8-3-2024 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున”(లేదా...)“శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా”
ఆ.వె:మనసు లోన భక్తి మార్గ మెరుగకనెదీక్ష బూను చుంద్రు తీరు మార్చివేష మేసి జనుల వెర్రివారల జేసిశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున”
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మార్గ మెరుగకయె" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.ఆటవెలదిలో "ఫాలనేత్రుని గొల్త్రు" అనండి. వృత్తంలో "...చుందురు జనుల్ క్షేమంబు..." అనండి.
సూచించిన సవరణలతో....భక్తి తోడ జనులు ఫాలనేత్రునిగొల్త్రుదుష్టశీలురైన శిష్టులైనవరములొందినారు పలువురు రాక్షసుల్శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున ?శివపూజల్ వెలయించుచుందురు జనుల్ క్షేమంబునాశించుచున్ శివభక్తుల్ శతకోటిగాదె జగమున్ చింతించి శోధించినన్లవలేశంబులు వారిలోన సుజనుల్ రాకాసులే దండిగాశివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
బల్లిదుడ నటంచు బలహీనులను జేరి ప్రాణములను తీసి పసిడి దోచిపాపకార్యములను వాసిగా నొనరించి శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?అవరోధమ్ములు ధర్మశాస్త్రములవే యార్జింపగా భాగ్యమున్ శివమున్ బొందగ నంచు మూఢుడయి సచ్చీలమ్మునే వీడుచున్ భవబంధమ్ముల చిక్కి నిత్యమిల పాపాలెన్నియో జేయుచున్ శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భద్రినాధునివలె రుద్రాక్ష మాలలువేసికొనియు ప్రజల మోసగించుదొంగ భక్తులెట్లు మంగళ కరమైనశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలదినియమ నిష్ఠ లేక నీలకంఠుని గొల్చిమూఢభక్తి నొందె బోయ ముక్తిమూలమంత్రమనగఁ బూను భక్తియె లేకశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?మత్తేభవిక్రీడితముశివమూర్తిన్ గొని మూఢభక్తిఁ బరమున్ జెందెన్ గదా కన్నడున్భవుడే కానక నిష్టయున్ నియమమున్ వాత్సల్యమున్ జూపఁగన్భువిలోనన్ దగు 'భక్తి' యే వలయు సోమున్ బొందగన్, 'లేదనన్'శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కంఠమందు నిలిపె గరళమును మనకై ,రాజధరుని కొలుచు రాత్రి యందు ,కడుపునిండ మెక్కి కరుణ జూపుమనుచుశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదం అన్వయించడం లేదు.
చేయరానిపనులజేతయైనిలచుచుశివునిగొల్చువాఁడుశిష్టుడగునవంకలున్నకఱ్ఱబారుగానుండునాసత్యమిదియఁజూడుశంకరార్య
మత్తు నందు మున్గి మంచి చెడ్డ లెరిగిమసల లేని వాడు మహిని జనులమోస గింప జూచు పోకిరి యగు వాడుశివుని గొల్చు వాడు శిష్టు డగున?
భవుపాదాబ్జమువ్రాలిరావణుడు తాభావించెదుర్మార్గమున్శివునేగోరగచంపెగాదెహరియున్ చిత్రంబుభస్మాసురున్చవులూరించెడిశంభునామమదిరా చండాడుపాపాత్ములన్శివరాత్రిన్శివుగొల్చునట్టినరునిన్ శిష్టుండనన్జెల్లునా
అవకాశంబులు దేవతార్చనకు లభ్యంబౌననల్పంబుగన్కవనమ్మేయగు తల్లిదండ్రులకు సౌకర్యమ్ములన్ చేయగన్లవలేశంబుయు బద్ధుడవ్వకనె కాలక్షేపముల్ చేయుచున్శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టండనం జెల్లునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు."లవలేశంబును బద్ధుడవ్వకయె" అనండి.
మ.జవరాల్ జూదము ధూర్తుడౌ గుణములన్ సామర్థ్యమున్ బుత్రునిన్నివసించంగ బహిష్కరించె బిత, సాన్నిధ్యమ్ము గాశీపురిన్*శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా*దివియన్ గ్రమ్మి కుబేరుడై జననమున్ దిక్పాలకుండయ్యెగా.
శివుఁడు వశుఁడుగాదె శిష్టులకెన్నఁడుభావజారి బాపు బంధనములుమనసునందున నిడుకొని మచ్చరమ్మునుశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున
శివమున్ గూర్చును భక్తకోటి గొలువన్ క్షిప్రమ్ముగా నీశుఁడేభవ నాశంకరుడైన శంకరుని సంభావించగా భక్తితోశివసాన్నిధ్యమునందు నైహికములన్ చింతించుచున్ హేలగాశివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆ.వె:సంధ్య వార్చ కుండ,స్నాన మైనను లేకకులపు ధర్మములను కూల ద్రోసిభవుని కేల నిష్ఠ,భక్తి ముఖ్య మటంచు శివుని గొల్చు వాడు శిష్టు డగునె
ఆ॥ భక్తి లేక పాప పంకిల మౌచు నశ్వరమగు యిహ భోగ భాగ్యములనెయాదరించి చనుచు నత్యాశ తోడనుశివునిఁ గొల్చు వాఁడు శిష్టుఁ డగునమ॥ భవ మోహంబున నెన్నొ పాపములు సంపాదించ నైశ్వర్యమున్భువిలోఁ జేయుచు ధర్మ చింతనయు సంపూర్ణమ్ముగా వీడుచున్భవునిన్ గొల్వఁగ దేవదేవఁడెటులన్ బాపాత్మునిన్ గాంచునోశివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుండనన్ జెల్లునా?
