గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశం :: దత్తపది ఇచ్చిన పదాలు :: *కన్ను ముక్కు చెవి నోరు* ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగించాలి. విషయము :: భారతార్థం ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు. సందర్భం :: నూరుమంది కుమారులను చంపి అంతులేని పుత్రశోకాన్ని కలిగించిన భీముని, తన ఉక్కు కౌగిట బంధించి చంపివేయాలని అనుకొన్న ధృతరాష్ట్రుని యొక్క దురాలోచనను గ్రహించిన శ్రీకృష్ణుడు అతని ముందు భీముని ఆకారంలో ఉన్న ఇనుప విగ్రహాన్ని ఉంచినాడు. ధృతరాష్ట్రుని పన్నాగం ఫలించలేదు. కృష్ణ భగవానుడు పాపాత్ముల పనులను వమ్ము చేస్తాడు. దుష్టులను క్షమించడు అని విశదీకరించే సందర్భం.
ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కన్నున్న'...? 'మొక్కవోనట్టి'ని 'ముక్కువోనట్టి' అన్నారు. 'ఎళ్ళి' అన్నది గ్రామ్యం. అక్కడ "ముందు కేగి" అనవచ్చు. 'బంచె'...?
హరి రాక న్నుతి యించి పాండవు లు జోహారు ల్ సమర్పించు చు న్ కర మౌ భక్తి విన మ్రులై ప్రణతి తో కైమోడ్ చి తాము క్కునా ద ర సంకల్ప ము తో డ కంచె విధ మై దక్షుoడవై బ్రోతు వే ధర లో నీ సతి వారి నో రుషి జనో ద్దారు oడ!క న్ గొందు మే !
మీ పూరణము చాల బాగున్నది. కాని, దత్తపదాలను స్వార్థమున ప్రయోగించరాదని నియమమును మాన్యులు శంకరయ్య గారు పెట్టారు. పరిశీలించి, అన్యార్థమునకు మార్చి, మఱల ప్రకటించగలరు.
గురువుగారు, కవిమిత్రులు మధుసూదన్ గారలు నన్ను క్షమించాలి. కన్నుతెరవడంలోని కన్ను, ముక్కుపచ్చారడంలోని ముక్కు, చెవికిల్లుకట్టుకొనిపోరడం లోని చెవి, నోరుగొట్టడం లోని నోరు స్వార్థప్రయోగాలు కావేమో అని నేననుకొంటున్నాను.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా, ఇది లోగడ మీరిచ్చిన సమస్యయే
దత్తపదాలు అవే. కాని అప్పుడు రామాయణార్థంలో వ్రాయమన్నాను.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు రారాజు తో.....
కన్నులు నెత్తికెక్కి పలుకన్నుడులిట్టులు మెచ్చుకొందురే
నిన్నిల ? కౌరవాధిప ! యనిన్ గన భీముని దేహముక్కు , చెం.
తన్నరునే వరించె వివిధాస్త్రచయమ్ము , పథమ్మునొక్కటే
యున్నది , సంధియే పొసగనో ? రుధిరమ్ములె నేలఁ బారునో ?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దత్తపదాలను అన్యార్థంలో సమర్థంగా వినియోగించి మైలవరపు వారు చేసిన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపాండవుల కృతజ్ఞతా ప్రకటనము....
తొలగించండిఅపుడు నీకన్నుతులు చేసినందువలన
కనులు జలముక్కులై నీరు గార్చువేళ
బేర్మి నీ దయ రక్షించె వివిధగతుల !
కృష్ణ ! మాకు నోరుపును నేర్పించితీవు !!
నీకు + (ఆ+నుతులు=) అన్నుతులు = నీకన్నుతులు
జలముక్కు... మేఘము
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి(పద్మవ్యూహానికి వెళుతున్న అభిమన్యుడు ఉత్తరతో)
రిప్లయితొలగించండిఅంత దైన్యము నీకెందు కన్నుమిన్న?
కాంచు ముక్కుదేహంబిది కమలనేత్రి!
