శాంతిభూషణ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అంబుజాక్షు' డనండి. రాముని విశేషణాలన్నీ ప్రథమలో ఉండి 'అంబుజాక్షు' అని ప్రథమేతరంగా ఉంది. "అంబు।జాక్షు డినకుల తిలకుడు..." అనండి.
సూర్యాకాశపు ప్రభాకరుడు చిదాకాశము నుండి వీక్షించగా భూత భవిష్యద్వర్తమానము లన్నియు ఒకే తలము లో స్పష్టము గా కనిపించును. ఆ చిదాకాశము నుండి ప్రభాకరుల కలము నుండి జాలువారిన ఆణిముత్యమిది
నాయెఱుక మేరకు 'తల్లి'తెలుగు పదము మఱియు సంస్కృత పదము కూడా. అయితే తెలుగు తల్లికి అర్థం 'అమ్మ'; సంస్కృత తల్లికి అర్థం 'తరుణి';వనిత' etc. Source :శతావధాని సీ.వీ.సబ్బన్న గారి "అవధాన విద్య".కావున దుష్ట సమాసం కాదనియే యనుకుంటాను.
అన్నపరెడ్డి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మైథిలి' అని హ్రస్వాంతంగా ఉంటే తద్భవం. అప్పుడు "మైథిలి తల్లి" అని సమాసం చేయవచ్చు. కాని "మైథిలీ" అని దీర్ఘాంతమైతే దానికి తల్లిని చేర్చి సమాసం చేయరాదు. 'రక్కసీలు' అన్నది సాధుప్రయోగం కాదు. రక్కసుడు, రక్కసి రెండింటికి బహువచన రూపం 'రక్కసులు'.
శ్రీరాముడె మా అయ్యనగ మాతల్లిగ చెలగెను సీతమ్మే రామరాజ్యమె కదా మా ఇల్లు మా నడతలవి ధర్మమే శివచాపమునదె సంధించి మాతల్లిని తానదె గెల్వగన్ తల్లికి దాళిగట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2662 సమస్య :: *తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.* తల్లికి తాళిగట్టిన దాశరథిని మనసులో స్మరిస్తాను అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలను రక్షించే తల్లి. ఆమె తన భక్తులను బ్రోచే కరుణాతరంగిణి, సర్వదా జగన్నాథుని పాదసేవ చేసే పతివ్రతా శిరోమణి. భూసుతగా సీతగా అవతరించిన జగన్మాత. అటువంటి ఆ సీతమ్మ తల్లికి తాళిగట్టిన దశరథరాముని సదా స్మరిస్తాను తరిస్తాను అని ఒక రామభక్తుడు అనుకొనే సందర్భం.
రెండును సంస్కృత పదాలైనపుడు యేకారణము చేత అది ('జానకీ తల్లి')దుష్ట సమాసమౌతుందో దయయుంచి నా సందేహం తీర్చగలరు.సంస్కృతమున 'తల్లి'యనగా తరుణి కదా! సమాసాలు రూపొందించుటలో పాటించవలసిన అన్ని నియమ నిబంధనలు నాకు తెలియవు.అందుకని యీ సందేహం ! తీర్చ.ప్రార్థన !