మ॥ 3వ పాదము మధ్యన దేవుదేవుఁడెటులన్ చిన్న టైపాటు మన్నించగలరు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. "నశ్వరమగు నిహభోగ..." అనండి.
ధన్యవాదములండి
మ:భవునిన్ గొల్చుచు,నర్థభాగమగు నంబన్ వీడి,విఘ్నాంతకున్శివపుత్రున్ స్మరియింపకే,వదలి నందిన్,కార్తికేయున్,హిమో ద్భవగంగన్ విడి,లింగపూజ తనకున్ ప్రాథాన్యమం చెంచుచున్శివరాత్రిన్ శివు గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనన్ జెల్లునే
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగుననుట కల్ల కాదు , నిజము కలియుగమున పాద సేవఁజేయ బాధలఁదొలగించు భూరి ధనము నొసఁగు ముదము తోడ
పుండ్రములు ధరించి భూత దయ యొకింత లేక సంచరింప లోకు లందు నాశ నూని యెడఁదఁ గేశవునిఁ బరమ శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున అవలోకింపఁగ ధర్మ వర్తనము ముఖ్యం బౌను లోకమ్మునన్ శివునిం గొల్చిన భస్మ దైత్యుఁడు ధరం జింతింప సన్మార్గుఁడే శివ భక్తుండగు రావణాసురుఁ డహో శిష్టుండె చింతింపఁగా శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
డా బల్లూరి ఉమాదేవి ముక్తినందగలడుపుడమిలోహసతము*“శివునిఁ గొల్చువాఁడు, శిష్టుఁ డగున”*.కానిపనులుచేసి కరములుజోడించువానిని పరికింప వసుధ యందు
ఆ.వె:
రిప్లయితొలగించండిమనసు లోన భక్తి మార్గ మెరుగకనె
దీక్ష బూను చుంద్రు తీరు మార్చి
వేష మేసి జనుల వెర్రివారల జేసి
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మార్గ మెరుగకయె" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఆటవెలదిలో "ఫాలనేత్రుని గొల్త్రు" అనండి.
వృత్తంలో "...చుందురు జనుల్ క్షేమంబు..." అనండి.
సూచించిన సవరణలతో....
తొలగించండిభక్తి తోడ జనులు ఫాలనేత్రునిగొల్త్రు
దుష్టశీలురైన శిష్టులైన
వరములొందినారు పలువురు రాక్షసుల్
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున ?
శివపూజల్ వెలయించుచుందురు జనుల్ క్షేమంబునాశించుచున్
శివభక్తుల్ శతకోటిగాదె జగమున్ చింతించి శోధించినన్
లవలేశంబులు వారిలోన సుజనుల్ రాకాసులే దండిగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
రిప్లయితొలగించండిబల్లిదుడ నటంచు బలహీనులను జేరి
ప్రాణములను తీసి పసిడి దోచి
పాపకార్యములను వాసిగా నొనరించి
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?
అవరోధమ్ములు ధర్మశాస్త్రములవే యార్జింపగా భాగ్యమున్
శివమున్ బొందగ నంచు మూఢుడయి సచ్చీలమ్మునే వీడుచున్
భవబంధమ్ముల చిక్కి నిత్యమిల పాపాలెన్నియో జేయుచున్
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభద్రినాధునివలె రుద్రాక్ష మాలలు
రిప్లయితొలగించండివేసికొనియు ప్రజల మోసగించు
దొంగ భక్తులెట్లు మంగళ కరమైన
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండినియమ నిష్ఠ లేక నీలకంఠుని గొల్చి
మూఢభక్తి నొందె బోయ ముక్తి
మూలమంత్రమనగఁ బూను భక్తియె లేక
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున?
మత్తేభవిక్రీడితము
శివమూర్తిన్ గొని మూఢభక్తిఁ బరమున్ జెందెన్ గదా కన్నడున్
భవుడే కానక నిష్టయున్ నియమమున్ వాత్సల్యమున్ జూపఁగన్
భువిలోనన్ దగు 'భక్తి' యే వలయు సోమున్ బొందగన్, 'లేదనన్'
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా?
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికంఠమందు నిలిపె గరళమును మనకై ,
రాజధరుని కొలుచు రాత్రి యందు ,
కడుపునిండ మెక్కి కరుణ జూపుమనుచు
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం అన్వయించడం లేదు.
