8, మార్చి 2024, శుక్రవారం

సమస్య - 4699

9-3-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్”
(లేదా...)
“తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో”
(తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. తార్క్ష్యమనగ నభ్రగమని
    తార్క్ష్యంబన రథమటంచు దలతును స్వామీ
    తార్క్ష్యరథుఁడు హరి, యెట్టుల
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్

    రిప్లయితొలగించండి
  2. తార్క్ష్యమనంగ నభ్రగము తార్క్ష్యమనంగ రథమ్ము కాదొకో!
    తార్క్ష్యరథుండనంగ హరి దర్పకుడాతని పుత్రుఁడే గదా
    తార్క్ష్యము తార్క్ష్యమంచిటుల తర్జనభర్జనలేల? నెవ్విధిన్
    తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో?

    రిప్లయితొలగించండి
  3. కం॥ త్రార్క్ష్య రథుఁడనఁగ భానుఁడు
    త్రార్క్ష్య రథికుడు మదనుని దస్యుఁడెటులగున్
    దార్క్ష్య రథుని నింద పలుక
    “తార్క్ష్య రథుఁడలిగి మదను దగ్ధమెనర్చెన్”

    ఉ॥ తార్క్ష్యుఁడు నొక్కఁడా యినుని తాల్మి రథంబును ద్రోలుచుండఁగన్
    తార్క్ష్యుఁడు నింకొకండు ఘన తామస హారిని మోయు చుండఁగన్
    తార్క్ష్య రథుండు మన్మథుని దస్యుఁడుఁ గాదనఁ గల్ల యియ్యదే
    “తార్క్ష్య రథుండు మన్మథుని దగ్థమొనర్చెను దేవభూమిలో”

    తార్క్ష్యుడు అనూరుడు గరుత్మంతుడు
    దస్యుడు శత్రువు

    రిప్లయితొలగించండి
  4. తార్క్ష్య రథు o డన హరియే
    తా ర్క్ష్య ర థు నకు o శివునకు తారమ్య మెటుల్?
    తా ర్క్ష్య ర థుo డెటు ల దా
    తా ర్క్ష్య ర థు దలిగి ద గ్ధ మొన ర్చె న్?

    రిప్లయితొలగించండి
  5. తార్క్ష్యుడు నారాయణునకు
    తార్క్ష్యము కాదని వచింప తప్పౌనుగదా
    తార్క్ష్యుడయిన నిటులనునా ?
    'తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్!'

    తార్క్ష్యుడు పద్మగర్భునకు తార్క్ష్యము కాదనిచెప్ప తప్పగున్
    తార్క్ష్యుడు వాహనంబయిన దైవతమేగద దేవదేవుడౌ
    తార్క్ష్యరథుండు; మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో
    తార్క్ష్యరథుండనన్ దొసవు త్ర్యక్షుడు దగ్దమొనర్చె నక్కటా!

    రిప్లయితొలగించండి
  6. తార్క్ష్యుఁడనఁగ వినత కొడుకు
    తార్క్ష్యుఁడు మధుసూదనునకుఁ దగ వాహనమౌఁ
    దార్క్ష్యుఁ దలఁచి యనె మూఢుఁడు
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్.

    తార్క్ష్యుఁ డనంగ నా వినత దద్దయుఁ బ్రీతినిఁ గన్న పుత్రుఁడౌఁ
    దార్క్ష్యుఁడనంగ నెల్లపుడుఁ దామరసాక్షుని వాహనంబె యౌఁ
    దార్క్ష్యుఁ డనంగ నంది యని తప్పుగఁ జూచిన మూఢుఁ డిట్లనెన్
    తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో.

    రిప్లయితొలగించండి
  7. కందం
    తార్క్ష్యరథుండన విష్ణువు
    తార్క్ష్యరథు కొమరుని శరము త్ర్యక్షునిఁ దాకన్
    తార్క్ష్య వడిన్, గనుచుండఁగ
    తార్క్ష్యరథుండ, లిగి మదను దగ్ధమొనర్చెన్

    ఉత్పలమాల
    తార్క్ష్యరథుండు విష్ణువన తారకుఁగూల్చెడు సూనునెంచుచున్
    దార్క్ష్యరథాత్మజుండెసఁగి త్ర్యక్షునిపైన శరంబునేయఁగన్
    తార్క్ష్యవడిన్ జలించి నయనంబున బుట్టగ నగ్ని ,సాక్షియై
    తార్క్ష్యరథుండు, మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో!


