4, మార్చి 2024, సోమవారం

సమస్య - 4695

5-3-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్”
(లేదా...)
“అరిషడ్వర్గము క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధానమై”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

42 కామెంట్‌లు:

 1. కం:
  సరియగు నియమము తోడన్
  విరివిగ సత్కర్మజేయువేదాంతులకు
  న్నెరిగించుచు తమ కీడును
  అరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్”

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. కందం
   పరిపరి విధముల మనుజుని
   గురిచూచుచు పతనమెంచి కూల్చెడివనఁగన్
   నిరసించుచు నదుపున నిడ
   నరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్!


   మత్తేభవిక్రీడితము
   పరిధుల్ దాటుచు నొక్కటొక్కటిగ నిర్భాగ్యాన ద్రోయన్ శిఖన్
   దొరకన్బుచ్చుకు లొంగదీసెడివిగన్ ధుఃఖానముంచున్ గదా!
   నిరసింపన్ ధృడచిత్తమున్ గలుగుచున్ నిర్బంధమై రేగకే
   యరిషడ్వర్గము క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధానమై


   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. హరికినరులై నిరంతర
  హరితలపులచేత ముక్తినందిరి ద్వారుల్
  హరిఁజేర్చి నడపదడపల
  నరిషడ్వర్గమ్ము గూర్చు నాత్మకు హితమున్

  రిప్లయితొలగించండి
 4. మరణమునాదిగభయములు
  అరిషడ్వర్గమ్ముగూర్చె, నాత్మకుహితమున్
  విరియగయోగమునిచ్చెను
  పరిపంథులగెల్చునట్టి భావముమెఱయన్

  రిప్లయితొలగించండి
 5. తఱితోదాడినిజేయగానిలువవేతాదాత్మ్యభావంబుతో
  అరిషడ్వర్గము,క్షేమిచ్చెనుగదానాత్మానుసంథానమై
  పురివిప్పన్గనయోగమున్మనసులోపూతాత్ముదర్శింపగా
  మరుజన్మంబనుమాయలోబడకయున్ మైబాధఁబోఁద్రోచియున్

  రిప్లయితొలగించండి
 6. పరి పరి విధముల హానిని
  యరి ష డ్వర్గ మ్ముగూర్చె : నాత్మ కు హితమున్
  మురిపము లను జే కూర్చును
  హరి నామ స్మరణ మనరె యార్యులు సుకవీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'హానిని నరిషడ్వర్గమ్ము..' అనండి.

   తొలగించండి
 7. నరులనధోగతి పాలుగ
  నరిషడ్వర్గమ్ము గూర్చె ; నాత్మకు హితమున్
  నెరపెను పురజనులందున
  నరుదుగ గూర్మి గలిగించ నారంభించన్

  రిప్లయితొలగించండి

 8. స్థిరమున్ బొందెడు కామమె
  హరిపై మోహంబు పెంచి యనిశమ్మది హె
  చ్చరికల జేసెనె త్రోయగ
  అరిషడ్వర్గమ్ము , గూర్చె నాత్మకు హితమున్.  హరియే సత్యమటంచు నమ్మితిని నిత్యంబాతనిన్ గొల్చుచున్
  స్థిరమున్ బొందగ వచ్చునంచు మదిలో తీవ్రంబుగన్ గోర్కెయే
  పెరుగంగన్ దృఢ చిత్తమయ్యది యికన్ వేటాడి తాకూల్చగా
  నరిషడ్వర్గము, క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధనమై.

  రిప్లయితొలగించండి
 9. ధరలో మిక్కిలి యాశలో మునిగియున్
  ధర్మంబు బాటించకన్
  జరియించజ్ఞుల బాలొర్చుసతతమున్
  సంతాపమాయ్యాయిదే
  అరిషడ్వర్గము , క్షేమమిచ్చునుగదా
  యాత్మాను సంధానమై
  నిరతమ్మెవ్వడు పుణ్యమున్ విడవకన్
  నిక్కంబు తాజేయునో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. *బాలొనర్చు సతమున్* అనండి. 'సంతాపమయ్యా' టైపాటు.

