తే.గీ:బట్ట తలవాని జూచుచు పగుల బడుచు పరిహసించెడి దుశ్చర్య బాపు కొరుకు "బట్ట తల గల్గు వాడె పో భాగ్యశాలి" యనుచు నొక సామెతను దెచ్చి రాంధ్రజనులు. (బట్టతల వాడు భాగ్యవంతుడని,సుఖ మని మనం చమత్కారం తో చెప్పటమే కాదు."బట్ట తల వాడికి భాగ్యం ఉంటుం"దని పూర్వమే ఒక సామెత తయారు చేశారు.)
వేదవిద్యలబోధించువిజ్ఞుడెపుడు
రిప్లయితొలగించండిశిష్యుతోనుండివల్లెనుఁజెప్పవలయు
మందబుద్ధులతనదైనమాటతోడ
బట్ట, తలగల్గువాడెపోభాగ్యశాలి
తలను దువ్వనక్కర లేక తగ్గు పనియు
రిప్లయితొలగించండిజుట్టు రాలెడు బెంగ మచ్చుకును లేదు
కుంకుడులు నూనె ఖర్చులు కొంచెముండు
బట్టతలఁ గల్లువాడె పో భాగ్యశాలి
అవుననకాదుగాయనునుహాస్యమునింపుచుమాటలాడునే
రిప్లయితొలగించండినివురునుగప్పునిప్పువలెనేరుపుజూపుచుచిచ్చురేపుచున్
వివరమునెంచివిజ్ఞుడుగవేదమునందునవక్రమెంచుగా
కవులువచింత్రుబట్టతలగల్గినవానినిభాగ్యశాలిగా
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండినున్నటితలపైనికలేదునూనెఖర్చు
భార్య పట్టును జుట్టను బాధలేదు
బుద్దివంతుడటండ్రిలపుడమిజనులు
*“బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి”*
చం.
రిప్లయితొలగించండితివిరి శిరోజముల్ పెఱుక దెచ్చును కళ్ళను బాష్పధారలన్
ధ్రువములు రెండు నున్నఁదన రూపము కాంతిని జూచు చుండెడిన్
కువలము బోలు రంగు శఠకోపము నిల్పిన శీతలంబగున్
*కవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్.*
రిప్లయితొలగించండిక్షౌరకుని జేరు వ్యర్థపు ఖర్చుతోడ
వాని ముందున దలవంచు పనియె లేదు
కొట్టు కేగుచు తైలాల గొనగ లేని
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి.
అవసర ముండదయ్యెనిక నంతవశాయిని జేరి యచ్చటన్
క్షవరము పేర వ్యర్థమగు ఖర్చును జేసెడి వాడు కాడిలన్
ద్రవిణము బోసి మేలయిన తైలములన్ గొన రైరి కావునన్
కవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్.
తేటగీతి
రిప్లయితొలగించండిభక్త ప్రహ్లాదుఁడనినట్లు బాధ్యతగను
చదువు నేర్చుటలొక్కటే చాలదనఁగ
మఱువకుండగ నుండెడున్ మర్మములను
బట్ట, తల గల్గువాఁడె పో భాగ్యశాలి!
చంపకమాల
క్షవరము, రంగు, నూనెలకు ఖర్చగుటుండదు పేల బాధలన్
దివులది లేదు దువ్వుటల తీరది లేదన నూరడిల్లెడున్
వివరము లేని పాలకులు వేయగ లేరన జుట్టు పన్నులన్
గవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్!
మంచి చెడుల నెంచెడి మానవునికి
రిప్లయితొలగించండియోచనల వేడిమి తగుల నూడె జుట్టు ,
కావున తెలుపుచుంటిని , కాయమందు
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి
క్షవరపుఖర్చులేదికనుకాసులువెచ్చముకావుచింతయున్
రిప్లయితొలగించండిదివులునుయుండబోదువినుతీరుగ దువ్వెడు బాధలేదయా
బవరముచేయువేళలనుభార్యయుపట్టగలేదటంచుస
*“త్కవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్
సూర్య కి రణాలు సోకగా సొమ్మ సిల్లు
రిప్లయితొలగించండినంద చందాలు మృగ్యమై యార్తి చెందు
మేల మాడుచు బాధింత్రు మిత్రు లెటుల
బట్ట తల గల్గు వాడె పో భాగ్య శాలి?
