13, మార్చి 2024, బుధవారం

సమస్య - 4704

14-3-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్మసంభవు పత్ని యపర్ణయె కద”
(లేదా...)
“పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”

23 కామెంట్‌లు:

 1. తేటగీతి
  అగ్రమందున కరముల వరలు నెవరు?
  చేతి మధ్యన శోభిల్లు మాతయెవరు?
  మూలమందెవరనఁ జూడఁ బొలుపుగ. ,రమ,
  పద్మసంభవు పత్ని, ,యపర్ణయె కద!

  మత్తకోకిల
  పద్మనాభుని మానసంబున వాసముండెడి దెవ్వరో?
  పద్మనేత్రుని కోడలమ్మగ వాణియెవ్వరి యాలియౌ?
  పద్మహస్తుని సోదరీమణి పల్కనెవ్వరు? లక్ష్మియున్,
  పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్

  రిప్లయితొలగించండి
 2. తాను స్థిరముగ నుండును తన్ను వేడు
  నరుల బ్రోచు విద్యలనెల్ల నరయజేసి
  పద్మసంభవు పత్ని; యపర్ణయె కద
  జగము గాచు తానరుదెంచి జనని వోలె.

  రిప్లయితొలగించండి
 3. విద్యలకు నెల్ల మూల మై వెలయు నెవరు?
  గొప్ప తపమును జేసియు మెప్పు నొంది
  పత్ని య య్యె ననుచు నెంచు పడతి యెవరు?
  పద్మ సంభవు పత్ని :: యపర్ణ యె కద

  రిప్లయితొలగించండి

 4. కచ్ఛపీ యను వీణియ కలిగి యున్న
  తల్లియెవ్వతె? ధూర్జటి తనువు నందు
  నర్థభాగము పొందిన నతివ యెవతి?
  పద్మసంభవు పత్ని , యపర్ణయె కద.  పద్మనాభుని డెందమందున వాసముండెడి దెవ్వరో
  పద్మలాంఛన కాదుటేమరి బ్రహ్మకన్యక శాబ్దియే
  పద్మసంభవు ధర్మపత్ని , యపర్ణ యందురు పండితుల్
  సద్మమన్నది లేనిగోపతి షష్టిభాగుని యూఢగన్

  రిప్లయితొలగించండి
 5. తాళపత్రములందువే దములులేవు
  గురువుముఖమునధారయైకులుకుచుండు
  వాణివాక్కులపౌరుషేయంబులహహ
  పద్మసంభవుపత్ని. పర్ణయెగద

  రిప్లయితొలగించండి
 6. పద్మమంతరమందుగాంచనభావరమ్యతవెల్గుగా
  పద్మమూలమునందుబుట్చెగబ్రహ్మసృష్టికినాద్యుడై
  పద్మజాదులమాటునుండెడిపల్కురాణిగనాద్యయై
  పద్మసంభవుధర్మపత్నియపర్ణయందురుపండితుల్

  రిప్లయితొలగించండి
 7. నరుల పుట్టుగిట్టులకు నిర్ణయమెవరిది
  పతిననుసరించు సహచరి ప్రవర యేమి
  శివుని గోరి భుక్తెరుగని చేడి యెవరు
  పద్మసంభవు, పత్ని, యపర్ణ గాదె

  రిప్లయితొలగించండి
 8. పద్మసంభవుడన్న నెవ్వరు? పద్మగర్భు తనూజుఁడే
  పద్మనాభుని కోడలెవ్వరు? పల్కుతొయ్యలి వాణియే
  పద్మలాంఛన యన్ననెవ్వరు? బ్రహ్మచారిణి యెవ్వరో?
  పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్

  రిప్లయితొలగించండి
 9. పద్మముఖియైన వాణియె వాటమయిన
  పద్మసంభవు పత్ని : యపర్ణయె కద
  పద్మనాభుని చెల్లెలు వావిజూడ
  పద్మిని యపరాజితునికి పత్నియగును

  రిప్లయితొలగించండి
 10. పద్మనాభుని భార్యయే పద్మవాస
  పద్మలాంఛన యనిపిల్వ పల్కుచుండు
  పద్మసంభవు పత్ని, యపర్ణయె కద
  పద్మగా పేర్కొనెడుసతి భార్గవునికి

  పద్మనాభుని రాణియైనది పద్మవాస నితంబినే
  పద్మలాంఛన యంచు కొల్వగ భక్తులన్ గరుణించుగా
  పద్మసంభవు ధర్మపత్ని; యపర్ణ యందురు పండితుల్
  పద్మగావెలుగొందు భామను ఫాలనేత్రుని భార్యనే

  రిప్లయితొలగించండి
 11. చదువు సంధ్యలు లేనట్టి జడుడొకండు
  పగ్గెలను బల్కుచు పరమ పండితునని
  తెగటుగొని యనె నజ్ఞత తెల్లమవగ
  పద్మసంభవు పత్ని యపర్ణయె కద

  రిప్లయితొలగించండి
 12. పద్మనాభు తనూజుండు పద్మభవుఁడు
  పలుకుతొయ్యలి భారతి వాణిగాదె
  పద్మసంభవు పత్ని? యపర్ణయెకద
  శైలధన్వుని యర్ధాంగి శైలపుత్రి!

