26, మార్చి 2024, మంగళవారం

సమస్య - 4717

27-3-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్”
(లేదా...)
“శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనంబున విశ్రమించెఁ దాన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

32 కామెంట్‌లు:

  1. సవనంబాయెగ జీవిత
    మవగాహనలేకనడచు మావటివోలెన్
    నవకంబొప్పిననిజశై
    శవమున్గనిబాటసారిశాంతుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. నవనవలాడుయౌవ్వనము నాలుగురోజులముచ్చటౌనుగా
    అవగతమాయెజీవితముహంగులుపొంగులునీటిరాతలే
    శివచరణమ్ముజాడగనిసేవనుజేయునకాముకుండుశై
    శవమునుగాంచిపాంథుడుప్రశాంతమనంబునవిశ్రమించెతాన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    భవభయ హరు బృందావని
    వివశత్వము బొందు నటుల వెన్నుని లీలల్
    వివరింపగ ప్రతిమలు శై
    శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్!

    చంపకమాల
    కువలయనేత్రునిన్ మధుర గోకులమందలి పుష్పవాటికన్
    వివశమునొందఁ జూడఁ గడు వేడ్కను సాగుచు కృష్ణలీలలన్
    వివరము సేయు బొమ్మలవి ప్రీతిఁ దలిర్పఁగఁ జెప్ప శౌరి శై
    శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనంబున విశ్రమించెఁ దాన్!

    రిప్లయితొలగించండి
  4. అవనిని పుట్టు మానవుల
    కందరకున్ శ్రమజీవనంబులో
    నెవరికి గష్ట నష్టముల నెల్ల
    భరించుక తప్పదోయి యే
    నవతలు లేక జీవితము నమ్ముము
    గడ్పుచునుండు నట్టి శై
    శవమును గాంచి పాంథుడు ప్రశాంత
    మనంబున విశ్రమించె దాన్.

    రిప్లయితొలగించండి
  5. అవసరమై యొకండు జనె నావలి ప్రోలుకిర్లు క్రమ్మినం
    తో వెదకె నాశ్రయంబునది దక్కె వినంబడె దొంగ దొంగ కే
    క వెఱపరౌచు నక్కి గనె కావలివానిని తేఱి ద్వారమున్
    శవమును గాంచి పాంథుడు ప్రశాంత మనంబున విశ్రమించెదాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు దోషాలు ఉన్నవి సవరించండి

      తొలగించండి
  6. జవనముగ నింటి కివెడల
    నవధిని జేరగ నట నొకడవరో ధించన్
    నెవరా యనగ నతని శై
    శవముం గని బాటసారి శాంతుం

    రిప్లయితొలగించండి

  7. కవికుల తిలకుండాతం
    డవసర మున్నదనుచు నపరాహ్నపు వేళన్
    జవమున నడుచుచు నట కే
    శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్.


    కవికుల శ్రేష్ఠుడొక్కడట గాముల మేటి ప్రచండుడౌచు దీ
    దివి సెలకట్టెలన్ విసురు దిష్టము యానము జేయు నత్తరిన్
    సవుని ప్రతాపమందునిక సాగగ లేనను వేళలోన కే
    శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనంబున విశ్రమించెఁ దాన్.

    రిప్లయితొలగించండి
  8. స్తవమునుచేయుచుగుడిలో
    వివశతతోగనుచు శ్రీశు విగ్రహమచటన్
    శివమునుగూర్చెడు హరిశై
    *"శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్”*

    రిప్లయితొలగించండి
  9. దివమున నర్కతేజమతి తీక్ష్ణముగా చెలరేగుచుండ వే
    సవి వడగాడ్పులత్తరిని చండముగా పొలయింప నూష్మమున్
    చవిగొనలేక భూజముల ఛాయను శ్రాంతమునొందబోవకే
    శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనంబున విశ్రమించెఁ దాన్

