22, మార్చి 2024, శుక్రవారం

సమస్య - 4713

23-3-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఈ వసంతమునన్ బాడవేల పికమ!”
(లేదా...)
“ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మద్యపాన నిషేధమే మంటగలిసి
    మత్తుమందులన్ దూగుచు మహిని యువత
    చిందువేయుచు చెడిపోయినందుకేన?
    యీ వసంతమునన్ బాడవేల పికమ!?

    మత్తకోకిల
    చేవఁ జూపని మద్యపాన నిషేధమన్నది హేతువై
    త్రోవఁ దప్పుచు యవ్వనస్తులు దూగి త్రాగుచు మత్తులో
    భావిజీవితమెల్ల జారుచు భంగమై పడినందుకా?
    యీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!?

    రిప్లయితొలగించండి

  2. *(పారిజాతము ఇవ్వలేదని కినుక బూనిన సత్యతో శ్రీకృష్ణుడు...... )*

    నన్ను గాంచిన చాలు నానందమందు
    పురిని విప్పిన నెమలివై ముదము లలర
    సరస భాషణ జేసెడిన్ సత్య యిప్పు
    డీ వసంతమునన్ బాడవేల పికమ!




    *(నర్తనశాలలో స్త్రీవేషంలో వున్న భీమునిచూసి సైరంధ్రిగా నెంచి కీచకుడు)*


    నీవురమ్మని పిల్చినావని నేను జేరితి గాదుటే
    యీవిధమ్మున మౌనముద్రనదేల దాల్చగ నో సఖీ
    భావమందున రేగుచుండెడి ప్రశ్రయమ్మును గూర్చి నీ
    వీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!

    రిప్లయితొలగించండి
  3. మ.కో.

    పూవులన్నిట రాలిపోవును పుణ్య మూర్తుల లేమిచే
    భావనాస్ఫుట మూర్తి వీవు శుభమ్ము ప్రేమ కలాపమున్
    చేవ మాదిక, చేత నీదిగ, చిత్తు, చూడు, రసజ్ఞులన్
    *ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!*

    రిప్లయితొలగించండి
  4. నిన్ను మించిన గాయకుల్ నేర్పు మీర
    నింపు సొంపు గ పాడగా నీసు తోడ
    నీవసంత ము నన్ పాడ వేల పికమ?
    నిన్ను జూచియె వారలు నేర్చుకొ నిరి

    రిప్లయితొలగించండి
  5. మండు చున్న యాతపమున మావి చెట్టు
    కొమ్మ పయిన చిగురు దిని కూయుచుఃడ
    కూర్మిగ మురియు మాపయి కోపమేల
    ఈ వసంతమునన్ బాడవేల పికమ ?

    రిప్లయితొలగించండి
  6. ప్రతి వసంతమునందునీ పాటతోడ
    ప్రజల కానందమునుగూర్చుపక్షి వీవు
    ఈవసంతమునను బాడవేల పికమ?
    కోకిలా మానవులపైన కోపమేల?

    రిప్లయితొలగించండి
  7. మావి తోపున నెంచితి మ్రానుఛాయ
    భావనాఝరి పొంగున వ్రాయుచుంటి
    సావధానముఁ గూర్చుచు సౌఖ్యమిడగ
    నీ వసంతమునన్ బాడవేల పికమ!

    ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!
    భావనాఝరి పొంగులెత్తగ వ్రాయబూనితి కావ్యమున్
    మావి కొమ్మల నక్కి యుంటివి మత్తుగా నువుపాడవా!
    సావధానముఁ హాయిగూర్చుచు చక్కగా గమకించవా

    రిప్లయితొలగించండి
  8. ఏవి కొమ్మలు నూగ మేయగ నేది పల్లవమంచు నీ
    వీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా
    ఠీవి దప్పిన మావి మీదకు టెక్కునొందు నిజమ్ము నీ
    రావమొక్కటి తెచ్చునామని రమ్ము వేగమె రమ్మిటన్

    రిప్లయితొలగించండి
  9. పావనమ్మగు దేవళమ్ములు పాపకూపములవ్వగా
    భావిభారతి సంప్రతిష్ఠకు భంగమౌనను భీతియా
    మావిపల్లవ ఖాదనమ్మును మాని కొందలపాటుతో
    ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!”

