9, మార్చి 2024, శనివారం

సమస్య - 4700

10-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి”
(లేదా...)
“మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో)

31 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తిరుమల రథసప్తమి నాడు తేరులందు
    మాడవీధుల విహరించు మాధవుఁగని
    వ్యోమ సీమల పులకించి, స్వామి మేని
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి!

    చంపకమాల
    తిరుమల మాడవీధుల నుతింపున సాగుచు తేరులందునన్
    సరసిజనేత్రుడందు రథసప్తమి వేడ్కల శోభగాంచుచున్
    హరిపదసీమలన్ దొరలి యద్భుతమంచును స్వామిమేనిలో
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే!

    రిప్లయితొలగించండి
  2. తెలి.యరానిది తత్వంబు తేటపడదు
    చిన్నమేఘంబు చెలరేగి చేటుగనక
    తళుకులీనుచు క్షణమునజారిపోవు
    మెరుపుతిరమనిపల్కెగామేఘపంక్తి

    రిప్లయితొలగించండి
  3. సదన మావిరిగ యెగసి చల్లబడగ
    మింటిపయిన యేర్పడియుండ , మేమచట
    కూడి యొకరికొకరము డీకొనుచు నుండ
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి

    రిప్లయితొలగించండి
  4. గగన సీమను తామెల్ల గ్రమ్ము కొనగ
    నేల పైనాడు చుండెడు నెమలి యొక్క
    మిలమిలల పింఛముల మిరుమిట్లు గొలుపు
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి”.

    రిప్లయితొలగించండి
  5. విరిసినపుష్పమాలికలు వీడును దారము కాలసంగతిన్
    కరగునుమంచుకొండలును కాయగయెండలసంగతంబుగా
    మరుగుచుసౌఖ్యమీయిలను మాధవులీలలెరుంగలేకయీ
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లనునొక్కిఁజెప్పెనే

    రిప్లయితొలగించండి

  6. పరమము రవియు కీర్తి శాశ్వతము కాని
    పుడమి లోనకావవియె బుద్బుదము వంటి
    యౌవనము భోగ భాగ్యము లందములును
    మెరుపులు స్థిరములని, పల్కె మేఘపంక్తి.



    పరమము సూక్ష్మదర్శితము భానుడు మానవ కీర్తిసంపదల్
    ధరణిని శాశ్వతమ్మని బుధానులు చెప్పిరి యప్పుడెప్పుడో
    యరయగ గావటంచనిరి యందము యౌవన మంతరిక్షమున్
    మెరుపులు సుస్థిరంబులని, మేఘములెల్లను నొక్కి చెప్పెనే.

    రిప్లయితొలగించండి
  7. కరియు తనువెల్ల మీమీద మెరుపులెల్ల
    నమ్మ బల్కునీ నాయకు లమ్మలార
    వరము లిత్తురు కోకోట్ల నరువు దెచ్చి
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి

    రిప్లయితొలగించండి
  8. వటువురూపుననరుదెంచివామనుండు
    మూడడుగులనేలబలినివేడితాను
    పెరుగగ. త్రివిక్రముడగనా విష్ణుమేని
    *“మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి”*


    విరిసినచంద్రకాంతులవి వెల్గులుపంచుచు నుండగా నటన్
    తరుణులువేచియుండిరటదర్శనభాగ్యముకల్గునంచునన్
    మురళినిచేతదాల్చుచును మోహన రూపున వచ్చి నంతనే
    *“మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే”*


    రిప్లయితొలగించండి
  9. అనిమిషేంద్రనివాసముఁ గనిన చాలు
    నిత్య సంరంభయుక్తమై నిగుడుచుండు
    చక్కనౌ దేవకన్యలుఁ స్వర్గమందు
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి

    సురపతి పట్టణంబుకడు సుందరమే బహు కాంతివంతమే
    నిరతము సుందరాంగులగు నెచ్చెలులే కనువిందుచేయ న
    ప్సరసల నృత్యగానములు సౌఖ్యత గూర్చును స్వర్గసీమలో
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే

