
    మరుసటి రోజునన్ కనగ మార్కెటు నందున దుండగీడుడై
    పరుగిడి చెంతచేరి యొక పంకజ నేత్రకు కన్నుగొట్టుచున్...
    చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
  31. వరకట్నంబులు దగదని
    సరిసమముగ నతివజూచు జక్కనివాడౌ
    పురుషోత్తమునిన్ ధర్మా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి


  32. పురివిప్పిన నెమలివలెన్
    ధరణిని నాట్యంబులాడు తరుణి జిలేబీ
    సరసము లాడి మదిని నా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. తరుణిని నబలగ జూచుచు
    కరుణింతయు జూపలేని గఠినాత్ముండౌ
    బురుషుని గసిగా దక్షిణ
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
  34. పరమేశ్వర సంకల్పము
    మరువక సద్భక్తిచేత మనుగడయందున్
    వరమని మగనినిగని యా
    చరణముతో బర్తృసేవసతియొనరించెన్

    రిప్లయితొలగించండి


  35. మరువక ప్రతి దివసంబున
    చెరగని చిరునగవు తోడ చేయుచు సేవల్
    నరసారథికిని,ధర్మా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*


    కరమును పట్టిన పతియే
    కరమను రాగమును చూప కాంతామణియున్
    మురియుచు నిరతము ధర్మా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*


    ధరణిజ యతిసద్ధర్మా
    చరణముతోభర్తృసేవ సతి యొనర్చెన్
    వరవర్ణినులకు నదియే
    పరమాదర్శంబునయ్యె వసుమతి యందున్.

    రిప్లయితొలగించండి
  36. శ్రీ రామాయణ కావ్యము
    పారాయణ సల్పుచుండె పతియతి భక్తిన్,
    ప్రేరణ గల్గగ సుశ్రీ
    చరణముతోభర్తృసేవ సతియొనరించెన్
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు











    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్ని పాదములు లఘువులతో మొదలవ్వాలి కదూ...

      తొలగించండి
    2. ధన్యవాదాలు పొరపాటు సుశ్రీ అన్న తరువాత చ గురువౌతుందని తికమక

      తొలగించండి
  37. పరగగ దైవభక్తియునపారముగా గలుగంగమంగళా
    చరణముతోడ భర్త్రుపరిచర్య యొనర్చె లతాంగివేడుకన్
    నరయగ భర్తయేగద యయాచిత సంపదలిచ్చువాడునై
    గరము నుదార బుధ్ధిని నెకాయెకి సంబరమిచ్చునేగదా

    రిప్లయితొలగించండి
  38. సరగున లేచి వేకువను స్నాన మొనర్చి భవానిని న్మదిన్
    స్థిరముగ నిల్పి పూజలను చేసి నివేదన తోడ తల్లికిన్
    గరము ప్రియమ్ము గూర్చి తన గానముతో తుది నొక్క మంగళా
    చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్.

    రిప్లయితొలగించండి
  39. ధనమా? దైవమా? సినిమాలో ఎన్టిఆర్ ను ఓదార్చుచూ జమున పాడే పాట నేపథ్యం గా...

    కందం
    ధర నాత్మశాంతి విడి యే
    సిరులున్ సౌఖ్యము వలదని చేరిచి యొడికిన్
    స్వరడోలన్ గానమ్మున
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్

    చంపకమాల
    కొరవడ నాత్మశాంతి సతిఁ గోరి విరామముఁ జెందఁ జేరగన్
    నెరకొన దైన్యమే నిమిరి " నీమది చల్లగ స్వామి! నిద్రపో
    సిరులును సౌఖ్యముల్ వలదు చిత్తము నందున శాంతిలేక" యన్
    చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
  40. తరుణికి పతియే దైవము
    పరమార్థము శుభములొసగు భద్రత గూర్చున్
    స్థిరమతి సద్భక్తి సదా
    చరణముతో భర్ర్తృసేవ సతియొనరించెన్
    రచయిత ఆకులశివరాజలింగము వనపర్తి

    రిప్లయితొలగించండి
  41. పరమపతివ్రతల్ పతిని ప్రాణపదంబుగ నెంతురయ్య యే
    తరుణమునందునైన జవదాటరనుజ్ఞ మహీతలంబునన్
    గురుతరకుష్టుబాధితుని కూర్మిసహింపదె భార్య సద్గుణా
    చరణముతోడ భర్తృ పరిచర్యయొనర్చె లతాంగివేడుకన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  42. కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయమే డా. జి. సీతాదేవి గారి పుస్తకాన్ని ప్రెస్సులో ఇవ్వడానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాను. పూరణలను చూడబోతుండగా అవుసుల భానుప్రకాశ్ గారు వచ్చి, ఇప్పటిదాక కూర్చుని వారి 'వాగ్దేవతా శతకం' పరిషరించుకొని వెళ్ళారు. అందువల్ల ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  43. వరహీనుడైనవానికి
    వరమున వచ్చెనొకకన్య భార్యగ నిలలో
    పరమపవిత్రయధర్మా
    *"చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"*

    రిప్లయితొలగించండి
  44. మరగించు వెతల బాపుచు
    మురిపించు వెలుగుల మగని మోమున నింపన్
    విరితేనె లొలుకు త్యాగయ
    చరణముతో భర్తృ సేవ సతి యొనరించెన్!


    రిప్లయితొలగించండి