19, మార్చి 2024, మంగళవారం

సమస్య - 4710

20-3-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్”
(లేదా...)
“యత్నము సేయువారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

 1. రత్నాకరమదిసాహితి
  పత్నిగనుండునునియతికి భావనసేయన్
  నూత్నమునౌగద పాఠకు
  యత్నమ్ముననేర్తుమొక్కొవ్యకరణమ్మున్

  రిప్లయితొలగించండి

 2. రత్నము కాదతడొక ని
  ర్యత్నకుడని పేరుగాంచె నాతడు కదనే
  రత్నమ్మా యిష్టపడక
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్ ?


  పత్నికి చెప్పుచుండెనొక భర్తయె పుత్రుని గూర్చి నిట్టులన్
  రత్నమటంచు నెంచి యనురాగము జూపుచు బెంచుకొన్న ని
  ర్యత్నకుడాతడే వినుమొ యంగన యిష్టమునే నటించుచున్
  యత్నము సేయువారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా.?

  రిప్లయితొలగించండి
 3. పత్నిగవాక్కుపార్వతియుపాయకనుండుగసాంబునయ్యెడన్
  నూత్నముగాగభావములనోడకశంభుడుసార్థకండునౌ
  రత్నముతారహారములరంజితమౌగదకాంచనంబుతో
  యత్నముసేయువారలకువ్యాకరణమ్మిసుమంతవచ్చునా

  రిప్లయితొలగించండి
 4. కందం
  రత్నాకరమంతటిదన
  నత్న సుధాకరుల సాక్షి నమితమ్మనగన్
  నూత్నమ్మనగన్ గించిత్
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్?


  ఉత్పలమాల
  రత్ననిధిన్ స్ఫురింపునని ప్రాజ్ఞులు సెప్పఁగ సత్యమే సుమా!
  అత్న సుధాకరాలిదగు నాకశమంతననంతమంచనన్
  నూత్నముగా గ్రహింప నొక నోమగు కాదన స్వల్పమైనదౌ
  యత్నము సేయువారలకు వ్యాకరణమ్మిసుమంత వచ్చునా?


  (అత్నుడు = సూర్యుడు)

  రిప్లయితొలగించండి
 5. నూత్న విధా నము వలనను
  పత్నికి నేర్పింప దొడగె పటు తర యుక్తి న్
  పత్నియు బలికెను బతిగని
  "యత్నమ్ము న నేర్తు మొక్కొ వ్యాకర ణ మ్మున్?"

  రిప్లయితొలగించండి
 6. యత్నమె యన్నిటికి వలయు
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్
  నూత్నముగ నిటుల నడుగకు
  యత్నమె తగు దేనికైన నవజితి పొందన్

  రిప్లయితొలగించండి
 7. యత్నము నీదగ సాధ్యము
  రత్నాకరమును యశస్సు రంజిల్లంగన్
  యత్నము మానవ నైజము
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్

  రిప్లయితొలగించండి
 8. కం॥ కృత్ను యగు సుకృతముఁ బొదవి
  హత్నువుఁ గృష్ణుడు కనకయె యధముల నణఁచెన్
  రత్నము రాయియు సమమా
  యత్నమ్మున నేర్తు మొక్కొ వ్యాకరణమున్

  ఉ॥ హత్నువు వీడి కృష్టుఁడటు హానినిఁ గాంచెనె కౌరవాళికిన్
  కృత్నుయగున్ గృపాకరుఁడు క్షిప్తముఁ జేయఁగ భాగ్య సంపదై
  రత్నము కాంతి పుంజముల రాజిలు చుండుఁ దనంత తానుగా
  యత్నము సేయువారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా?

