25, మార్చి 2024, సోమవారం

సమస్య - 4716

26-3-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె వలయు శాంతి రక్ష కొరకు”
(లేదా...)
“రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

22 కామెంట్‌లు:

  1. 1.ఆటవెలది
    జాతి సేమమెంచి శాంత్యహింసలఁ బూని
    తెల్ల దొరలఁ దరిమె! ధీరుడతఁడు!!
    జాతిపితగ గాంధి సద్యశుండన సంస్మ
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    2.కురుక్షేత్రములో అర్డునునితో శ్రీకృష్ణ పరమాత్మ:

    మత్తేభవిక్రీడితము
    పణమై మీరలు జూదమోడ మునుపున్ వాసమ్ము కాంతారమే!
    యణుమాత్రమ్ము గతంబునెంచకయె మోహావేశమున్ బూనుచున్
    గుణివీడన్ వనవాసమే గతియగున్ గుంతీసుతా! వింటి ధా
    రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్!





    రిప్లయితొలగించండి
  2. కనుముకృష్ణుబోధ కలతలుదొలగంగ
    రణమువలయుశాంతిరక్షగలుగ
    నరుడుకర్తగాడునైజంబుదెలియుడీ
    నడచిరండుప్రజలు, నయముమీర

    రిప్లయితొలగించండి
  3. క్రొత్తగ పరిణయము గుదిరె, చెప్పెదవిను,
    మాలు మగల నడుమ నాజి తొలగ,
    నామె నిన్ను రహిగ నడిగు చుండెడి యాభ
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రిప్లయితొలగించండి
  4. శాంతిశాంతి యనెడు భ్రాంతి వీడకయున్న
    దురిత జనులనెల్ల నుఱుమకున్న
    ధర్మ వర్తనమ్ము ధరలోన వరలునే
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రిప్లయితొలగించండి

  5. శాంతి భద్రతలకు చరమ గీతముపాడి
    రక్తపాతమిచట శక్తిమేర
    సృష్టి జేయు నట్టి చేడిగేరియల మా
    రణమె వలయు శాంతి రక్ష కొరకు.


    గుణహీనుండ్రు నధర్మ వర్తనులు సంకోచమ్మునే వీడుచున్
    బణమున్ బొందగ శత్రు గుప్తపతులై ప్రాణంబులన్ దీయగా
    మనదేశమ్మును జొచ్చు దుర్మతులనే మాయింపగా నెంచుచున్
    రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్.

    రిప్లయితొలగించండి
  6. ఇరుగు పొరుగు లెప్పు డీర్ష్య ను విడనాడి
    స్నేహ భావ మునను చెలగ వలయు
    నిచ్చి పుచ్చు కొనుచునెపు డు యు ద్ద ము నివా
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రిప్లయితొలగించండి
  7. రణకృత్యంబులు భీతిగొల్పు ప్రజకున్ రాకాసి యుద్ధంబు ప్రాం
    గణముల్ కూల్చుననాథలౌ నధిక సంఖ్యాకంబుగానింక కా
    రణమేమైనను లోకమేకమయి రారా జాత్యహంకార మా
    రణమే కావలె శాంతి రక్షణకు వీరా లెమ్ము లేలెమ్మికన్

    రిప్లయితొలగించండి
  8. అఘములెల్లబాపియానందమునుగూర్చు
    దైవమన వసుధను దాశరథియె
    అట్టి. స్వామి నామ మనయముచేయుధా
    *"రణమె వలయు శాంతి రక్ష కొరకు”*

    రిప్లయితొలగించండి
  9. రణమే శాంతి విఘాతకమ్ము రణమే రాజ్యమ్ములన్ గూల్చుగా
    రణమే మారణకాండ నూలుకొలుపున్ క్రమ్మించు వహ్నిన్ దిశల్
    రణమున్గోరక శాంతికాముకులమై రంజిల్ల హింసా నివా
    రణమే కావలె, శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  10. రణమగునుకదా మరణ సంవరణమని
    తెలియకున్న యెడల కలుగు క్షోభ
    జనుల మేలు కోరి సత్వర రణనివా
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రణమున్ సల్పిన నంతరింత్రు భటులే రౌద్రంబుతోపోరి త
    త్క్షణమే యోచన చేయగల్గు గుణమే సంగ్రామ దీక్షా నివా
    రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్
    క్షణమాలస్యము చేయకుండ చనుమా సంప్రాప్తమౌ సంధికై

