ఉ:వచ్చిన వాడు ఫల్గుణుడు వానిని గెల్వగ గష్టమంచు నీ హెచ్చరికల్ బొనర్చు గురు నేల గణించెదవోయి!కర్ణుడే యచ్చపు వీరమిత్రు డని యాత్మ దలంపుము నాకు నోడగా వచ్చిన వాడు ఫల్గుణు డవశ్యము గెల్చెద మో సుయోధనా!
ఎచ్చుగఁ జతురంగ బలం బిచ్చట మన దర్జునుండు నిట నొంటరి వాఁ డచ్చముగ నిశ్చయమ్ముగ వచ్చిన ఫల్గునుని గెల్వ వచ్చుఁ గురుపతీ
అచ్చెరు వయ్యె వానిఁ గన నంకము నందు ననూహ్య రీతినిన్ మెచ్చఁగ రాజ రాజు కడు మిన్కుల నింపుగ భగ్న మయ్యె నా వచ్చి వచించె నా శకుని పాండుకుమారుల గుప్త వాసమే వచ్చిన వాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్చెద మో సుయోధనా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎచ్చుగ నాలఁదరిమె ని
తొలగించండిక్కచ్చిగ నర్జునుడు వచ్చు కదనంబునకున్
హెచ్చు బలముఁ తెచ్చితిమిగ
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చు గురుపతీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియుద్ధరంగములో దుర్యోధనునితో కర్ణుడు:
తొలగించండికందం
చచ్చిన సుతునెంచి సగము
సచ్చిన ప్రాణము దడబడు శస్త్రములేయన్
గచ్చితమిదెయని నమ్ముము
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ!
ఉత్పలమాల
చచ్చెను వీరుడౌ సుతుఁడు సందియమేటికి నా సగమ్ముగన్
జచ్చిన ప్రాణముల్ సడల శస్త్రములేయఁగఁ దొట్రుపాటునౌ
కచ్చిత మిద్దియే వినుము కాలము మీ కనుకూలమయ్యె సూ!
వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్చెద మోసుయోధనా!
ముచ్చటగా రణమునకై
రిప్లయితొలగించండియిచ్చటికేతెంచె యోధుడింద్రతనయుడే
యిచ్చిన గడువుకు ముందుగ
వచ్చిన, ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ
వచ్చినవాడు క్రీడియను వాస్తవ మొక్కటి చాలు కాదుటే
కుచ్చితులైన పాండవుల గుట్టు బహిర్గత మయ్యె ముందుగా
వచ్చిన కార్యమియ్యదియె ప్రాజ్ఞులెఱుంగరె, చాటిచెప్పుమా
వచ్చినవాఁడు ఫల్గుణుఁ, డవశ్యము గెల్చెద మోసుయోధనా.
మచ్చికకలితోజేసియు
రిప్లయితొలగించండిచొచ్చినననిలోమనసునచుట్టలవిడువ,న్
హెచ్చునుజయమును శీఘ్రముగా
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుకురుపతీ
శీఘ్రము
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిహెచ్చిన శ్వేతవాహనుని హేళగ జంపుట లక్ష్యమే మదిన్
గ్రుచ్చెద నింద్ర దత్తమగు గ్రూరపు టస్త్రము శక్తి బాణమున్
*వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్చెదమో సుయోధనా!*
వచ్చు ఘటోత్కచున్ దునుమ వాడెద నిప్పుడు నీదు రక్షకై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిచ్చలమిది గోపిలయెద
రిప్లయితొలగించండిముచ్చిలు టందున చతురుడు మురళీ ధరునిన్
అచ్చిక బుచ్చిక లేకనె
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ
చెచ్చెరఁ విజయము నీదౌ
రిప్లయితొలగించండివిచ్చిన కన్నులఁ గనుమిక భీష్ముని ద్రోణున్
కచ్చితమే కర్ణ విజితి
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ
తుచ్చములాడగావలదు ద్రోణుడు శ్రేష్టుడు బాణవిద్యలో
విచ్చినకన్నులన్ గనుమ విశ్వవిజేతగ నిల్చుఁ భీష్ముడే
కచ్చితమేగదా గెలుపు కర్ణునిపై నభయమ్మునుంచినన్
వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్చెద మోసుయోధనా
అచ్చటి నీతిమార్గమున యానముజేయు
రిప్లయితొలగించండియుగంబుజూడడే
పెచ్చుగమాటలాడడిల పేదగనుండుననర్థమున్గొననున్
నచ్చదుమూకతోడుతను నాల్గునుదిక్కులమోహరించుటన్
వచ్చినవాడుఫల్గుణుడవశ్యము గెల్చెదమోసుయోధనా
అచ్చపు
రిప్లయితొలగించండికర్ణుడు రాజరాజు కు సూచన ---
రిప్లయితొలగించండిఅచ్చెరు వందగ నేలా
మచ్చె మట లు పట్ట చుట్టు ముట్టగ బలముల్
పెచ్చగు శరముల వలనన్
వచ్చిన ఫల్గు ణుని గెల్వ వచ్చుఁ గురు పతీ!