విసపు వ్యూహంబు గల్పించె విమతగురుడు;
రుధిర ముప్పొంగె;పోదునో రుచిరవాణి!
బాపూజీ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండి!
తొలగించండిbaagumdi
రిప్లయితొలగించండికన్ను గానక ద్రౌపదినీడ్చ, చలించని
రిప్లయితొలగించండిస్థాణువులు పెద్దలు
ముక్కు మూసుకుని జపమాచరింపగ
రెక్కలవి లేని గద్దలు
చెవికి సోకిన దాష్టికము చలించని
గుడ్డి ధృతరాష్ట్రుడు
నోరు మెదపని పుత్ర ప్రేమగ చెలరేగెను
దుశ్శాసన దుష్టుడు
రమేశ్ గారూ,
తొలగించండిదత్త పదాలను అన్యార్థంలో వినియోగించాలని నియమం!
కురుసభలో వికర్ణుని హితోక్తి....
రిప్లయితొలగించండిద్రుపదతనయ కన్నులమిన్న కపకృతి యొన
రించినార ముక్కుమిగుల నెంచి చూడఁ
దోఁచె విపరీతములు వచ్చు దుర్దశ లికఁ
దలఁప నోరుచుకొందుమె దైన్యదశను.
మైలవరపు వారూ, ఒకసారి నా పూరణను కూడా పరిశీలించి బాగోగులు తెలుప ప్రార్థన!
తొలగించండి...కంది శంకరయ్య
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు.... పద్యం హృద్యం గా ఉందండీ.... ముక్కు పద ప్రయోగం దగ్గర నా బుర్రకు అర్థం కాలేదు... కొంచెం వివరింపగలరా ?
...మైలవరపు మురళీకృష్ణ
ఉక్కుమిగుల = అతిశయంగా. ద్రౌపదికి అతిశయంగా అపకారం చేశాము ... అని నా భావన.
...కంది శంకరయ్య
✅బాగుందండీ.. 🙏
...మైలవరపు మురళీకృష్ణ
ముక్కు టములను దరియించి ముదము గాను
రిప్లయితొలగించండివిపిన మందున నివశించె విధిని దలచి
సన్ను తించగ ద్రౌపది కన్ను మొఱకు
రుచిర మేరీతి నొప్పునో రుచిర సతికి
---------------------------------
ముక్కుటములు = నార వస్త్రములు
కన్ను మొఱకు = వంచించు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్నుమొఱకు' అన్నపుడు 'కన్ను' స్వార్థంలో ప్రయోగించినట్లే. 'రుచిర' శబ్దం పునరుక్తమయింది.
ముక్కు టములను దరియించి ముదము గాను
తొలగించండివిపిన మందున నివశించె విధిని దలచి
చెంగ లించగ ద్రౌపది చెఱకు కన్ను
రూప మేరీతి నొప్పునో రుచిర సతికి
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[యుద్ధమున శిఖండినిఁ బురోభాగమందుంచి యనిసేయఁ బిలిచిన యర్జును నుద్దేశించి, భీష్ముఁడు వచించిన సందర్భము]
పార్థ! మా కన్నులన నాజిఁ బ్రాతికూల్య
ముంట, మే ముక్కుననుఁ బోర నుజ్జగింతు!
మడర ననిసేయు తఱి మించె, విడుతుము విలు!
నీ ఘనోరుతర కలహ మ్మేల మాకు?
(అన్నులు = స్త్రీలు)
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!🙏
తొలగించండిఉత్తర కుమారుని విలాపము:
రిప్లయితొలగించండి(దత్తపది పూరణ):
ఎన్నో రుగ్మమ్ములతో
కన్నా! ముక్కుచు వణకెడి కంపమ్ములతో
చెన్నుగ సెలవును పెట్టెద!
నన్నిక పిలిచె విధి! నమ్ము!నారాయణుడా!
కన్ను + ఆ = కన్నా (గ్రేసు మార్కులు ప్లీజ్!)
