11, జూన్ 2016, శనివారం

దత్తపది - 89 (మబ్బు-వాన-జల్లు-వరద)

కవిమిత్రులారా,
మబ్బు - వాన - జల్లు - వరద
పై పదాలను ఉపయోగించి భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

59 కామెంట్‌లు:

  1. యుద్ధ రంగాన మబ్బుల యురుము లటుల
    వడిని గురిసెను శరముల వాన జల్లు
    వైరి సైన్యము వరదలై పోరు సలుప
    సాగి రిరువురు భారత సంగరమున!

    రిప్లయితొలగించండి
  2. ఉత్తర గోగ్రహణ నమయాన వచ్చుచున్న రథగమనము పసిగట్టి ద్రోణాదులనుకొనుచున్నట్లు :
    “మబ్బు” దొలగిన రవివోలె మండు చుండి
    వచ్చుచున్ననా పార్థద”వాన”లాన
    కురుబలగవిపినము వాని కోల”జల్లు “
    బడగ భస్మప్రేతతతుల ” వరద” యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బలగ విపినము’ అనడం దోషం. ‘కురుబలపు విపినము’ అనండి.

      తొలగించండి

  3. కందంలో.....

    పొడిచెను మబ్బులు యరుములు
    వడిగా నడరెను శరములు వానల భంగిన్
    సుడిగాలి జల్లు లట్టుల
    వడి వడి వరదల్లె సాగె భారత రణమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మబ్బులు నురుములు... వరద వలె సాగె...’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు....సవరించినది....
      కందంలో.....

      పొడిచెను మబ్బులు నురుములు
      వడిగా నడరెను శరములు వానల భంగిన్
      సుడిగాలి జల్లు లట్టుల
      వడి వడి వరదవలె సాగె భారత రణమున్!

      తొలగించండి
  4. రాయబారిగా వచ్చి తన యింట విడిది చేసిన శ్రీకృష్ణునితో విదురుని పల్కులు.......

    పాండవులకు రాజ్యభాగ మబ్బునొకొ? నీ
    వానతిచ్చినంత మౌనము విడి
    మోజు తీర గ్రుడ్డిరా జల్లుఁడ వని నీ
    కోరిక నిడునొక్కొ? శౌరి! వరద!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీపూరణ యద్భుతముగనున్నది.
      “యాజినాపి గ్రుడ్డిరా జల్లుఁడ వని నీ” యనిన నింకనూ బాగుండునేమొ?

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      నా పూరణ మీకు నచ్చినందుకు సంతోషం. మీ సవరణకు ధన్యవాదాలు.

      తొలగించండి
    3. (సవరించిన పూరణ...)
      రాయబారిగా వచ్చి తన యింట విడిది చేసిన శ్రీకృష్ణునితో విదురుని పల్కులు.......

      పాండవులకు రాజ్యభాగ మబ్బునొకొ? నీ
      వానతిచ్చినంత మౌనము విడి
      మోజు తీర గ్రుడ్డిరా జల్లుఁడ వని నీ
      కోరిక నిడునొక్కొ? శౌరి! వరద!

      తొలగించండి
  5. రాయబారం విఫలమైన తరువాత సన్నివేశము:

    ఉత్పలమాలలో మరో ప్రయత్నము:

    సంగర మబ్బు కొన్నదిక
    సామ్యత లేదు సమీక్ష జేయగన్
    భంగము జేయగా నని; ప్ర
    భంజనమింక దవానలమ్ముగన్;
    వంగరు కౌరవుల్; యికను
    వైరము జల్లుక రెచ్చిపోవుటే;
    సంగరమందుమో! వరద!
    సంధియె దప్పెను పోరు దప్పదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కౌరవుల్+ఇకను’ అన్నపుడు యడాగమం రాదు. ‘కౌరవుల్ తుదకు వైరము...’ అనండి.

      తొలగించండి
  6. ధర్మరాజును పాచికతో కొట్టిన విరాటరాజుతో ద్రౌపది.....

    ధర్మమూర్తిని భూ'వర ద'యను మాలి
    గొట్టనిట్టుల 'వాన'లు గురియకచట
    జరుగుబడిలేక ప్రజలంత 'జల్లు'మనరె
    'మబ్బు' బట్టును పాలన మట్టి పైన
    భట్టు తలనుండి రుధిరంపు బొట్టు బడిన
    విన్నవించెను సైరంధ్రి విరటునకును !!!

    రిప్లయితొలగించండి
  7. విను మబ్బుర మిది వానర
    ఘనకేతను డర్జునుండు గాండీవి ననిం
    గన గుండెలు జల్లు మనవె
    యనిశము నభయవరద బిరుదాంకితు డతడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా మరో పూరణ తిలకించ గోర్తాను.

