22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4539

23-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”
(లేదా...)
“తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ”

35 కామెంట్‌లు:

gsnatp చెప్పారు...

నిరతము దానము జేయుచు
చరితము నెరుగకనె భ్రష్ఠ చరితుల కివ్వన్
చెరతురు లోకము వారలు
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.

BMahalakshmi చెప్పారు...

అరయక శంభుడుభస్మా
సురునికివరమీయనసువుస్రుక్కగపాఱెన్
పరుగిడెరక్షకువిష్ణువు
తరతమభావమ్ముజూచిదానమిడవలెన్

Sitharamayya Solasa చెప్పారు...

అరయగ దానమిడునతని
కరములు పుచ్చుకొను వాని కైపై నుండన్
దొర యనుకొనవచ్చు గనుక
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చరితను గనుగొని మిక్కిలి
సరియగు నిర్భాగ్యునకును
సన్మతితోడన్
నిరుపేదకు పాత్రునకును
తరతమ భావమ్ము జూచి
దానమిడవలెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
సురపతి కొమరునిఁ గావఁగ
పరుగున దానమ్ము గొనె కవచకుండలముల్
వెరువక నిడి కర్ణుఁడొరిగె
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్

చంపకమాల
సురపతి కావ పుత్రుని, యశోధన శోభితు దానకర్ణునిన్
బరుగున మారువేషమున పంచన జేరియుఁగోర తొడ్గునున్
వెరువక తా నొసంగి రణవేదినిఁ గూలెను నిస్సహాయుఁడై
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నిరతము మద్యము గ్రోలగ
పరులను ధన మీయ గోరి ప్రాధేయపడన్
దిరముగ. యోచించి యపుడు
తరతమ భావమ్ము జూచి దాన మిడ వలె న్

విరించి చెప్పారు...

ధరణిని పాత్రత నెరుగక
నెరపిన దానమ్మదిగన నీచుల పాలై
సురభికి వేశ్యల పాలౌ
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్.



ఎరుగక జేయు దానమది హీనుల కింపును గూర్చు గాదె యీ
వరి దరి జేరి చేతకుడు వామము పొందిన నా పణమ్ము తో
సురభిని గ్రోలు దుష్టులగు శుండల జేరుచు నుంద్రు కావునన్
దరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అరయగ భారతావనిని యత్యధికుల్
నిరు పేదలుందురే
సరియగు వారి నెన్నుకొని సాయము
సేయుట యోగ్య కార్యమౌ
నిరతము బాధతో నెపుడు నిక్కము
నల్గెడు పేదవారికిన్
తరతమ భావముంగని వదాన్యలు
దాన మొసంగ యుక్తమౌ

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

అరయకమేలోకీడో
త్వరపడిదానమొనొసగకతగునో గాదో
నరయుచువచ్చిన వారల
*“తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్”*

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ అరయఁగ నపాత్ర దానము
వెరవక మూర్ఖునకుఁ గరపు విద్యయుఁ గనఁగా
ధరలో చేటును బడియవ
తరతమ భావమ్ముఁ జూచి దానమిడవలెన్

చం॥ అరయ నపాత్ర దానమున యాపద హెచ్చగు నిచ్చు వారికే
సరగున రాజకీయమున సజ్జనులన్ గని యెన్న కున్నచో
మరవకు కష్టనష్టములు మాన్య జనాళికిఁ దప్ప వయ్యరో
తరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ

M.B.G.TILAK చెప్పారు...

త్వరపడి దానములొసగుట
సరికాదని చెప్పనగును చరితను గనినన్
సరియగు విచక్షణముతో
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్

అరయని సంప్రదానమున హానిని పొందెను దానకర్ణుడే
వరములొసంగ సంకటము వచ్చెనుగా బలిచక్రవర్తికే
త్వరపడు దానమే దొసగు తప్పిదముల్ వెత పెట్టకుండగా
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ

శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

మరొక పూరణ

చం॥ సురపతి కోర కర్ణుఁడును శుక్రుని బోధను వీడి నాతఁడున్
వెరవక దాన మీయఁగను వీడఁగ వచ్చెను జూడఁ బ్రాణమే
నరియ నపాత్ర దానమున హానినిఁ బొందుటఁ గాంచఁ దోచెనే
తరతమ భావముం గని వదాన్యులు దాన మొసంగ యుక్తమౌ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నిరతము జూదగృహమ్ములఁ
దిరుగుచు ధనమెల్లనొడ్డి తిరిపరి యగు జూ
దరికిన్ దానమపాత్రము
తరతమభావమ్ముఁ జూచి దానమిడవలెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నిరతము జూదశాలలకు నెట్టన నేగుచు నిల్లుఁ గాంచకన్
దిరుగుచు నెల్లవారలను దేబరిగొట్టుగ నాశ్రయించు నా
వెరువక బిచ్చమెత్తుకొను వెంగలికిచ్చు ధనమ్ము వ్యర్థమౌ
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ

శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్త చెప్పారు...

గురుకుల మాణికంబు బలు కూకలు బెట్టగ నూరడింపగన్
వరగురుడేగె కాననము వాగురవానికడన్నహో మహ
త్తర గురుదక్షిణంబడిగె తా ప్రియ శిష్యుడు పార్థుకోసమై
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ

వాగురవాడు = నిషాదుడు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చరితము నెరుగకయె' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'భారతావనిని నత్యధికుల్...'

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరణలు వాట్సప్ లో చూడండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మొదటి వృత్తంలో 'దానమున నాపద...' అనండి.
రెండవ వృత్తంలో 'వీడి యాతఁడున్' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

Sreedhara Rao Machavolu చెప్పారు...

అరయగ నార్తులౌ ప్రజల నాదుకొనన్ మదిలో గణించుచున్
జెఱుపగ వారి వేదనను శీఘ్రమె సాయము గూర్చు నంతలో
యురుకున సాగి పోవక నియోగ విధానము లెంచి వానిలో
తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ

Subbarao Ayyalasomayajula చెప్పారు...

చం.

పిరుదుల దాటు కీల్జడను పెంపుగ పువ్వుల కూర్పు నేర్పుగా
తురిమి సుగంధ వృష్టి నిడి తూపులు మన్మథ కామితార్థముల్
సరసకు రాని భార్య గని సౌరభ భాగ్యము శాంతి కాములై
*తరతమభావముం గని వదాన్యులు దానమొసంగ యుక్తమౌ.*

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ధన్యవాదములండి

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

పరులకు గౌరవ మిడవలె
తరతమ భావమ్ముఁ జూచి; దాన మిడవలెన్
సరియగు పాత్రత నెంచుచు
నిరుపేదల కందరికిని నేర్పుగ సిరులన్.