    రిప్లయితొలగించండి
  11. రణము దారుణమ్ము రణరంగమందున
    మరణ హవము జరుగు మడియ జనులు
    ప్రగతి ఘాతకమగు రణమువలదు నివా
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. ఆ॥ ఉగ్రవాద కతన నుసిగొల్పి సతతము
      కయ్యమునకు నెపుడు కాలుదువ్వి
      చనెడి పొరుగు దేశ చపలత నణఁచఁగ
      రణమె వలయు శాంతి రక్ష కొరకు

      మ॥ అణు మాత్రంబును లజ్జఁ గాంచకను దానణ్వస్త్ర దేశంబనిన్
      రణమున్ జేయక నుగ్రవాదమున నౌరా శాంతిఁ గత్రించెడిన్
      గుణహీనంబగు శత్రు దేశమునకున్ గూర్చంగ సద్బుద్ధినిన్
      రణమే కావలె శాంతి రక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్

      తొలగించండి
    2. మత్తేభము 3వ పాదము క్రింది విధముగా మార్చినానండి

      గుణహీనంబగు శత్రు దేశమదమున్ గూల్చంగ నేఁడివ్విధిన్

      తొలగించండి
  13. ఆ.వె:నాది భూమి యనగ నాదియే యని యన్న
    దమ్ము లిద్దరిట్లు తగవు పడగ
    నెవరి దంచు మనమె యేల జెప్పంగ క
    రణమె వలయు శాంతి రక్ష కొరకు

    రిప్లయితొలగించండి
  14. మ:ధనిక మ్మౌ భరతావనిన్ కఠిన మౌ దారిద్ర్య మం దుంచిరే!
    ఘనులౌ వీరుల సంహరించి రురి శిక్షల్ వేసి యీ తెల్ల వా
    రిని స్వాతంత్ర్యము దేవిరింతమె ,జయశ్రీ నొంద,స్వేచ్ఛన్ గొనన్
    రణమే కావలె ,శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్”

    రిప్లయితొలగించండి
  15. మ.

    రణమున్ జత్తురు గెల్చి చేరెదరు వీరాగ్రేసరుల్ స్వర్గమున్
    క్షణికావేశము వీడి భక్తి గొనుటన్ సంసారి లక్ష్యమ్ముగా
    తృణమాత్రంబుగ దల్చి బంధువులతో దీపించు వైనమ్మకా
    *రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్.*

    రిప్లయితొలగించండి
  16. ఎల్ల వేళ లందు నిలలోన గణియింప
    శాంత గుణ మొసఁగదు శాంతి సుంత
    దండ మొసఁగు గుణము దండిగఁ బరికింప
    రణమె వలయు శాంతి రక్ష కొఱకు


    క్షణదా గాములు జారచోరగణ సంఘద్రోహి సంఘాతమున్
    పణవిద్యా పరిపూర్ణ పండితులు దుర్వ్యాపార పారీణులుం
    బ్రణిపాతమ్ము లొసంగి వేఁడినను సంభావింతురే నమ్రులై
    రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  17. ఋణమే దిక్కని దిక్కులన్ వెదకి యా ఋక్థంబు దక్కంగనే
    తృణమున్ రాలిచి మిక్కిలిన్ మెసవి దాతృత్వంబు చాటించు నై
    పుణియే నేతల లక్షణంబిపుడయో మోసంబు పోకార్చగా
    రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్

    రిప్లయితొలగించండి
  18. అఘములెల్లబాపియానందమునుగూర్చు
    దైవమన వసుధను దాశరథియె
    అట్టి. స్వామి నామ మనయము చేయుధా
    *"రణమె వలయు శాంతి రక్ష కొరకు”*

    డా బల్లూరి ఉమాదేవి
    క్షణికావేశములోనచేయుపనిశిక్షల్ గూర్చునిక్కంబుగా
    క్షణకాలంబునుమానసమ్మునకువిశ్రాంతిన్ వడిన్కూర్చకన్
    రణమేమేలనుకొంచునుండకనుకార్యమ్మున్ సదాచేయుపూ
    రణమేకావలెశాంతిరక్షణకువీరాలెమ్ములేలెమ్మికన్.

    రిప్లయితొలగించండి