అచ్చపుటంబు చాలనమునందున నర్జునుసాటి కర్ణుడే
రిప్లయితొలగించండిమెచ్చగ వాని విక్రమము మేదినియందున నెల్లవారలున్
రెచ్చిలి పోరుసల్పు నలరించును నిన్ను విజేత తానెయై
వచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్చెద మోసుయోధనా
విచ్చలు మార్గణములతో
రిప్లయితొలగించండిమెచ్చగ రాధేయు జనులు మేదినియందున్
రెచ్చిలి పోరును సల్పగ
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్తర గోగ్రహణ సమయం
రిప్లయితొలగించండికర్ణుడు అర్జునుడితో పోరుకు సంబర పడుచు భీష్ముని ప్రశంస పిదప సుయోధనుడితో
కం॥వచ్చిన వాఁడు విజయుఁడే
మెచ్చఁగ నెల్లరు జయింతు మేటిగఁ బ్రభలన్
విచ్చుకొన నాదు శౌర్యము
వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ
ఉ॥ వచ్చిన వాఁడు ఫల్గుణుఁడవశ్యము గెల్తుమనంగ రాదనన్
మెచ్చను నేను యుద్ధమున మేటిగ పోరఁగ గెల్వఁ జాలమా
విచ్చఁగ నాదు శౌర్యమిట భీకర సంగర మందు గెల్వనో
వచ్చిన వాఁడు ఫల్గుణుడవశ్యము గెల్చెదమో సుయోధనా
చివరి పాదములో ఫల్గుణుఁడవశ్యము లో ఫల్గుణు పిదప ఁ మరచి పొయ్యినానండి
రిప్లయితొలగించండికం:అచ్చపు మిత్రుడ కర్ణుడ
రిప్లయితొలగించండిమెచ్చును శత్రుల నెపుడు మీ గురువే వా
రచ్చపు పాండవ మిత్రులు
వచ్చిన ఫల్గుణుని గెలువ వచ్చు గురుపతీ.
ఉ:వచ్చిన వాడు ఫల్గుణుడు వానిని గెల్వగ గష్టమంచు నీ
రిప్లయితొలగించండిహెచ్చరికల్ బొనర్చు గురు నేల గణించెదవోయి!కర్ణుడే
యచ్చపు వీరమిత్రు డని యాత్మ దలంపుము నాకు నోడగా
వచ్చిన వాడు ఫల్గుణు డవశ్యము గెల్చెద మో సుయోధనా!
వచ్చినవాడు పల్గుణు డవశ్యము
రిప్లయితొలగించండిగెల్చెదమో సుయోధనా!
సచ్చిన బాలచందురుని శౌర్యము
దల్చుచు మాటిమాటికిన్
పిచ్చిగ మారినాడు సుమి పేరిమి
పుత్రుడు లేడటంచు ని
క్కచ్చిగ గాండివంబుగతి గాంచుము
దప్పును జూడు మిత్రమా!
ఎచ్చుగ నాలమందలఁ దమిక్కకుఁ తోల కిరీటి కోపియై
రిప్లయితొలగించండిచెచ్చెరఁ బూని యుత్తరుని సేవకుడై కదనంబు కేగగన్
కచ్చితమాయె పార్థుడంత కర్ణుడు బీరములాడుచిట్లనెన్
వచ్చిన వాడు ఫల్గుణుడవశ్యము గెల్చెదమో సుయోధనా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎచ్చుగఁ జతురంగ బలం
రిప్లయితొలగించండిబిచ్చట మన దర్జునుండు నిట నొంటరి వాఁ
డచ్చముగ నిశ్చయమ్ముగ
వచ్చిన ఫల్గునుని గెల్వ వచ్చుఁ గురుపతీ
అచ్చెరు వయ్యె వానిఁ గన నంకము నందు ననూహ్య రీతినిన్
మెచ్చఁగ రాజ రాజు కడు మిన్కుల నింపుగ భగ్న మయ్యె నా
వచ్చి వచించె నా శకుని పాండుకుమారుల గుప్త వాసమే
వచ్చిన వాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్చెద మో సుయోధనా
హెచ్చిన మదగర్వముతో
రిప్లయితొలగించండివచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ!
కచ్చితము చూచు చుండుము
చచ్చిన వెనుకడుగు వేయ సమరము నందున్
హెచ్చగు గర్వమున్గలిగి యీశుని వోలెను యుద్ధభూమికిన్
రిప్లయితొలగించండివచ్చినవాఁడు ఫల్గుణుఁ డవశ్యము గెల్చెద మోసుయోధనా!
కచ్చితమౌనునాపలుకు కాతరమొందక నుండుమాయికన్
చచ్చిన వేయ వెన్కడుగు సాగుదు ముందుకు నీవ చూడుమా
చచ్చినసుతునేతలచుచు
రిప్లయితొలగించండినిచ్చలువిలపించుచున్ననెలతునుగనుచున్
హెచ్చిన క్రోధముతోడను
*"వచ్చిన ఫల్గుణుని గెల్వవచ్చుఁ గురుపతీ”*