ఉ:ప్రేమగ మా సుపుత్రునకు పెండ్లికి చేపల దూర ముంచుచున్ నీమము తోడ నుండు రమణిన్ వెదుకన్ కడు గష్ట మయ్యె హే రామ!యిదేమి మా కొక వరమ్మన చేపలు గిట్ట నట్టి యా భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో (ఒరిస్సా లో బ్రాహ్మణులకి కూడా చేపలు నిషిద్ధం కాదు.తినని వాళ్లు లభించటం కష్టం.)
*నేపథ్యం* రాజా విశ్వనాథ్‌దేవ్ - రాయగడలో కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల మజ్జి ఘరియాణి (మజ్జిగౌరమ్మ) అంటారట. ఆయన గోల్కొండ సేనల దాడిలో మరణిస్తే ఆయన 108మంది రాణులూ అగ్నిలో దూకి చనిపోయారట.
రిప్లయితొలగించండిఎంతగ వెదకిన నేమిర
కొంతైనను గర్వముండి కొంటెతనముతో
కాంతులనవమానించెడి
కాంతలు గనరారు రాయగడ నగరమునన్.
గామిడులౌచు సంతతము కయ్యము లాడెడు వార లెప్పుడున్
నేమము వీడుచున్ చెలగు నేరమనస్కుల ధర్మవర్తనుల్
సోమరులైచరించుచు నసూయను చెందెడి స్వార్థచిత్తులౌ
భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఇంతలుగ ప్రజ్ఞఁ గలిగిన
నింతిగ వెలిగెడు నపర్ణ నెంచుచు సభ ని
శ్చింతగఁ జేరుచు నెల్లరు
కాంతలు, గనరారు రాయగడ నగరమునన్!
ఉత్పలమాల
లేమ శతావధానమట ప్రీతిని గూర్చెడు పాటవమ్మునన్
శేముషిఁగల్గు పృచ్ఛకులు సిందగ మోదము పద్యమొల్కునన్
గామన నెల్లరున్ సభను గాంచ నపర్ణను చేరినారనన్
భామలు, లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిశాంత విభూషణు లతివలు
రిప్లయితొలగించండిశ్రాంతమెరుంగరు సలిపెడు సత్కార్యములన్
వంతలలో జిక్కి కుములు
కాంతలు గనరారు రాయగడ నగరమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభ్రాంతిగ నుండును మరి యా
రిప్లయితొలగించండిప్రాంతమున యువకులలోన వలపతియగుటన్
సాంతము సనాధ లొంటరి
కాంతలు గనరారు రాయగడ నగరమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపంతము మూర్ఖత నిండిన
రిప్లయితొలగించండివింతగు పాలన మిడుకొను పెద్దలు లేరే
శాంతిని భంగపరచు కుల
కాంతలు గనరారు రాయగడ నగరమునన్
పామరులై యనారతము పాలన సల్పెడు మంత్రివర్యులున్
సోమరిపోతులై తిరిగి సొమ్మును కోరెడు మర్త్యబృందమున్
గోమలులై సదా శరణు కోరు లతాంగులు శక్తిహీనులౌ
భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపంతము న విద్య నేర్చియు
రిప్లయితొలగించండిశాంతము సఖ్యత గలిగిన సద్గుణ వ తు లౌ
యింతులె. కానీ తప్పుడు
కాంతలు గనరారు రాయగడ నగరము నందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామలు శాంతి కాముకులు భవ్యమనస్కులు సాధువర్తనుల్
రిప్లయితొలగించండినీమముతోడ నీశ్వరుని నిర్మల భక్తిని గొల్చువారలే
సోమరులై చరింపరు, యశోధనులెల్లరు, నీతిబాహ్యులౌ
భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినీమముతోడ జీవనము నిక్కము
రిప్లయితొలగించండిగడ్పుచు నుందురెల్లరున్
శ్రామిక కర్షకావళియు స్వాస్థత
గల్గియు సంతసంబునన్
క్షేమముతోడ బత్కుదురు చింతలు
లేవు,వితంతువుల్ కడున్
భామలులేరు రాయగడ పట్టణ
