2, మార్చి 2024, శనివారం

సమస్య - 4693

3-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్”
(లేదా...)
“పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్”
(అయ్యగారి కోదండరావు గారికి ధన్యవాదాలతో...)

42 కామెంట్‌లు:

 1. కానగసంఘంబందున
  మానని వైరము పదవికి మైకొనియుండన్
  ఏనికయౌగాహీనుడు
  పీనుగుతరుశాఖపైకివేగమెయెక్కెన్

  రిప్లయితొలగించండి
 2. కాననము వెళ్ళెనొక్కడు
  పూనికతోదేను గట్టె పుల్లలువడిగా
  తానట పులిని గని, పిరికి
  పీనుగ తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కాననమున కేగె నొకడు.." అనండి.

   తొలగించండి
 3. మానండప్పుడుసౌబలుండుగనగా మారాజుతోడెంచుటన్
  కానండాయెగకౌరవుండుహృదిలోకార్చిచ్చుమామాయెగా
  ఆనంజేసెనునిర్ణయంబునకటా హానిన్గనన్రాజ్యమే
  పీనంగెక్కెనువృక్షశాఖనటనుద్వృత్తిన్ జవంబొప్పగన్

  రిప్లయితొలగించండి
 4. కందం
  పేనఁగ భేతాలుడు కథ
  మౌనము వీడిచు బదులిడ మాన్యుడు రాజై
  యానతి దప్పెననుచు నా
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్!

  శార్దూలవిక్రీడితము
  పేనంగన్ గథనొక్కటిన్ బదులుకై భేతాలుఁడున్, విజ్ఞుఁడై
  మౌనంబున్ విడి విక్రమార్క ప్రభువే మాటన్ సమాధానమున్
  దానందింపఁగ దప్పుచున్ నియమమున్ దర్కమ్మునన్ బద్ధమై
  పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 కందంలో రెండవపాదము లో సవరణ: వీడిచు బదులు వీడుచు

   తొలగించండి
 5. కం:
  ఏనుగును గని భయపడెను
  తాను, పరుగెత్తి చేరె తరువట గురిసెన్
  వాన, గనెను తొర్రనుగల
  పీనుగు! తరుశాఖపైకి వేగమె యెక్కెన్”

  రిప్లయితొలగించండి
 6. మానుగ భేతాళు ని గొని
  మౌనపు విక్రము డు తాను మా టా డ వెసన్
  జానుగ నెగిరివెడలి యా
  పీనుగ తరుశాఖ పైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి

 7. వానిని దాచగ వలెనని
  యేనాడైనను విడువని యీ యస్త్రములన్
  పీనుగుగ మార్చినంతనె
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్.


  మ్రానున్ జేరుచు పల్కె సోదరులతో మాన్యుండు ధర్మజ్ఞుడే
  యేనాడున్ విడనట్టి యస్త్రములనే యీనాడు నిచ్చోటిలో
  పీనుంగై యగుపించురీతి నిట దాపెట్టంగ మేలంచనన్
  పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్.

  రిప్లయితొలగించండి
 8. దీనుడతడు బతుకుటకయి
  మ్రాను పయిన కట్టినట్టి మఱువలను చేరన్
  దోని ధనమొంద నా నడ
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  నడపీనుగు = నడచుశవము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "మఱువల జేరన్" అనండి

   తొలగించండి

 9. నేనిక ప్రశ్నింతు సమా
  ధానము తెల్పుమని అడగ దక్షుడు తెలుపన్
  మౌనము భంగమయెననుచు
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్.


  మౌనమ్మందున సాగు రాజునడిగెన్ మాన్యుండ వంచున్ సమా
  ధానమ్మిమ్మని ప్రశ్నజేయనదియే తా జెప్పగా నంతటన్
  మౌనంబయ్యది భగ్నమయ్యె ననుచున్ మన్నేడి స్కందస్సుపై
  పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్.

