10, మార్చి 2024, ఆదివారం

సమస్య - 4701

11-3-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్”
(లేదా...)
“కాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్”
(సి.వి. సుబ్బన్న శతావధాని పూరించిన సమస్య)

32 కామెంట్‌లు:

 1. కాయలుఁ గాచు తరువులకుఁ
  కాయలుఁ గాచు తృణములకు కడఁ ఫలములునా
  దాయమిడుఁ గాని వేర్లకు
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 2. ఊయలయందునబిడ్డడు
  సాయమురాడుగపితకును షండుడుకాగన్
  ప్రాయముకల్మషమెంచగ
  కాయలుగాచినవిపండ్లుగావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 3. న్యాయంబెంచనికౌౌరవాదులనినాయాసంబుఁజూపట్టగన్
  ప్రాయంబందునచిన్నవానినకటావారించిరేక్రూరతన్
  పాయన్ఁజేసిరిపార్థుపుత్రునయయోపద్మంపుచక్రంబులో
  కాయల్గాచినవెన్నడైనఫలముల్గాబోవునిక్కంబుగన్

  రిప్లయితొలగించండి
 4. పాయని వేడికి మ్రగ్గుచు
  కాయము గుల్లగను మారి కడు గాసిలు చున్
  మాయని రీతిగను జెమట
  కాయలు గాచినవి పండ్లు గావె న్న టికిన్

  రిప్లయితొలగించండి

 5. నేయుల యింటికి బోవగ
  సోయగమును పెంచుకొనగ సుంతమ లామున్
  పూయగ ముఖముపయి బలు
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 6. కందం
  శ్రేయమని వీరతిలకమ
  జేయునిగఁ బతిఁ గన దిద్ది జిద్దున కంపెన్
  రాయంచ యుత్తర! కనుల
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్! !

  శార్దూలవిక్రీడితము
  మాయన్ బన్నిన తమ్మిమొగ్గరమునే మార్తాండునిన్ బోలి స్వ
  ల్పాయుష్కుండభిమన్యుడున్ జిదుమబోవంగన్ నిరీక్షించుచున్
  శ్రేయంబెంచగఁ బత్ని యుత్తరయె, నిర్జీవుండనన్, గన్నులన్
  గాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్

  రిప్లయితొలగించండి

 7. మాయింట బెరడు లోనను
  మా యనుజుడు మోజుపడుచు మ్రాకుల నెన్నో
  వేయగ కొబ్బరి చెట్టుకు
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్.


  ప్రాయంబంతయు భోగ భాగ్యముల యారాటమ్ము తో సాగగన్
  నీయాలోచన లేకపోయెను గదా నిర్గ్రందుఁ మన్నింపుమా
  కాయంబిప్పుడు క్రుంగుచుండె నికపై కైవల్యమున్ గోరుచున్
  నాయుల్లంబున నిల్పినిన్ గొలిచెదన్, నానేత్రముల్ జూడగా
  కాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్.

  రిప్లయితొలగించండి
 8. వేయక మొలచిన మొక్కే
  చేయని కృషిఁ బొటకరించి చెట్టుగ మారెన్
  కాయాపండాయన టెం
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాయంబెంతటిదైనఁ జూడ వలయున్ గన్నుల్ సదా స్పష్టతన్
   రేయైనన్ బగలైనఁ గాంచ కనులే లేకున్నచో నొక్కటే
   మాయాలోకము కానరాదుకద సంభావింపగా కన్నులే
   కాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. శ్రేయంబున్ మదినెంచి బాలకుని సంక్షేమమ్ముకై తండ్రియే
  ప్రాయంబంతయు కాయకష్టముల సంపాదించగన్ రూకలన్
  హేయంబౌ వెసనంబులన్ సుతుఁడహో హీనుండుగా మారెనే
  కాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్

  రిప్లయితొలగించండి
 10. ప్రాయంబంతయు శ్రమతో
  శ్రేయము గూర్చఁగ సుతుండు రేయింబవలున్
  హేయఁపు వెసనములఁ బడెను
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 11. తోయము నిచ్చియు జనులకు
  పాయక దాహంబుదీర్చు పరమోన్నతమౌ
  తీయని నీరుడు కొబ్బరి
  కాయలు గాసినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. కం॥ న్యాయము విడి పాలకులిల
   మాయలు పన్నుచుఁ బ్రజలను మాలిమి చేయన్
   బూయఁగ నాశలు కన్నులఁ
   గాయలు కాచినవి పండ్లు గావెన్నటికిన్

   శా॥ న్యాయంబెంచని పాలకుల్ ఘనముగా నమ్మించ వాగ్దానముల్
   మాయామర్మము నింపి చేతురటులన్ మాధుర్య మొప్పారఁగన్
   బూయించంగ జనాళి యిచ్చల నిలన్ బొంకంబుతోఁ కన్నులన్
   గాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్

   మాయమాటలు ఔతుందేమో నని మాయామర్మముకు శార్దూలములో మార్చినానండి
   (తప్పులు లేకుంటే యిది నడుస్తున్న చరిత్ర అండి)

   తొలగించండి
 13. కం:నాయన!మామిడి చెట్లకు
  కాయలు కాచినవి పండ్లు గా మారె గదా!
  యే యద్భుతమో! కొబ్బరి
  కాయలు కాచినవి పండ్లు కా వెన్నటికిన్.
  (చిన్న పిల్లవాడు ఆశ్చర్యం తో తండ్రి తో అంటున్నట్లు.)

  రిప్లయితొలగించండి
 14. శా:కాయన్ జొచ్చితి నీ రసాల తరులన్ కష్టమ్ము నే నొర్చుచున్
  కాయ మ్మెంతయు కృంగె సత్ఫల మిడన్ కాలమ్ము కా లడ్డె నా
  కాయత్నమ్ము ఫలమ్ము నీదు,విఫల మ్మై రాలె నీ గాలికిన్
  కాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ కాబోవు నిక్కమ్ముగన్

  రిప్లయితొలగించండి
 15. తీయగ నుండును బండ్లని
  వేయఁగ మాపొలములోన బ్రీతిని దానిన్
  సాయీ!యదేమి వింతయొ
  కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 16. వే యుష్ణం బడరంగం
  బాయక నిస్సంశయముగఁ బరికింపంగా
  నాయతముగ నఱకాళులఁ
  గాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్


  ఏయే వేళల నివ్విధం బవనిలో నేపారు నా వేళలన్
  జాయాస్యాంబుజ దివ్య దర్శన మహా సందిగ్ధ సంతాప ధౌ
  రేయాక్షిద్వయ మార్తి మిక్కుటముగా రేఁగన్ నిరీక్షింప వే
  కాయల్ గాచిన వెన్నఁ డైన ఫలముల్ గాఁ బోవు నిక్కంబుగన్

  రిప్లయితొలగించండి
 17. సాయీ!చూచితె? వింత యీయది యహో శాఖాంత రాళంబు నన్
  వేయిం చొప్పున కాయ లెన్నియొ దగన్ వ్రేలాడు రీతింగనన్
  మాయంజేయువి ధంబుఁదోచెను మదిన్ మర్మంబు గానయ్యెడిన్
  గాయల్ గాచిన వెన్నడైన ఫలముల్ గాబోవు నిక్కంబుగన్

  రిప్లయితొలగించండి
 18. సాయముగనుండవలసిన
  నాయజమానియిలువీడియరిగినయఃతన్
  జాయకువెతతో కన్నులు
  కాయలుగాచినవిపండ్లుగావెన్నటికిన్

  రిప్లయితొలగించండి