👌👍
తొలగించండి...కంది శంకరయ్య సారు
చక్కని పూరణ..... ✅✅🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగుంది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి👌🙏🏼
తొలగించండి....డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
అతని వీకన్నుడువ బ్రహ్మ కైన కాదె
రిప్లయితొలగించండియుంకు చుండు నతని శౌర్యముక్కు సమము
విజయుడమ్ముల గురిపించె విరుల వోలె
యద్రి దిగియిట వచ్చెనో రుద్రుడనగ!
****)()(****
(వీక = పరాక్రమము ;ఉంకు = ఎగయు)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విరులవోలె। నద్రి..." ఆనండి.
ఘటోత్కచుడు అర్జునునితో...
రిప్లయితొలగించండివైభవంబున మన *కన్ను*వయునుఁగలుగ
దనచు వచియింపు*ముక్కు*దేహంబు నాది-
తో*చెవి*బుధుండు కృష్ణునితోడ చెలిమి
చేరు మనలకు జయము మ*నోరు*హముగ.
అన్నువ=అలతి,అల్పము శబ్ద రత్నాకరము
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిపోరు కన్ను రికి న భీము తీరు జూడ
రిప్లయితొలగించండిదేహము క్కుగా జేసి యు తీవ్ర మైన
నాగ్ర హంబు చె విరిచె నా న రి దళాన్ని
పారె నో రు ధి ర మనం గ పర గె నపుడు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పోరు కన్ను రికిన'...? 'ఆగ్రహంబుచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'దళాన్ని' అనడం వ్యావహారికం. "దళమును' అనవచ్చు.
రిప్లయితొలగించండినిలచె విరటుని కొ లువునం
దు లబ్జుగన్ కంకుభట్టు తుంగముగ! దుము
క్కుల వలుడు! బృహన్నల,యను
జులున్ చురుక్కను కటికది చోడుమ నోర్చన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని లోపాలున్నవి. వలలుడు వలుడయ్యాడు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశం :: దత్తపది
ఇచ్చిన పదాలు :: *కన్ను ముక్కు చెవి నోరు*
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగించాలి.
విషయము :: భారతార్థం
ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు.
సందర్భం :: నూరుమంది కుమారులను చంపి అంతులేని పుత్రశోకాన్ని కలిగించిన భీముని, తన ఉక్కు కౌగిట బంధించి చంపివేయాలని అనుకొన్న ధృతరాష్ట్రుని యొక్క దురాలోచనను గ్రహించిన శ్రీకృష్ణుడు అతని ముందు భీముని ఆకారంలో ఉన్న ఇనుప విగ్రహాన్ని ఉంచినాడు. ధృతరాష్ట్రుని పన్నాగం ఫలించలేదు. కృష్ణ భగవానుడు పాపాత్ముల పనులను వమ్ము చేస్తాడు. దుష్టులను క్షమించడు అని విశదీకరించే సందర్భం.
రమ్మని బిల్చినాడు ధృతరాష్ట్రు డి ‘’క న్ను’’ సి జేయు భీమునిన్,
నెమ్మది చంప నెంచె గద నేడిచటన్ నిజ ‘’ముక్కు’’ కౌగిటన్
పిమ్మట, నంచు తా నినుప విగ్రహ ముం ‘’చె వి’’వేకి కృష్ణుడున్,
వమ్మొనరించు దుష్కృతుల, పాపుల ‘’నోరు’’ చునే ధరాస్థలిన్?
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (17-4-2018)
చాల బాగుందండీ! అభినందనలు! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
ఈ నాటి దత్తపదికి నేను వ్రాసిన *ఉత్పలమాల పద్యాన్ని తేటగీతి* గా మార్చిన
తొలగించండి*శ్రీ చిటితోటి విజయకుమార్ గారి పద్యం.*
చేరి భీము నిక న్నుసి చేయు నంబి
కాతనూజుడు నిజముక్కు కౌగిటనని
వెస నయోమూర్తి నుంచె వివేకి శౌరి
దుష్కృతముల నోరుచునే మధుద్విషుండు.
శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువర్యులకు ప్రణామాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసభలో తమ్ములతో ధర్మరాజు
అన్నిగుణముల నోరుపు మిన్నయంద్రు
ద్రుపద పుత్రికన్నులమిన్న ధూర్తుచేత
మొక్కపాటు బడచె విక్రముండు భీము
డాతననిని ముక్కడగించు నానగొనెను
వేచియుందము చావడే నీచుడెపుడు
నా ముందటి పద్యంలో “ ముక్కడగించు”లో ముక్కు స్వార్ధమైనచో క్రింది పూరణను గ్రహించ ప్రార్ధన!
తొలగించండిఅన్నిగుణముల నోరుపు మిన్నయంద్రు
ద్రుపద పుత్రికన్నుల మిన్న ధూర్తుచేత
మొక్కపాటు బడచె, విక్రముండు వాయు
పుత్రుడు, వినుముక్కుతనుడు ఫూత్కరించి
నానగొనె జంపగా వాని ననిని జీల్చి
వేచియుందము చావడే నీచుడెపుడు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ (సవరించిన) పూరణ బాగున్నది. అభినందనలు.
పుత్రిక + అన్నులమిన్న... అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
సైంధవుని తలను జగము (కన్ను) పడమరదిశ చేరక మునుపున
రిప్లయితొలగించండినేను ఖండింతునని కిరీటి శపధము చేయ , రారాజు దా(చె,వి)జయునికి
వెరచి సైoధవుని కందరమున ,జాడ దొరకక గాండీవి కలకను బడయ,
చక్రి సుదర్శన చక్రమ్ము నoబు(ముక్కు) పగిది నభమున కుతపుని కను
మరుగు గావించె, గ్రుంకెను మంథి యనుచు
సైoధవుoడు బయల్పడగ జక్కవ చెలి
కనుల వడె, తెర(నోరు)వై కఱ్ఱి, శరము
తోడ నాతని శిరమును తుంచె నపుడు .
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసపద్యం మొదటి, రెండవ పాదాలలో గణదోషం. సవరించండి.
రాయబారమున శ్రీకృష్ణ పరమాత్మతో సుయోధనుఁడు:
రిప్లయితొలగించండికందం
ఇంకన్నుతించ వైరుల
జంకుదుమె? హరి! రణముక్కుసంకల్పము మా
కింకని వచించె విజ్ఞత
లింక సుయోధనుఁడు నోరుపెరుగని వాడై!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికర ముక్కు కర తలమున ది
రిప్లయితొలగించండివిరి తాకన్నుగ్గయి పృథివిఁ బడె నరదమే
విరథుఁ గని విఱిచె విల్లును
దిరిగి మనోరు జవ మారుతి చఱచె నరినిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి17/9/2017 నాటి రామాయణార్థంలో:
తొలగించండిముక్కుటిల మా జనకునకుఁ
జిక్క ధనోరుక్మము నడఁచె విశా లోరుం
డెక్కిడి వీకన్ను కుజకు
నక్కడ నుండంగఁ జూపె నవనీశుండే
[మూఁడు +కుటిలము = ముక్కుటిలము; వీకు + అన్ను = వీ కన్ను; అన్ను = ఆఁడుది; వీకు = ఉన్నతి ]
వీకుటన్ను సాధువు. ధనుర్భంగ సమయములో సీతా దేవి యచ్చట లేదు. ఈ కారణముల సవరించిన పూరణ:
ముక్కుటిల మా జనకునకుఁ
జిక్క ధనోరుక్మము నడఁచె విశా లోరుం
డెక్కిడి వీకన్నుతు లిడ
నక్కడి ముని జనులు మెచ్చి యవనీశుండే
1/11/2016 నాటి దీపావళి సంబరాలు:
తెగువన మనోరువేగ ప
తగమున సద్ద్వారకన్నుత నివాసుఁడిలన్
దగ నంబుముక్కు వర్ణుఁడు
బిగి మగువ గన సమయించె విలయుని నరకున్
[అంబుముక్కు = మేఘము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిడా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండికురుమూకన్నురికించెదన్ పవరమున్ ఘోరంబుగానోడించుచున్
వరుసన్ ముక్కుచు మూల్గుచున్ భయమునన్ పర్వుల్ దీయగా చంపెదన్
పరువున్ గాచెద నంచువంచె విన యంబారీతి శోభిల్లగన్
నరునిన్నోరుపు పట్టుమంచుపలికెన్ నారాయణుండత్తరిన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, రెండవ పాదాలలో గణదోషం. సవరించండి.