అల్లన జన్మ మందె న సు రాళివినాశ న మూల మ య్యు దా చల్లని చూపుల న్ గలిగి శాంత మనోహరసౌమ్య రూ పి యై యె ల్లరి సేమమార యుచు నీప్సితము ల్ నెర వేర్చు నుర్వి జా తల్లి కి దాళిగట్టి న ను దారు ని దాశరథి న్ ద లె oచె ద న్
శివుని వింటినే బంతికై జరిపిన సీతకు పూలదండ భారమైనదా? అని వచ్చెడు నవ్వును మెల్లగ నాపి విల్లుఁ ద్రుంచి బేలకు సీతకు మా తల్లికి ఉదారస్వభావముతో తాళిఁ గట్టిన రాముని తలంచెదను అను భావంతో:
ఉత్పలమాల
విల్లును బంతికై జరిపి వేడుక జేసి స్వయంవరమ్మునన్ పల్లవపాణి దండగొని వాలెనె ముందుకు భారమయ్యె నో? మెల్లగ నవ్వునాపి యటు మీదటఁ ద్రుంచుచు విల్లు బేల మా తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
(ముందుకు వాలి తలవంచి నిలబడడము వధువుకు సహజమే ఆ మాత్రం తెలియని వాడు కాదు మా రామచంద్రుడన్నది కాసేపు ప్రక్కనుంచుదాం)
సందర్భము: సీతమ్మ పెండ్లి నాడు జనక మహారాజు యిలా సంబర పడిపోతున్నాడు. "నా చిట్టి తల్లి సీత ఎంత అల్లారు ముద్దుగా పెరిగిందో! ముందే లక్ష్మీ కళ కలిగినది. ఆ మీద ఇప్పు డిక పెండ్లి కళ కూడా వచ్చేసింది. నా చిట్టి తల్లికి దాశరథి యంతటి వాడు తాళి గట్టినాడు. ఇక నా భాగ్య మే మనవచ్చు?" ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ "ఎంత యల్లారు ముద్దుగా నెదిగె సీత
లక్ష్మి కళతోడ నా తల్లి లక్షణముగ..
మీద నిదె పెండ్లి కళ వచ్చె.. నాదు చిట్టి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె.."
2 వ పూరణము:
సందర్భము: అమ్మాయిని తల్లి దండ్రులే ముందుగా చూడాలి. అబ్బాయి పెండ్లి చేసుకోవాలి. ఇదీ భారతీయ సంప్రదాయం. ఇక్కడ తల్లి దండ్రులు ముందుగా చూడలేదు. కాని ఆ లోటు లేకుండా గురుడు అనగా విశ్వామిత్రుడు చూచినాడు. రాముని తల్లి దండ్రులకు తెలిపినాడు. వాళ్ళు నిశ్చింతగా తరలివచ్చినారు. అట్లాగైనా పరవాలేదు. అని భావించి శ్రీ రామ చంద్ర మూర్తి తాళి గట్టినాడు. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ ఇలను దలిదండ్రులే చూడవలెను తొలుత
రిప్లయితొలగించండిఅల యయోధ్య పురపు ప్రజ లమిత మోద
పడగ,కౌసల్య గారాల పట్టి ,యంభు
జాక్షు, రఘుకుల తిలకుడు జానకమ్మ
తల్లికిం దాళి గట్టెను దాశరథియె
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంబుజాక్షు' డనండి. రాముని విశేషణాలన్నీ ప్రథమలో ఉండి 'అంబుజాక్షు' అని ప్రథమేతరంగా ఉంది. "అంబు।జాక్షు డినకుల తిలకుడు..." అనండి.
గురువు పనుపున నిండగు కొలువులోన
రిప్లయితొలగించండిశివుని విల్లును భేదించి శీఘ్రముగను
సంతసమ్మడర మదిని జనకు చిట్టి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండి'జనకుని చిట్టితల్లి' అనడం బాగున్నది. చక్కని పూరణ. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ + అవని =అయ్యవని ..యయ్యవని అవుతుంది
తొలగించండిహరుని చాపమ్ము విరిచి యయ్యవని పుత్రి
కౌశికుని వెంట మిథిలకు కదలి యచట
తొలగించండిహరుని చాపమ్ము విరిచి యయ్యవని పుత్రి
జనకుని సుత సద్గుణ శీలి జగము నేలు
తల్లికిం దాళి గట్టెను దాశరథియె
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివధనువు నవలీలగ ఛేదపఱిచి
రిప్లయితొలగించండిన ఘనుడు హనుమ సేవితుడు గుణవంతు
డు రఘు వంశ తిలకు ధీరుడు లవకుశల
తల్లికిం దాళి గట్టెను దాశరథియె
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
విష్ణుమూర్తిని కోరగ వేల్పులపుడు
రిప్లయితొలగించండిరావణుని చంపబూనుచు రాణియైన
లక్ష్మి భువినందు పుట్టగ; లవుని కుశుని
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె
లవకుశుల తల్లికి ఇదివరలో గురువుగారు objection పెట్టినట్టు జ్ఞాపకం! పెళ్ళినాటికి వారు పుట్టలేదుగదా! పరిశీలించ ప్రార్ధన!🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండిసీతాదేవి గారు
సూర్యాకాశపు ప్రభాకరుడు చిదాకాశము నుండి వీక్షించగా భూత భవిష్యద్వర్తమానము లన్నియు ఒకే తలము లో స్పష్టము గా కనిపించును. ఆ చిదాకాశము నుండి ప్రభాకరుల కలము నుండి జాలువారిన ఆణిముత్యమిది
కావున సరియే
యిట్లు భాష్యకారిణి
జాల్రా జిలేబి
రవిగాంచనిచో కవి గాంచును అంటారుగదా! ఇచట రవే కవి గనుక యిక హద్దులు లేవట!
