11, మార్చి 2024, సోమవారం

సమస్య - 4702

12-3-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్”
(లేదా...)
“రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీనరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

43 కామెంట్‌లు:

  1. రథమన వచ్చు మనమునే
    పథముయు లేక పరుగులిడు పాయకనెపుడీ
    కథ విన్ననూహల మునిగి
    రథి లేకనె స్యందనమ్ము రయముననేగెన్

    రిప్లయితొలగించండి
  2. మథనముసేయగశాస్త్రము
    పథమునుపెట్టగపరుగులు బండియువచ్చెన్
    సతమునుకృత్రిమమేథను
    రథిలేకనుస్యందనమ్మురయముననేగెన్

    రిప్లయితొలగించండి
  3. మథనంబెంతయుజేసివిజ్ఞులునువేమారుల్విచారంబునున్
    పథమున్జూపిరివిశ్వమంతకునుతాభాగ్యంపుటాలోచనన్
    కథనంబీవిధిసాగెమేథయునుసాకల్యంబుసంకేతమై
    రథిలేకుండగనేగెస్యందనము తీవ్రంబైనవేగంబునన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    మధుసూదనుని వరించిన
    వధూటి, శివకామిని గుడి ప్రక్కన వేచన్
    పథకమనఁ గొన హరి నడుప
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    మత్తేభవిక్రీడితము
    మధురావాసుని రుక్మిణీలలన సంభావించి నర్చింపఁగన్
    విధమున్ దెల్పిన విప్రునిన్ సిరుల సంప్రీతిన్ గటాక్షించియున్
    పథకమ్మున్ వివరించి, రుక్మిణిఁ గొనన్ వార్ష్ణేయుఁడున్ సాగగన్
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    రిప్లయితొలగించండి
  5. రథమున్ బోలు మనమ్ము యేరథియు సారథ్యంబు లేకుండనే
    పథమున్ లేక విహారముల్ సలుపు సంభాళించు నింపాదినీ
    కథనాలించిన దేలె నూహల మమేకమ్మౌచు నీపట్టునన్
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    రిప్లయితొలగించండి

  6. కథ చెప్పిరిటుల రుక్మిణి
    వ్యథ తీర్చుచు నామెనికను పరిణయ మాడన్
    రథమెక్కగ కృష్ణుడు సా
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్.


    కతగా చెప్పెను తల్లి పుత్రులకు సత్కార్యమ్మదే రుక్మిణీ
    వ్యథనున్ దీర్చుటె యంచు యాదవుడు తానానం దమున్ బొందుచున్
    రథమున్ జేరుచు కాలిడన్ గనుచు ధారాటమ్ములే వేగ సా
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్.

    రిప్లయితొలగించండి
  7. పృథసుతుని వాహనము సా
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్,
    కథనము బాగున్నది, యే
    పథకము చందమున యిట్లు పడవన జరిగెన్

    రిప్లయితొలగించండి
  8. పృథివీపతి యుత్తరుడే
    రథము దిగి పరుగిడెనట త్రసనము తోడన్
    రథి వెంబడఁ బార్థుడు సా
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    కథకుండే వివరించె నుత్తరునికే కంగారు తీవ్రంబునై
    రథమున్ వీడుచుఁ బాఱె కౌరవపటాలంబున్ విలోకించుచున్
    రథ సారథ్యము సేయుచున్న నరుడే రక్షింప వెంటాడ సా
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కందంలో 'వెంబడ'?

      తొలగించండి
    2. ఉత్తరుని పార్థుడు వెంబడించగా అనేఅర్థంలో వాడాను గురూజీ

      తొలగించండి
  9. వ్యథ తో నుత్తరుడు దిగగ
    ప థ మును వీడక విజయుడు
    పౌరు షమున దా
    మ థ న పడ క పోరు కు సా
    ర థి లేక యె స్యంద నమ్ము రయ మున నే గె న్

    రిప్లయితొలగించండి
  10. పృథపుత్రుండు కిరీటి యస్త్రచయమున్ విక్రాంతుఁడై సంధిలన్
    రథికుల్ కేతనముల్ రథంబులనిఁ నేలంగూలెఁ బ్రాజ్యమ్ముగా
    వ్యధితుండై కురువీరుడొక్కఁడు రథంబందుండగా నిస్పృహన్
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ రథమగు సంసారమిలను
    పథమగు వృద్ధినిఁ బడయుట భగవద్కృపయే
    వ్యథలను బాపి పథముఁ గన
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    మ॥ రథమే సంసృతి పోషణై చనును సారాంశమ్ము దెల్పన్ సఖా!
    పథమే వృద్ధినిఁ బొందుటై చను భువిన్ బ్రారబ్ధ కర్మంబిదే
    వ్యథలన్ ద్రుంచఁగ దేవదేవ కృపకై ప్రార్థించి సంధించఁగన్
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    సారథులు భార్యాభర్తలండి

    రిప్లయితొలగించండి
  12. పృథసుతుఁడు సంగరమ్మున
    రథముల రథికులనుగూల్చ ప్రాజ్యమ్ముగ నా
    రథమున రథి కూలఁగనే
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    రిప్లయితొలగించండి
  13. కం:రథికున కొక యుద్ధము లో
    విధి వశమున శిరము త్రెగగ వేగ తురగముల్
    ప్రథితమ్ముగ సాగె నకట !
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    రిప్లయితొలగించండి
  14. మ:కథలన్ బూర్వము గొప్పగా పరగు సంగ్రామ్ముల దెన్నడే
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్?
    బుధులౌ శాస్త్రవిదుల్ కనుంగొనగ నంభో వీధి లో నొక్క సా
    రథియే లేక విమానముల్ నడచు సంగ్రామంబు నే డౌ గదా!
    (మానవరహిత యుద్ధవిమానాలు నేడు కనుగొన బడినాయి.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'సంగ్రామంబులం దెన్నడే' టైపాటు.

      తొలగించండి
  15. పథికులు దారిని బోవుచు
    రథమును గళ్ళారఁజూచి రక్తిని బలికెన్
    మధురానగరము దారికి
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేగెన్

    రిప్లయితొలగించండి
  16. కథలందు లోకులకు సు
    ప్రథితుం డగు చందమామఁ బరికింపంగా
    మథియించి మదులఁ బంపఁగ
    రథి లేకయె స్యందనమ్ము రయమున నేఁగెన్


    కథితోద్ధండ పరాక్రముండు నిజ రక్షా స్ఫూర్తి లంకాపురీ
    పథ సద్యో గమనోన్ముఖుండు నయి యభ్యామర్ద రాజన్మహా
    రథి పౌలస్త్యుఁడు త్రోల రామ శిత నారాచైక ఘాతుండు సా
    రథి లేకుండఁగ నేఁగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్

    రిప్లయితొలగించండి
  17. రథమున్ జూచినబాటసారియనె నారాటంబుఁబెంపొందగా
    రథి లేకుండగ నేగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్
    బథముల్ జూడగ బాగులేవిచట యేమార్గంబుఁబోఁజూతురో
    మధురావాసపు దారిజూడగను సన్మార్గంబుగాఁదోచెడిన్

    రిప్లయితొలగించండి
  18. 4వపాదము
    మధురా పట్నపు
    గాచదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి

  19. పథమునరథమునిలిపిసా
    రథిదిగనశ్వములెరిగినరహదారనుచున్
    పృథివినివడివడిగనుసా
    రథిలేకయె స్యందనమ్మురయముననేగెన్

    రిప్లయితొలగించండి