17, మార్చి 2024, ఆదివారం

సమస్య - 4708

18-3-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్”
(లేదా...)
“గీతాబోధన సేసి యర్జునునకున్ కృష్ణుండు కీడెంచెనే”

35 కామెంట్‌లు:

  1. భ్రాతగజేసెగకృష్ణుడు
    గీతా బోధననరునకు , కీడొనరించెన్
    సూతునిపుత్రుడు కర్ణుడు
    నేతకుదుర్బోధజేసినింపుచువిషమున్

    రిప్లయితొలగించండి
  2. గీతము సాధన జేయగ
    గాత నిలయమునకు వచ్చె గాడిద వేగన్
    కౌతుకముగ నేర్చిన సం
    గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్

    రిప్లయితొలగించండి
  3. కం:
    నీతిని విడచిరి జనులు స
    నాతన కాలపు నిబంధనలు వలదనుచు
    న్నీతరమునందు మరచుట
    గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్

    రిప్లయితొలగించండి
  4. రీతియు నియమము ధర్మము
    నీతిని విడనాడి జేయు నేతకు నెపుడున్
    చేతలు సక్కగ లేకను
    గీతా బోధన నరునకు గీడొనరించున్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    చేత ధనువుఁ గ్రీడి విడఁగ
    జేతలుగా కౌరవాళి చెలగుదురనుచున్,
    జేతనమిడి శ్రీకృష్ణుఁడు
    గీతాబోధన నరునకుఁ, గీడొనరించెన్!

    శార్దూలవిక్రీడితము
    చేతన్ వింటిని వీడి ఫల్గుణుఁడు నిశ్చేష్టుండుగా నిల్వగన్
    జేతవ్యుండుగ నిల్వనర్జునుఁడదే సేమంబు గాదంచుఁదా
    జైతన్యంబొసఁగన్ బ్రసాదమనగన్, స్తంభింప రారాజునే,
    గీతాబోధన సేసి యర్జునునకున్ కృష్ణుండు, కీడెంచెనే!

    రిప్లయితొలగించండి
  6. చేతో మోదము గూర్చె ను
    గీతా బోధన నరునకు :: కీడొ న రించె న్
    మాతను గాదను గర్ణు కు
    భ్రా త వలనమూ డె కాదె బవరము నందున్

    రిప్లయితొలగించండి
  7. తాతల్తండ్రులుమేనమామలనిలోధర్మంబుదప్పన్కృపుం
    డాతండయ్యెగవిష్ణుడంతహితమున్ఠావున్గనన్జేసితా
    గీతాబోధనజేసియర్జునకున్, కృష్ణుడు కీడెంచెనే
    నీతిందప్పినరాజరాజునకువేనేర్పన్సమానత్వమున్

    రిప్లయితొలగించండి

  8. నీతియు నియమము, పాపపు
    భీతియు నిసుమంత లేని పెచ్చారి యొకం
    డీతీరున వచియించెను
    గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్.


    ప్రీతిన్ జూపిన వారలెందరొ యనిన్ విద్వేషులై యుండగా
    చేతన్ బట్టగలేను గాండివమికన్ జేయంగ యుద్ధమ్మనన్
    జైతన్యంబొనరించె, ధర్మమునుతా స్థాపింపగా చక్రియే
    గీతాబోధన సేసి యర్జునునకున్ , కృష్ణుండు కీడెంచెనే?

    రిప్లయితొలగించండి
  9. చేతోజాతముగా ధనుంజయునకున్ శ్రీకృష్ణుడే విజ్ఞుడై
    గీతార్థంబులు బోధజేసెనుగదా గీలించి సుజ్ఞానమున్
    భాతిన్ నెక్కొనజేయ జ్ఞానమది సంభావింప నేరంబొకో?
    గీతాబోధన సేసి యర్జునునకున్ కృష్ణుండుకీడెంచెనే?

    రిప్లయితొలగించండి
  10. గీతార్థంబులు నరునకు
    భాతిగ నెరిగించి శౌరి భ్రమలడగించెన్
    చేతమునందేల తలఁపు
    గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్?