తొలగించండిభాష్యకారిణీ నమోనమః!🙏🙏🙏
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లక్ష్మి భువిఁ బుట్టెఁ, బుట్టెడి లవకుశులకు। దల్లికిం...' అనండి.
సారూ:
తొలగించండిఅన్ని అరసున్నలు !!!
సీతా దేవి గారికి సీత...
తొలగించండితియ్యటి పలుకులు జిలేబీ గారూ...
తొలగించండి🙏🙏🙏
జిలేబీ గారూ, మనలో మాట:
తొలగించండివేదాంత పరిభాషలో ఆకాశములు మూడు:
1. చిదాకాశము
2. చిత్తాకాశము
3. భూతాకాశము
మీకూ, నాకూ, ఈ మూడింటిలో స్వేచ్ఛా విహారం :)
తొలగించండిఏమండీ జీపీయెస్ వారు,
ఈ భూతాకాశం మీ ఫిట్టింగా ? :)
చిత్తాకాశం, చిదాకాశం, 'ఆకాశం' ('ఉత్త' ఆకాశం :)) ఈ మూడే కదా యోగ వాశిష్ట ప్రకారం ?
వివరించుడీ :)
జిలేబి
http://www.yogam.org/literature/yoga_journal/May_2012.pdf
తొలగించండి"చిదాకాశం - చిత్తాకాశం - భూతాకాశం అని మూడుగా. చెప్పాలి. స్వభావ స్థితినే చిదాకాశమంటారు. ఆచిదాకాశంనుండి ..."
రిప్లయితొలగించండివిన్నకోట నరసరాయ వినుడు రామ
గాధ! ధన్వము విరిచెను గణుతి కెక్కె
పుడమి పుట్టువు! మైథిలి! భూజ! పసిడి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గాధి జునియాజ్ఞ తలదాల్చి గారవ మున
రిప్లయితొలగించండిశివుని విల్లును విరిచిన భవు డనంగ
జనక జాత్మను మురిపించి జగతి నేలు
తల్లికిం దాళి గట్టెను దాశర ధియె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక్కటులె బాయు నెవరికి మ్రొక్కినంత ?;
రిప్లయితొలగించండినాది లక్ష్మియె సీతగా నవతరింప
వింత గొల్పునటుల నాడు విల్లు విఱచి
తల్లికిం ; దాళిఁ గట్టెను దాశరథియె
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఫెళ్ళున మహేశు చాపము విరిచినంత
సకల లోకములును సంతసంబు మునగ
రత్నగర్భ సొబగుల గారాల చిన్ని
తల్లికిం దాళి గట్టెను దాశరథియె
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విల్లును బట్టి తాటకిని పేరడగించి గురుండు కోరగా
రిప్లయితొలగించండిజల్లన రక్కసీల హృది, జన్నముఁగాచివనమ్మునందునన్
చల్లగ చేరి కూటమున శంభుని విల్లును ద్రుంచి మైథిలీ
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
మైథిలీ తల్లి దుష్ట సమాసమౌతుందా అనే సంకోచం ఉన్నది
తొలగించండినాయెఱుక మేరకు 'తల్లి'తెలుగు పదము మఱియు సంస్కృత పదము కూడా. అయితే తెలుగు తల్లికి అర్థం 'అమ్మ'; సంస్కృత తల్లికి అర్థం 'తరుణి';వనిత' etc. Source :శతావధాని సీ.వీ.సబ్బన్న గారి "అవధాన విద్య".కావున దుష్ట సమాసం కాదనియే యనుకుంటాను.
తొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మైథిలి' అని హ్రస్వాంతంగా ఉంటే తద్భవం. అప్పుడు "మైథిలి తల్లి" అని సమాసం చేయవచ్చు. కాని "మైథిలీ" అని దీర్ఘాంతమైతే దానికి తల్లిని చేర్చి సమాసం చేయరాదు.
'రక్కసీలు' అన్నది సాధుప్రయోగం కాదు. రక్కసుడు, రక్కసి రెండింటికి బహువచన రూపం 'రక్కసులు'.
ద్వయము (వైకృతమును దేశ్యమును మిశ్రమైన పదము) వి. (రక్కసి + ఈఁడు)
తొలగించండిరాక్షసుఁడు.
"సీ. కదలక పెన్నిధిఁగాచు దయ్యంబులు రచ్చరావుల బొమ్మరక్కసీలు." కవిక. ౪, ఆ. (స్వార్థమున ఈఁడు.)
గురువర్యుల చూచనలకు ధన్యవాదములు.పూజ్యమౌ తల్లికి అనవచ్చా తెలుప ప్రార్థన
తొలగించండి
రిప్లయితొలగించండిఅల్లన కౌసలేయుడగు రాముని కార్ముక ఛేదనమ్ము తా
నుల్లము పొంగ జూడగ వినూత్నపు కాంతుల లోక మాత ,యా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెద
న్నెల్లలు లేని సంతసము నెక్కొన నందరికిన్ జిలేబియా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎల్లరినేలు తండ్రి హరి యిద్ధర బుట్టెను మానవాకృతిన్
నల్లని రామమూర్తియన , నాటి రమాసతి ముజ్జగాలకున్
తల్లియె సీతయయ్యె ! మను ధర్మవిధిన్ మనువాడు వేళ మా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఉల్లము ప్రేమనిండ , మధురోహల దేలుచు పెండ్లికూతురై
తొలగించండిఫుల్లముఖాబ్జ భూమిసుత ముద్దుగ జేరగ మ్రొక్కి తండ్రికిన్
తల్లికి ., తాళి గట్టిన యుదారుని దాశరథిన్ దలంచెదన్
విల్లును ద్రుంచినట్టి రఘువీరుని ధర్మమనోహరాకృతిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆహా!!! ఏమి విరుపు!!!
తొలగించండి👏👏👏
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ముఖ్యంగా రెండవ పూరణ విరుపు అద్భుతంగా ఉన్నది.
తెల్లనితల్లికిన్ , జనకధీరుని జ్ఞానసముద్రు సత్క్రియా
రిప్లయితొలగించండివల్లికి , సౌకుమార్యమధుభాషల వెల్లికి , కీర్తిగీతికా
వల్లకికిన్ , సముజ్జ్వలితభాసితకాంతులు నిండు ప్రేమపుం
దల్లికి దాళి గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.
శ్రీ బాపూజీ గారూ నమోనమః.... మీ నాన్న గారి పద్యం వలెనే.......
తొలగించండిలలిత మనోజ్ఞ మంజుల విలాస విశేష పదార్థ భావ సం...
