21-3-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్”
(లేదా...)
“కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్”
(లేదా...)
“కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)
అన్నులమిన్నగనుండెడు
రిప్లయితొలగించండిచిన్నదితరుమగవయసునుజేజియుకాగా
మిన్నగజెప్పెనుబాల్యము
కన్నెననుచు నవ్వయెనయగారములొలికెన్
అవ్వ తన మనుమరాలి తో......
రిప్లయితొలగించండికందం
మన్ననగలగిన వరుఁడే
తిన్నఁగ నినుమెచ్చ సిగ్గు తెరలు సహజమౌ!
మున్నిట్టులె తాతఁ గనిన
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్!
ఉత్పలమాల
మన్ననలందెడున్ వరుడు మంచితనంబున వెల్గువాడనన్
దిన్నగ నిన్నుమెచ్చ మది తీయఁగ నూయలలూగ సాజమే
మున్నిటులే ననున్ వలచ ముద్దుల తాతయ సిగ్గుమొగ్గనౌ
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే!
చెన్నగనవ్యమున్దవిలి చేరకనాథునితల్లియయ్యెగా
రిప్లయితొలగించండిపన్నుగయందచందములబామ్మయలంకృతిశోభనందెనే
మిన్నగవైద్యమున్గదిసిమేనికిశస్త్రచికిత్సజేసెగా
క న్నెనునేనటంచునయగారపుఁబల్కులఁబల్కెనవ్వయే
రిప్లయితొలగించండినిన్ను వలచితి నటంచును
వెన్నుని ప్రాణసఖుడైన విజయుని తోనా
యన్నువ యూర్వశి వలచితి
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
వెన్నుని ప్రాణమిత్రుడగు వీరుడు కవ్వడి కడ్మి గాంచుచున్
నిన్ను విరాలిగొంటినని నే విరహమ్మును తాళలేనురా
మన్ననతో వరించుమని మానిని యూర్వశి పల్కె నిట్టులన్
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే.
(కురు వంశజుడైన పురూరవుని భార్య కనుక అర్జునునకవ్వయె ఆమె)
ఉ.
రిప్లయితొలగించండిసన్నని మేను గల్గి కడు చంగము చొప్పడు సౌష్ఠవమ్ముతో
వన్నియ బాఢమై చదువు బాధ్యత హెచ్చిన వృత్తిలో బడెన్
కన్నెఱికమ్ము బోయె, కొమ, కాంక్ష వివాహము స్థావిరమ్మునన్
*కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే.*
కన్నెలు గుమిగొని యామెను
రిప్లయితొలగించండిమిన్నగ మందాకిని యని మేలము సలుపన్
చెన్నుగ నలంకరించుకు
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
కన్నులు చారెడుండగ ముఖమ్ము విశాలము బూరె బుగ్గలున్
రిప్లయితొలగించండిసన్నని రూపుకున్పసిడి ఛాయ తలన్పువు చెండ్లఁ దాల్చినో
చిన్నది నిల్చె నద్దమును చెన్నుగఁ జూపుచు నా పటమ్ములో
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే
పిన్నవయస్సు నందు తన ప్రేమను పంచిన వన్నెగాని సం
రిప్లయితొలగించండిపన్నమె యడ్డుగోడయి విపన్నము సేయగనామె యర్మిలిన్
కన్నెగనుండిపోయె చిరకాలము, వార్ధకమందు గూడ తా
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే
చిన్నతనంబున నన్గని
రిప్లయితొలగించండియన్నులమిన్నయని పొగిడిరందరు రయమున్
గన్నియ లందున మేలగు
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
కన్నులముందునున్న ననుగాంచి సదా మదిహాయినిండగా
నన్నులమిన్నయంచు కొనియాడిరి పల్వురు బాల్యమందునన్
మిన్నగనెంచబడ్డ పలు మేలగు కన్నియలందు యోగ్యమౌ
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే
వెన్నెల లో నే నుండగ
రిప్లయితొలగించండిదిన్న గ కబురులను జెప్పు దివ్యా త్ముడు దా మిన్న గ ప్రేమించె నపుడు
కన్నె ననుచు నవ్వ యె నయ గారము లొలి కెన్
పిన్నవయసు నందున తా
రిప్లయితొలగించండినన్నులమిన్నల నడుమన నగ్రగ ననుచున్
వన్నెల వీవన ననుచును
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
కం:న న్నెవ రాక్షేపించెద?
