5, మార్చి 2024, మంగళవారం

సమస్య - 4696

6-3-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్”
(లేదా...)
“తర్కము సేయలేఁడు ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

29 కామెంట్‌లు:

 1. మర్కట బుద్థిని కలుగగ
  తర్కంబును జేయలేఁడు : తత్త్వముఁ జెప్పున్
  కర్కశ పలుకుల తోడుత
  నర్కుడు ప్రాణుల కొసంగె డభయము గూర్చిన్

  రిప్లయితొలగించండి
 2. పేర్కొన శంకర నామము
  తార్కొని జయమందె నెపుడు తామసుల పయిన్
  కర్కశ వాదంబును దు
  స్తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పేర్కొన వచ్చుశంకరుని వేదము నేర్చిన తత్వవేత్తగా
   తార్కొనిగెల్చునెన్నడును తత్వపు చర్చల వాదమందునన్
   కర్కశమొప్పకుండునట కారణజన్ముడు వాదులాడ దు
   స్తర్కము సేయలేఁడు ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. దక్షిణామూర్తి మౌన ప్రబోధకుడు...

  అర్క సమానుండై సం
  పర్కమనగఁ నెదుట నిల్వ పండనొసంగున్
  గర్కశులమార్చు శివుఁడే
  తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్


  ఉత్పలమాల
  అర్క సమాన తేజమున నా శివ రూపము వెల్గి మౌన సం
  పర్కము సేత జ్ఞానమును బంచఁగఁ దీరుచు దక్షిణంబుగన్
  గర్కశులైన శాంతిఁగొని గ్రాలఁగ జేయును మర్రినీడలో
  తర్కము సేయలేఁడు ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 4. కర్కశమగు వాదనలన్
  శర్కర తుల్యమగు వాద చాతుర్యముతో
  కర్కటము వోలె మొండిగ
  తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్”

  రిప్లయితొలగించండి

 5. కర్కశముగ మాటాడడు
  పేర్కొనడెవ్వండనైన వెకలి యటంచున్
  శర్కర నొల్కునుడులు, కు
  తర్కంబును జేయలేఁడు, తత్త్వముఁ జెప్పున్  కర్కశమైన వాక్యములు కల్లలు పల్కడె వండనైన తా
  పేర్కొన బోవడెప్పుడును వెంగళుడంచును మాటలందునన్
  శర్కరలూరుచుండు గన సద్గుణ శీలి యతండు శుష్కమౌ
  తర్కము సేయలేఁడు, ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 6. అర్కుని వలెకాంతినొసగు
  పేర్కొనబోడెవ్వరినిలబేలలటంచున్
  కర్కశ బుద్ధిని చూపుచు
  *“తర్కంబును జేయలేడు తత్త్వముఁ జెప్పున్”*

  రిప్లయితొలగించండి
 7. అర్కుని భక్తుం డ గుచును
  కర్కశ హృదయ o బు గల్గి కథ లల్లుచు. దా
  మర్కట మతితో నయ్యె డ
  తర్కo బును జేయ లేడు తత్త్వము జెప్పు న్

  రిప్లయితొలగించండి
 8. తార్కికముగ యోచించును
  కర్కశముగ మాటలాడఁగా నేరఁడు తా
  నర్కునివలె భాసిల్లు, కు
  తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి
 9. తార్కికుఁడాతడెల్లరి వితర్కములన్ బకలమ్ముసేయు తా
  నర్కుని భంగి భాసిలు హృదంతరమందలి జ్ఞానదీప్తితో
  శర్కర కన్న తీయగను సౌరుగ బల్కుచునుండు మూర్ఖపుం
  దర్కము సేయలేఁడు ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 10. కం॥ నర్కుచు నితరుల వాదనఁ
  దర్కము సేయుట వలదనిఁ దగదనిఁ గనుచున్
  గర్కశ వాదన విడువఁ గు
  తర్కంబును జేయలేఁడు తత్వముఁ జెప్పున్

  ఉ॥ నర్కఁగ వాదనల్ పరుల నమ్ముచు శత్రువు లౌదురంచు తాఁ
  గర్కశ రీతులన్ గనక గమ్మున బాధ్యత తోడ నిండుగా
  నర్కుని వోలె సాగునఁట యందరు మెచ్చఁగఁ బాటవమ్ముతోఁ
  దర్కము సేయలేఁడు ఘన తాత్విక బోధను జేయు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 11. అర్కాచార్యుల బోధలు
  నర్కాదులఁ గూర్చి యుండునసమానమునౌ
  కర్కశమౌ సంగతులను గూర్చి
  తర్కమును జేయలేడు తత్వముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి
 12. అర్కుడుసాక్షిగ నుండగ
  కర్కశముగవాదనేల కాంచగ పరమున్
  మర్కటవాదమువీడుచు
  తర్కంబునుజేయలేడు తత్వముఁజెప్పున్

  రిప్లయితొలగించండి
 13. అర్కుని గాంతిని ఁజూడగ
  కర్కశముగ నుండియైన గాంతిని నిచ్చున్
  దర్కముఁజేయుట యొకకళ
  తర్కంబును జేయలేఁడు తత్త్వముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి
 14. అర్కుని గానరాకకనె గాంతిని నిచ్చును లోకమంతకున్
  మర్కట జాతియౌ హనుమ మైధిలి రాకకు కారణంబుగాఁ
  దర్కము శాస్త్రమై యలరి తార్కిక చింతన కాలవాలమౌ
  తర్కము సేయలేఁడు ఘనతాత్త్విక బోధను జేయు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 15. పేర్కొనఁ దగి నట్టి గురువు
  కూర్కొను నాధ్యాత్మికమున గురుతర రీతిన్
  మార్కొని దుష్టుల నెన్నఁడు
  తర్కంబును జేయ లేఁడు తత్త్వముఁ జెప్పున్


  తర్కము నందు నైపుణుఁడు ధాత్రిని సాధు జనైక వర్గ సం
  పర్కుఁడు పూజి తాంఘ్రి యుగ పండిత వర్యుఁడు తిగ్మ సుప్రచం
  డార్క సమాన తేజుఁడు మహాత్ముఁడు వ్యర్థపు టడ్డదిడ్డపుం
  దర్కము సేయ లేఁడు ఘన తాత్త్విక బోధను జేయు నెల్లెడన్

  రిప్లయితొలగించండి