16, మార్చి 2024, శనివారం

సమస్య - 4707

17-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే”
(లేదా...)
“పులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే”

33 కామెంట్‌లు:

  1. ఇలలో నూకలు చెల్లిన
    నిలువదు ప్రాణము నరులకు నిమిషంబయినన్
    నలువనిడుద యాయువునిడ
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే

    రిప్లయితొలగించండి
  2. కలతన్మార్కండేయుడు
    తలపడి శంభునిపిలచెను ధర్ముడురాగా
    విలువనుప్రాణమునిలచెను
    పులి పట్టిన కుఱ్ఱగనెనుపూర్ణాయువునే

    రిప్లయితొలగించండి
  3. కొలువైయుండగశంకరుండుమదిలో కూర్చంగశాంతంబునే
    కలుపన్గాలియముండువచ్చెనటమార్కండేయుప్రాణంబులన్
    నెలవైయుండినభక్తిభావమది తానేర్చెన్సదారక్షనే

    రిప్లయితొలగించండి
  4. పులినోటంబడినట్టిబాలుడుగనెన్పూర్ణాయువున్చిత్రమే

    రిప్లయితొలగించండి
  5. కలితో వండిన రుచితో
    వెలి యన్నము శ్రేష్టమగుట విదితమ్మే యా
    కలిదీరగ ప్రతిదినమున
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే

    కలి , పులి : పులిసిన గంజి (fermented rice water)

    రిప్లయితొలగించండి
  6. పులులితరములాడుచు విం
    తలుఁజేయు వినోదకర ప్రదర్శనమందున్
    తెలియక జొచ్చి విడవడగ
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే

    రిప్లయితొలగించండి

  7. అలనాడట దుశ్యంతుడు
    పులితో క్రీడించు నట్టి బుడతడగు శకుం
    తల తనయుని గనె, మరియా
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే.


    అలనాడావుల మేప నెంచుచునరణ్యంబేగెడిన్ వారితో
    బలవంతమ్మున నేగగా నచట జిహ్వాపమ్మె పైదూక, గ
    ఱ్ఱలతో మోదుచు పెద్దలా బుడతనే రక్షించిరే, నేటికా
    పులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే.

    రిప్లయితొలగించండి
  8. కందం
    తెలుపంగ దర్శకేంద్రుఁడు
    బలిమిఁ గథానాయకుండు వట వృక్షపు నూ
    డల నూగుచుఁ దప్పింపఁగఁ
    బులిపట్టిన కుఱ్ఱఁ, గనెను పూర్ణాయువువే!

    మత్తేభవిక్రీడితము
    తిలకింపన్ దగు దర్శకేంద్రు కృతమౌ తీరైన చిత్రమ్ములన్
    మలయంబందున సాహసమ్ము వివరింపంగన్ గథానాయకుం
    డలవోకంగను మర్రియూడఁగొని యూగాడించి తప్పింపఁగన్
    బులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్! జిత్రమే!!

    రిప్లయితొలగించండి
  9. నిలయపు గోడకు వ్రేల్చుచు
    అలంక రణకు పు లి బొమ్మ నమరిం చగనే
    తెలియక నోట తలనిడగ
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే

    రిప్లయితొలగించండి
  10. పులకింతల పాల్జేయును
    తెలుగు చలన చిత్రమందు దృశ్యములెన్నో
    పులులన్ జక్కగ చూపిరి
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే

    కలలోనైనను గాంచ వచ్చునుగదా గండంబులన్ మెండుగా
    తెలుగే మాధ్యమమైన చిత్రములలో దృశ్యంబులన్ గంటివా
    పలు చిత్రంబులలోన చూడనగునే ప్రావీణ్యతన్ దృశ్యముల్
    పులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే

    రిప్లయితొలగించండి
  11. కలికి శకుంతల తనయుడు
    చిలిపిగ నాడుచు నొక పరి చిరుతను గని దా
    నలయక తేకువ తోడన్
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణా యువు నే

    రిప్లయితొలగించండి
  12. కం:తెలివిగ పాపా రాయని
    కొలువున బడె బాల్య మందె కూటికి కరవే!
    చెలిమిన్ బొందుచు బొబ్బిలి
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే”
    (పాపారాయుడిని బొబ్బిలి పులి అంటారు.బాలుడు తెలివి గా ఆయన కొలువు లో చేరి తిండికి కరువు లేక పూర్ణాయుష్షు తో జీవించాడు.)