    రిప్లయితొలగించండి
  10. ఎన్నికల భాషణమ్ములు మిన్నునంట
    కర్ణపుటముల రుధిరమ్ము గారుచుండె
    భీతిచెందక నీవైన ప్రీతి మీర
    ఈ వసంతమునన్ బాడవేల పికమ!

    రిప్లయితొలగించండి
  11. తే॥ ప్రకృతి సమతుల్య మీనాఁడు పాడగుటకొ!
    మావి చిగురుఁ దొడగదని మనసుఁ గనకొ!
    పట్టణముల నల్లరిఁ గని భయము కలిగొ!
    యీ వసంతమున్ బాడ వేల పికమ!

    మత్త॥ మావితోటను లేత యాకులు మాయమయ్యె నటంచునో!
    యావనిన్ గన వృక్ష సంపద లంతరించె నటంచునో!
    కావు కావను కాకిగోలను గాంచి దవ్వుల నుంటివో!
    యీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:శిశిరమున నాకు రాలదు,చిగురు వచ్చు
    గ్రీష్మ తాప మామని లోనె రెచ్చి పోవు
    ఈ వసంతమునన్ బాడ వేల పికమ?
    యందుమే కాని ఋతు ధర్మ మవని నేది?

    రిప్లయితొలగించండి
  13. మ.కో:ఈ వసంతము నందు నెండలె హెచ్చె గ్రీష్మపు రీతిగా
    మావి కొమ్మల లే చిగుళ్లును మాడిపోయె విచిత్రమై
    నీవు కూర్చొను చెట్టు లేదిక నిల్చె నిళ్లట ,కానిచో
    ఈ వసంతసమాగమమ్మున నేల పాడవు కోకిలా?
    (పై మార్పులు వచ్చాయి కానీ అవి లేక పోతే నువ్వు పాడకుండా ఎందు కుంటావు?)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భావ కవితలకృష్ణుడేపారెననియ
      చేదుమిగిలెగపద్యాలచిత్రమనియ
      నవ్యరసభావసౌందర్యనడతలేద?
      ఈవసంతమునన్పాడవేలపికమ

      తొలగించండి
  14. పావనంబదిరామనామముపాడకష్టము వచ్చెనా
    చేవలేకనుసత్యధర్మముచెప్పువాడునులేడనా
    నావికుండిటనేర్పుతోడుతనావదాటగరాడనా
    ఈవసంతసమాగమంబుననేలపాడవుకోకిలా

    రిప్లయితొలగించండి
  15. ఏ వలను పరికించిన నెల్లర కిటఁ
    గేవలము కల్గ నానందమే విరివిగఁ
    జిక్కిచింతా భరమ్మున నక్కజముగ
    నీ వసంతమునం బాడవేల పికమ!


    ఈ విషాదము రేఁగఁ గారణ మెద్ది నాకు వచింపుఁడీ
    రావు వెన్నెల కాయు చుండ విరక్తి యేల చకోరమా
    యీ వలాహక సంభ్రమమ్మున నేల నాడవు చంద్రకీ
    యీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!

    రిప్లయితొలగించండి
  16. తాగు బోతుల పాటలు ధరణి యందు
    మారు మ్రోగుట చేతను మైకమొంది
    భయముఁజెందితె? మఱియేమి?పాడ కలిగి
    యీ వసంతమునన్ బాడవేల పికమ!”
    (

    రిప్లయితొలగించండి
  17. ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!
    భావ జాలము లేకయుండెనె? పాడయిష్టము లేకనా?
    మావి డాకుల చిగురు లేకన? మంది కోయన కూయకా?
    కావు మంచును గావుమంచును గాకికూయగ వింటివే!

    రిప్లయితొలగించండి
  18. ఆమనియరుదెంచెనదిగోనవనియందు
    పచ్చదనముతోప్రకృతియుపరిఢవిల్లె
    పూలబాణుడేతెంచెతాభూరిగాను
    *ఈవసంతమునన్ పాడవేల పికమ*


    ఈవనమ్ములునిన్నుగానకనేడ్వసాగెనుగాంచుమా
    త్రోవలన్నియుతెల్లబారెనుదోసమెంచకరావడిన్
    మావికొమ్మనుచేరివేగమెమానుగాగళమెత్తుచున్
    *“ఈ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా!”*

    రిప్లయితొలగించండి