24-3-2024 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు”(లేదా...)“ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్”(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)
తేటగీతిమాయరోగము లోకులమరణమెంచివ్యాప్తిచెందెను తొలినాళ్లగుప్తముగనుదాక నన్యుల, మూతికి తప్పి తొడుగుముట్టి యొకఁడు సచ్చె, మడిసె ముట్టకొకఁడు!ఉత్పలమాలమట్టిని గల్పగన్ జనుల మారణహోమము మాయరోగమైచుట్టెను లోకమున్ జెలఁగి చూర్ణము సేసెను దొల్త పెక్కురిన్జట్టము తాకకేరినని, జాలిక మూతికిఁ జెప్ప, మీరుచున్ముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గొట్టు కోవిడు జగతిని చుట్టు ముట్టికట్టిడి తనమున జనుల ముట్టడించముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడుగిట్టె నర్భకుండైనను జెట్టి యైనసరిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చ్ 24, 2020 న భారత దేశంలో లాక్డౌన్ ప్రకటించిన సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గట్టిగ నెయ్యమున్న చెలికాండ్లు విహారమునేగ నెంచి రాపట్టు నొకండు కోరి సురపానము జేసియు చాలనంబు చేపట్టి నపాయమై విగత ప్రాణులునైరి నిజమ్ము మద్యమున్ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్
తరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*ధరణిజ నశోకవనమున దాచి వడిగస్త్రీలనవమానపరచినశిక్షయిదియె
నేస్తు లిద్దరు విద్యుత్తు నిట్ట నెక్కతీగ తగిలి చచ్చె నొకడు దిటయరపునబెదరినట్టి రెండవ వాడు పృథ్వికొరగెముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పట్టగ మౌని శాపమున పాండు నృపాలుడు రాలి పోయె చేపట్టకనంబ శాపమున పావన భీష్ముడు కూలి పోయె నీపట్టున పెద్ద తండ్రియును పట్టియు వాలిన తీరు తెన్నులన్ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్!!
వింత రోగము వ్యాపించె విశ్వ మంతవార్త లందున గనుపించు ప్రత్య హంబుజూచి చర్చించి రయ్యె డ చోద్య ముగనుముట్టి యొకడు సచ్చె మడిసె ముట్టకొకడు
అసువులను దీసె కోవిడు విసము జిమ్మివసనములు మారెనానాడు మసనములుగనెంత కట్టడి చేసిన నేమి ఫలముముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
ఎట్టి విపత్తు లేర్పడిన వెందరు కోవిడు బారిఁ జిక్కియాపట్టున మట్టిలో కలిసి వావిరిగా గతియించి పోయిరోకట్టడిచేయజాలని వికల్పమునన్బడవైచి రోగులన్ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చట్టము నతిక్రమించుచు పెట్టిరకటజనహననముకై బాంబుల సంచినొకటిప్రేలె నొకటి పరీక్షించు వేళలోనముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడుచట్టము మీఱువారు జనసంహరణమ్ముకు బాంబులుంచగాపెట్టగ ప్రేలలేదనుచు వెళ్ళి పరీక్ష నొనర్చు వేళలో ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్బెట్టిన బాంబు ఢమ్మనుచు ప్రేలెను తత్సమయంబునక్కటా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
తే.గీ:అధిక మైన రక్తపు పోటు నన్న కలిగికారమును మెక్కె,తమ్ముడు కలిగి యల్పమైన పోటును కార మింతైన తినడుముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు”
తే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గానుదోఁచె నొకఁడు యండ నొసఁగి ప్రోచె నొకఁడుపట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటుముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడుఉ॥ చట్టముఁ జుట్టమంచు నటు సర్వము దోఁచె నొకండు వానికిన్గట్టిగ నిచ్చి మద్దతును గాయు నొకండు నిఘా విభాగమున్జట్టన పట్టి పంప చెఱసాలకు నట్టుల నీతిబాహ్యులన్ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'ఒకడు + అండ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "దోఁచె నొక్కఁ డండ.. చట్టన నటు..." అనండి.
ధన్యవాదములండి. తెలిసిన సూత్రమే కాని అప్పుడప్పుడు మరచిపోతూనే ఉంటాను. అనేక ధన్యవాదములు. తేటగీతి మార్చిన పద్యముతే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గానుదోఁచె నొకఁడు సాయమొసఁగి ప్రోచె నొకఁడుపట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటుముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడు
ఉ:ముట్టెడు జీతమే కరణమున్ బతికించునొ!లంచ మింతయేన్ముట్టక దప్పదంచు దిని మూర్ఖుడు ఖైదును పొంది చచ్చె ,దానట్టిది చేయనన్ కరణ మాకలి తోడనె చచ్చె నయ్యయోముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్”(పూర్వం కరణాలకి అతి తక్కువ జీతాలు లుండేవి.తాలూకాఫీస్ జమాను కంటే వీళ్ల జీతాలు తక్కువ.ఏదో చిలుక కొట్టుడు తప్పదు.తింటే కేసుల తో చచ్చే వాళ్లు.తినక పోతే తిండికి మాడి చచ్చే వాళ్లు.)