    రిప్లయితొలగించండి

  8. తార్క్ష్యమ్మనగను రథమట
    తార్క్ష్యుండనగరుడుడంద్రు, దామోదరుడే
    తార్క్ష్యుండె యైన నెప్పుడు
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్?



    తార్క్ష్యమనంగనేమన రథమ్మని తెల్పె నిఘంటు వొక్కటిన్
    తార్క్ష్యుడు సూర్యసారథియు తాపసి కశ్యపు డంచు తెల్పిరే
    తార్క్ష్యుడు విష్ణుమూర్తి మరి దర్పకుడాతని పుత్రు డెవ్విధిన్
    తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో??

    రిప్లయితొలగించండి
  9. తార్క్ష్యుడను నాటకమ్మున
    తార్క్ష్యరథుని వేషధారి దగ పోషించన్
    తార్క్ష్యరథుడీశు డయ్యెను
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్

    రిప్లయితొలగించండి
  10. తార్క్ష్యరథుడనగ విష్ణువు
    తార్క్ష్యరథునికి మదనుడగు తనయుడు కనుకన్
    తార్క్ష్యు ని తెలియక పలుకకు
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్

    రిప్లయితొలగించండి
  11. కం:తార్క్ష్య మనగ పాము కదా!
    తార్క్స్యధరుం డలిగి మదను దగ్ధ మొనర్చెన్
    తార్క్ష్యపు టే యర్థము లో
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధ మొనర్చెన్
    (తార్క్ష్యం అంటే పాము.తార్క్ష్యధరుడు మన్మధుని చంపాడు కానీ తార్క్ష్యరథుడు కాదు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తార్క్ష్య'మంటే పాము అన్న అర్థం నాకు ఏ నిఘంటువులోను కనిపించలేదు.

      తొలగించండి
    2. తార్క్ష్యpermalink
      తార్క్ష్య : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report error(s)
      పు.
      గరుడుఁడు; అనూరుఁడు; బండి; గుఱ్ఱము; పాము; పక్షి.(Andhrabharathi)

      తొలగించండి
  12. ఉ:స్వర్క్షతి బాప దేవతలు భర్గుని పెండ్లి దలంప,నొప్పగా
    తార్క్ష్యరథుండు, మన్మథుని దగ్ధ మొనర్చెను దేవభూమిలో
    వార్క్ష్యము లోని కల్పతరుపక్షము లన్నియు నల్ల లాడ గా
    తార్క్స్యధరుండు,దేవతలు తద్దయు గుందిరి కార్యభగ్నతన్.
    (స్వర్గ లోకక్షతిని బాపటానికి దేవతలు శివుని వివాహాన్ని కోరుకున్నారు.తార్క్ష్యరథు డైన విష్ణువు దానికి ఒప్పుకున్నాడు.దేవభూమిలోని వార్క్ష్యము లో అనగా వనం లో కల్పతరుశాఖలు కూడా భయం తో అల్లలాడే విధం గా శివుడు మన్మథుణ్ని భస్మం చేశాడు.కార్యభంగానికి దేవతలు బాధ పడ్డారు.సంయుక్తాక్షరప్రాసలో ఒకటి కంటే ఎక్కువ వత్తు లున్నప్పుడు ఒకటి తగ్గించి ప్రాస వేయ వచ్చును.తార్క్ష్యధరుడు అంటే శివుడు. )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలోని ప్రాస విషయంలో నాకు సందేహమే. అటువంటి నియమం ఉన్నట్టు వినలేదు.

      తొలగించండి
  13. తార్క్ష్య మనోహర వాహనుఁ
    దార్క్ష్యాశ్వకుమార వర్యుఁ దనరింపక యే
    పార్క్ష్యక్రియనుం గాంక్షిత
    తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్


    వార్క్ష్యవరోన్నతాయుధునిఁ బంచ శరప్రము ఖాంగజాతునిం
    దార్క్ష్యవినూత్న వాహనునిఁ దార్క్ష్య చరాత్మజుఁ గాంచినంతటం
    బార్క్ష్య విహీన రమ్యతర భంగినిఁ గాంక్షిత దివ్య రూప భృ
    త్తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో

    [వార్క్ష్యము=వృక్షమునకు సంబంధించినది, పార్క్ష్యము= పృక్షమునకు(యుద్ధమునకు) సంబంధించినది, తార్క్ష్యము=కశ్యపుని యపత్యము, పక్షి(గరుడుఁడు, చిలుక)]

    రిప్లయితొలగించండి