3, మార్చి 2024, ఆదివారం

సమస్య - 4694

4-3-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు”
(లేదా...)
“నాన్నకు పెండ్లియంచనుచు నాట్యము జేసిరి పిల్లలిద్దరున్”
(సింహాద్రి వాణి గారికి ధన్యవాదాలతో...)

39 కామెంట్‌లు:

 1. తేటగీతి
  పెంచి పోషించి తలిదండ్రి విద్య నేర్పి
  బ్రతుకు నిచ్చిన భాగ్యాన పరవశించి
  షష్టి పూర్తికి వేదిపై జననిఁ గూడ
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు!


  ఉత్పలమాల
  ఎన్నడు గష్టమున్ గనని యింతటి జీవితమందజేయుచున్
  పున్నమినింపినారలని పూజ్యులుగామది నెంచి ప్రేమతోఁ
  దిన్నగ షష్టిపూర్తి కని దివ్యమనోహర వేదిఁ దల్లితో
  నాన్నకు పెండ్లియంచనుచు నాట్యము జేసిరి పిల్లలిద్దరున్!

  రిప్లయితొలగించండి
 2. తల్లి దండ్రుల ప్రేమలో తనియు చుండి
  పెళ్ళి రోజని తెలియగా ప్రీతి తోడ
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు
  కనుల విందుగ గాంచిరి కన్న వారు

  రిప్లయితొలగించండి
 3. కన్నెపద్మావతీదేవికబడగ
  శ్రీనివాసుని మదిలోనరేఁగెప్రేమ
  వనవసంతుడుమరునితోవంతబాడ
  పిల్లవాడికి నాన్నకుపెండ్లియనుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కంటబడగ... పిల్లలాడిరి" టైపాటు.

   తొలగించండి
 4. అన్నవసంతుడేయచటహంసకుపద్మకు దారిజూపగా
  వెన్నునికన్నబిడ్డడట వేగమబాణమునెక్కుబెట్టెగా
  అన్నులమిన్నమానసమునైక్యమయెంగద శ్రీనివాసుతో
  నాన్నకుపెండ్లియంచనుచు నాట్యముఁజేసిరిపిల్లలిద్దరున్

  రిప్లయితొలగించండి
 5. అమ్మ యడిగిన భూషణమమరలేదు
  మాత చెప్పినట్టి పనులు మరచిపోయె
  జనని వేగ రమ్మనినను జాగు చేసె
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  రిప్లయితొలగించండి
 6. తిన్నదనమ్ములో మరియు తేజము
  లోనను నేర్పునందునన్
  మిన్నగనున్న కన్యలను మిక్కిలి
  చూచెను గాని నేటికిన్
  కన్నియనొక్కతిన్ దుదకు గాంచి సరే
  యనె నిప్పుడాహ! చి
  నాన్నకు పెండ్లియంచునుచు
  నాట్యము చేసిరి పిల్లలందరున్

  రిప్లయితొలగించండి

 7. పెండ్లి వేడుక లనుచును పిలిచి రనుచు
  తల్లిదండ్రులు సుతులతో తరలి రచట
  చూడ ముచ్చటైన ప్రతిభన్ జూపదలచి
  పిల్ల లాడిరి నాన్నకుఁ, బెండ్లి యనుచు.


  ఎన్నడు రాని మాతులయె యింటికి వచ్చెను చేత సంచితో
  కన్నులకింపుగా గలుగు కమ్మని తీయని లడ్డు లెన్నియో
  పిన్నల కందజేయుచును ప్రేమగ చెంతకు జేరి చెప్పగన్
  నాన్నకు పెండ్లియంచనుచు, నాట్యము జేసిరి పిల్లలిద్దరున్

  రిప్లయితొలగించండి
 8. నిండ తండ్రికరువదేళ్ళు నెమ్మితోడ
  షష్టిపూర్తియటంచును సంబ‌రమున
  *“పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు”*
  బంధుమిత్రులనుపిలిచిపరవశాన

  రిప్లయితొలగించండి
 9. ఎన్నివసంతముల్ గడిచె నిప్పటికమ్మకు నాన్నగారికిన్
  చెన్నుగ పాణిబంధమయి, చేసెదమిప్పుడు షష్టిపూర్తికిన్
  మిన్నగ పెండ్లిపెద్దలము మేమయి పెండిలి, మాదు తల్లికిన్
  నాన్నకు పెండ్లియంచనుచు నాట్యము జేసిరి పిల్లలిద్దరున్