చేయరానిపనులజేతయైనిలచుచు
రిప్లయితొలగించండిశివునిగొల్చువాఁడుశిష్టుడగున
వంకలున్నకఱ్ఱబారుగానుండునా
సత్యమిదియఁజూడుశంకరార్య
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తు నందు మున్గి మంచి చెడ్డ లెరిగి
రిప్లయితొలగించండిమసల లేని వాడు మహిని జనుల
మోస గింప జూచు పోకిరి యగు వాడు
శివుని గొల్చు వాడు శిష్టు డగున?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవుపాదాబ్జమువ్రాలిరావణుడు తాభావించెదుర్మార్గమున్
రిప్లయితొలగించండిశివునేగోరగచంపెగాదెహరియున్ చిత్రంబుభస్మాసురున్
చవులూరించెడిశంభునామమదిరా చండాడుపాపాత్ములన్
శివరాత్రిన్శివుగొల్చునట్టినరునిన్ శిష్టుండనన్జెల్లునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవకాశంబులు దేవతార్చనకు లభ్యంబౌననల్పంబుగన్
రిప్లయితొలగించండికవనమ్మేయగు తల్లిదండ్రులకు సౌకర్యమ్ములన్ చేయగన్
లవలేశంబుయు బద్ధుడవ్వకనె కాలక్షేపముల్ చేయుచున్
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టండనం జెల్లునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"లవలేశంబును బద్ధుడవ్వకయె" అనండి.
మ.
రిప్లయితొలగించండిజవరాల్ జూదము ధూర్తుడౌ గుణములన్ సామర్థ్యమున్ బుత్రునిన్
నివసించంగ బహిష్కరించె బిత, సాన్నిధ్యమ్ము గాశీపురిన్
*శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా*
దివియన్ గ్రమ్మి కుబేరుడై జననమున్ దిక్పాలకుండయ్యెగా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివుఁడు వశుఁడుగాదె శిష్టులకెన్నఁడు
రిప్లయితొలగించండిభావజారి బాపు బంధనములు
మనసునందున నిడుకొని మచ్చరమ్మును
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివమున్ గూర్చును భక్తకోటి గొలువన్ క్షిప్రమ్ముగా నీశుఁడే
రిప్లయితొలగించండిభవ నాశంకరుడైన శంకరుని సంభావించగా భక్తితో
శివసాన్నిధ్యమునందు నైహికములన్ చింతించుచున్ హేలగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె:సంధ్య వార్చ కుండ,స్నాన మైనను లేక
రిప్లయితొలగించండికులపు ధర్మములను కూల ద్రోసి
భవుని కేల నిష్ఠ,భక్తి ముఖ్య మటంచు
శివుని గొల్చు వాడు శిష్టు డగునె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ॥ భక్తి లేక పాప పంకిల మౌచు న
రిప్లయితొలగించండిశ్వరమగు యిహ భోగ భాగ్యములనె
యాదరించి చనుచు నత్యాశ తోడను
శివునిఁ గొల్చు వాఁడు శిష్టుఁ డగున
మ॥ భవ మోహంబున నెన్నొ పాపములు సంపాదించ నైశ్వర్యమున్
భువిలోఁ జేయుచు ధర్మ చింతనయు సంపూర్ణమ్ముగా వీడుచున్
భవునిన్ గొల్వఁగ దేవదేవఁడెటులన్ బాపాత్మునిన్ గాంచునో
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుండనన్ జెల్లునా?
మ॥ 3వ పాదము మధ్యన దేవుదేవుఁడెటులన్ చిన్న టైపాటు మన్నించగలరు
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"నశ్వరమగు నిహభోగ..." అనండి.
ధన్యవాదములండి
తొలగించండిమ:భవునిన్ గొల్చుచు,నర్థభాగమగు నంబన్ వీడి,విఘ్నాంతకున్
రిప్లయితొలగించండిశివపుత్రున్ స్మరియింపకే,వదలి నందిన్,కార్తికేయున్,హిమో
ద్భవగంగన్ విడి,లింగపూజ తనకున్ ప్రాథాన్యమం చెంచుచున్
శివరాత్రిన్ శివు గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనన్ జెల్లునే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగుననుట
రిప్లయితొలగించండికల్ల కాదు , నిజము కలియుగమున
పాద సేవఁజేయ బాధలఁదొలగించు
భూరి ధనము నొసఁగు ముదము తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుండ్రములు ధరించి భూత దయ యొకింత
రిప్లయితొలగించండిలేక సంచరింప లోకు లందు
నాశ నూని యెడఁదఁ గేశవునిఁ బరమ
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున
అవలోకింపఁగ ధర్మ వర్తనము ముఖ్యం బౌను లోకమ్మునన్
శివునిం గొల్చిన భస్మ దైత్యుఁడు ధరం జింతింప సన్మార్గుఁడే
శివ భక్తుండగు రావణాసురుఁ డహో శిష్టుండె చింతింపఁగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిడా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిముక్తినందగలడుపుడమిలోహసతము
*“శివునిఁ గొల్చువాఁడు, శిష్టుఁ డగున”*.
కానిపనులుచేసి కరములుజోడించు
వానిని పరికింప వసుధ యందు