30, మార్చి 2024, శనివారం

సమస్య - 4721

31-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రాందీ సేవింపఁ దొలఁగుఁ బాపౌఘమ్ముల్”
(లేదా...)
“బ్రాందీ త్రాగినఁ దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

16 కామెంట్‌లు:

  1. అందీయందనిమోక్షమందుగురితోనాసక్తిపెంపొందగా
    బంధాలన్నియుద్రెంచిమానసమునీవంచున్విముక్తిన్గనన్
    చిందుల్ద్రొక్కుముసేవనంబురసమున్చిత్తంబువిష్ణంశనా
    బ్రాందీత్రాగినదీరిపోవుగలిలోప్రారబ్ధపాపౌఘముల్

    రిప్లయితొలగించండి

  2. ఎందులకీ పాడలవా
    టందును మిత్రమ సతతము హనుమంతుండా
    సుందర రూపుని, మానుచు
    బ్రాందీ , సేవింపఁ దొలఁగుఁ బాపౌఘమ్ముల్.


    సౌందర్యానను డాతడే శివుడు పంచాస్యుం డతండే కదా
    సందేహమ్మికమాని ముక్తికొరకై సద్భక్తితో వీనులన్
    విందున్ జేసెడి వాని కీర్తనలనే పీయూషమున్, వీడుచున్
    బ్రాందీ , త్రాగినఁ దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధ పాపౌ ఘముల్.

    రిప్లయితొలగించండి
  3. గాంధీ మార్గము తనదని
    బ్రాందీ విస్కీ వలదను పల్కులతోడన్
    బొందిన పదవే కయిపై
    బ్రాందీ సేవింపఁ దొలఁగుఁ బాపౌఘమ్ముల్

    గాంధీమార్గమునన్ చరింతుననుచున్ గంభీర వాగ్దానముల్
    సంధించున్ గెలుపే లభించిన సదా చౌకైన సారాయి తా
    నందించున్ ఘనుడైన నేత! పరమానందంబు సంప్రాప్తమై
    బ్రాందీ త్రాగినఁ దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్


    రిప్లయితొలగించండి
  4. బ్రాందీ సేవనమన్న దుర్వ్యసనమే త్రాగంగనుత్సాహులై
    ఆదాయంబును వెచ్చపెట్టు నటుపై నారోగ్యమాయుష్యులున్
    బ్రాందీ త్రాగిన దీరిపోవు, కలిలో బ్రారబ్ధ పాపౌఘముల్
    సందేహంబులు లేక చుట్టుకొను నాసారాయమున్ త్రాగినన్

    రిప్లయితొలగించండి
  5. నిందలు బలుకుదురు జనులు
    బ్రాందీ సేవింప :: దొలగు బాపౌ ఘమ్ముల్
    పొందుగ గొలుచుచు శంభు ని
    సుందర సురుచిర సుమముల సుమధుర భక్తి న్

    రిప్లయితొలగించండి
  6. గాంధీ పుట్టిన దేశము
    నందున మద్యమును గ్రోల నఘములు గలుగున్
    విందులలో విడువనెలమి
    బ్రాందీ సేవింపఁ దొలఁగుఁ బాపౌఘమ్ముల్

    రిప్లయితొలగించండి
  7. విందుల్ వేడుకలంచు సంతతము నీవిట్టుల్ నిరాళంబుగా
    బ్రాందీ త్రాగకుమయ్య, దుర్వ్యసనమౌరా! స్వాస్థ్యమున్ జాఱ్చురా
    బ్రాందీ త్రాగినఁ, దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్
    నందంబొందగజేయు మానసమునన్ నందాత్మజున్ గొల్వుమా!

    రిప్లయితొలగించండి
  8. కందం
    కుందుచు బాధల సుఖమని
    మందును సేవింప నేల మనుజులు? మది గో
    విందుని నామము, మానుచు
    బ్రాందీ, సేవింపఁ దొలఁగుఁ బాపౌఘమ్ముల్

    శార్దూలవిక్రీడితము
    కుందన్ బాధల ముక్తిఁ బొందు కతనన్ గొంగ్రొత్తగా నేర్చుచున్
    మందున్ గ్రోలుట కాదు సేమమది సన్మార్గాన కష్టించి గో
    విందా యంచు సుధాంబువున్ మిగుల సంప్రీతిన్ దగన్, మానుచున్
    బ్రాందీ, త్రాగినఁ దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్