అద్దమెదుట నిల్చి యంగజముల దువ్వు
రిప్లయితొలగించండి.............సమయమే మిగులగ శాంతి కలుగు
తలయంటు వేళలో తలరుద్దు కొనుటకై
.............శీకాయ కుంకుళ్ళ చింతలేదు
తలపైన రంగుకై తలలోని పేలకై
.............కాసులన్ వెచ్చించు కర్మ లేదు
క్షవరమే శూన్యమై ఖర్చులే శుష్కమై
.............మంగలి యంగడి మరువవచ్చు
కురుల భారము దూరమై కొంత హాయి
గాలి ధారాళముగసోకి కలుగు సుఖము
బోడి తలలోన తలపులు పోడిమిగొను
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి
క్షవరపు ఖర్చులేదు పర కాంతలు పైబడు హాని లేదుగా
వివరము లెంచుచున్ గృహిణి పిల్కనుబట్ట నసాధ్యమౌనుగా
చివరకు పెద్దవాడనుచు జీవన మందున పేర్మి దక్కుగా
కవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్
వివరముదెల్పెదన్ వినుఁడు వేదినితో పనిలేదు జుట్టుకున్
రిప్లయితొలగించండిక్షవరము గోరి క్షౌరకునిశాలకు పోఁబనిలేదు దందడిన్
ద్రవిణము ఖర్చుజేసి పలు తైలములన్ గొను సడ్డ తప్పుటన్
కవులు వచింత్రు బట్టతల గల్గినవానిని భాగ్యశాలిగన్
క్షౌరశాలకుఁ జను నవసరము తగ్గు
రిప్లయితొలగించండిధనము వెచ్చించ బనిలేదు తైలమునకు
తలను దువ్వెడు పనికూడ తప్పిపోయె
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి
తే.గీ:బట్ట తలవాని జూచుచు పగుల బడుచు
రిప్లయితొలగించండిపరిహసించెడి దుశ్చర్య బాపు కొరుకు
"బట్ట తల గల్గు వాడె పో భాగ్యశాలి"
యనుచు నొక సామెతను దెచ్చి రాంధ్రజనులు.
(బట్టతల వాడు భాగ్యవంతుడని,సుఖ మని మనం చమత్కారం తో చెప్పటమే కాదు."బట్ట తల వాడికి భాగ్యం ఉంటుం"దని పూర్వమే ఒక సామెత తయారు చేశారు.)
చం:అవిరళచింతనాభరితులై,తమ కేశము లెల్ల రాలగా
రిప్లయితొలగించండినవి గని యన్యు లెట్టి పరిహాసము జేయక యుంటకై కడున్
కవనచమత్కృతిన్ గలిపి కమ్మని హాస్యము రంగరించుచున్
కవులు వచింత్రు బట్ట తల గల్గిన వానిని భాగ్యశాలిగన్
తే॥ పడతి మెచ్చి నల్లని జుట్టు పరిణయంబుఁ
రిప్లయితొలగించండిజేసి కొనఁగ మెల్లగ జుట్టు చిక్కి పోయి
బట్టతలఁ గన విడివడె భార్య యెటుల
బట్ట తలగలవాఁడె పో భాగ్య శైలి
(విడివడక పోయినా ప్రతిదినము గొడవ మిగులుట తథ్యము)
చం॥ కవితలు వ్రాయఁ గోరుచును గట్టిగ లాగఁగ జుట్టు తట్టకన్
జివరకు రాలి పోయెనఁట చిక్కి కృశించుచు జుట్టు పూర్తిగా
నవ కవితా సుమంబులును నచ్చిన రీతిని పూయు వేళకున్
గవులు వచింత్రు బట్టతల గల్గిన వానిని భాగ్యశాలిగన్
(ఇది తప్పులు లేకుంటే చపలాతిశయోక్తి క్రిందికి మొదటి 3 పాదములు వస్తుందాండి)
మన్నించాలి తేటగీతి చివర శాలి గా తీసుకొన మని విన్నపము. శాలి పొరపాటున శైలి యైనదండి.
తొలగించండిఇట్టలముగ దురద యుండి నెట్టనఁ గడు
రిప్లయితొలగించండిదట్టముగ నుండ నఖములు బెట్టిదముగఁ
బొట్ట గల వాని కుండును దిట్ట దుడ్డు
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి
చివురులు తొడ్గి వెల్గెడిని ఛిన్న మహీరుహ కాండ భంగినిం
జివికిన శత్రు సేనలను జేతృ నరాధిపు కోట మాడ్కినిన్
నవ తృణవృత్త సద్విమల నార తటాక నిభమ్ముగా ధరం
గవులు వచింత్రు బట్టతల గల్గిన వానిని భాగ్యశాలిగన్
నూనె రాయంగఁబనిలేదు వానికెపుడు
రిప్లయితొలగించండిదువ్వుకొనుటయు నుండదు దొరల వోలె
గుండు కన్పించు చుండును గుండ్రముగను
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి.
ఎట్టి నూనెలు దట్టించ నేరు లేదు
రిప్లయితొలగించండిజుట్టు దువ్వగ పనిలేదు పట్టి పట్టి
ఒట్టు నమ్ముమిది నిజము ఓర్మినరయ
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి
ఏరు = బాధ