  రిప్లయితొలగించండి
 13. తే॥ తమ్మిచూలినందు రిటుల నిమ్ము గాను
  పతికి తోడునీడగఁ జను పడతి యెవరు
  శివుని యర్ధ భాగముననే స్త్రీ నిలచెనొ
  పద్మసంభవు పత్ని యపర్ణయె కద

  మత్త॥ పద్మనాభుని పుత్రుఁడై తల వ్రాత లన్నియు వ్రాయు నా
  పద్మసంభవు నంటి యుండెడి పద్మలాంఛనయే కదా
  పద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్
  పద్మనాభుని సోదరీమణి, పాటలావతి, పార్వతీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మత్త॥ పద్మనాభుని పుత్రుఁడే తల వ్రాత వ్రాసెడి దేవుఁడే
   పద్మలాంఛన బ్రహ్మ కేమగు పార్వతీ సతి నామమే!
   పద్మ నాభుఁడు లోక పాలక భక్త రక్షకుఁ డాయనే
   పద్మ సంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్

   క్రమాలంకారమండి
   లోకపాలక భక్తరక్షకుఁ డాయనే యందురు పండితుల్ అని భావము

   తొలగించండి
 14. మ.కో:"పద్మరాగ "మటంచు నొక్క ప్రబంధమున్ వెలయించుటన్
  పద్మసంభవ వర్ణ సాధ్విగ వన్నె గూర్చిన దంచు నా
  పద్మభూషణ బొంది నట్టి యపర్ణ మెచ్చుచు మాన్యతన్
  పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”
  (ఆమె పేరు అపర్ణ.ఆమె పద్మరాగం అనే ప్రబంధం రాసి పద్మభూషణ పొందింది.ఆమె పద్మసంభవవర్ణం లో అనగా బ్రాహ్మణకులం లో పుట్టింది కనుక ఆ కులానికి పేరు తెచ్చిందని ఆమెని పద్మసంభవు ధర్మపత్ని ఐన సరస్వతే అన్నారు.)

  రిప్లయితొలగించండి
 15. 1)తే.గీ:కావ్యమును వ్రాయ నచ్చు కై కాసు లిడెను
  లక్ష్మి, పలుకు లందించె సలక్షణముగ
  పద్మసంభవు పత్ని, యపర్ణయె కద!
  నాదు కావ్యమునన్ నిల్చె నాయికగను.
  (కావ్యం లో నాయిక పార్వతి.పలుకుల నిచ్చింది సరస్వతి.అచ్చుకి సొమ్ము నిచ్చింది లక్ష్మి దేవి.)

  రిప్లయితొలగించండి
 16. సంశయమున లక్ష్మీ సతి చంచలాక్షి
  తనదు కోడలి నడిగెను దరికిఁ జేరి
  పార్వతీ సతి నామము పల్కు మమ్మ
  పద్మసంభవు పత్ని! యపర్ణయె కద


  పద్మ సంభవుఁ గాంచ నెంచి యపార భక్తి మహా మునుల్
  సద్మ రాజము సేరఁ బ్రశ్నము సక్క వేయ వచింపఁగాఁ
  బద్మలోచన పార్వతీ సతి భద్ర నామము నన్యముం
  బద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్

  రిప్లయితొలగించండి
 17. చదువు సంధ్యల కాణాచి శారదాంబ
  పద్మసంభవు పత్ని ,యపర్ణయె కద
  విశ్వ గురువును బొందిన వీర వనిత
  శ్రీలు సంపద లిచ్చిరక్షించుగాక!

  రిప్లయితొలగించండి
 18. పద్మరేకుల కండ్లు గల్గిన పద్మనాభుని సోదరే
  పద్మసంభవు ధర్మపత్ని ,యపర్ణ యందురు పండితుల్
  పద్మ రేకును బోలు నేత్రము పద్మ మోమున నుంటచే
  సద్మమన్నది లేని శంభుని చంక భాగము నెక్కెనే

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  హంస వాహిని యగు శారదాంబ యామె
  పద్మ సంభవు పత్ని; యపర్ణయె కద
  శివుని కొఱకు ఘోర తపము చేసి తుదకు
  సఫలతను పొంది శంకరు సతిగ నిలిచె.

  రిప్లయితొలగించండి