16-3-2024 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె”(లేదా...)“అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్”
తేటగీతిపెద్దవాడగుపించుచుఁ బిన్నవలెనుచూచు వారికి భ్రమలను దోచు చుండనాటకమ్మున పాత్రలవాటమెరిగియన్న తమ్ముఁడయ్యెను! తమ్ముఁ డన్న యయ్యె!! ఉత్పలమాలకన్నులు సూచుచున్ భ్రమల కల్పనఁ జేయుట వాస్తవమ్మనన్బిన్నయె పెద్దవానివలెఁ బెద్దయ పిన్నగఁ దోచుచుండఁగన్మన్ననలొంద నాటకము మాన్యులపాత్రల వాటమెప్పఁగాయన్నయె తమ్ముఁడయ్యె! మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
భ్రాత లిరువురిలో నన్న వామనుండుఅన్నదమ్ములుగ నటించ నవసరమునతామిరువురు నాటకమందు తగినటులుగనన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు
ధరణిపుత్రి వియోగమ్ము తాళ జాలఓపలేనింక వాసంత పవనములనుయన్న రాముని సౌమిత్రి అనునయించెఅన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలుపవనములను+ అన్న అన్నపుడు యడాగమం రాదు
అన్న లక్ష్మణ వేషంబు ననుజుడేమొ రామ పాత్రను ధరియించి రమ్యమైననటన జూప బంధువొకడు నవ్వి పలికె నన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె.అన్నవు నీవటంచు వినయమ్మును జూపెడు లక్ష్మణుండతో వెన్నుని కన్న హాలునిగ పృథ్విజనింతువు ద్వాప రమ్మునన్ మన్నన జేతునంచు నభిమానముతో వచియించి రాముడాయన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్.
రామ లక్ష్మణులుగ బుట్టె రఘుకులమునరామ కృష్ణులునైరి ద్వాపర యుగమందుశేషశాయి శేషులు దుష్ట శిక్షణకునుఅన్న తమ్ముడయ్యెను తమ్ముడన్నయయ్యె
మీ పూరణ బాగున్నది అభినందనలుమొదటి పాదంలో వచన దోషంరెండవ పాదంలో గణభంగం
నమస్కారములు,మొదటి పాదములో వచనదోషం తెలియలేదు.రెండవ పాదమురామకృష్ణులయిరి ద్వాపరయుగమందు ఇలా మారుస్తారు.
తగును రాముని వేషమే తమ్ముని కగునన్న లక్ష్మణు కే తాను మిన్న యగు నటంచు నాటకమున వేయ నని రి జనులునన్న తమ్ము డ య్యె ను తమ్ము డన్న య య్యె
మీ పూరణ బాగున్నది అభినందనలు
తిన్నని కుమారు లిరువురు నెన్నికైరినాడు రామాయణ చరిత్ర నాటకమునరామ లక్ష్మణ పాత్రలు లభ్యమాయెఅన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యెతిన్నని పుత్రులిర్వురును తిన్నగనేగిరి నాటకంబుకైక్రన్నన పెద్దవానిఁ గని లక్ష్మణ పాత్రకు నెంచిరాతనిన్బ్రన్నని రూపమున్ గలిగి రాముని పాత్రను బొందె తమ్ముడేయన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
ధన్యవాదాలు గురూజీ 🙏
అన్నయు తమ్ముడేగె చిన యత్తను చూడగ తండ్రి పంపగాఅన్నుల మిన్నలిద్దరట అక్కయు చెల్లియునత్త బిడ్దలాఅన్నను మెచ్చె చెల్లి మరి అక్కయు తమ్ముని మెచ్చె చిత్రమౌఅన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్!!