    రిప్లయితొలగించండి
  13. మ:కల లో నైనను పంచభక్ష్యముల దా గాంచంగ లే కెట్టి మం
    దుల తో స్వాస్థ్యము బెంచ జూచు నొక మేధోశక్తియున్ లేక,పే
    దల దౌ గంజిని ద్రావి తల్లి యిడగా తన్మాత్రమే తృప్తి యై
    పులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే”
    (పులి అనేది ఒక ఆహారపదార్థం.)

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. కం॥ తలచఁగ భక్తిగ నీశుని
      వలచి పరీక్షింపఁ బంప వ్యాఘ్రము నతఁడే
      కలతను జెందని బుడతఁడు
      పులి పట్టిన కుఱ్ఱ గనెను బూర్ణాయువునే

      మ॥ ఫలమున్ బొంద తపంబు సేయఁ బరమున్ బ్రార్థించి బాలుండటుల్
      బలమున్ భక్తిని నిర్ధరించ ధవుఁడే వ్యాఘ్రమ్ము నంపంగ నా
      పులి నోటంబడి నట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే?
      భళిరా యంచుఁ బరాత్పరుండటుల సంప్రాప్తించి దీవించఁగన్!

      ప్రహ్లాదుడు ధృవుడు అనుకోవచ్చండి
      చిన్న టైపాటులు సవరించి ద్రుత సంధికూడ చివరి పాదములో చేసానండి

      తొలగించండి
  15. అలడొంకరాయి యటవిని
    నలుగురు సంతోషమొప్ప నాట్యము చేయన్
    బులినొకనిని వేఁబట్టఁగ
    పులి పట్టిన కుఱ్ఱ గనెను పూర్ణాయువునే.

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. కొలిచిన వరమ్ము లొసఁగు జ
      నుల కాతఁ డరయునె భయమును ముదిమి నిలలోఁ
      గలియుగ దైవం బయ్యప
      పులి పట్టిన కుఱ్ఱ గనెను బూర్ణాయువునే


      అల యా బాలుఁడు భీతినిన్ వణఁకి వే యార్వంగ వ్యాఘ్రమ్ము క్రే
      పులకై వచ్చినఁ గాంచి నిర్భయముగా మ్రోగించి వాద్యాలి లో
      కులు వీక్షించి ముహూర్తకాలమున నిర్ఘోషమ్ములన్ ముంచఁగాఁ
      బులి నోటన్బడి నట్టి బాలుఁడు గనెన్బూర్ణాయువుం జిత్రమే

      [పులిని + ఓటన్ = పులి నోటన్; ఓట = భయము]

      తొలగించండి
  17. పెన్నధి వారలన్ గవల పిల్లలుగా
    జనియింపజేసెగా
    చిన్నతనంబునందొరులు చిన్నెవరో
    మరి పెద్దయెవ్వరో
    క్రన్నన రూపురేఖలును గాంచిన
    నెర్గక పోయిరందుచే
    నన్నయె తమ్ముడయ్యె మరి యన్నగ
    మారెను తమ్ముడత్తరిన్.

    రిప్లయితొలగించండి
  18. పులి నోటం బడినట్టి బాలుఁడు గనెన్ బూర్ణాయువున్ జిత్రమే
    బళిరా యేమనిచెప్పనోపుదును యబ్బాలుండుదైవాంశుఁడే
    లలనా! కాంచితె చిత్రమున్ శిశువు బ్రహ్లాదుండు కష్టంబులన్
    గలగా భావన జేసియే మదిని నాకంసారిఁబ్రార్ధించెగా

    రిప్లయితొలగించండి
  19. తిలకించుచునలుదెసలను
    నలయకతానాడుచుండనాటలనెల్లన్
    నిలబడినచ్చోతాతయు
    పులిపట్టినకుఱ్ఱగనెనుపూర్ణాయువునే

    రిప్లయితొలగించండి