30, జనవరి 2019, బుధవారం

సమస్య - 2916 (అల్పుఁ జెప్పనగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"
(లేదా...)
"అల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"

94 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పనికి మాలినట్టి పరమశుంఠను తెచ్చి
      పెద్దల సభ లోన గద్దె నుంచ
      వెక్కిరింతురంద,రెక్కించి గొప్పంచు
      నల్పుఁ జెప్ప...నగు.."మహాత్ముఁ డనుచు"

      నగు=నవ్వు

      తొలగించండి
    2. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెప్పన్ అగు'ను 'చెప్ప నగు' అన్న విరుపు ప్రశస్తంగా ఉన్నది. కాని అందరు బహువచనం, నగు ఏకవచనమౌతున్నది. "వెక్కిరించె నొక్క డెక్కించి గొప్పంచు" అంటే అన్వయం కుదురుతుందని నా సూచన.

      తొలగించండి
    3. ధన్యవాదాలు కంది శంకరయ్య గారు. మీ సవరణకు శతానేక నమస్సులు.

      తొలగించండి
  2. ఆటవెలది
    సమర సాధనములు సత్యమహింసలె
    లోని రామ నామ బాణ మెగసి
    స్వేచ్ఛ కై తలపడి సిద్ధింప జేయ న
    నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు

    రిప్లయితొలగించండి


  3. తన పరిధిని మీరడనుచు తరుణి మన
    మల్పుఁ జెప్పనగు; మహాత్ముఁ డనుచు
    చెప్ప గలము సూవె చెన్నుగ దన్నుగ
    గళము విప్పిన మన గాంధిని చెలి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఆంగ్ల పాల నంబు నంత మొంది oపగా
    హింస లేని రణ మె హిత మటoచు
    మార్గ దర్శ నాన మాన్యుడైన నత న
    న ల్పు చెప్ప నగు మహాత్ము డను చు

    రిప్లయితొలగించండి
  5. దైవ పూజ లందు భవబంద ములువీడి
    పరుల మేలు కోరి పరగు వాడు
    నియమ నిష్ట లనుచు నిలకడ గావున
    నల్పుఁ జెప్ప నగు మహాత్ముఁ డనుచు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.

      తొలగించండి


  6. బల్పుకొనంగ సంపదల బాధ్యత లేకయు కూడగట్టి తా
    తల్పుల మూసి వేయుచు ప్రధానుడు గా తిరుగాడు వాడినే
    నల్పునిఁ జెప్పగాఁ దగు; మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్
    కల్ప ద్రుమంబు గా మదిని గాంధివలెన్ సఖి దోచు వాడినే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. గురువు గారు నిన్నటి సమస్య ఒక్క సారి పరిశీలించండి
    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    దుర్యోధనుడు చంద్ర వంశపు రాజు కర్ణుడు సూర్య వరమును బడసిన వాడు అను భావన తో భారత యుధ్ద. సన్నివేశము

    దారుణముగ నేడు దనుజుడు చెలరేగి చెండాడు చుండెను సేనలను, ఘ

    టోత్కచునుని నీదు షత్కము తోడ సత్వరమున చంపగ వలయు నోయి

    మిత్రమా యని కడు నాత్రుత తోడ నా రారాజు కర్ణుని కోరె, జూడ

    గ నిట నీరజమున గలువరేని నెలవొప్పారెన్గ హతవిధీ ,భారత సమ

    రమున పార్ధుని కై ముద్గరమును పొంది

    నాడ,నేడిది వాడిన మూడు చావు

    రక్కసునకు పార్ధుని చంప రణము లోన

    కష్టమే యని వగచెను కర్ణు డపుడు

    రిప్లయితొలగించండి
  8. ( భారతాంబ బంగారుబిడ్డ )
    జల్పపు బల్కు లెన్నడును
    జాటనివానిని ; మాతృభూమికై
    మల్పుల ద్రిప్పు దీక్షలను
    మ్రగ్గుచు సల్పిన మాననీయునిన్ ;
    గల్పక మంటి నాయకుని ;
    గాంధిని ; ధీరుని ; స్వార్థకాంక్ష యం
    దల్పుని ; జెప్పగాదగు " మ
    హాత్ము " డటంచు ; జనుల్ "భళీ " యనన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
      'కల్పక సామ్య నాయకుని' అంటే బాగుంటుంది

      తొలగించండి
    2. రాకుమార గారికి , శంకరార్యులకు ధన్యవాదాలు .
      "కల్పకసామ్యనాయకుని " పదబంధం బాగుందండీ!