    రిప్లయితొలగించండి
  10. పవనము దక్కక యాత్రను
    కవివరుడొక్కడు చవిగొనె కష్టములెన్నో
    చివరకు సరస్సునందున
    శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్

    వివరములేల యాత్రయని వేసవి కాలములో ప్రయాణమై
    కవివరుడొక్కరుండు పడె కష్టము లెన్నియొ నీటికోసమే
    చివరకు దప్పితీర్చుకొను చింతయె తీర సరస్సుసందునన్
    శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనంబున విశ్రమించెఁ దాన్

    శవము = జలము

    రిప్లయితొలగించండి
  11. జవముగ గమ్యము జేరగ
    ప్రవిమల భక్తి యు ప్రపత్తి ప్రాభవ మొప్ప న్
    నవ విధ కీర్తన తో కే
    శవ ముం గని బాటసారి శాంతిo బొందె న్

    రిప్లయితొలగించండి
  12. దివమున నర్కుని తేజం
    బవఘళముగ పరిగొనంగ నలమటపడునా
    యవసరమందున నొక కే
    శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. కం:ఠవఠవ బడి యగ్గిన వే
    సవి లో నీరమ్ము లేక సాగుచు నుండన్
    జవి తో చల్ల నొసగు కే
    శవమును గని బాటసారి శాంతుం డయ్యెన్.
    (చవి=ఉప్పు.చల్ల=మజ్జిగ.ఉప్పు కూడా వేసిన మజ్జిగ ఇస్తున్నాడు.)

    రిప్లయితొలగించండి
  14. కం॥ పవనము శూన్యము గ్రీష్మమొ
    యవధులఁ గాంచని ప్రకాశమలరి బడల్చన్
    జవసత్వములు కృశించఁగ
    శవముం గని బాటసారి శాంతు డయ్యెన్

    చం॥ పవనము శూన్యమై పరఁగ పాంథుని దాహము హెచ్చఁ దాపమో
    యవధులఁ గాంచకన్ జనుచు నారడి వెట్టఁగ డస్సి పోవఁగన్
    భవుని నమస్కరించి తన బాధను దీర్చఁగ వేడు నంతలో
    శవమును గాంచి పాంథుఁడు ప్రశాంత మనంబున విశ్రమించెఁ దాన్

    శవము జలము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  15. చం:వివర మెరుంగమిన్ పురపు వీధుల జూచుచు పాంథు డేగగా,
    నెవడొ బకాసురాఖ్యు కథ నేర్పడ జెప్ప వెరంగు జెందె, నా
    హవమున భీముడా బకుని నంతము జేయగ నాడె , వానిదౌ
    శవమును గాంచి పాంథుడు ప్రశాంతమనమ్మున విశ్రమించె తాన్.
    (ఎవడో బాటసారి యల్ టి సి లాగా బయల్దేరి ఏకచక్రపురవీధులు చూస్తూ తిరుగుతున్నాడు.ఇంతలో ఎవడో ఆ పట్నం లో ఉన్న బకాసురుడి సంగతి చెప్పాడు.బాటసారి భయ పడ్డాడు.కానీ ఆ రోజే భీమసేనుడు వాణ్ని చంపాడు.ఆ శవాన్ని చూసి బాటసారి శాంతం గా విశ్రమించాడు.)

    రిప్లయితొలగించండి
  16. అవిరళ సాంద్ర తర తరు ప
    రివృతగ్రామమ్ము సేరి హృద్యమ్మును బాం
    ధవు గృహమున నెద నిజ శై
    శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్


    కవియఁగ నొక్క యాశ్రమముఁ గానన సీమను జేసి భక్తినిన్
    సవినయ సప్రపత్తి ముని చంద్రున కంజలి స్వీయ సుప్రభా
    ఛవులను వెల్గ రమ్యముగ సన్ముని ధామము నిర్మ లాపగా
    శవమును గాంచి పాంథుఁడు ప్రశాంత మనంబున విశ్రమించెఁ దాన్

    [శవము = జలము]

    రిప్లయితొలగించండి