మీ పూరణ బాగున్నది అభినందనలుతమ్ముడేగిరట... అనండి
ప్రన్నదనమ్ము నల్దెసల పంపతటమ్మున చెన్ను మీరగన్ సన్నని పిల్లతెమ్మెరల జానకి జ్ఞప్తుల నుమ్మలించు రామన్నను జేరి లక్ష్మణుడు మంజుల వాక్కుల నూరడించగన్ అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్పంపాతీరంలో వెళ్తూ వసంత వీచికలలో సీత జ్ఞాపకాలతో వేదించ బడిన రామచంద్రుని లక్ష్మణుడు ఓదార్చిన సన్నివేశం.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తే॥ అక్కచెల్లెండ్రు కాంచిరి యన్నదమ్ములిరువురినిఁ బెండ్లి చూపుల నెంచు కొనఁగనక్క కనుజుఁడు చెల్లెల కన్న నచ్చనన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁడన్న యయ్యెఉ॥ మిన్నగ నన్నదమ్ములటు మెచ్చుచుఁ గాంచఁగఁ బెండ్లి చూపులన్జెన్నగు సోదరీ మణులఁ జెల్లికి నచ్చఁగ నగ్రజన్ముఁడేయన్నుల మిన్న యక్క కనె నాశగ తమ్ముని మెచ్చి యయ్యహోఅన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁడత్తరిన్
పుట్టిన కవలపిల్లకు గట్టి ప్రశ్ననెదురుకొనువలసివచ్చె నెప్పడెవ్వరెట్లు పిలుతురో తికమక లెన్నతరమెయన్న తమ్ముడయ్యెను తమ్ముడన్నయయ్యె
భరత లక్ష్మణ శత్రుఘ్నులు రఘు రామున కవరజు లైరి దశరథ నందను లయి భరత శత్రుఘ్నులకు నెన్న వరుస లక్ష్మణన్న తమ్ముఁ డయ్యెను దమ్ముఁ డన్న యయ్యె అన్నను గాంచి లక్ష్మణుఁడె యంచిత రీతిని నూఱడింపఁగా నన్నుల మిన్న నాత్మ సఖి నక్కట జానకిఁ గోలుపోవఁగన్ మిన్నఁగ మున్గి దుఃఖమున నివ్వెఱఁ దా విలపించు చుండఁగా నన్నయె తమ్ముఁ డయ్యె మఱి యన్నగ మారెను దమ్ముఁ డత్తఱిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు
అన్నయు తమ్ముడున్ కవలలై జనియించితిరొక్క తల్లికిన్చిన్నతనంబునందునొక చెన్నుగనుండిరి రూపురేఖలన్క్రన్నన పెద్దవారలయి ప్రాయమునందున రూపు మారి యాయన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అన్నదమ్ములె యొకచోట యచ్చెరువుగఁ దమ్ముఁడన్నగ వేషాల దరియఁజేసి యన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె చూచు వారల కయ్యది చోద్య మయ్యె
అన్నదమ్ములు కవలలాయమ్మ సుతులుతుల్యమైనట్టి రూపమ్ముతోడ బుట్టియవ్వనమ్మున రూపములడరుకొనఁగనన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
అన్నయు తమ్ములిర్వురును నన్నవరమ్మున నాట్యశాలలోఁజిన్నగ నన్నయున్ గనగ జ్యేష్టుఁడు తమ్ముఁడు గానటించుటన్ అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్ చెన్నుగ నుండె వారిమతి చిన్నలు పెద్దలు మెచ్చునట్లుగన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. అనుజుడెంత పొడవుగున్న నంత పొట్టియన్న, కనుక వేషమొకటి యన్న వేసెననుజునిగ,తమ్ముడున్ వేసె నన్నగానెఅన్న తమ్ముడయ్యెను తమ్ముడన్న యయ్యె.
త్రేతయందున చూడంగ. శ్రీరఘుపతియన్నకాగశేషఫణియుననుజుడయ్యెద్వాపరమునశేషునకుతాతమ్ముడయ్యెనన్నతమ్ముబయ్యెనుతమ్ముడన్పయయ్యె
తేటగీతి
రిప్లయితొలగించండిపెద్దవాడగుపించుచుఁ బిన్నవలెను
చూచు వారికి భ్రమలను దోచు చుండ
నాటకమ్మున పాత్రలవాటమెరిగి
యన్న తమ్ముఁడయ్యెను! తమ్ముఁ డన్న యయ్యె!!