      మేత మేయు చుండఁ బ్రీతి కురంగము
      వీపు పైన నెక్కె వింతఁ గొంగ
      వానిఁ జూచి బోయ బాణము వేసి స
      బకము రేగి జింక ప్రాణముఁ గొనె

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు (నేటిది, నిన్నటిది) బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. మబ్బు వీడగ మార్తాండ మహిమ వోలె
    జోరు వానయె వరదలై పారు రీతి
    శర పరంపర జల్లులు కురియ జేయు
    ఫల్గుణుని జూచి రిపుల్లె పరుగు లిడిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారు మీపూరణ చాలా బాగుంది. నాల్గవ పాదములో గణ దోషమైనది. చూడండి.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ, ధన్యవాదాలు. అది నా దృష్టికి రాని టైపు దోషం. ‘రిపులెల్ల’ అని ఉండవలసింది.

      తొలగించండి
  9. అల్ల కురు వంశ మంతయు జల్లు మనగ
    తొడరి సభలోన జెప్పదొ డవుగ రాజ్య
    భాగ మబ్బునే జెప్పుమ పాండవులకు
    ననివి దురుడుదా పలికె నీ వానతీ యు
    మార్య !జరుగబో వుఘట న లాదులిపుడు

    రిప్లయితొలగించండి
  10. ఎదల మబ్బులు వీడంగ విరటు కొలువు
    పాండు సుతుల కాహ్వానము పలికె! నంత
    విరటు రాజ్యాన కురిసె దీవెనల జల్లు!
    ధర్మము వరద వాఱుచు తనివి తీరె!

    రిప్లయితొలగించండి
  11. కరమబ్బురముగ విప్రుడు
    వెరవానగ మత్స్య యంత్ర భేదన మేయన్
    విరిజల్లు కురియ ద్రుపదుడు
    వరదక్షిణ తోడ నొసగె వధువగు కృష్ణన్

    రిప్లయితొలగించండి
  12. యుద్ధరంగమున శ్రీకృష్ణునితో అర్జునుడు:

    అయిన వారిఁ జంప నధికారమబ్బుటన్
    వలదనంగ కేశవా! నను విడి
    యాదు కొనఁగ నీకు నంజల్లు ఘటియింతుఁ
    గరుణఁ జూపి వరద! కదలుమయ్య!!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    [భీమాంజనేయుల యుద్ధానంతర మాంజనేయుఁడు భీమునకు సౌగంధికా కుసుమ వన మార్గముం దెలుపఁగా, భీముం డిట్టు లాంజనేయునితోఁ బలికిన సందర్భము]

    గొబ్బునను సమరోత్సాహ మబ్బు రీతి;
    వానవర! దయనుఁ జూపి, ఫల్గును ధ్వజ
    మందు రిపులకు నెద జల్లు మనెడు నట్లు
    నిలిచి, విజయమ్ము నిడఁ బ్రవర్తిలుము తండ్రి!

    రిప్లయితొలగించండి
  14. కురుక్షేత్రయుద్ధమందుశ్రీకృష్ణునితోఅర్జునునిపలుకులు
    ఆకశంబె విల్లు అందున మబ్బులే
    బాణ తతియు జల్లు వరదరాగ?
    వడిగ యుద్ధమందు బావా|నలుగను నా
    యండనుండు కృష్ణ|ననె కిరీటి.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆకసంబె...’ అని ఉండాలి. ‘విల్లు+అందున’ అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. ‘కృష్ణ యనె’ అనండి.

      తొలగించండి
  15. కీచకుడు మదోన్మత్తుడై ద్రౌపదితో పలికిన మాటలుగా నూహించిన పద్యం

    నీరూపమబ్బురపరచె
    నో రమణీ! చేరవా నను ముదము తోడన్
    పారించెద సిరులవరద
    కోరితి నీప్రేమజల్లు కురిపింపు మికన్

    నిన్నటి సమస్యకు నా ఆటవెలది పూరణ

    బాల కృష్ణు జంప బకుడను దనుజుడు
    కంసు నాజ్ఞ నొంది ఖలుడు వాడు
    గోకులమును జేరి కుటిలుడైనట్టి యా
    బకుడు రేగి జింక ప్రాణము గొనె

    రిప్లయితొలగించండి
  16. మబ్బు వాన జల్లు వరద
    మబ్బు మెరిసినట్లు మఘవు సుతుడు వచ్చి
    వీరము నట జూప విరులవాన
    వలె శరముల జల్లు పడుచు నుండగనట
    వరద వోలె బడిరి వైరు లెల్ల.

    రిప్లయితొలగించండి
  17. ధైర్య మబ్బు నాకు దాపున నీ వున్న
    కేశవా! నరవర! లేశమైన
    భయము కలుగ దనిని భాణాల జల్లును
    లెక్క జేయ వరద! నిక్కముగను.

    రిప్లయితొలగించండి
  18. కలహపున్ మబ్బు క్రమ్మెను కౌరవేంద్ర!
    గుండె జల్లుమను మురారి యండ నిడుచు
    తోల రథమును భూవర! దురమునందు
    నర్జునుని సరముల వాన నాపతరమె?
    భాణపు వరదఁబాఱరె వైరిమూక?