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    పొల్పుగ స్వీయబోధనల పూర్వకవీంద్రకవిత్వమాధురుల్
    దెల్పుచు , నైపుణిన్ గరపి , ధీయుతశిష్యులజేయునట్లు సం...
    కల్పితచిత్తుడై గురువు, గాంచగ నొక్కని తీర్చిదిద్దగా
    నల్పునిఁ., జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. కల్పక మందుమా? ప్రభుత కల్లుదు కాణము చూపునిచ్చటన్!
    వేల్పుల సంఖ్యయా?యిచట వేనకు వేలది స్వాములందరున్!
    కల్పనయా కరాగ్ర రమ,కాదది జ్యేష్ఠన నవ్వు నేలనం
    దల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    త్రాగు సమయమందు తనదను జగమంత
    సజ్జనుండు భార్య ,సంతతి యను
    ఒక్క నిమిషమైన నోపునె సంసారి?
    అల్పు జెప్పనగు మహాత్ముడనుచు

    రిప్లయితొలగించండి
  12. చేతనబలమే విచిత్రబలంబ య్యె
    భారతీయతాత్మబంధువయ్యె
    అస్త్రశస్త్రచయము లనగసత్యాగ్రహమ
    *"నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

    రిప్లయితొలగించండి
  13. అల్పులటంచుమానవులునల్పులటంచునువానరంబులన్
    తల్పడురావణుండు వరదర్పమదే విధిలీలగాకసం
    కల్పవికల్పజన్యమదికైటభవైరినృసింహవామనా
    *"నల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"*

    రిప్లయితొలగించండి
  14. అల్పశరీరమల్పమగునాశ స్వకీయులస్వేచ్ఛగోరె దా
    నల్పుడభారతీయులునునల్పులె విద్యధనాస్త్రశస్త్ర సం
    జల్పమునందునల్పులు విశాలహృదంజలిగారవించె మే
    *"నల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    కల్పన జేసె "గాంధి"యిది కావలె నందరి క్షేమ ధాత్రిగా
    నల్పులు పీఠమెక్కి తమ హాయినె కోరుకొనంగ జూడమే?
    సల్పిరి సత్కృతుల్ నిధులు, సాగుకు నీటిని, యంత్ర వాసినిన్
    "అల్పుని జెప్పగానగు మహాత్ముడటంచు, జనుల్ భళీ యనన్"

    రిప్లయితొలగించండి
  16. ఊరువులును లేవు-ఉన్నతోన్నతుడయి
    సూర్య రథము తోలె సుందరముగ
    కార్య శీలురవుర!ఘనులగు చూడ,న
    నల్పుజెప్పనగు మహాత్ముడనుచు!

    రిప్లయితొలగించండి
  17. పరులహితము గోరి పడరాని పాటున
    బరగినాడు భువిని, బక్కపలుచ
    వాడు,బోసినవ్వు రేడు దా మొరగునం
    దల్పు చెప్పనగు మహాత్ముడనుచు

    రిప్లయితొలగించండి
  18. భారత యుద్ద ములో కర్ణుని రధసారధి శల్యుడు అర్జునునకు గోపాలకృష్ణుడు

    హరిముందర సముఉజ్జీ కానే కాడు . కాని ఆతను సారధ్యం చేస్తూ పాండవ విజయ కారణ భూతుడైనాడు అన్న భావన

    సీస మిళిత సమస్య పూరణ

    సమస్య

    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"




    పార్ధుని తేరుపై పరమేష్టి సారధి,
    తనదు రధము పైన తగిన వాడు

    శల్యుడు కాదంచు శంక బడసి రణ
    రంగమున దుమికె రాజ రాజు

    కోరగ కర్ణుడు,పోరులోన ఘడియ
    కొకమారతని తోడ గొడవ బడుచు

    పాండవులకు చేసె దండిగా సాయము
    యెంచి చూడగ శల్యు డెంత, నంద

    తనయు నెదుట నతని ఘనత నే పాటియో,

    మద గజంబు నెదుట మశకము గద,

    భరత యుద్ద మందు చిరు సాయ మిడినట్టి

    నల్పు జెప్పనగు మహా త్ముడనుచు

    రచన. పూసపాటి

    రిప్లయితొలగించండి
  19. శీల సంపదెపుడు సిసలైన సంపద
    ధనము వలన గొప్ప తనము రాదు
    మానవత్వమున్న మనిషియే యైనచో
    "నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"

    రిప్లయితొలగించండి
  20. బక్కపలుచగ నుండి,యే పనియురాని
    నల్పుజెప్పనగును మహాత్ముడనుచు
    తినుచుగూర్చుంటయాతని దినపుచర్య
    భాగ్యమనగను నతనిదే భరణి యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాసారు. నా సవరణ....

