21, మార్చి 2024, గురువారం

సమస్య - 4712

22-3-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ”
(లేదా...)
“పదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

33 కామెంట్‌లు:

  1. బెదరకనీతికినిలబడి
    పదును ధర్మముతలచుచుభారమునైనన్
    కుదరనిజీవితమందున
    పదములురెండుగలవాడభాగ్యనరుండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి

      తొలగించండి
    2. పదునునధర్మముదలచుచు
      టైపులోమరచుటజరిగినది
      క్షమించగలరు

      తొలగించండి
  2. చదివినది యెంతయైనను
    పదవిని దనచేత యెంత బడసిన కూడన్
    మద, మత్సరములనెడి యీ
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ

    రిప్లయితొలగించండి

  3. మదమది హెచ్చి చరించుచు
    ముదితల నవమాన పరచు మూర్ఖుడు వాడే
    కద పశువుకన్న హీనుడు
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ.



    అధర్మమైననేమిరా ధనార్జనమ్ము సేయుటే
    ప్రధానమంచు నెంచి దాని బానిసై చరించినన్
    విధానమంచు లేనిజీవి వేపికన్న హీనుడా
    పదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్.

    రిప్లయితొలగించండి
  4. పంచచామరము.

    సుదీర్ఘ జీవనమ్ము నొంది చూపు తగ్గి యాత్రలన్
    నదీనదమ్ములందు గాహనమ్ము కష్టమౌ విధిన్
    ముదంబు నష్టి జానువుల్ ప్రమోదమెద్ది? నొప్పిచే
    *పదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్*.

    రిప్లయితొలగించండి
  5. సదమలమగు మది గలిగిన
    సదయుడె సౌభాగ్యపరుడు సత్వంబెరుగన్
    మద మాత్సర్యము లనియెడు
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ

    రిప్లయితొలగించండి
  6. కందం
    ఉదరంపు పోషణమునకుఁ
    గుదురుగ కరపాద యుగము కూడఁగనొప్పున్
    చెదరఁగ నవిటిగఁ గరములుఁ
    బదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ!

    పంచచామరము
    క్షుధార్తి యేరికైన తీరుఁ గూడు గల్గినంతనే
    పదార్థమేది కాలుచేయి వాడకుండరాదుగా
    విదారకమ్ము మానసాన విర్గినట్టి చేతులున్,
    బదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్!

    రిప్లయితొలగించండి
  7. కుదురు గ నుండక సతతము
    పది మందికి జేటు గూ ర్చు పనులనొ నర్చే
    మద ము న చరించు వాడౌ
    పదములు రెండు గల వాడ భాగ్య నరుండౌ

    రిప్లయితొలగించండి
  8. పదములు రెండైన వృధా
    విధివంచితులైన జనులు వికలాంగులకున్
    బ్రదుకగ నిరర్థకంబౌ
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ

    పదాలు రెండు గల్గియుంద్రు పౌరులెల్ల భూమిపై
    పదాలు శక్తివంతమైన భాగ్యుడే ధరాతలిన్
    పదాలు శక్తిహీనమైన పట్టుదప్పుఁ వ్యర్థమౌ
    పదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్

    రిప్లయితొలగించండి
  9. పంచచామరము
    సదా పరోపకారమున్ ప్రశంస జేయు మానవుల్
    విధాత సృష్టిలోన పల్లవించు భాగ్య వల్లరుల్
    క్షుధార్తులన్న నేవగింపు క్రోధభావమన్ననీ
    పదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్

    రిప్లయితొలగించండి
  10. హృదయమునం దార్ద్రతయును
    సదమలమౌ కరుణ లేక సతతము మదిలో
    మదమాత్సర్యము లనియెడు
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ

    రిప్లయితొలగించండి
  11. పదములె గుఱి దరిఁ జేర్చు వి
    శదపడినిది లక్ష్యములు సుసాధ్యమగునవే
    పదములు లిరుదెసలయిన నా
    పదములు రెండు గలవాఁడభాగ్య నరుండౌ

    రిప్లయితొలగించండి
  12. కం:కదలగ కారే లేదని
    యెద గుందెద వేల? పదములే లేని నరుల్
    పది మంది బిచ్చ మడిగిరి
    పదములు రెండు గలవాడ భాగ్యనరుండౌ
    ("పదములు రెండు కలవాడే భాగ్యవంతు" డనే భావం తో.)