సైంధవుని తలను జగము (కన్ను) పడమర కకుభమునకు చేరక మునుపున
రిప్లయితొలగించండినేను ఖండింతునని కిరీటి శపధము చేయ , రారాజు దా(చె, వి)జయునికి
వెరచి సైoధవుని కందరమున ,జాడ దొ రకక గాండీవి కలకను బడయ,
చక్రి సుదర్శన చక్రమ్ము నoబు(ముక్కు) పగిది నభమున కుతపుని కను
మరుగు గావించె, గ్రుంకెను మంథి యనుచు
సైoధవుoడు బయల్పడగ జక్కవ చెలి
కనుల వడె, తెర(నోరు)వై కఱ్ఱి, శరము
తోడ నాతని శిరమును తుంచె నపుడు .
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండికురుమూకన్నురికించెదన్ పవరమున్ ఘోరంబుగానోడించుచున్
వరుసన్ ముక్కుచు మూల్గుచున్ భయమునన్ పర్వుల్ దీయగా చంపెదన్
పరువున్ గాచెద నంచువంచె విన యంబారీతి శోభిల్లగన్
నరునిన్నోరుపు పట్టుమంచుపలికెన్ నారాయణుండత్తరిన్
పై రెండు పాదాలలో గణదోషం సవరించలేదు.
తొలగించండికీచకుని చెంతకు పంపుచూ సుధేష్ణ ద్రౌపదితో పలికిన మాటలుగా నూహించి..........
రిప్లయితొలగించండిముక్కుటపు వలువలగట్టు ముగ్ధ వినుము
నిన్ను వలచె విజ్ఞుడతండు నీరజాక్షి
కోర దనకన్నుల వరుస జేర వచ్చు
నేలనో రుచిరమ్మగు నీదు భవిత
గాలరాచుట భావ్యమ్ము కాదనెఱఁగు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాండవులనులక్కింటకాల్చనెంచునట్టిసమయము
రిప్లయితొలగించండిలక్కయింటను కన్నున్న లౌక్యమందు
భీమ!తానో రుజువుగాను-భీతివిడచి
ముక్కు వోనట్టి ధైర్యాన ముందుకెళ్లి
బంచె విరచించు ధర్మంబు బలముచేత
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్నున్న'...? 'మొక్కవోనట్టి'ని 'ముక్కువోనట్టి' అన్నారు. 'ఎళ్ళి' అన్నది గ్రామ్యం. అక్కడ "ముందు కేగి" అనవచ్చు. 'బంచె'...?
మరో ప్రయత్నం కీచక వధ
రిప్లయితొలగించండిఏకుచు విరిచె విసపరిని
వాకముగ దుముక్కుల మజ వలలుండతడే
తా కుత్తకన్నులుముచున్
తేకువ తో నోరుచు సతి తెవ్వన జూడన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగుంది. ఏదో అచ్చతెనుగు పద్యాన్ని చదివినట్లనిపించింది.
తొలగించండిపొగిడారా తెగిడారా కందివారు ? :)
జిలేబి
పొగడ్తే... తెగిడే అలవాటు నాకు లేదని మీకు తెలుసు!
తొలగించండి
తొలగించండిహమ్మయ్య ! ప్యాసై పోయా !
