28, మార్చి 2024, గురువారం

సమస్య - 4719

29-3-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై”
(లేదా...)
“సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

38 కామెంట్‌లు:

  1. హరితోడునువిడనాడెను
    పురివైకుంఠంబువదలి భూరమతానే
    తఱితోవేంకనవెలసెను
    సిరివీడినవాడెచెలగుశ్రీమంతుండై

    రిప్లయితొలగించండి
  2. కందం
    పరదారాసక్తి, మరియు
    పరరాజ్యానుభవములవి పతనమ్మెంచున్
    ధర స్వార్జితుఁడు, పరులదౌ
    సిరి వీడిన, వాఁడె చెలఁగు శ్రీమంతుండై

    మత్తేభవిక్రీడితము
    పరదారన్ గొనితెచ్చి రావణుఁడొకో ప్రాణాలు గోల్పోయెనే
    పరరాజ్యంబును రాజరాజు గొనుచున్ వంశమ్ము గోల్పోయెనే
    నిరతమ్మున్ శ్రమియించి స్వార్జితమునన్ నిశ్చింత నన్యమ్మునౌ
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    రిప్లయితొలగించండి
  3. సురిగెన్లక్ష్మియుమౌనిచేతలకు నీసుంబొందివైకుంఠమున్
    తఱితోవిష్ణువుశ్రీనివాసుడుగనాదైవంబువేంకన్నయై
    తిరువీథిన్ప్రజగావగావరదుడైతీర్చంగబాధల్ భువిన్
    సిరినిన్దూరముబెట్టువాడెచెలగున్ శ్రీమంతుడైయెప్పుడున్

    రిప్లయితొలగించండి
  4. మ.

    సురలన్ వేడగ స్వర్గలోకమునకై శోభిల్లి సంప్రాప్తిగా
    విరివిన్ దానము జేసి రాజులిలలో విఖ్యాతి పుణ్యమ్ముతో
    మరుజన్మంబును వీడి ముక్తి గొనుటన్ మాన్యంబు నైశ్వర్యమే
    *సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్.*

    రిప్లయితొలగించండి

  5. విరివిగ ధనమును పొందుటె
    పురుషార్థము కాదటంచు ముక్తిపథము కై
    పరమాత్ముని సేవించుచు
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై.


    పరిబర్హమ్మును బొందనేల నిక కైవల్యమ్ము నేపొందుటే
    పురుషార్థంబని యెంచి తా విడుచుచున్ భోగమ్ములన్ నిత్యమున్
    బరమానందుని సేవలో మునుగగన్ బంధాలనే రోయుచున్
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  6. క్రమాలాంకారంలో --
    ధర పేద గ యగు నెవ్వడు?
    మెరుగగు వాణిజ్య మందు మేటిగ ధనముల్
    కరముగ గూడ గ నేమగు?
    సిరి వీడిన వాడె :: చెలగు శ్రీ మంతు o డై

    రిప్లయితొలగించండి
  7. సరవిని విడనాడి మనుజు
    డరిషడ్వర్గమ్ము లనెడు నాటంకములన్
    సరగున నన్యాయార్జిత
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై

    రిప్లయితొలగించండి
  8. హరివాసమునన్ దన్నెను
    పరమాత్మను భృగు మహర్షి వక్షము పైనన్
    మరియాపై గమనింపగ
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై

    పరిశీలింపగ వచ్చినాడు భృగువే బ్రహ్మాదులన్ విష్ణువున్
    హరినే తన్నెనతండు రొమ్ముపయినన్నాకస్మికావేశమున్
    సిరి తాఁవీడెను విష్ణుమూర్తి గృహమున్ చింతాత్మయై! కన్గొనన్
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    రిప్లయితొలగించండి
  9. పురమున గల గుడి వెలుపల
    కరములు జాచి య డఃగుకొను క్రకరము బట్టన్
    కొరతగు టెరిగియు పైస వి
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై

    రిప్లయితొలగించండి
  10. మత్తేభము:
    సరవిన్ మచ్చరమాది షట్కముల సంసర్గంబు వర్జించి యే
    మరకన్ దైవమునందు ధ్యానమిడి సన్మార్గంబునన్ బోవుచున్
    స్థిరమౌ చిత్తముతో నిరంతరము సచ్ఛీలుండునై బాహ్యమౌ
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    రిప్లయితొలగించండి
  11. కం॥ వరమగు మనుజ జననమున
    వరదుని సేవయె సిరియని పరఁగుచు భువిలో
    మరువక ధర్మము ధనమను
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై

    మ॥ సిరికిన్ జెప్పకఁ బ్రోచు వాని కృపయే శ్రీమంత మెవ్వారికిన్
    సిరి తానై హరి వెంటనుండ ఘనమౌ శ్రేయంబుఁ బ్రాప్తించదా!
    హరియే సర్వమటంచు భక్తిఁ గని ధర్మాధర్మ తజ్ఞుండునై
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    మొదటి రెండు పాదములలో సిరి లక్ష్మీదేవి
    4వ పాదములో సిరి ఐశ్వర్యమండి

    రిప్లయితొలగించండి
  12. కం:చొర బడితివి నాటకముల
    మరి మీసము తీయ వేల మంకుతనమునన్ ?
    వెరువకు, నాటకముల మగ
    సిరి వీడినవాఁడె చెలఁగు శ్రీమంతుండై”
    (నాటకాల లోకి వచ్చిన వాళ్లు గడ్డాలు,మీసాలు తీసేస్తారు.అవసరాన్ని బట్టి పెట్టుడు గడ్డాలు,మీసాలు,విగ్గులు పెడతారు.)

    రిప్లయితొలగించండి
  13. మ:సిరిపై రంథిని బెంచుకొంచు తనకే సేమమ్ము కానట్టి తెం
    పరి,యన్యాయపు రీతులన్ బడయ కొంపల్ గూలు,సద్వృత్తి తో
    తిరమౌ రీతిగ వృద్ధి నొంద వలె ,నీతిన్ బూనుచున్ నల్లనౌ
    సిరినిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్”
    (నల్లనౌ సిరి=నల్ల ధనము,బ్లాక్ మనీ)

    రిప్లయితొలగించండి
  14. (3)కం:వెరువకు పేడి యనుచు మగ
    సిరి వీడిన వాడె చెలగు, శ్రీమంతుండై
    గరువము నొందెడు కురుపతి
    విరువ గదలు సారథియును భీభత్సుండే!
    (ఇక్కడ ధ్వని.నీ సారథి మగసిరి లేని పేడి అని భయపడకు.అతనూ భీభత్సుడే అనేసింది సైరంధ్రి.ఎలాగూ యుద్ధం చెయ్యబోయేది భర్త ఐన అర్జునుడే అని ఆమె ఊహ.ఆ సంతోషం లో అర్జునుడి బిరుదులలో ఒకటైన భీభత్సుడు అనే బిరుదుని చెప్పేసింది.అజ్ఞాత వాసం కనుక అర్జునుడు అనెయ్య కూడదు.కానీ ఆపుకో లేక భీభత్సుడు అనేసింది.మరి ఉత్తరుడికి అర్థం కాదా! అంటే అవక పోవచ్చు.భీభత్సం చేసే వీరు డెవరైనా భీభత్సుడు కావచ్చు కదా!అతను అలాగే ఊహిస్తాడు.)

    రిప్లయితొలగించండి
  15. పరమాత్ముని శ్రీనాథుని
    గురు వాత్సల్యమ్ముఁ జూఱకొన్న నరుండే
    సుర లోకమ్మున, ధరలో
    సిరి వీడిన వాఁడె, చెలఁగు శ్రీమంతుండై


    అరవిందాక్షుఁడు వల్కెనే స్వయము నిత్యారాధ్యులే భూసురుల్
    ధరలో నంచుఁ దదీయ విత్తములనుం దాఁకంగ రా దేరికిం
    బెరుమాళ్లింపుగ నిత్యముం గొలుచు నా విప్రాలిఁ దర్జింప రా
    సిరినిన్ దూరము వెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. సిరికిన్ లోపము లేక తృప్తిగను నే సేమంబు గా నుండ నం
    దఱకున్ స్నేహముఁబంచినే గొనుచు శాతంబందుచున్ నీవు నా
    దరికిన్ లోభమ! యేలచేరితివొ? తత్బాంధవ్యు లేకాకిఁ జే
    సిరి, నిన్ దూరముఁ బెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్

    రిప్లయితొలగించండి
  17. వందేళ్ల తెలుగు సాహిత్యం నుంచి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణ వ్యాసాలు , ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచిన వెయ్యి పేజీల గ్రంథం "కవన గర్బరాలు".. అమెజాన్ లో అందుబాటులో ఉంది. వెల ఆరువందల రూపాయలు.. సంపాదకులు చేపూరి సుబ్బారావు వి.కె.ప్రేంచంద్


    Book Brochure link: https://kavanagarbaralu-telugubook.blogspot.com/2024/01/blog-post.html


    Thank you...

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పరుల ధనము నాశించక
    నిరతము దానముల జేసి నిస్వార్ధముతో
    విరివిగ నన్యాయార్జపు
    సిరి వీడినవాడె చెలగు శ్రీమంతుండై.

    రిప్లయితొలగించండి