29, మార్చి 2024, శుక్రవారం

సమస్య - 4720

30-3-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్”
(లేదా...)
“భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

19 కామెంట్‌లు:

  1. శక్తినిసీతనుజూచుచు
    రక్తుడునైరావణుండురాగములొలుకన్
    సక్తినినింపుచునాతడు
    భక్తిగవీక్షింపనామెభగభగమండెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    యుక్తము గాదని శివుడన
    సక్తతఁ జని తండ్రి నింద సతి యోర్వక తా
    ముక్తిఁగన గుండమునఁబడి
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    ఉత్పలమాల
    యుక్తము గాదనన్ బిలువకుండగఁ బోవుట భర్త త్ర్యక్షుడున్
    సక్తత యజ్ఞశాలఁజని సంబరమెంచియుఁ దండ్రి నిందలన్
    ముక్తిని బొందనెంచి సతి బోరున నేడ్చుచు దూకి గుండమున్
    భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే!

    రిప్లయితొలగించండి
  3. యుక్తము కానట్టి నుడుల
    వ్యక్తపరచి దక్షుడచట బన్నపరచ నా
    శక్తియె దేవత లెల్లరు
    భక్తిగ వీక్షింప, నామె భగభగ మండెన్


    యుక్తమె తండ్రి చేసెడు మహోన్నత యజ్ఞము గాంచుటంచు నా
    శక్తియె యేగినంతట ప్రజాపతి గర్వము దూలపుచ్చగా
    పక్త సృజించు కొంచు సతి భార్గవి యచ్చటనున్న దేవతల్
    భక్తిగఁ జూచినంతటనె , భగ్గున మండెను గాదె యామెయే.

    రిప్లయితొలగించండి
  4. ముక్తినిగోరిగొల్లడునుమోహమువీడెనుకాళిగొల్వగా
    శక్తినినింపెనామెయును, షండునికంతకవిత్వమబ్బెగా
    భక్తినిజూచినంతనె, భగ్గనిమండెనుగాదెయామెయే
    సక్తినిరాక్షసుండుగనసంగరమందునమృత్యుదేవతై

    రిప్లయితొలగించండి
  5. భక్తులు నాదరంబునను ప్రస్తుతి
    జేసిన సంతసంబునన్
    శక్తికొలంది వారలకు చక్కని
    మార్గము జూపుచున్ సదా
    రక్తితొ బోధజేయు కొమరాలును
    గాంచినొకానొకండు దు
    ర్భక్తిగ జూచినంతటనె భగ్గున
    మండెను గాదె యామయే.

    రిప్లయితొలగించండి
  6. శక్తి గ మారియు పితనే
    యుక్తి గ నెదిరింప లేక ను క్రో ష ము నన్
    ముక్తి ని బొంద o గ సురలు
    భక్తి గ వీ క్షింప నామె భగభగ మండె న్

    రిప్లయితొలగించండి
  7. వక్తలు దమలో తననొక
    భక్తిగ వీక్షింప ; నామె భగభగ మండెన్
    మౌక్తికము వంటి రచనలు
    భక్తి సలుపునటుల దాను వ్రాసితి ననుచున్

    భక్తి = భాగము , సేవ

    రిప్లయితొలగించండి
  8. శుక్తపు పలుకుల తోడ సు
    యుక్తుని దక్షుండు దూఱ నుమయే దూకెన్
    ముక్తిన్ బడయగ వహ్నిని
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    యుక్తము కాదు వద్దనుచు నుగ్రుడు తెల్పెను భార్య గౌరికిన్
    సూక్తుల లక్ష్యమున్ గనక చొచ్చెను పార్వతి యజ్ఞశాలకున్
    రక్తి విహీనుడైన సుతి రట్టడితో హవమందు దూకి స
    ద్భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  9. భుక్తిని కోరు లేమలు సమున్నత స్థాయిని జేరు గాని యే
    యుక్తము లేని మందులు నయోగ్యుల చేతల నొచ్చు నట్లునో
    ముక్తి పథంబునేగదగు పోకిరి వృద్ధుడు వెఱ్ఱి చేష్టలన్
    భక్తిగ జూచినంత భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  10. కం:"భక్తుడు తలి దండ్రుల, కను
    రక్తి యె తన పైన లేని రాయి,యితండున్
    వ్యక్తియె!"యని భర్త పితరు
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    రిప్లయితొలగించండి
  11. రక్తిగ యాగమునకుఁ జని
    వ్యక్తముగా తండ్రి పతిని యవమతి బరుపన్
    ముక్తిన్బొందఁగ కుండముఁ
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    రిప్లయితొలగించండి
  12. ఉ:యుక్తమె భర్త పోవగనె యోచన జేయక భార్య యగ్నిలో
    ముక్తికి వోలె దూకు? టది మూర్ఖత యంచు దలంప కెల్లరున్
    రక్తము లేని రాల వలె రక్కసులంబలె యగ్గి వెట్టుచున్
    భక్తిగ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామె యే !
    (సతీసహగమనదురాచారాన్ని గూర్చి.)

    రిప్లయితొలగించండి
  13. కం॥ త్యక్తముఁ జేసిన నతఁడను
    రక్తిని వెంటపడి చనఁగ రమణిని యటులన్
    భక్తుడఁ గరుణించ మనుచు
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    ఉ॥ శక్తికి మారుపేరతివ సాహస మేలను జేయఁగావలెన్
    యుక్తిని వీడ స్త్రీ మనము యోధుని కైన నగోచరంబిలన్
    ద్యక్తముఁ జేసినన్ దెలివి తానటు పొందక ప్రేమ మైకమున్
    భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  14. రక్తిగ దక్షయజ్ఞము కరాళిక గాంచగనేగి యచ్చటన్
    సేక్తను దూఱ జన్మదుడు సేకమెలర్చగ గుండమందునన్
    ముక్తముగాఁగ బంధములు మోక్షమునొందఁగ దూకి చెచ్చెరన్
    భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  15. యుక్తమె మన్నింప రుషా
    సక్త దురాత్మను రవంత శాంతము గనమే
    రిక్తగ నను నిందించెను
    భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్

    [వీక్షింపను + ఆమె = వీక్షింప నామె]


    యుక్తమె మోసగింప మది నూహ వహించుట యేరి కైన నా
    శక్తి గలట్టి వానిఁ గన శక్యమె యెందును భూ తలమ్మునన్
    భక్తుఁడ నంచు నెంచు నని భాగ్యద లక్ష్మిని దుష్ట భావ భృ
    ద్భక్తిగఁ జూచి నంతటనె భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  16. రక్తపు బంతులై కనులు ప్రాకటమైన వధూటిఁ గాంచియే,
    శక్తియె గోచెరించెనని సాధకుడైన వరుండు ధాటిగా
    సూక్తము లేవొపాడుచును శోభన రాత్రము మందిరమ్ములో
    భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే

    రిప్లయితొలగించండి
  17. యుక్తము కాదటంచు పతి యొప్పుగ చెప్పిన శంభు మాటలన్
    శక్తియు నాలకించకను సాగెన యజ్ఞము చూడగాను నా
    సక్తిని చూపకున్నపిత, శాంతత వీడుచు యజ్ఞ కుండమున్
    *“భక్తిగఁ జూచినంతటనె భగ్గున మండెను గాదె యామెయే”*

    రిప్లయితొలగించండి