    రిప్లయితొలగించండి
  19. శ్రీకృష్ణుడు రాయభారమున దృతరాష్ట్రునితోదెలుపుట
    ----------------------ఉత్సాహవృత్తము---------
    జలదరింత|మబ్బు-వానజల్లు వరద లైనచో?
    “కలవరింత యుద్ధమందు కన్నవారు మబ్బునన్
    గలసిపోక మమతజల్లు”.కలుపుకొమ్ము పాండవుల్
    వలదు యుద్ధమన్న వంశవరదమాన్పు తండ్రివై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వంశవరద’... వంశమునకు వరమునిచ్చువాడన్న అర్థమైతే సరి! వంశమనే వరద అంటే దుష్టసమాసం అవుతుంది.

      తొలగించండి
  20. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ద్వి ప ద
    ...........

    అతివ నీ పైన మో జల్లు కొనగ
    సతమత మైన కీచకుడు తాళ డిక ;

    నేల రావా నళినేక్షణ ? జాల
    మేలనే సైర౦ధ్రి ? యీవ కౌగిలిని ;

    """"""""""""""""""""""""""""""""

    ఓ నీచ కీచక ! ఉబ్బు నీ మబ్బు
    నా నాధు లి౦క న౦తమ్ము గావి౦త్రు ;

    వరదను సేవి౦చు పావని నేను
    సరసర నగ్నిలో శలభమ్ము నీవు ;

    { మబ్బు = అఙ్ఞానము . వరద = దుర్గ }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తాళ డిక| యేల రావా’ అనండి. ఇక ద్రుతాంతం కాదు.

      తొలగించండి
  21. మబ్బు రీతిగ యద్థాన మసలు చున్న
    కౌర వేంద్రుని సైన్యంబు గాంచి నరుడు
    వాన వడ్డట్టు శరములు వదలుచుండ
    జగడ మాడెడిగుండియల్ జల్లు మనగ
    వరద గట్టెను రక్తంబు వసుధ లోన

    రిప్లయితొలగించండి
  22. అరయఁ గర మబ్బురము తోడ నర్జనునిఁ గ
    ని, పరువాననున్న ఉలూచి నెమ్మిక గొని,
    చంపకములును మల్లె పూజల్లుల నడి,
    త్వరగొనియె మారె నరవర దయిత గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘ఊకదంపుడు’ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పూజల్లుల నిడి’ లో ‘నడి’ అని టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
  23. పద్మవ్యూహమందలి విశేషాలను వేగువొకడు యెప్పటికప్పుడు ధర్మరాజుకు వివరిస్తున్నట్టుగా ఊహించిన పద్యము

    పాండవా! నవయువకుడౌ పార్థ సుతుడు
    శత్రు సైన్యమబ్బుర పడు చందముగను
    విడువక శర జల్లుల కురిపించు చుండ
    రక్తపు వరదలే పారె రణము నందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శరజల్లులు’ అని సమాసం చేయరాదు. ‘విడువక సెలజల్లుల...’ అందామా? (సెల=బాణము)

      తొలగించండి
  24. గురువు గారికి నమస్కారములు సవరించి పూరించాను. పరిశీలించ గోరుతాను. ధన్య వాదములు.
    మబ్బు తెరలు విడి వడగ మత్స్య రాజు
    పాండు సుతుల కాహ్వానము పలికె! నంత
    విరటు రాజ్యాన కురిసె దీవెనల జల్లు
    ధర్మము వరద వాఱుచు తనివి తీరె!

    రిప్లయితొలగించండి
  25. దుర్యోధనుడు ధర్మజుని జూదానికి పిలిపించిన సందర్భం. ఇక్కడ మోహము = అజ్ఞానము అన్న అర్ధంలో వాడాను.

    స్నేహమ్మబ్బునను నెపము
    నన్ హర్షాహ్వానమంపె నా ధర్మునికిన్
    మోహము వెదజల్లునటుల్
    తా హస్తిన జనె నరవర దమ్ముల తోడన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది.
      రెండవపాదంలో ప్రాస తప్పింది. ‘నరవర’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు.
      ‘నెపము|తో హర్షాహ్వాన మంపితో ధర్మునికిన్... జనె నరపతి తమ్ముల...’ అనండి. (పంపితో=పంపినావా? ఈ పద్యాన్ని శకుని దుర్యోధనునితో అన్నట్టుగా ఊహిస్తే సరి!)

      తొలగించండి
  26. యుద్ధరంగమున శ్రీకృష్ణునితో అర్జునుడు:

    అయిన వారిఁ జంప నధికారమబ్బుటన్
    వలదనంగ కేశవా! నను విడి
    యాదు కొనఁగ నీకు నంజల్లు ఘటియింతుఁ
    గరుణఁ జూపి వరద! కదలుమయ్య!!

    రిప్లయితొలగించండి