ఉత్పలమాల
కన్నులు సూచుచున్ భ్రమల కల్పనఁ జేయుట వాస్తవమ్మనన్
బిన్నయె పెద్దవానివలెఁ బెద్దయ పిన్నగఁ దోచుచుండఁగన్
మన్ననలొంద నాటకము మాన్యులపాత్రల వాటమెప్పఁగా
యన్నయె తమ్ముఁడయ్యె! మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిభ్రాత లిరువురిలో నన్న వామనుండు
రిప్లయితొలగించండిఅన్నదమ్ములుగ నటించ నవసరమున
తామిరువురు నాటకమందు తగినటులుగ
నన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిధరణిపుత్రి వియోగమ్ము తాళ జాల
రిప్లయితొలగించండిఓపలేనింక వాసంత పవనములను
యన్న రాముని సౌమిత్రి అనునయించె
అన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిపవనములను+ అన్న అన్నపుడు యడాగమం రాదు
రిప్లయితొలగించండిఅన్న లక్ష్మణ వేషంబు ననుజుడేమొ
రామ పాత్రను ధరియించి రమ్యమైన
నటన జూప బంధువొకడు నవ్వి పలికె
నన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె.
అన్నవు నీవటంచు వినయమ్మును జూపెడు లక్ష్మణుండతో
వెన్నుని కన్న హాలునిగ పృథ్విజనింతువు ద్వాప రమ్మునన్
మన్నన జేతునంచు నభిమానముతో వచియించి రాముడా
యన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిరామ లక్ష్మణులుగ బుట్టె రఘుకులమున
రిప్లయితొలగించండిరామ కృష్ణులునైరి ద్వాపర యుగమందు
శేషశాయి శేషులు దుష్ట శిక్షణకును
అన్న తమ్ముడయ్యెను తమ్ముడన్నయయ్యె
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిమొదటి పాదంలో వచన దోషం
రెండవ పాదంలో గణభంగం
నమస్కారములు,
తొలగించండిమొదటి పాదములో వచనదోషం తెలియలేదు.
రెండవ పాదము
రామకృష్ణులయిరి ద్వాపరయుగమందు ఇలా మారుస్తారు.
తగును రాముని వేషమే తమ్ముని కగు
రిప్లయితొలగించండినన్న లక్ష్మణు కే తాను మిన్న యగు న
టంచు నాటకమున వేయ నని రి జనులు
నన్న తమ్ము డ య్యె ను తమ్ము డన్న య య్యె
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండితిన్నని కుమారు లిరువురు నెన్నికైరి
రిప్లయితొలగించండినాడు రామాయణ చరిత్ర నాటకమున
రామ లక్ష్మణ పాత్రలు లభ్యమాయె
అన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
తిన్నని పుత్రులిర్వురును తిన్నగనేగిరి నాటకంబుకై
క్రన్నన పెద్దవానిఁ గని లక్ష్మణ పాత్రకు నెంచిరాతనిన్
బ్రన్నని రూపమున్ గలిగి రాముని పాత్రను బొందె తమ్ముడే
యన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఅన్నయు తమ్ముడేగె చిన యత్తను చూడగ తండ్రి పంపగా
రిప్లయితొలగించండిఅన్నుల మిన్నలిద్దరట అక్కయు చెల్లియునత్త బిడ్దలా
అన్నను మెచ్చె చెల్లి మరి అక్కయు తమ్ముని మెచ్చె చిత్రమౌ
అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్!!