పుట్టె విషజ్వరంబకట పూర్తిగ జుట్టె ప్రపంచమంతటిన్పట్టణ వాసులైన నటు పల్లెల నుండెడి వారలైన లేదిట్టి యుపద్రవంబు మునుపెన్నడెరుంగని సంకరంబనన్ ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
రోజ! యీమధ్య వచ్చిక రోన వినుము ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు చూడ శక్యము గానిదై చొచ్చి హృదికి తీయు ప్రాణము నిమిషాన దెలియ కుండ
పట్టి తగఁ జెట్టపట్టాల నట్టహాసమునను జుట్టరికము మూర ముదము తోడఁ దిరిగి యిద్దఱు విద్యుత్తు తీఁగ నకట ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్ట కొకఁడు దట్టపు గుట్టు రట్టయినఁ దట్టుకొనంగఁ దరమ్ము గాక యేపట్టున నెట్టు లైన మెయి వట్టఁగ నెట్టనఁ దట్ట కన్యముల్ పట్టిన యట్టి బెట్టిదపుఁ బట్టును వీడక యగ్ని నన్నమున్ ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పుట్టనుండి పై కెగయుచు పుట్ట పురుగు మట్టి చదును జేసెడి వారి మధ్యదూరిముట్టి యొకఁడు సచ్చె , మడిసె ముట్టకొకఁడుబిలశయపు రూపమును గని భీతి తోడ.కట్టెదమంచు గోడనట కార్మికులిద్దరు వచ్చి యచ్చటన్ మట్టిని త్రవ్వు వేళనొక మండలి బుస్సుని పైకి లేవగాముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్ పుట్టసమీపమందు బుసపుర్వును గుండెయె యాగిపోవగన్.
తరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*ధరణిజ నశోకవనమున దాచి వడిగస్త్రీలనవమానపరచినశిక్షయిదియెపట్టగనాంజనేయునటబందినిచేయగ దైత్యు లెంచుచున్చుట్టిరికట్టివేయగనుసూత్రముతోడనుమేఘనాథుతోబెట్టునుచేయకన్వడిగవెంబడిసాగుచుహూంకరించగాముట్టియొకండుసచ్చెమరిముట్టకచచ్చెనొకండు చూడగన్
తేటగీతి
రిప్లయితొలగించండిమాయరోగము లోకులమరణమెంచి
వ్యాప్తిచెందెను తొలినాళ్లగుప్తముగను
దాక నన్యుల, మూతికి తప్పి తొడుగు
ముట్టి యొకఁడు సచ్చె, మడిసె ముట్టకొకఁడు!
ఉత్పలమాల
మట్టిని గల్పగన్ జనుల మారణహోమము మాయరోగమై
చుట్టెను లోకమున్ జెలఁగి చూర్ణము సేసెను దొల్త పెక్కురిన్
జట్టము తాకకేరినని, జాలిక మూతికిఁ జెప్ప, మీరుచున్
ముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగొట్టు కోవిడు జగతిని చుట్టు ముట్టి
రిప్లయితొలగించండికట్టిడి తనమున జనుల ముట్టడించ
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
గిట్టె నర్భకుండైనను జెట్టి యైన
సరిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చ్ 24, 2020 న భారత దేశంలో లాక్డౌన్ ప్రకటించిన సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగట్టిగ నెయ్యమున్న చెలికాండ్లు విహారమునేగ నెంచి రా
రిప్లయితొలగించండిపట్టు నొకండు కోరి సురపానము జేసియు చాలనంబు చే
పట్టి నపాయమై విగత ప్రాణులునైరి నిజమ్ము మద్యమున్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు
రిప్లయితొలగించండి*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*
ధరణిజ నశోకవనమున దాచి వడిగ
స్త్రీలనవమానపరచినశిక్షయిదియె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేస్తు లిద్దరు విద్యుత్తు నిట్ట నెక్క
రిప్లయితొలగించండితీగ తగిలి చచ్చె నొకడు దిటయరపున
బెదరినట్టి రెండవ వాడు పృథ్వికొరగె
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపట్టగ మౌని శాపమున పాండు నృపాలుడు రాలి పోయె చే
రిప్లయితొలగించండిపట్టకనంబ శాపమున పావన భీష్ముడు కూలి పోయె నీ
పట్టున పెద్ద తండ్రియును పట్టియు వాలిన తీరు తెన్నులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివింత రోగము వ్యాపించె విశ్వ మంత
రిప్లయితొలగించండివార్త లందున గనుపించు ప్రత్య హంబు
జూచి చర్చించి రయ్యె డ చోద్య ముగను
ముట్టి యొకడు సచ్చె మడిసె ముట్టకొకడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅసువులను దీసె కోవిడు విసము జిమ్మి
రిప్లయితొలగించండివసనములు మారెనానాడు మసనములుగ
నెంత కట్టడి చేసిన నేమి ఫలము
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎట్టి విపత్తు లేర్పడిన వెందరు కోవిడు బారిఁ జిక్కియా
రిప్లయితొలగించండిపట్టున మట్టిలో కలిసి వావిరిగా గతియించి పోయిరో
కట్టడిచేయజాలని వికల్పమునన్బడవైచి రోగులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచట్టము నతిక్రమించుచు పెట్టిరకట