    రిప్లయితొలగించండి
  11. కం॥ చైతన్యము నింపంగన్
    గీతా బోధన నరునకున్, గీడొనరించెన్
    నీతినిఁ బాసిన కౌరవ
    ఘాతుకులకుఁ గ్రీడి యనిని ఘనముగఁ గూల్చన్

    శా॥ గీతాబోధన సేసి యర్జుననుకున్, గృష్ణుండు కీడెంచెనే
    చేతన్ బూనుచు విల్లుఁ గ్రీడి యటులన్ జేయంగ యుద్ధమ్మునున్
    వ్రాతల్ మారఁగఁ గౌరవాధములకున్ వారందరున్ గాంచఁగన్
    జైతన్యంబు నడంగ చత్తురు గదా సందేహమే లేదనిన్

    కృష్ణుడు కీడెంచినది కౌరవులకండి

    రిప్లయితొలగించండి
  12. కం:ఏ తత్త్వము గమనించక
    గీత యనగ యుద్ధమె యని కృత్రిమ విధితో
    హేతువిరుద్ధత జేసెడు
    గీతాబోధన నరునకు గీ డొనరించెన్
    (భగవద్గీత యొక్క అసలు తత్త్వం కేవలం యుద్ధం కాదు.అది తెలియక అది కేవలం యుద్ధబోధ అనుకునే గీతా బోధ కీడు చేస్తుంది.)

    రిప్లయితొలగించండి
  13. నూతన లోకపు తెరఁగు, స
    నాతన మార్గమ్ము వీడి, నాస్తికుల కుసం
    జాతులనుగతిన్, మరువగ
    గీతాబోధన, నరునకుఁ గీడొనరించెన్

    రిప్లయితొలగించండి
  14. శా:స్వాతంత్రార్జన యుద్ధమార్గముననే సాధ్యంమ్మటంచెంచు బో
    సీ తర్కమ్ము నొనర్చె హింసకుల పై హింసాప్రయోగమ్ము లో
    నే తత్త్వమ్మును తప్పు పట్టదు కదా ! హిందుత్వ మే మెచ్చదే!
    గీతాబోధన జేసి యర్జునునకున్ గృష్ణుండు కీ డెంచెనే ?

    రిప్లయితొలగించండి
  15. శ్వేతాశ్వమ్ములఁ బూన్చియున్న రథమున్ శ్రీకృష్ణసారథ్యమున్
    జేతన్ విల్లు ధరించియున్న నరుడే చింతాత్ము డైనిల్వగా
    గీతాబోధన సేసి యర్జునునకున్ కృష్ణుండు కీడెంచెనే
    తాతన్ జ్ఞాతులనే వధించెనుగదా దాక్షిణ్య రాహిత్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేతన్విల్లుధరించినఁ
      చేతనమందున నిరాశ చిందులు వేయన్
      చైతన్యమొసగెఁ గృష్ణుడు
      గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్

      తొలగించండి
  16. ఆతత కరుణం గంస వి
    ఘాతి సమరకాంక్షుఁ జేయఁ గౌరవ సేనా
    వ్రాతమునకుఁ జేసి యనిన్
    గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్


    వీతానుగ్రహ మానసమ్మునను సంవీక్షించి భూ సౌఖ్య సం
    ధాతృస్థానము నాక్రమించి తమి నానాగోత్ర భూమీశ్వర
    వ్రాతఘ్నం బగు యుద్ధ మెంచి వసుధా భారమ్ము తగ్గింపఁగా
    గీతాబోధన సేసి యర్జునునకుం గృష్ణుండు కీడెంచెనే

    రిప్లయితొలగించండి
  17. పాతకములఁదొలగించెను
    గీతాబోధన నరునకు, గీడొనరించెన్
    గీతాచార్యుని బలుకులు
    ఖాతరు జేయంగలేని కాపురుషులకున్

    రిప్లయితొలగించండి
  18. గీతాబోధన సేసి యర్జునునకున్ కృష్ణుండు కీడెంచెనే
    గీతాబోధనఁజేసి పార్ధునకునాకృష్ణుండు మేల్జేసినే
    నేతీరున్ గన భారతంబున నికన్ నేమార్చు వీరుండునై
    నీతిందప్పిన రాజరాజునకుఁదానేర్పెన్సరాగంబునున్

    రిప్లయితొలగించండి
  19. రీతిగ వినిన శుభములగు
    *"గీతాబోధన నరునకుఁ, గీడొనరించెన్”*
    కోతలుకోయుచు వెనుకను
    గోతులుతీసెడునరునకు కువలయమందున్

    రిప్లయితొలగించండి