      బక్కపలుచ నుండి పనియేదియును రాని
      యల్పు జెప్పనగును మహాత్ముడనుచు
      తినుచు గూరుచుంట దినచర్య యతనిది
      భాగమన నతనిదె వసుధయందు.

      తొలగించండి
    2. ఒౌనండి పొరపాటుబడ్డాను.
      మార్చివ్రా సినందులకు కృతఙ్ఞతలు

      తొలగించండి
  21. స్వల్పపు బుద్ధి నేత యయి , జాతిమతమ్ముల రంధి హెచ్చగా
    నల్పుని జేసి పల్కును మహాత్మునిగాంచి , స్వలాభమున్నచో
    "అల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"
    దల్పగ దుఃఖ మౌను గణతంత్రము నీచుల చేత జిక్కినన్.

    రిప్లయితొలగించండి
  22. కుజను లనుచరులుగ కుటిలతంత్రము తోడ
    నోట్లుజల్లి జనుల యోట్లు బొంది
    ప్రజల సొమ్ము మ్రింగు ప్రతినిధులైనట్టి
    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రతినిధి యైనట్టి' అనండి. లేకుంటే వచనదోషం.

      తొలగించండి
  23. కల్పన! నాదుపల్కులను గాదనకుండగ నేర్వుమాయిటన్
    నల్పుని జెప్పగాదగు మహాత్ముడటంచు జనుల్ భళీయనన్
    నల్పుడు చేయకేపనిని హాయిగబొట్టను నింపుకొంచుచున్
    నల్పపుబుద్ధితో దనుమ హాత్మునిగాదలచున్గదాభువిన్

    రిప్లయితొలగించండి
  24. తనకు నున్న దాని దాన మిచ్చు బడుగు
    లేని దాని కర్థి గాని వాని
    వాణి యున్న లక్ష్మిఁ బడయ నేరని వాని
    నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు


    జల్ప విహీను సచ్చరితు సద్దృఢ చిత్తు నహీన సత్య సం
    కల్పు నుదాత్త దాంత గుణు గర్వ విహీను నజస్ర హోమముల్
    సల్పుచు విశ్వ శాంతికయి సన్మతి నుండెడు సంయమీంద్రు వా
    గల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. రెండవదైతే మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. ఆటవిడుపు సీరియస్ పూరణ:
    (సీతా దేవి గారికి అంకితం)

    కల్పుచు భారతీయులను కర్రను ద్రోలుచు తెల్ల దొర్లనున్
    స్వల్పపు మేతతో నలరి శక్తులు యుక్తులు మేళవించుచున్
    కల్పము నొక్కడై యొదవు గాంధిని మూరెడు గుడ్డగోచితో
    నల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కల్పుచు నోబిసీయులను స్కంధము నెత్తుచు బ్రాహ్మణాదులన్
    స్వల్పపు మేతతో నలరి వాక్కుల నిచ్చుచు మన్-కి-బాతులన్
    కల్పము నొక్కడై యొదవు కమ్మని చాయిని నమ్మువానినిన్...
    అల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నమ్మువాని నా యల్పుని...' అనండి.

      తొలగించండి
    2. 🙏

      ఈ ట్రిక్కులు ఇంకా వంట బట్టడంలేదు ఈ మంద బుద్ధికి...

      తొలగించండి
  27. దోచుకునుచు ప్రజల దాచుకొనుచు సొమ్ము
    కొట్లుకోట్లు ధనముఁ గూడబెట్టి
    కులుకుచు చరియించ కుత్సితుం డెట్టు లా
    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ అధిక్షేపాత్మకమైన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. తత్తర పడకయ్య తత్త్వము తెలియుము
    ఆత్మ రూపమంచు నందరిగను
    దేహి గుణములెంచి దెప్పగవలదిక
    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు

    రిప్లయితొలగించండి
  29. విశ్వ మందు గాంధి విమలమౌ భారత
    దేశ చరిత ఘనత దిక్కు లలర
    జేయ, శాంతి మంత్ర చేతనాబల క్రియా
    నల్పుఁ జెప్పనగు మహాత్ముఁడనుచు!