కన్ను పదం మరీ కష్టమే నండోయ్ :)
నెనరుల్స్
జిలేబి
జ్ఞాతి కన్నుమిన్నెరుగక సదముకీడ్చ
రిప్లయితొలగించండిజాయ ముక్కుడుస్సినజుట్టు జారుచుండ
భీముడేలనో రుద్రమువిడిచి భ్రాత
ముందు తలవంచె వినయము పుట్టు చుండ
ముక్కుడుస్సిన= సడలిన
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్ను, ముక్కు' పదాలను స్వార్థంలో వినియోగించారు.
హరి రాక న్నుతి యించి పాండవు లు జోహారు ల్ సమర్పించు చు న్
రిప్లయితొలగించండికర మౌ భక్తి విన మ్రులై ప్రణతి తో కైమోడ్ చి తాము క్కునా
ద ర సంకల్ప ము తో డ కంచె విధ మై దక్షుoడవై బ్రోతు వే
ధర లో నీ సతి వారి నో రుషి జనో ద్దారు oడ!క న్ గొందు మే !
ధరలో నీ సరి అని చదవాలి
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సైరంద్రి కొరకు నర్తనశాలలో వేచియున్న కీచకుని తలపులు
రిప్లయితొలగించండిచిలుకలకొలికన్నువనాకు కలుగ జేసె
నెడద పై చేచె చనుముక్కు గడబిడలను
వేచె విరితూపులను వెస విషమశరుడు
నేడునే నోరుపుగ నుంటి నృత్యశాల
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొలికి + అన్నువ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
సైరంద్రి కొరకు నర్తనశాలలో వేచియున్న కీచకుని తలపులు
తొలగించండికలువకంటి నా కన్నువ కలుగ జేసె
నెడద పై చేచె చనుముక్కు గడబిడలను
వేచె విరితూపులను వెస విషమశరుడు
నేడునే నోరుపుగ నుంటి నృత్యశాల
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదేహముక్కుపిండమువలె దీర్చియున్న
భీముడనికన్నురుకుచుండె బిఱుసు గూడి
కాంచె విక్రాంతమతనిది కౌతుకమున
మఱియు నోరువుతో దరుమయ్య గుడిని
(ఓరువు= సహనము; గుడి= శిబిరము)
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనికన్ + ఉరుకుచుండె' అన్నపుడు నకారద్విత్వం రాదు.'అనికన్'...?
. .. దత్తపది
రిప్లయితొలగించండికన్ను ముక్కు చెవి నోరు
అన్యార్థంలో.. భారత పరంగా..
సందర్భము: ధర్మరాజు కుంతితో అంటున్నాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన పిమ్మట..
కర్ణుని జన్మ రహస్యం చెప్పకపోయితివి క దమ్మా! చెప్పి వుంటే యింత ఘోరం జరుగక పోయేది గదా.. అని..
"విశాలమైన అంతఃపురాలలో వుండి సూర్యు డంటే కూడ తెలియని సుకుమారి యైన ద్రౌపదితో కలిసి అరణ్యవాస క్లేశ మనుభవించాము. చిట్ట చివరకు భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టడంతో యుద్ధం పరిసమాప్త మయింది."
భారత యుద్ధానికి తాళంచెవి కుంతివద్దనే వుం దని ధర్మరాజు భావన. ఆమె చెప్పివుంటే కర్ణుడు పాండవులవైపు వచ్చేసేవాడో యేమో! దుర్యోధనునికి బలం క్షీణించి యుద్ధానికి సాహసించకపోయే
వాడు. కులక్షయం బంధునాశం తప్పేది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఎండ కన్ను నెఱుంగని కృష్ణఁ గూడి
ముక్కుటమ్ముల నడవికిఁ బోయితి మయొ!
కడ వడముడి ఘ నోరు భంగమ్ముఁ జేసె
నా సుయోధనుఁ... గర్ణరహస్య మింతఁ
జెప్ప వే మమ్మ! తాళపు చెవియు నదియె..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
ఎండకన్ను.. సూర్యుడు; కృష్ణ.. ద్రౌపది; ముక్కుటము.. నార చీర; వడముడి.. భీముడు
ఎండకన్ను స్వార్థం లో ప్రయోగం అవదాండి ?
