10, ఆగస్టు 2022, బుధవారం

సమస్య - 4159

11-8-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్య లేనివారె విజ్ఞులు గద”
(లేదా...)
“విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్”

42 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

ఎగి రెగిరి పడుచును నెంతఁజెప్ప వినరు
విద్య లేని వారె,విఙ్ఞులు గద
యణగి మణగి యుందు రన్నియుఁ దెలిసిన
వార లరయ గాదె వసుధ యందు

M.B.G.TILAK చెప్పారు...

విద్యలేనివాడు వింతపశువనుచు
పలుకు మాటలెల్ల పాతవాయె
రాజకీయరంగ లక్షణములుజూడ
విద్య లేనివారె విజ్ఞులు గద

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కౌరవ సభలో భీష్ముడు రా రారాజుతో..

ఆటవెలది
సంధిఁ జేయ వచ్చి సకలము వివరించి
శుభము గూర్చ పలికె విభవమంద
దారి జూప నెంచె రారాజ! కృష్ణయ్య
విద్యలేని వారె? విజ్ఞులు గద!

శార్దూలవిక్రీడితము
ఆద్యంతమ్ము శుభాశుభమ్ములు సయోధ్యన్ గూర్ప వల్లించెనే
వద్యంబైనది మేలుగూర్చుకతనన్ బ్రహ్మాండ పూజ్యుండునై
హృద్యమ్మైతగు దారిజూపుననగన్ గృష్ణుండు రారాజ! తా
విద్యాగంధ విహీనులే? వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్!

subbarao చెప్పారు...

ఏవిద్యల్ దెలి యంగఁ బల్కిరి యహా యేమంటి రేమంటి ,రే
విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్?
విద్యాగంధముఁ గల్గు వారలె యికన్ విద్వాంసు లైయొప్పెడున్
వంద్యుల్ వారలె యెక్కఁ డైనను గనంబాహ్యాంత రాళంబునన్

Rama Murthy Duvvuri చెప్పారు...

తేటగీతి
లేమ!నరపశువులె*విద్య లేనివారు,
విజ్ఞులుగద*నేర్చుకొనగ విద్యలెల్ల
విద్య కలవారి కెందును వింతలేదు
మిన్నయౌనన్ని ధనములకన్న విద్య.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

విద్యవలన నొదవు వినయ సంపదయని
పెద్దలనెడు మాట చద్ది మూట
సత్వగుణ యుతులయి సన్మార్గులైన య
విద్య లేనివారె విజ్ఞులు గద

Rama Murthy Duvvuri చెప్పారు...

శార్దూలము
విద్యానామక కల్పవృక్షమొసగున్ విజ్ఞాన విత్తంబులన్
హృద్యంబౌ మృదుమాధురీ ఫలములన్నేవేళలోనైన ,స
*ద్విద్యాగంధవిహీనులే? వసుధలో విజ్ఞుల్ ఘనుల్,తాత్త్వికుల్*
విద్యావంతులు,జ్ఞానవంతులు గదా వేనోళ్ళశ్లాఘింపమే.

sitharamayya solasa చెప్పారు...

పరుల మోసగించి పబ్బము గడుపుచు ,
ప్రజల నడమ నందు పగను పెంచ
కులమతముల రెచ్చగొట్ట నేర్పు గలుగు
విద్య లేనివారె విజ్ఞులు గద

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

విద్యల్ నేర్చినవారలీ భువిని నిర్వేదంబునున్బొందకన్
సద్యస్స్ఫూర్తిగ కార్యనిర్వహణమున్ చక్కంగ సల్పందగున్
విద్యాగంధమె మానవాళికిలలో వెల్గుల్ పిసాళించు దు
ర్విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చదువులభ్యసించి జగతిలో పేరొంది
పదవులంద వచ్చు వాసిగా ను
ధనము కొరకటంచు దారిమార్చెడు క్షుద్ర
*"విద్య లేనివారె విజ్ఞులు గద”*

చదువు నేర్వ కున్న సంస్కారమును చూపి
సాటి వారి కెపుడు సాయ పడుచు
మంచితనము తోడ మనసులు గెలిచిన
*"విద్య లేనివారె విజ్ఞులు గద”*

విరించి చెప్పారు...


బాధ్యతల నెరుగని పౌరులుండెడి చోట
నోటు గోరుచుతమ యోటునమ్మి
నేతల గెలిపించు నీచులుండెడి చోట
విద్య లేనివారె విజ్ఞులు గద.