    రిప్లయితొలగించండి
  13. పంచచామరము

    సదాచరించు వాహనాళి సందు నీక దాటగా
    ఇదేమి బాధ పాదచారి యెట్లు దాటు వీధులన్
    ముదమ్ము నొంద గాదు, కారు ముఖ్య, మద్ది లేకయే
    పదాలు రెండు గల్గు వా డభాగ్యుడౌ వసుంధరన్

    రిప్లయితొలగించండి
  14. మదమును మాత్సర్యంబను
    పదములు రెండు గలవాఁ డభాగ్యనరుండౌ
    పదుగురి కండగ నిలిచిన
    ముదమున నాశంకరుండు మోక్షము నిచ్చున్

    రిప్లయితొలగించండి
  15. ముదంబునిండలేమియందుముందుదారివిష్ణువే
    కదాయనన్మనంబులోవికారమెంచియండగా
    నిదానమింతలేనిజాతినేర్పుతోసహింపదే
    పదాలురెండుగల్గువాడభాగ్యుడౌవసుంధరన్

    రిప్లయితొలగించండి
  16. కుదు రుండ దింట బయట నె
    డఁద నధికారిగ మఱియు నొడయునిగ నుండం
    బదిలము క్షీణింప సతము
    పదములు రెండు గలవాఁ డభాగ్య నరుండౌ


    ఉదార బుద్ధి సంతతమ్ము నున్నవాఁడు దానమున్
    సదా యొనర్చు నట్టి వాఁడు సద్గుణుం డనంబడుం
    బదంబు ముందు నొక్క టుండి వాక్య మంత మాఱఁగాఁ
    బదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్

    రిప్లయితొలగించండి

  17. సదయుండగుచును సతతము
    మదిలో నైనను తలచక మధుసూధనునిన్
    వదరుచు తిరిగెడు మనుజుడు
    పదములు రెండు గలవాడభాగ్యనరుండౌ



    రిప్లయితొలగించండి
  18. కం॥ బ్రదుకున నొకింత కపటము
    కుదురుగ మంచితనమున్న గుణవంతుఁ డిలన్
    బ్రదుకు విధమిదియన నెటుల
    పదములు రెండు గలవాఁడ భాగ్య నరుండౌ!

    పంచచామరము
    సదా ధరన్ నిజమ్ముఁ బల్క సాధ్యమౌదు మిత్రమా
    పదాలు రెండు పల్కు వాఁడు పాపిగాఁడు తెల్పఁగన్
    సదా జనాళి లౌక్య మొంద సౌఖ్యమబ్బు నెట్టులన్
    బదాలు రెండు గల్గువాఁడ భాగ్యుడౌ వసుంధరన్

    శ్రీ గుండా వెంకట సుబ్బసహదేవుడు గారికి ధన్యవాదములు. ఈరోజు గణ విభజన చేసిన తరువాత గణములు యతి స్థానము అర్థమైనాయి. కాని Telugu grammar literature అంతా బెంగుళూరులో ఉన్నందున పంచచామరమని అర్థము కాలేదండి. మూడు జతల వృత్తాలు కాకుండా వేరే వృత్తమిస్తే నాకింకా వెంటనే అర్థము కాదండి. నేను తెలుగు 12 వ తరగతి వరకే నేర్చుకున్నానండి. అది ఒక భాగమే! రెండో భాగము సంస్కృతమండి. తరువాత వ్రాసే దానికి ముందు net లో చదివి చూసాను. పోతన గారు భాగవతములో పంచచామరము ఒక్కటే వ్రాసారండి

    రిప్లయితొలగించండి