మందునదేమి చిత్రమో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బత్కుదురు' అనడం సాధువు కాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికం॥ పంతముఁ బూనుచు విద్యలు
తొలగించండిసాంతము నేర్చుచు పురుషుల సరసన గరిమన్
గాంచు కొమలె గాని యితర
కాంతలు గనరారు రాయగడ నగనమునన్
ఉ॥ నేమము తోడ విద్యలను నేర్వఁగఁ బోయిన వారుఁ గొందరై
ప్రేమగఁ దల్లిదండ్రులును బిల్వఁగఁ బోయిన వారుఁ గొందరై
గోముగఁ దీర్థయాత్రలను గోరుచుఁ బోయిన వారుఁ గొందరై
భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం:కాంతలు నిశి నొంటి తిరుగ
రిప్లయితొలగించండిచింత విడువ స్వేచ్ఛ యనుచు చెప్పెను గాంధీ
ఎంత వెదుక నట్లు తిరుగు
కాంతలు కన రారు రాయగడ నగరమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిసీమ కళింగ దేశమున చిక్కె, నవాబుల చేతిలో దుదిన్
ధామము ముందు రాజులకు దక్కెను సాహితి యుత్కలమ్మునన్
క్షేమమునొంది నేర్వ, విదుషీమణి యోషితలే, కురూపులౌ
*భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో!*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిఉ:ప్రేమగ మా సుపుత్రునకు పెండ్లికి చేపల దూర ముంచుచున్
రిప్లయితొలగించండినీమము తోడ నుండు రమణిన్ వెదుకన్ కడు గష్ట మయ్యె హే
రామ!యిదేమి మా కొక వరమ్మన చేపలు గిట్ట నట్టి యా
భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో
(ఒరిస్సా లో బ్రాహ్మణులకి కూడా చేపలు నిషిద్ధం కాదు.తినని వాళ్లు లభించటం కష్టం.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిఅంతఃపురకాంతలు హత
రిప్లయితొలగించండికాంతలు మరణింప మజ్జి ఘరియాణి సతిన్
సుంతయినఁ బూజ సేసెడి
“కాంతలు గనరారు రాయగడ నగరమునన్”
స్వామినిఁ గోలుపోయి పెఱవారికి జిక్కక గుండమందు నా
రామలు రాణులెల్లఁ దమ ప్రాణములన్ విడ నాత్మరక్ష కా
హా! మనసార మజ్జిఘరియాణికిఁ బూజలు సేయువార లే
“భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో”
*నేపథ్యం*
రాజా విశ్వనాథ్‌దేవ్ - రాయగడలో కోట మధ్యలో అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల మజ్జి ఘరియాణి (మజ్జిగౌరమ్మ) అంటారట. ఆయన గోల్కొండ సేనల దాడిలో మరణిస్తే ఆయన 108మంది రాణులూ అగ్నిలో దూకి చనిపోయారట.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిసంతత సంతోష నిమ
రిప్లయితొలగించండిగ్నాంతఃకరణ లచటఁ గల కాంతా మణులే
సంతాన విహీన లయిన
కాంతలు గనరారు రాయగడ నగరమునన్
నామమె తెల్పు చున్నది ఘనమ్ముగ గొప్ప తనమ్ము నోర్మినిన్
భూమి సమాన లెల్లరును బుణ్య చరిత్రలు సుందరాంగు లే
ధామము నందుఁ గాంచినను దాన మొసంగని యట్టి వార లే
భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండివింతగు మాటల తోడను
రిప్లయితొలగించండిచింతనుపెంచుచుజనులకుచిక్కులనిడుచున్
పంతముతోడచరించెడు
*“కాంతలు గనరారు రాయగడ నగరమునన్”*
నీమము తప్పకుండకడునిష్టగ భాగవతాది గ్రంథముల్
ధీమతి తోడ వ్రాయుచును తీరుగ చక్కని కావ్య శైలిలో
సామముతోడవీడకయె సాధన చేసెడివారె, వ్యర్థులౌ
*భామలు లేరు రాయగడ పట్టణమందు నదేమి చిత్రమో”*