   తొలగించండి
 10. సరియగు మార్గాన్వేషికి
  నరిషడ్వర్గపు నియమము హాయిని గూర్చున్
  పరిపరి విధముల తలపగ
  నరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్

  నరుడైపుట్టిన వానికుండును గదా నాకంబుపై వాంఛలే
  పరమానందమునందుకొన్గ నిడుమా బ్రహ్మంబు పైదృష్టినే
  సరియౌరీతిని హద్దులో నిలుపగా సన్మార్గమే దక్కగా
  నరిషడ్వర్గము క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధానమై

  రిప్లయితొలగించండి
 11. అరిషట్కమ్ము వినాశకారక సమాహారంబు జీవాళికిన్
  విరతింగూర్చదు మానసంబునకు నిర్వేదంబొనర్చున్ హృదిన్
  నిరతిన్ శ్రీహరి నామకీర్తనమునన్ నిస్సంగుడై వీడగా
  నరిషడ్వర్గము క్షేమమిచ్చెనుకదా  యాత్మానుసంధానమై

  రిప్లయితొలగించండి
 12. స్మరణంబున హరినామము
  నిరతిన్ నిస్సంగుడగుచు నిర్మలమతియై
  నరుఁడుండ నెమ్మి, విడువగ
  నరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకుహితమున్

  రిప్లయితొలగించండి
 13. మ.

  గురు సేవార్థిగ మంత్ర తంత్రములతో గోవిందు ధ్యానించెడిన్
  ధరలో మౌనమె దీక్షగా వ్రతము ప్రాధాన్యంబు సన్మార్గమున్
  *అరిషడ్వర్గము క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధానమై*
  సుర లోకంబున జేరు వాడు సుఖుడై చొక్కంగ నెల్లప్పుడున్.

  రిప్లయితొలగించండి
 14. కం॥ వరమగు జీవిత మందున
  నరుగఁగ హరిభక్తిఁ బడసి యనిశము మహిలో
  పరమును గోరుచు విడుచుచు
  నరిషడ్వర్గమ్ము, గూర్చె నాత్మకు హితమున్

  మ॥ వరమౌ జీవిత మందు బుద్ధిఁగని నిస్స్వార్థమ్ముతో ధాత్రిని
  గరుమమ్మున్ విడకుండ ధర్మ పరులై కారుణ్య సంజాతులై
  పరమున్ గోరుచు భక్తితత్పరత సంభావించి స్ఫోటించఁగా
  నరిషడ్వర్గము, క్షేమమిచ్చెను కదా యాత్మాను సంధానమై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   'ధాత్రినిన్' టైపాటు.

   తొలగించండి
  2. ధన్యవాదములండి. అలా మరచిపోవడమో తప్పులు టైపు చేయడమో నాబలహీనతండి. కడుంగడు ధన్యవాదములు

   తొలగించండి
 15. ధరపై మానవ పతనపు
  కరణము మితిమీరినట్టి కాంక్షలు, నీకున్
  త్వరపడి కనుగొన వీడగ
  నరిషడ్వర్గమ్ము, గూర్చె నాత్మకుహితమున్

  రిప్లయితొలగించండి

 16. పరులకు రక్తిని దానము
  విరివిగఁదాఁజేయుచుండి విమలపు బుద్ధిన్
  బరగిన నాజీవాత్మకు
  నరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్

  రిప్లయితొలగించండి
 17. నర లోకమ్మున జనులకు
  నిరంతరధ్యాన మొసఁగ నిఖిలేంద్రియ దు
  ర్భర బల లయమ్ము కూలఁగ
  నరి షడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్


  గురు ఘోరేంద్రియ పాశ బద్ధుల కిలం గ్రూరంపు టుద్దీపితో
  ర్వరి షడ్వర్గము క్లేశ మిచ్చును గదా యాత్మానుసంధానమై
  గురు ఘోరేంద్రియ వర్గ నిగ్రహులకుం గోదండ విధ్వంసితో
  ర్వరి షడ్వర్గము క్షేమ మిచ్చెను గదా యాత్మానుసంధానమై

  రిప్లయితొలగించండి
 18. హరి ద్వేషంబున మున్గి తేలుచును వీరావేశులై నిత్యమా
  హరి నామంబుఁదలంచె దుర్మతులు వైరాగ్రేసరుల్ ద్వారపా
  లురుఁ బూర్వంబున నాశులైరిటను పై లోకంబు దక్కంగనా
  అరిషడ్వర్గము క్షేమమిచ్చెను కదా యాత్మానుసంధానమై

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  హరిపై మనసును నిలుపుచు
  నిరతము స్మరియించుచుండ నీమము తోడన్
  పరమాత్ముని దయ... వీడగ
  నరిషడ్వర్గమ్ము...గూర్చె నాత్మకు హితమున్.

  రిప్లయితొలగించండి
 20. పరులనుమోసముచేయక
  పరహితమునుకోరుకొనుచుపవలున్ రేయిన్
  స్థిరముగహరిని తలచి విడ
  నరిషడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్

  రిప్లయితొలగించండి