*(కీచకుడు మరణావస్త లో తనలో తాను అనుకున్న పలుకులు)*
మానస మందున కుటిలము తో నను రమ్మని పిలువగ తొందర పడితిన్ బ్రాణము మీదకు వచ్చెను మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్.
కాముకు లైన కొందరి వికారపు చేష్టల కారణమ్ము తో భామలు మోసపోయి విధి వంచితలై తమ పొట్టకూటికై క్షేమము కాని మార్గమును చేరి గణేరుజయైన యట్టి యా కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ.
*(కీచకుడు మరణావస్త లో తనలో తాను అనుకున్న పలుకులు)*
రిప్లయితొలగించండిమానస మందున కుటిలము
తో నను రమ్మని పిలువగ తొందర పడితిన్
బ్రాణము మీదకు వచ్చెను
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్.
కాముకు లైన కొందరి వికారపు చేష్టల కారణమ్ము తో
భామలు మోసపోయి విధి వంచితలై తమ పొట్టకూటికై
క్షేమము కాని మార్గమును చేరి గణేరుజయైన యట్టి యా
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ.
తేనెలు కురిపించే నెర
రిప్లయితొలగించండిజాణల నవ్వు బడవేయు జంబాలమునన్
సోనలబడి ముణగకుమీ
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
కం॥ నేనొక మానిని నవ్వఁగ
రిప్లయితొలగించండిమానస మందు మరులుఁగొని మనువాడంగన్
బూనెను బాధ్యత లెన్నియొ
మానిని చిరునవ్వదియె ప్రమాదముఁ దెచ్చెన్
ఉ॥ ఏమనిఁ దెల్పఁగా వలయు నెవ్వరి తోడను బంచుకొందునో
నామది దోఁచె నవ్వుఁ గని నారి మదమ్ముగఁ బ్రేమ నాటఁగన్
భామను పెండ్లి యాడఁగను బాధ్యత లెన్నియొ మోసి డస్సితిన్
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
కర్నాటకలో సుప్రసిద్ధ హాస్య విదూషకులు శ్రీ గంగావతి ప్రాణేశ చెణుకు ఆధారంగా
కర్నాటకలో సుప్రసిద్ధ హాస్య విదూషకులు శ్రీ గంగావతి ప్రాణేశ ఛలోక్తి
తొలగించండిరస్తె యల్లి అవళు కండళు
నన్న నోడి నక్కళు
నమగీగ ఇబ్బరు మక్కళు
దారిలో ఆమె కనిపించింది
నన్ను చూసి నవ్వింది
మాకిప్పుడు ఇద్దరు పిల్లలు
తెలుగులో భావము
భామలలోననింత చెలువంపు లతాంగిని గాంచమెచ్చటన్
రిప్లయితొలగించండితామరసాక్షి మల్లియల దామము కొప్పుననుంచి మత్తుగా
కాముని పూశరంబులను కమ్రముగా నిగిడించె నవ్వులన్
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
ఏమరు పాటుచే యురగ మెత్తిన ప్రాణము చేటుగల్గదే
రిప్లయితొలగించండిపాములు కాటువేయవు యపాయము గల్గక యున్నచోనెడన్
కామిని తీరు వేరరయ కారణమేలను కాటు వేయగన్
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
లేనిది యున్నట్లు కనుచు
రిప్లయితొలగించండితానచ్చెరువై కురుపతి తబ్బిబ్బు పడెన్
గానట నవ్వెను ద్రౌపది
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
భామినినవ్వెగామయసభన్ గురుభూపతి కాలుజారగా
లేమయె కారణంబనిరి రెచ్చిన కచ్చకు మొగ్గరంబుకున్
గోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
క్షేమకరంబుకాదనుచు చెప్పిరి పెద్దలు చిత్తగింపుమా
కందం
రిప్లయితొలగించండిహానికర కురుక్షేత్రమ
యోనిజ నవ్విన కతనను యోధులఁ గూల్చెన్
వేణుధరు గీత సాక్షిగ
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
ఉత్పలమాల
భామిని ద్రౌపదీ లలన ఫక్కున నవ్విన వంకఁ బేనఁగన్
సేమము కాదు కాదనుచు శ్రీకరుఁడాడిన సంధి వీడుచున్
నీమవిహీన లౌకికము నెగ్గిన యుద్ధము గూల్చె వంశమున్
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
గానము సలుపుచు నుండగ
రిప్లయితొలగించండిఆ నెలతి ననుగని నవ్వ , నానం దమునన్
మేను మరువ గతీ తప్పెను,
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
మౌనముగా వేణువుపై
రిప్లయితొలగించండిగానము వినిపించెడుశుభ ఘడియలయందున్
సూనాస్త్రుని శరమట్టుల
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
కానక యెదురుగ వచ్చెడు
రిప్లయితొలగించండియాన వరమ్మును జరింప నలవోకగఁ దా
నా నాతిని వీక్షించుచు
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
ఈ మహి మాన వావలిని నేరిని గాన మచంచలాత్ములం
గామ విహీన పూరుషులఁ గాన మసత్యము నిందు సుంతయున్
వే మన మందు మత్తిలఁగ వేదన తోడుతఁ గంపనమ్ములం
గోమలి మందహాస మది కో విడు, కన్న! ప్రమాదమే సుమీ
[కోవు + ఇడు= కో విచ్చునట్టి; కోవిడు మందహాసము; కోవు = ఆర్పునం దగు ధ్వన్యనుకరణము]
చాన యొ కర్తు నను గనుచు
రిప్లయితొలగించండికను గీటుచు సై గ చేయ కామిత ముగ నే
దానిని జేరగ న య్యె డ
మానిని చిరు న వ్వ ది యె ప్రమాదము దె చ్చె న్
మానినియేకద యనుకొని
రిప్లయితొలగించండిమానమునే వదలి యామె మనసును దోచన్
గనివిని యెఱుగని విధముగ
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్
కోమలి మందహాసమది కోవిడు కన్న ప్రమాదమే సుమీ
రిప్లయితొలగించండికోమలి చూపులున్ విషమె కోమలినామము సున్నితంబునౌ
కోమలు గొంతమందిలను గోమలమైనమనంబు గల్గియున్
గోమున పేదసాదలకు కోరిక లన్నియు తీర్చు చుందురే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
(దుర్యోధనుని స్వగతం)
మౌనము నుండక నన్నవ
మానపరచె పాండవ సతి మయసభ
యందున్
తాననుభవించె ఫలితము
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్.