తొలగించండికన్నులకొలికి అని కూడా చెప్పొచ్చునా అన్యార్థము పడతి అన్న అర్థంలో వెలుదండ వారు ?
జిలేబి
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎండకన్ను'లో కన్ను స్వార్థంలోనే ఉన్న దనుకుంటాను.
ఈ నాటి దత్తపదికి నేను వ్రాసిన *ఉత్పలమాల పద్యాన్ని తేటగీతి* గా మార్చిన
రిప్లయితొలగించండి*శ్రీ చిటితోటి విజయకుమార్ గారి పద్యం.*
చేరి భీము నిక న్నుసి చేయు నంబి
కాతనూజుడు నిజముక్కు కౌగిటనని
వెస నయోమూర్తి నుంచె వివేకి శౌరి
దుష్కృతముల నోరుచునే మధుద్విషుండు.
విజయకుమార్ గారూ,
తొలగించండిఅమోఘంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
ధన్యోఽస్మి శంకరయ్య గారూ!
తొలగించండిద్రౌపది అజ్ఞాతవాసం...
రిప్లయితొలగించండిఎండకన్ను నెఱుంగని ఇంతి తాను
నిక్కువముగనే మానస ముక్కు విడక
నోరుపు వహించి వేచె వినూత్న రీతు
లాభరణములు జేయు సైరంధ్రిగాను ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎండకన్ను'లో మాత్రం కన్ను స్వార్థంలోనే ఉంది.
ద్రుపద సూతి కన్నులమిన్న కపకృతి గని
రిప్లయితొలగించండిభీమసేనుడు కరముక్కు పిండ మనిని
పిక్కటిల్ల దిక్కులు వాని పీచమణచె
వీరులెల్లరు తలవంచె విక్రమునికి
నోరుపుకు ఫలమిదనుచు నూరడిల్లి
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎల్లరు' బహువచనం, 'తలవంచె' ఏకవచనం. "వీరు లెల్లరు నోడిరి విక్రమునకు" అనండి. అలాగే ".. నోరుపునకు ఫలమిదని యూరడిల్లి" అనండి.
ద్రుపద సూతి కన్నులమిన్న కపకృతి గని
తొలగించండిభీమసేనుడు కరముక్కు పిండ మనిని
పిక్కటిల్ల దిక్కులు వాని పీచమణచె
విక్రముండని బొగడగ వీరులెల్ల
నోరుపునకు ఫలమిదని యూరడిల్లె
కన్నులింతలు జేయుచు కాంత జూచె
రిప్లయితొలగించండిముక్కు మూసియే జపమును మునియు చేయ
చెవుల జేరవే మాటలు చెలియ నాడ
నోరు విప్పడు నింద్రియున్ నోడి గెలువ
Dr Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిదత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలని నియమం. "ఇంద్రియా లోడి గెలువ" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికన్నులింతలు జేయుచు కాంత జూచె
తొలగించండిముక్కు మూసియే జపమును మునియు చేయ
చెవుల జేరవే మాటలు చెలియ నాడ
నోరు విప్పడు నింద్రియాలోడి గెలువ
Dr Varalakshmi
Bangalore
tku for the correction KS garu..
దత్తపదాలను స్వార్థంలో ప్రయోగించారు. అన్యార్థంలో ప్రయోగించాలని నియమం.
తొలగించండి(2)
రిప్లయితొలగించండిబండికన్నుఁ జేఁతఁ బట్టి యా యభిమన్యుఁ
డప్పు డిఁక దుముక్కుమంచు దుమికి,
పెనఁగి పెనఁగి త్రుంచె విజయమ్మునందఁగఁ
సద్ఘనోరుయుద్ధసరణిఁబూని!