రిప్లయితొలగించండిజనహననముకై బాంబుల సంచినొకటి
ప్రేలె నొకటి పరీక్షించు వేళలోన
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
చట్టము మీఱువారు జనసంహరణమ్ముకు బాంబులుంచగా
పెట్టగ ప్రేలలేదనుచు వెళ్ళి పరీక్ష నొనర్చు వేళలో
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
బెట్టిన బాంబు ఢమ్మనుచు ప్రేలెను తత్సమయంబునక్కటా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితే.గీ:అధిక మైన రక్తపు పోటు నన్న కలిగి
రిప్లయితొలగించండికారమును మెక్కె,తమ్ముడు కలిగి యల్ప
మైన పోటును కార మింతైన తినడు
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గాను
తొలగించండిదోఁచె నొకఁడు యండ నొసఁగి ప్రోచె నొకఁడు
పట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటు
ముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడు
ఉ॥ చట్టముఁ జుట్టమంచు నటు సర్వము దోఁచె నొకండు వానికిన్
గట్టిగ నిచ్చి మద్దతును గాయు నొకండు నిఘా విభాగమున్
జట్టన పట్టి పంప చెఱసాలకు నట్టుల నీతిబాహ్యులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'ఒకడు + అండ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "దోఁచె నొక్కఁ డండ.. చట్టన నటు..." అనండి.
ధన్యవాదములండి. తెలిసిన సూత్రమే కాని అప్పుడప్పుడు మరచిపోతూనే ఉంటాను. అనేక ధన్యవాదములు. తేటగీతి మార్చిన పద్యము
తొలగించండితే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గాను
దోఁచె నొకఁడు సాయమొసఁగి ప్రోచె నొకఁడు
పట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటు
ముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడు
ఉ:ముట్టెడు జీతమే కరణమున్ బతికించునొ!లంచ మింతయేన్
రిప్లయితొలగించండిముట్టక దప్పదంచు దిని మూర్ఖుడు ఖైదును పొంది చచ్చె ,దా
నట్టిది చేయనన్ కరణ మాకలి తోడనె చచ్చె నయ్యయో
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్”
(పూర్వం కరణాలకి అతి తక్కువ జీతాలు లుండేవి.తాలూకాఫీస్ జమాను కంటే వీళ్ల జీతాలు తక్కువ.ఏదో చిలుక కొట్టుడు తప్పదు.తింటే కేసుల తో చచ్చే వాళ్లు.తినక పోతే తిండికి మాడి చచ్చే వాళ్లు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపుట్టె విషజ్వరంబకట పూర్తిగ జుట్టె ప్రపంచమంతటిన్
రిప్లయితొలగించండిపట్టణ వాసులైన నటు పల్లెల నుండెడి వారలైన లే
దిట్టి యుపద్రవంబు మునుపెన్నడెరుంగని సంకరంబనన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరోజ! యీమధ్య వచ్చిక రోన వినుము
రిప్లయితొలగించండిముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
చూడ శక్యము గానిదై చొచ్చి హృదికి
తీయు ప్రాణము నిమిషాన దెలియ కుండ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపట్టి తగఁ జెట్టపట్టాల నట్టహాస
తొలగించండిమునను జుట్టరికము మూర ముదము తోడఁ
దిరిగి యిద్దఱు విద్యుత్తు తీఁగ నకట
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్ట కొకఁడు
దట్టపు గుట్టు రట్టయినఁ దట్టుకొనంగఁ దరమ్ము గాక యే
పట్టున నెట్టు లైన మెయి వట్టఁగ నెట్టనఁ దట్ట కన్యముల్
పట్టిన యట్టి బెట్టిదపుఁ బట్టును వీడక యగ్ని నన్నమున్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపుట్టనుండి పై కెగయుచు పుట్ట పురుగు
మట్టి చదును జేసెడి వారి మధ్యదూరి
ముట్టి యొకఁడు సచ్చె , మడిసె ముట్టకొకఁడు
బిలశయపు రూపమును గని భీతి తోడ.
కట్టెదమంచు గోడనట కార్మికులిద్దరు వచ్చి యచ్చటన్
మట్టిని త్రవ్వు వేళనొక మండలి బుస్సుని పైకి లేవగా
ముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
పుట్టసమీపమందు బుసపుర్వును గుండెయె యాగిపోవగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు
రిప్లయితొలగించండి*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*
ధరణిజ నశోకవనమున దాచి వడిగ
స్త్రీలనవమానపరచినశిక్షయిదియె
పట్టగనాంజనేయునటబందినిచేయగ దైత్యు లెంచుచున్
చుట్టిరికట్టివేయగనుసూత్రముతోడనుమేఘనాథుతో
బెట్టునుచేయకన్వడిగవెంబడిసాగుచుహూంకరించగా
ముట్టియొకండుసచ్చెమరిముట్టకచచ్చెనొకండు చూడగన్