    రిప్లయితొలగించండి
  9. కం॥ బ్రాందీ త్రాగుట వ్యసనము
    బ్రాందీ త్రావఁగ వృథయగుఁ బైకముఁ దెలుపన్
    నిందింతురు బుధులు నెటుల
    బ్రాందీ సేవింపగఁ దొలగుఁ బాపౌఘమ్ముల్

    శా॥ బ్రాందీ త్రావుచు మత్తునొంది చనఁగాఁ బాడౌద యారోగ్యమున్
    బ్రాందీ త్రావుటకై ధనమ్ము వృథయై బాధించు నెవ్వారినిన్
    బ్రాందీ త్రాగుట పాపమంచు విబుధుల్ వారింతురే యెట్టులన్
    బ్రాందీ త్రాగినఁ దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్

    నేను మద్యపాన వ్యతిరేకినం

    రిప్లయితొలగించండి
  10. కం:మం దింత బడిన యంతట
    నందరితో నిజము బల్కి,యందరి ప్రేమన్
    బొందుట యలవాటగుచో
    బ్రాందీ సేవింప దొలగు పాపౌఘమ్ముల్
    (తాగినప్పుడు నిజాలు మాట్లాడి అందరితో ఎక్కువ ప్రేమ గా ఉండే అలవాటు టుంటే తాగితేనే పాపాలు పోతాయి .)

    రిప్లయితొలగించండి
  11. శా:మందుల్ వాడగ వ్యాథి తగ్గని తరిన్ మా వంగ సన్మిత్రు డా
    నందమ్మీయగ దీర్థ మిచ్చి పలికెన్ నన్ నమ్ము మయ్యా! ప్రణ!
    బ్రాందీ త్రాగినఁ, దీరిపోవుఁ గలిలోఁ బ్రారబ్ధపాపౌఘముల్”
    మందుల్ వెంటనె నీకు సత్ఫల మిడున్ మన్నించు నా మాటలన్.
    (వ్యాథి తగ్గకుంటే బెంగాలీ మిత్రుడు రాముడి తీర్థం ఇచ్చాడు."ప్రణబ్! రామ్ దీ"అన్నాడు.రాం ది అనాలి కానీ దీ ఎందుకు దీర్ఘ మైంది?అంటే ఏమి?అనే పదాన్ని కొన్ని సార్లు ఏమీ అన్నట్టు అది,ఇది అనే పదాలని ఎంఫటిక్ గా చెప్పేటప్పుడు అదీ,ఇదీ అంటూ ఉంటాం.పైగా అతను బెంగాలీ కనుక కొంత యాస ఉంటుంది.)

    రిప్లయితొలగించండి
  12. తొందరగ రోగ మబ్బును
    బ్రాందీ సేవింపఁ ; దొలఁగుఁ బాపౌఘమ్ముల్
    స్కందుని సేవించగనే
    చందమిటుల మనుజులందు సాగును గదరా

    రిప్లయితొలగించండి
  13. యతి ప్రాసాక్షరములను మార్పక యన్యభాషాపదమును సవరించి కూర్చిన పూరణము:

    అందెల్ ఘల్లన నాట్య మాడుచును బ్రహ్లాదాది రక్షో బృహ
    త్సందోహం బిల మున్నిషేవణమునన్ సాధింపరే ముక్తినిన్
    సందేహింపకు విష్ణు నామ రస మన్ స్వచ్ఛంపుఁ బానీయ మీ
    మందుం ద్రాగినఁ దీఱిపోవుఁ గలినిం బ్రారబ్ధపాపౌఘముల్

    రిప్లయితొలగించండి
  14. చెందున్ హంసల కోవనంచు ప్రజ జేజేల్కొట్టి పూజించ ధా
    త్రిం దాన్ దైవమె యంచుదెచ్చి యొక దుర్నీతున్, సురన్ ద్రావుచున్
    చిందుల్వేయుచుఁ జిక్కి, చెప్పె నిది మీచింతల్ వెసన్ దీర్ప, నే
    బ్రాందీ త్రాగిన దీరిపోవు గలిలో ప్రారబ్ధ పాపౌఘముల్

    రిప్లయితొలగించండి
  15. మందుడవైపోదువిలను
    బ్రాందీ సేవింప,దొలగుపాపౌఘమ్ముల్
    సందియమొందకనాగో
    విందునికొలువంగసతమువినుమిది పుత్రా

    రిప్లయితొలగించండి