    రిప్లయితొలగించండి
  30. చల్పుచుఁ బాలనమ్ము కడు చక్కని రీతిని గాఢమైన సం
    కల్ప బలమ్ముతోడ సహకారముఁ బొంది జనమ్మునుండి తా
    పొల్పగు పద్ధతిన్ ప్రజకు మోదము గూర్చుచు నుండు, రూపమం
    దల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
  31. అల్పుడు వేష భాషల ననల్పు డకుంఠిత సత్యదీక్షలో
    నల్పుడు డాబుగాబుల ననల్పు డహింసను నోర్పు నేర్పుల
    న్నల్పుడు కాడు గాంధి యన నద్భుత మూరితి చూడ నాకృతి
    న్నల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్.

    రిప్లయితొలగించండి
  32. పనియె దైవమంచు బంట్రోతుఁ జెప్పగా
    వృత్తి ధర్మమదియె విష్ణువనుచు
    విన్న వారి లిట్లు విస్మయమునఁ బల్కె
    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు

    రిప్లయితొలగించండి
  33. కల్పముఁ స్వార్థచిత్తుడను గాంచుచు దూరమునుంచమేలెయౌ
    నల్పునిఁ , జెప్పగాఁ దగు మహాత్ముడటంచు జనుల్ భళీ యనన్
    వేల్పుల గొల్చుచున్ సతము పేదల వేదన దీర్చు గొప్ప సం
    కల్పముఁ గల్గి దీనజన కష్టములన్ తొలిగించు వాడినే.

    రిప్లయితొలగించండి

  34. పొల్పుగ సాధుశీలగతభూరికృపామహనీయసత్యసం
    కల్పజనస్వతంత్రనయకార్యనిమగ్నవిచారు గాంధినిన్
    జల్పితదుర్వచోరహితు సత్వసుధాపరిపూర్ణుఁ గ్రూరమ
    త్యల్పునిఁ జెప్పగాదగు మహాత్ము డటంచు జనుల్ భళీ యనన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  35. అల్పమేది జూడ నవనిలో నన్నిట
    చెప్పు లేని నడక చేతనగున
    అగ్రమనుచు నీకు నుగ్ర రూపంబేల
    *"నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అల్పుడెవడు జూడ నధముండదెవ్వడో
      దూర ముండు నపుడు తోచగలద
      దారిఁ దెలుసు కొనుచు దరికేగి జూడగా
      *"నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

      చీమ చిన్నదైనఁ జిటుకుమన్న దెలియు
      నల్లి కరచునపుడు నరకమనిన
      పేను, దోమ, యీగ పేరేమి యననేమి
      *"యల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

      తొలగించండి
    2. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన పీవీ నరసింహారావు గారికి నివాళిగా...

      రాజకీయమనిన రాజ్యమేలుట గాదు
      జనుల కేది మేలొ జరుగ వలయు
      పీవి దారి జూడుమా విజయమదియె
      *"యల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

      తొలగించండి
  36. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పద్యమును పరిశీలింప ప్రార్థన.
    గారాబము నింపెను రవి
    నీరజమున, గలువఱేని నెలవొప్పారెన్
    భూరిగ కవి పుంగవు లెద
    లూరించుచు కవనము గొన నుత్సాహముతో!

    రిప్లయితొలగించండి
  37. కనులుమూసుకొనగ కాషాయ వస్త్రాన
    శిష్యులనిరి"గురువు" సిద్ధుడనుచు
    బాబవేషమందు బ్రమలను గల్పించు
    అల్పుజెప్ప నగు మహాత్ముడనుచు!

    రిప్లయితొలగించండి
  38. అందరికీ నమస్కారం,

    నా పేరు చాగంటి చరణ్. నేను IIT లో B.Tech చేసి వృత్తి రీత్యా హైదరాబాదు లో ఇంజనీరు గా పని చేస్తున్నాను. తెలుగు సాహిత్యం పై ఆసక్తి యున్న వాడనై ఈ బ్లాగులో ప్రత్తీ దినము ఇచ్చే సమస్యా పూరణలు చదువుతాను. పూర్ణలు కూడా పంపుతూ ఉంటాను. పుస్తకాలు మరియు బాలవ్యాకరణం చదివినా చిరు సందేహాలు వస్తూ ఉంటాయి. అవి అందరూ ఉన్న ఈ బ్లాగులో అడగటం సమంజసము కాదనిపించింది. కనుక మీలో ఎవ్వరినైనా వ్యక్తిగతంగా సంప్రదించుటకు email లేదా phone no. లేదా ఏ ఇతర మాధ్యముల వివరాలైనా ఇవ్వగలరని ఆశిస్తూ..