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండితమ్ముడేగిరట... అనండి
ప్రన్నదనమ్ము నల్దెసల పంపతటమ్మున చెన్ను మీరగన్
రిప్లయితొలగించండిసన్నని పిల్లతెమ్మెరల జానకి జ్ఞప్తుల నుమ్మలించు రా
మన్నను జేరి లక్ష్మణుడు మంజుల వాక్కుల నూరడించగన్
అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
పంపాతీరంలో వెళ్తూ వసంత వీచికలలో సీత జ్ఞాపకాలతో వేదించ బడిన రామచంద్రుని లక్ష్మణుడు ఓదార్చిన సన్నివేశం.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండితే॥ అక్కచెల్లెండ్రు కాంచిరి యన్నదమ్ము
రిప్లయితొలగించండిలిరువురినిఁ బెండ్లి చూపుల నెంచు కొనఁగ
నక్క కనుజుఁడు చెల్లెల కన్న నచ్చ
నన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁడన్న యయ్యె
ఉ॥ మిన్నగ నన్నదమ్ములటు మెచ్చుచుఁ గాంచఁగఁ బెండ్లి చూపులన్
జెన్నగు సోదరీ మణులఁ జెల్లికి నచ్చఁగ నగ్రజన్ముఁడే
యన్నుల మిన్న యక్క కనె నాశగ తమ్ముని మెచ్చి యయ్యహో
అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁడత్తరిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిపుట్టిన కవలపిల్లకు గట్టి ప్రశ్న
రిప్లయితొలగించండినెదురుకొనువలసివచ్చె నెప్పడెవ్వ
రెట్లు పిలుతురో తికమక లెన్నతరమె
యన్న తమ్ముడయ్యెను తమ్ముడన్నయయ్యె
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిభరత లక్ష్మణ శత్రుఘ్నులు రఘు రాము
రిప్లయితొలగించండిన కవరజు లైరి దశరథ నందను లయి
భరత శత్రుఘ్నులకు నెన్న వరుస లక్ష్మ
ణన్న తమ్ముఁ డయ్యెను దమ్ముఁ డన్న యయ్యె
అన్నను గాంచి లక్ష్మణుఁడె యంచిత రీతిని నూఱడింపఁగా
నన్నుల మిన్న నాత్మ సఖి నక్కట జానకిఁ గోలుపోవఁగన్
మిన్నఁగ మున్గి దుఃఖమున నివ్వెఱఁ దా విలపించు చుండఁగా
నన్నయె తమ్ముఁ డయ్యె మఱి యన్నగ మారెను దమ్ముఁ డత్తఱిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిఅన్నయు తమ్ముడున్ కవలలై జనియించితిరొక్క తల్లికిన్
రిప్లయితొలగించండిచిన్నతనంబునందునొక చెన్నుగనుండిరి రూపురేఖలన్
క్రన్నన పెద్దవారలయి ప్రాయమునందున రూపు మారి యా
యన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నదమ్ములె యొకచోట యచ్చెరువుగఁ
రిప్లయితొలగించండిదమ్ముఁడన్నగ వేషాల దరియఁజేసి
యన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
చూచు వారల కయ్యది చోద్య మయ్యె
అన్నదమ్ములు కవలలాయమ్మ సుతులు
రిప్లయితొలగించండితుల్యమైనట్టి రూపమ్ముతోడ బుట్టి
యవ్వనమ్మున రూపములడరుకొనఁగ
నన్న తమ్ముఁడయ్యెను తమ్ముఁ డన్న యయ్యె
అన్నయు తమ్ములిర్వురును నన్నవరమ్మున నాట్యశాలలోఁ
రిప్లయితొలగించండిజిన్నగ నన్నయున్ గనగ జ్యేష్టుఁడు తమ్ముఁడు గానటించుటన్
అన్నయె తమ్ముఁడయ్యె మఱి యన్నగ మారెను తమ్ముఁ డత్తఱిన్
చెన్నుగ నుండె వారిమతి చిన్నలు పెద్దలు మెచ్చునట్లుగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అనుజుడెంత పొడవుగున్న నంత పొట్టి
యన్న, కనుక వేషమొకటి యన్న వేసె
ననుజునిగ,తమ్ముడున్ వేసె నన్నగానె
అన్న తమ్ముడయ్యెను తమ్ముడన్న యయ్యె.
త్రేతయందున చూడంగ. శ్రీరఘుపతి
రిప్లయితొలగించండియన్నకాగశేషఫణియుననుజుడయ్యె
ద్వాపరమునశేషునకుతాతమ్ముడయ్యె
నన్నతమ్ముబయ్యెనుతమ్ముడన్పయయ్యె