స్వస్తి
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కన్ను తెరువ కున్న పన్నుగ నదనున
రిప్లయితొలగించండి.....కౌరవులకు వలె కలుగు చేటు
ముక్కుపచ్చారని ముద్దు వయసు లోనె
.....ధర్మనిరతి నేర్పదగు శిశులకు
చెవి కిల్లు గట్టుక చెప్పిన విదురుని
.....భాతి వినక యున్న ప్రళయ మగును
నోరుగొట్టిన యైనవారికి తుద కది
....నీ వినాశమునకు ద్రోవ జూపు
భారతము మానవాళికి బల్లగుద్ది
చెప్పి యున్నట్టి సూక్తుల చెవిని బెట్ట
కలుగు శ్రేయము సోదరా కాని యెడల
చ్యుతిని పొందుట తప్పదు క్షితిని మనకు.
సుకవిమిత్రులు మిస్సన్న గారూ...నమస్సులు!
తొలగించండిమీ పూరణము చాల బాగున్నది. కాని, దత్తపదాలను స్వార్థమున ప్రయోగించరాదని నియమమును మాన్యులు శంకరయ్య గారు పెట్టారు. పరిశీలించి, అన్యార్థమునకు మార్చి, మఱల ప్రకటించగలరు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ సీసపద్యం అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కాని దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలని నియమం.
గురువుగారు, కవిమిత్రులు మధుసూదన్ గారలు నన్ను క్షమించాలి. కన్నుతెరవడంలోని కన్ను, ముక్కుపచ్చారడంలోని ముక్కు, చెవికిల్లుకట్టుకొనిపోరడం లోని చెవి, నోరుగొట్టడం లోని నోరు స్వార్థప్రయోగాలు కావేమో అని నేననుకొంటున్నాను.
తొలగించండి
రిప్లయితొలగించండిబండికన్ను పెట్టి భాను మరుగు పర్చ
నప్పుడిక దుముక్కు మనుచు దుమికి
నోరుపు విడి విజయు డొప్ప పూరించెవి
నంగ శంఖ మచట నక్రహరుడు.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నోరు తెఱచి మరి నుతికన్నుగ్గు జేయు
రిప్లయితొలగించండిబార జూడగనె యెదుటి బలగముక్కు
యోధులను జయించు కనగ నోరు తోడ
వింతగా నరుల నణచె విజయుడనిని!
****)()(****
(నుతిక్ట =సేన ;ఉక్కు = చచ్చు; ఓరు = అరుపు,శబ్దము)
సవరణ : "నుతిక" = సేన
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి.. .. ..దత్తపది
కన్ను ముక్క చెవి నోరు
అన్యార్థంలో భారతపరంగా
సందర్భము: సౌగంధిక పుష్పంకోసం బయలుదేరిన భీమసేనుడు దారి కడ్డంగా ఎంతో పొడవైన తోకను పడవేసి కూర్చున్న భారీ ఆకారం గల ఒక ముదుసలి కోతిని చూశాడు. నిరసనగా మాట్లాడాడు.అది "తోకను నీవే తొలగించుకొనిపొ" మ్మన్నది. (ఆరూపంలో వచ్చింది ఆంజనేయుడే!)
భీము డెంతో ప్రయత్నించి విఫలుడైనాడు.
ఇలా తన మనస్సులో భావిస్తున్నాడు.
జోక... సామ్యము.జత;
రుద్ధము.. నిరోధించబడినది. అడ్డగించబడినది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఈ కో తెక్కడ నుండి వచ్చె?విధియో!..
యీశానుడో!... విష్ణువో!...
తోక న్ను గ్గొనరింతు నే ననుచు
నెంతో సేపు యత్నించితిన్
జోకే దీనికి లేదు.. ముక్కుచు... నెటో
చూచున్ గదా! మూల్గు భ
ల్లూకంబో! పెను భూతమో!యెటులనో!
రుద్ధంబు నా మార్గమే!..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
మయసభ చూచిన తర్వాత దుర్యోధనుని స్వగతం
రిప్లయితొలగించండిమాకన్ను కుట్టుచున్నది
చీ! కౌంతేయుల సిరులకు, చెవిలో బడెగా
యాకృష్ణ నోరు నవ్వగ
నాకసియే ముక్కుటించె నలుపగ వారిన్.