రిప్లయితొలగించండిరన్నెము పున్నెం బెరుగని యవివాహిత నే
ఎన్నడు పూవుల విడువని
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్”
(పెళ్లే కాలేదు కనుక ఎప్పటికీ కన్యే.)
ఉ:న న్నిట దూరదర్శనమునన్ గడు గుర్తున నుంచి యెంతయున్
రిప్లయితొలగించండిమన్నన జేయ మెచ్చితిని,మాతనొ,బామ్మనొ నేడు !నేటికిన్
మున్ను ధరించినట్టి వగు ముద్దుల పాత్రలు నిల్చె ,జ్ఞప్తిలో
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే”
నున్నని యద్దపు చెక్కిలి
రిప్లయితొలగించండిప్రన్నని వెన్నెలను బోలు ప్రవిమల వదనం
గున్నేనుగు పదగతిగల
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
చెన్నింత యేని తగ్గక
రిప్లయితొలగించండియున్నట్టి నెలంత నారయుఁడు నన్నిట నే
నెన్న నఱువ దేండ్ల వయసు
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
అన్నుల మిన్న నేను మును యౌవన మందు గణించి చూడఁగా
సన్నని మేను పద్మ నిభ చారు తరాస్యము తోడ వెల్గఁగాఁ
జెన్నుగ వాసి కెక్కిన విశేష పరాక్రమ రాజ వంశపుం
గన్నెను నే నటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే
మిన్నగు నొయారములతోఁ
రిప్లయితొలగించండిగ్రన్ననఁ దాపలుకు చుండి కమ్మని పలుకుల్
అన్నుల మిన్నను వినుదా
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్
కన్నులు సోయగంబలర కాంతులు సిమ్ముచు నెల్లదిక్కులన్
రిప్లయితొలగించండిమిన్నగు దేహసౌష్ఠవము,మేనున గంధపు పూతయున్
జెన్నువు మీరగాఁబలికెఁ జెంగట నుండెడు వారితో
కన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ఎన్నడు పెండ్లిని తలచక
కొన్నేండ్లకు పిదప తనకు కోరిక కలుగన్
కన్నును గీటి యువకునికి
కన్నెననుచు నవ్వయె నయగారము లొలికెన్.
చెన్నుగపెండ్లిసమయమున
రిప్లయితొలగించండిసన్ననిజఘనమ్ముతోడచక్కగనొప్పన్
సన్నుతిచేసిరపుడునే
కన్నెననుచునవ్వయెనయగారములొలికెన్.
కం॥ అన్నుల రత్నము తానని
రిప్లయితొలగించండిమిన్నగు సంబంధములను మెచ్చకఁ బోవన్
గన్నెగ బ్రదుకున మిగలఁగఁ
గన్నెననచు నవ్వయె నయగారము లొలికెన్
ఉ॥ అన్నుల రత్న మంచు నొక యాఁడుది యందము నెంచి గర్వమున్
మిన్నగఁ గాంచి తానటుల మెచ్చక జవ్వని పెండ్లి చూపులన్
గన్నెగ నుండి పోవఁగను గాంతయె బెట్టును వీడకుండఁగన్
గన్నెను నేనటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కెఁ నవ్వయే
నిన్న ఈరోజు బెంగుళూరులో లేనండి. 2 గంటల క్రితమే వచ్చాను. అందుకనే ఆలస్యం.