    ఎవ్వరిని ఇబ్బంది పెట్టనని మనవి చేసుకుంటున్నాను. వివరాలు బ్లాగ్లో ఇవ్వుట ఇష్టములేని యెడల క్రింద యున్న నా phone no. కు గాని email కు గాని పంపగలరు.

    ధన్యవాదములు,
    చాగంటి చరణ్
    9948723374
    charanchaganti@gmail.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరీ వేదిక పైననే నిరభ్యంతరముగ నెట్టి సందేహముల నైన (ఆంధ్ర సాహిత్య పరమైన) నడుగ వచ్చును. గురువుగారు కాని యితరలు గాని నివృత్తి చేయగలరు.

      తొలగించండి

    2. చాగంటి గారు

      రోజూ తప్పో ఒప్పో పూరణలు వేసేయండి

      Over a period of time అన్నీ ఓ కొలిక్కి వచ్చేస్తాయి


      జిలేబి

      తొలగించండి
    3. చరణ్ గారూ
      మీరు ఛందో వ్యాకరణాలకు సంబంధించిన సందేహాలను ఇక్కడ నిరభ్యంతరంగా అడగి నానుండి, ఇతర కవిమిత్రుల నుండి సమాధానాలు పొందవచ్చు.

      తొలగించండి
  39. అల్పుడునోబిశాచమొధరాస్థలిదిర్గుదిగంబరాంబరా
    కల్పవికల్పవర్జితవికారవిరాగియచేతనాస్థితిన్
    గల్పితవర్ణధర్మములకచ్ఛకమండలబంధనాళి సం
    కల్పముచేతవీడియుజగంబునవెఱ్ఱిగదిర్గు రూపమం
    *"దల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"*

    రిప్లయితొలగించండి
  40. ఉత్పలమాల
    పొల్పును వీడకెప్పుడును పూనుచు సత్యమహింస మేటి సం
    కల్పపు టాయుధమ్ములుగ గాంచియు దేశ స్వతంత్రతన్ సదా
    వేల్పుగ పూజ్యుడౌచు పదవిన్మదిఁ గోరని దర్పధారణం
    దల్పునిఁ జెప్పగాదగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్

    రిప్లయితొలగించండి
  41. అల్పపు జొన్నగట్క పరమాన్న ము,పైరులెనందనంబు, సం
    కల్పము గారుచీకటుల గఱ్ఱయె వజ్రము,గడ్డివాములే
    తల్పపుఠావులై,మితహితాచరణంబున యోగియై సదా
    కల్పనజేయు బంటనిధి,గంబళి
    బచ్చిక సజ్జసెజ్జలై
    జల్పవిహీన జెట్టులగు సౌధము,మంది పసుల్లు హాలికా
    *"నల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"*

    రిప్లయితొలగించండి
  42. సవరించిన పూరణ
    -----------------
    దైవ పూజ లందు తనరారు భక్తిని
    పరుల మేలు కోరి పరగు వాడు
    నియమ నిష్ట లనుచు నిలకడ గావున
    నల్పుఁ జెప్ప నగు మహాత్ముఁ డనుచు


    రిప్లయితొలగించండి
  43. కవిమిత్రులు మన్నించాలి ...
    నెల్లూరు ప్రయాణంలో ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  44. పరుల హితము గోరు పామరుడైనను
    పూజనీయుడతడు పుణ్య పురుష
    దాన గుణము గలిగి ధనము లేకున్నను
    *"అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"*

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఒగి ననల్పు డల్పు డొక్క రీతిగ నుంద్రు..
    వారి వారి నడక తీరు వేరు..
    అరయ నల్పుఁ జెప్ప నగు దురాత్ము డని.. య
    నల్పుఁ జెప్ప నగు మహాత్ముఁ డనుచు

    మరొక పూరణము..

    అల్పుడైన నేమి? యల్పత గుర్తించి
    యల మహాత్మ సంఘమందు మెలగి
    నట్టులయిన.. నల్పు డనరాదు.. భావి నా
    యల్పుఁ జెప్ప నగు మహాత్ముఁ డనుచు

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    30.1.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  46. దేశహితముకోరి తెగువను చూపుచు
    సర్వమొసగెనతడు జగతి యందు
    అట్టివారి యీవి యనితర సాధ్యమ
    నల్పు జెప్పనగు మహాత్ము డనుచు

    రిప్లయితొలగించండి