వేద్యుల్ మేలును గోరి చెప్పినను తా పెచ్చారులై పౌరులే
మద్యంబిచ్చిన వారినే సతము సమ్మానించగా నేతలై
యాద్యుండ్రై వెలుగొందుచోటగనగా నవ్యక్తులున్ నీచులౌ
విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చదువు కున్న వారు సంస్కార హినులై
మని న వారి కంటె మహిని నండ్రు
చదువు లేక యున్న సంస్కారమున్నచో
విద్య లేని వారె విజ్ఞు లు గద

Siva Prasad Chavali చెప్పారు...

ఆటవెలది
పొట్ట నింపు విద్య బోరన నేర్వదె
జంతు వేది యైన! జగతి మనికి
నేర్వ మనుజులందు నీతిమాలిన మోస
విద్య లేనివారె విజ్ఞులు గద

sarada చెప్పారు...

ఆటవెలది
పరిమళమ్ము లేని విరుల వాడము గద
విద్య లేని వాడు వింత పశువు
గురువు గారు తప్పు గ రచించె సూక్తిని
విద్య లేనివారె విజ్ఞులు గద.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్

అపర్ణ గాడేపల్లి చెప్పారు...

శార్దూలము.
ఆద్యంతంబుల గాంక్షలన్బడుచు నన్యాయంబులన్
మ్రగ్గుచున్
సద్యస్ఫూర్తిని వీడి యంధుడగుచున్సంచారము న్జేయుచున్
విద్యల్నేర్చినవాడు వింతపశువై వేషాలువేయంగ, నా
*విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్*

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

Siva Prasad Chavali చెప్పారు...

ప్రాజ్ఞుల 'నిత్యానంద'ము
లే జ్ఞాన గతులన, వార లేగియు నెరపన్
విజ్ఞత విహీన మన్మథ
యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

ఇంటి పనులయందు వంట జేయుటనందు
పిల్ల పాపలగని పెంచుటందు
విత్త పాలనమున భేషౌను గృహిణులే
విద్యలేని వారె విజ్ఞులు కదా

అపర్ణ గాడేపల్లి చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా 🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Subbarao Ayyalasomayajula చెప్పారు...

శా.

మద్యమ్మున్ రుచిచూచుచున్ బడతులన్ మౌఢ్యమ్ముచే నేపుచున్
విద్యాసంస్థల గత్తరన్ సలుపగా విత్తంబు లక్ష్యంబుగా
సద్యంబౌ నభిలాష నేతగ నగున్ సామ్రాజ్యమున్ గెల్వగన్
*విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్*

.... డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

Chennamadhavuni Bhaskara Raju చెప్పారు...

**సమస్య పూరణము**
(విద్య లేని వారె విజ్ఞలుగద)
===
**ఆటవెలది**
*దండి కండబలము గుండెబలము నిచ్చు*
*సాహితీ పిపాస చదువులిచ్చు*
*చోద్య,చోరతత్వ విద్యాధికుల కన్న*
*"విద్య లేని వారె విజ్ఞులు గద"!*
===
*సమస్య*="విద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్వికుల్"
===
**శార్దూలవిక్రీడితము**
*ఆద్యంతంబుగ శాస్త్రముల్ చదివి పెన్నాచార శూన్యత్వత*
*న్విద్యాభ్యాసము జేసియున్మలినుడౌ వేదాంతి కన్నన్ భళా!*
*సద్యోస్ఫూర్తియె సత్ప్రవర్తన సువిజ్ఞానార్థులున్ బ్రాజ్ఞులౌ*
*"విద్యారంగ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్వికుల్"*
===
**చెన్నమాధవుని భాస్కర రాజు**

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

Chennamadhavuni Bhaskara Raju చెప్పారు...

ధన్యవాదములు గురువు గారు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వినయ మీయ నట్టి విద్య లేల మనకు
డెంద మందు నకట కొందరికి న
ఖర్వముగఁ బుడమిని గర్వ మొసంగును
విద్య, లేని వారె విజ్ఞులు గద


ఆద్యం బెల్లర కెంచ సుంతయిన విద్యా గంధ మిద్ధాత్రినిం
జోద్యం బింతయుఁ గాంచ మీ గిరలఁ బ్రాచుర్యంబ లోకమ్మునన్
సద్యస్స్ఫూర్తి సెలంగ మిక్కుటముగన్ శాస్త్రార్థ సంవేదులౌ
వి ద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

శంకర్ జీ డబ్బీకార్ చెప్పారు...

కొండాడంగనిషాదుడొక్కడడుగోగోమాయువాంగ్లేయుదౌ
గుండెన్నీరొనరించినించెభయమున్గోరంతకొండంతవే
దండంబింగ్లిషుకోటికిన్హరియెసీతారామరాజొక్కడౌ
*“మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్”*