  రిప్లయితొలగించండి
 10. తల్లి దండ్రుల రక్షణ తాముపొంది
  కల్లకపటము నెరుగక పిల్లలాడు
  పిల్ల లాటలు గమనింప వింతగొలుపు
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  మన్నన కోరినిల్చిరట మానసచోరుల గుట్టు తెల్పుచున్
  గన్నుల ముందు దేహజులు కాదనరాదను కాంక్షతోడుతన్
  నాన్నయె పెండ్లికొప్పుకొన నాడు కృతజ్ఞత వెల్లడించుచున్
  నాన్నకు, పెండ్లియంచనుచు నాట్యము జేసిరి పిల్లలిద్దరున్

  రిప్లయితొలగించండి
 11. ఉమ్మడింటను బ్రేమలు నూరుచుండు
  మంచి చెడులనేకమగును మారుననక
  పెండ్లి యింట వావి తెలియక వేడ్క చంటి
  పిల్లలాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. "వావి విడిచి" అందామా?

   తొలగించండి
 12. షష్టిపూర్తి మహోత్సవ సమయమందు
  వేడుకగ తల్లిదండ్రుల పెండ్లి చేతు
  మనుచు యానంద మగ్గలమైన వేళ
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  రిప్లయితొలగించండి
 13. తే॥ తల్లియె గతించఁ దండ్రియె పిల్లల నతి
  శ్రద్ధతోఁ బెంచి గొప్పగ నుద్ధరించఁ
  దండ్రికిక పెండ్లిఁ జేయుట తప్పదనుచు
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  ఉ॥ అన్నియు తానై కష్టముల నన్నియు సైఁచుచు శ్రద్ధవీడకన్
  మిన్నగఁ దండ్రి యొక్కఁడటు మేదినిఁ బెంచఁగఁ దల్లి పోవఁగన్
  మన్నన తోడఁ బిల్లలును మానక బెండ్లినిఁ జేయనెంచుచున్
  నాన్నకు పెండ్లియంచనుచు నాట్యముఁ జేసిరి పిల్లలిద్దరున్

  ఇది అరుదుగా జరుగుతున్న (తల్లి పోయిన తరువాత పిల్లలను పెంచుట వరకు) విషయమండి. నాకు తెలిసిన విషయమే వ్రాసాను. కాకపోతే మరిక ఆవయసులో పెళ్ళి చేసుకోలేదండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "అన్నియు తానె... శ్రద్ధ వీడకే" అనండి.

   తొలగించండి
 14. షష్టిపూర్తి దినంబున సరపు దోయి
  నమ్మ నాన్నలి రువురును నిమ్ముగాను
  వేసి కొనుటను గళ్ళార చూసి వారి
  పిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు

  రిప్లయితొలగించండి
 15. చిన్న తనము నుండియు నాన్న నాన్న యంచు
  ముద్దుగఁ బిలువఁ బడ లోకమునకు నయ్యె
  నతఁడు నాన్న వాని వివాహ మందు నెలమిఁ
  బిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు


  కన్న ఋణమ్ముఁ దీర్చికొనఁగం దగు కాలము రా ముదమ్మునన్
  మిన్నగ నుత్సవమ్మును సమీక్షణ ముద్ధతిఁ జేసి చల్పఁగా
  నన్నుల మిన్న యమ్మకు సమంచిత చిత్తకు షష్టిపూర్తిలో
  నాన్నకుఁ బెండ్లి యంచనుచు నాట్యము సేసిరి పిల్ల లిద్దఱున్

  రిప్లయితొలగించండి
 16. మిన్నగు సంతసంబొదవ మేడను శుభ్రముఁజేయఁబోవగా
  గన్నులవిందుగా నచటఁగన్గొని షష్టి పూర్తికిన్
  గొన్నవి వస్తుజాలమును గోరిక హెచ్చగఁదన్మ యంబు తో
  నాన్నకు పెండ్లియంచనుచు నాట్యము జేసిరి పిల్లలిద్దరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "వేడుక షష్టిపూర్తికిన్" అందామా?

   తొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  అరువదేండ్లు తండ్రికి వచ్చెననుచు,షష్టి
  పూర్తి యుత్సవమును జరుపుటకు సంతు
  దండలను దెచ్చి నిడ తల్లిదండ్రులకును
  నొకరి మెడలోన వేయ నింకొకరు, కనుచు
  పిల్లలాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు.

  రిప్లయితొలగించండి