  కృత్ను నైపుణ్యంగా పనిచేయువాడు
  హత్నువు ఆయుధము

  ఏదైన ప్రతిభతో పట్టుబడుతుందనండి

  రిప్లయితొలగించండి
 9. రత్నాభరణమ్ములతో
  పత్నిని మెప్పించగలుగు పతి ధన్యుండౌ
  నూత్నోత్సాహము కఱపడు
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్

  రత్నము వెల్వరించుగద రంగుల కాంతులు చూడనింపుగా
  ప్రత్నపు రీతులన్ విడిచి లక్ష్యము గెల్చుట సాధ్యమేకదా
  పత్నికి దూరమై నిలిచి పట్టుగ నేర్వగ శ్రద్ధ లేనిదౌ
  యత్నము సేయువారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా

  రిప్లయితొలగించండి
 10. రత్నాకరమున పేత్వము
  యత్నమ్మున సాధ్యమయ్యె నమరులు వొందన్
  యత్నమె కీలకము, వినా
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్?

  రిప్లయితొలగించండి
 11. యత్నము సేయు వారలకు వ్యాకరణమ్మిసుమంత వచ్చునా
  యత్నము సేయకిట్లఱచ న్యాయమె శిక్షణ సాధనమ్ములున్
  చేత్నము దెచ్చు నెల్లరకిసింత యుపాయమునంది నేర్చినన్
  నూత్న తలంపులూరు వినూత్న ప్రయోగముద్భవించగన్

  రిప్లయితొలగించండి
 12. కం:రత్నమ్ము తెలుగె కానీ
  నూత్నగతుల నాంగ్ల మనెడు నూతిని బడగా
  పత్ని తెలుగు నేర్వ మనును
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్!

  రిప్లయితొలగించండి
 13. ఉ:నూత్నపథమ్ములన్ బడి తెనుంగును వీడితి,నాంగ్ల మెంచితిన్
  పత్నికి నాంధ్ర మిష్ట మయి పద్యము వ్రాయు మటంచు బోరు, నే
  యత్నము జేయ వ్యాకరణ మంతయు దప్పును ,నేడు క్రొత్తగా
  యత్నము సేయు వారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా?

  రిప్లయితొలగించండి
 14. రత్నమువోలె మల్చనగు ఱాయిని యత్నమొనర్చి మానవుల్
  యత్నమె కీలకమ్మరయ నన్నివిధంబుల కార్యసాధనన్
  నూత్నపథమ్మునన్జనక నూకలు చెల్లిన ప్రాఁత పద్ధతిన్
  యత్నము సేయువారలకు వ్యాకరణమ్మిసుమంత వచ్చునా

  రిప్లయితొలగించండి
 15. యత్న మవశ్యము గావలె
  యత్నమున కసాధ్య మెద్ది యవనిం దలఁపన్
  నూత్న విధానమ్ముల ఘన
  యత్నమ్మున నేర్తు మొక్కొ వ్యాకరణమ్మున్


  రత్న చయోదరీ తలము రాజవరేణ్య సురక్షితంబు గాన్
  నూత్నతమప్రయోగ సుమనోజ్ఞ విధాన పరంప రోన్నతిన్
  యత్న పరాత్మ మర్త్యులకు వ్యాకరణం బది బ్రహ్మ విద్యయే
  యత్నము సేయు వారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా

  [ఇసుమంత వచ్చునా? కాదు కొండంత వచ్చు నని భావము]

  రిప్లయితొలగించండి
 16. యత్నముఁజేయుట మనవిధి
  యత్నమునన్బనులుసుసాధ్యంబౌసుమ్మీ
  యత్నముఁజేతను నిదియును
  యత్నమ్మున నేర్తుమొక్కొ వ్యాకరణమ్మున్

  రిప్లయితొలగించండి
 17. యత్నము సేయువారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా
  యత్నము సేయువారిలను నైక్యతతోడను జేయఁగోరుచో
  రత్నము లైనఁబొందనగు గ్రామరు వచ్చుట యేమి కష్టమౌ
  యత్నము లోననుండువిధి యాయన యిచ్చును గుండె ధైర్యమున్

  రిప్లయితొలగించండి