  రిప్లయితొలగించండి
 10. కానగ వృక్షంబు పయిన
  పీనుగులో దాగియుండు భేతాళుండే
  మౌనము భంగంబొనరగ
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  తానే పీనుగునావహించి మను భేతాళుండు వృక్షంబుపై
  తానే ప్రశ్నలఁ సంగడించి విధిగా తాఱించు మౌనంబునే
  నానా రీతుల కల్పనల్ చదివితిన్ నాబాల్యమందే యిటుల్
  పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్

  రిప్లయితొలగించండి
 11. మేనుఁ బెరిగెనేనుగు వలె
  హాని కలుగునన్న లావునావిరి చేయన్
  పీనుగు వలె చిక్కగనా
  పీనుగు తఱుశాఖపైకి వేగమె ఎక్కెన్

  రిప్లయితొలగించండి
 12. పూనికతో తానడిగిన
  పానలు దీర్చంగరాజు బదులిచ్చుటకై
  మౌనము విడచిన తోడనె
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  (పానలు= సందేహము)

  రిప్లయితొలగించండి
 13. మౌనంబున్ విడనాడకన్ చలముతో క్ష్మానాథుఁడా మ్రానుపై
  పీనుంగున్ తన మూఁపునందుగొనఁగా బేతాళుఁడా రాజుకున్
  మౌనంబున్ విడనాడజేయ నడిగెన్ మాన్యంపు సందేహమున్
  పీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్

  రిప్లయితొలగించండి
 14. కం॥ మానక నుత్తర మొసఁగుచు
  మౌనము వీడఁగ నధిపుడు మరిమరి విధిగా
  నానతిఁ దప్పితి వనుచును
  బీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  శా॥ కానంగాఁ గలికాల చోద్యమగునో కాదో మరేమాయయో
  సూనమ్మాయె మనంబుఁ జూడగ నటుల్ శుద్ధమ్ముగా భీతితోఁ
  బీనుంగెక్కెను వృక్షశాఖ నట నుద్వృత్తిన్ జవంబొప్పగన్
  నేనిశ్చేష్టుఁడ నైతి లేవమనె నానిక్కంపుటాలప్పుడే

  రిప్లయితొలగించండి
 15. కం:బాణమ్ముల,శస్త్రమ్ముల
  పీనుగు రూపమ్ము జేసి వృక్షము పైనన్
  దానిని పాండవు లుంచిరి
  పీనుగు తరు శాఖ పైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి
 16. శా:ప్రాణమ్ముల్ కబళించుచున్,దివి కి శాపమ్మైనదౌ నుప్పెనన్
  దీనమ్మై విలపించె సీమ,కన నీ దృశ్యమ్మె యెచ్చో గనన్
  పీనుం గెక్కెను వృక్షశాఖ నట, నుద్వృత్తిన్ జవం బొప్పుచున్
  బ్రాణాధారపు బంట నిచ్చు దివికిన్ బ్రాప్తించె నా కష్టముల్.
  (దివి సీమ ఉప్పెన లో మృతకళేబరాలు చెట్ల పై ఉన్న దృశ్యాలు అనేకం.)

  రిప్లయితొలగించండి
 17. మానున గలభే తాళుఁడు
  పీనుగు పైనావహించి వేయగ ప్రశ్నల్
  మౌనమె రాజ్యముఁజేయగ
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి
 18. ఊనంగ విక్రమార్క ధ
  రా నాథుం డంచి తోత్తరం బీయంగం
  దా నడిగి నట్టి ప్రశ్నకుఁ
  బీనుఁగు తరు శాఖ పైకి వేగమె యెక్కెన్


  వానల్ దగ్గిన వేళ లందు నిజ సత్వంబుం బ్రదర్శింపఁగా
  మానం జాలక రక్తి నాడు ననుకంపం గోఁతి కొమ్మంచినిం
  గోనల్ గొండలు తిర్గుచుండి వడి సద్గోత్రుండు జ్యేష్ఠుండు రా
  పీనుం గెక్కెను వృక్ష శాఖ నట నుద్వృత్తిన్ జవం బొప్పఁగన్

  రిప్లయితొలగించండి
 19. వీనులలరంగనునుపా
  ఖ్యానము వినిబదులొసంగగాంచుచు మదిలో
  నానందమునొందుచునా
  పీనుగు తరుశాఖ పైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి
 20. నా పూరణ ప్రయత్నం..

  కానలనొక చెట్టు మొదట
  పానము బోయిన మిడతను బట్టెను చీమల్,
  దానిని మహిజము కీడ్చగ
  పీనుగు తరుశాఖపైకి వేగమె యెక్కెన్

  రిప్లయితొలగించండి