    రిప్లయితొలగించండి
  10. భక్త సులభుడు కైలాస వాసి యగుచు
    విశ్వ మును గావ భక్షిo చె విషము దాను
    సర్ప ముల దాల్చు సర్వేశు సాంబ శివుని
    మెరుపులు స్థి రము లని ప ల్కె మేఘ పంక్తి

    రిప్లయితొలగించండి
  11. మెరిసి మాయమైపోవును మేఘవహ్ని
    దానియాయువు మాత్రము క్షణికమేను
    తరుణి యందాల మేనిపై దనరు నట్టి
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి

    రిప్లయితొలగించండి
  12. అరయగ నందచందముల నప్సరలన్ తలదన్ను నెచ్చెలీ
    సరసిజముల్ నిశాకరుడు చక్కదనంబున నీకు సాటియా
    మెరయును మేఘవహ్నులు నిమేషపు మాత్రము, నీదు మేనిలో
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే

    రిప్లయితొలగించండి
  13. తరములు నెన్ని సాగినను తారలు సాగు ననంత రీతులన్
    దరులవి యెన్ని కాలముల దాట ఫలించు మరింతలింతలై
    గిరులవి మించి యన్నిటిని గీరగ నిల్చు జగమ్మునట్లు మా
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే

    రిప్లయితొలగించండి
  14. తే॥ మనుజులకు సేవఁ జేయఁగ మాధవుండు
    మెచ్చు ననుచు సతతమిల మేటి గాను
    బరుల సేవఁ గను నరుని ప్రభల విరియు
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి

    చం॥ అరయఁగ సాధనా గరిమ యాసర నీయఁగ నేర్చి విద్యలన్
    బరమును గోరి సర్వులకు పంచుచు నేర్చిన విద్యలన్నియున్
    వరలుచు నుండు సజ్జనుఁడు వాసిగఁ గాంచు ప్రకాశమందునన్
    మెరుపులు సుస్థిరంబులని మేఘము లెల్లను నొక్కి చెప్పినే

    రిప్లయితొలగించండి
  15. మేఘ ధాటికి నుదయించు మెరుపు లవని
    మేఘ ములలోన దిరముగ దాగి యుంట
    మెరుపులు స్థిరములని పల్కె మేఘపంక్తి
    మెరుపు వెంబడి శబ్దమ్ము ధరను జేరు

    రిప్లయితొలగించండి
  16. మెరుపులు రాక కారణము మేఘము,మేఘము గుద్దు కొంటయే
    ధరకవి కాంతి రూపమున దర్శన మిచ్చును జీవకోటికిన్
    మెరుపులు దాగియుంటనిక మేఘము లందున నిశ్చయమ్ముగా
    మెరుపులు సుస్థిరంబులని మేఘములెల్లను నొక్కి చెప్పెనే

    రిప్లయితొలగించండి
  17. కనులు మిఱుమిట్లు గొల్పఁగఁ గాంతు లీన
    ననుసరింపఁగ నుఱుములు నంచితముగ
    నుదరి వెలుఁగంగ నొక్క ముహూర్త మవని
    మెఱపులు స్థిరము లని పల్కె మేఘపంక్తి


    అఱిముఱి రేఁగు బుద్బుద కణావళి భంగిని సంభవించుచున్
    వెఱపు నొసంగు భగ్గు మను భీకర వహ్నిని ధిక్కరించుచుం
    దఱచుగ వర్ష కాలమునఁ దత్క్షణ మాత్రము వెల్గు లీయఁగా
    మెఱపులు సుస్థిరంబు లని మేఘము లెల్లను నొక్కి చెప్పెనే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కారు మబ్బుల రాపిడి కలిగి నపుడు
    క్షణము కనిపించి మెరుపులు గగనమందు
    కను మరుగగు చుండునెపుడు గాని; కావు
    మెరుపులు స్థిరములని పల్కె మేఘ పంక్తి.

    రిప్లయితొలగించండి