కలిత లతాంత జాత రస కమ్ర కవిత్వ మరంద మాధురీ
విలసిత పద్యసౌరభము వేడ్క హృదంతరవీథి నిండి ఈ
పలుకులు జాలువారినవి ! పాపయశాస్త్రిసుతా ! *నమోऽస్తు తే* !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పియంభావుక మిత్రవర్యులకు కృతజ్ఞతా పూర్వక
తొలగించండినమస్సులు .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శంకరార్యులకు ధన్యవాదాలు.
తొలగించండిశ్రీరాముడె మా అయ్యనగ మాతల్లిగ చెలగెను
రిప్లయితొలగించండిసీతమ్మే
రామరాజ్యమె కదా మా ఇల్లు మా నడతలవి
ధర్మమే
శివచాపమునదె సంధించి మాతల్లిని తానదె
గెల్వగన్
తల్లికి దాళిగట్టిన నుదారుని దాశరథిం
దలంచెదన్
రామనవమికి దేవళ ప్రాంగణమున
రిప్లయితొలగించండిగ్రామ జనులెల్ల వేడుకన్ గనుచునుండ
దివ్య వేదికపైనఁ బతివ్రతామ
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపరగ "ప్లాటో రిపబ్లికు" భణితి రాజు
కుండ రాదట సంబంధ ముర్వి మీద
జన్నమున బుట్టి ధరణిజ జానకీమ
తల్లికిం దాళి గట్టెను దాశరథియె
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివల్లె యటందువో యనవొ వచ్చునదన్నము భూమి నుండియే
తల్లియ భూమి;భూమిజయ; దాశరథే జనియించె నన్నమై
జెల్లె బలంబు జూపగ విశేష సుసంస్కృతి నిల్పు జంట "నా
తల్లికి" దాళి గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హరియె పుట్టువొందెను గదా నరుని గాను
రిప్లయితొలగించండిజనకునింట లక్ష్మి వెలసె జానకిగను
నలువ నిర్ణయింపగ నా జనకుని ముద్దు
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా, Plato's Republic లో తలి దండ్రులెవరో తెలియకుండా,అలా పెంచబడిన సుశిక్షితులైన వారే నాయకులు(పాలక వర్గం) కావాలని ,స్వార్థ బుద్ధి,Nepotism ఉండ బోవని Plato సిద్ధాంతం.
ప్రోచి ముని యాగమును కడు ముదమిడెను తన
రిప్లయితొలగించండితల్లికిం;దాళి గట్టెను దాశరథియె
సర్వ జగములు మిక్కలి సంతసించ
ధైర్యమున త్రిశూలధరుని ధనువు ద్రుంచి
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "ముదమిడెఁ దన" అనండి.
జనకు,రాజర్షి తనయ,విశాల హృదయ,
రిప్లయితొలగించండిసీత,భూజాత,భువనైక చిద్విలాసి,
కీర్తితాశయసంవర్తికి,కరుణామ
తల్లికిందాళిఁగట్టెను దాశరథియె
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జనక రాజర్షి...' అనండి.
ధన్యవాదములు
తొలగించండిహరుని చాప ము గాంచియునవ ని విభులు
రిప్లయితొలగించండిభంగ పడి నట్టి తరుణాన భవుని వోలె
రాము డా విల్లు విరిచి యు రమ యె యైన
తల్లి కిం దాళి గట్ టెను దాశరథి యె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2662
సమస్య :: *తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.*
తల్లికి తాళిగట్టిన దాశరథిని మనసులో స్మరిస్తాను అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలను రక్షించే తల్లి. ఆమె తన భక్తులను బ్రోచే కరుణాతరంగిణి, సర్వదా జగన్నాథుని పాదసేవ చేసే పతివ్రతా శిరోమణి. భూసుతగా సీతగా అవతరించిన జగన్మాత. అటువంటి ఆ సీతమ్మ తల్లికి తాళిగట్టిన దశరథరాముని సదా స్మరిస్తాను తరిస్తాను అని ఒక రామభక్తుడు అనుకొనే సందర్భం.
ఎల్ల జగాల గాచు, కరుణించుచు భక్తుల బ్రోచు, లక్ష్మి తా
నెల్లలు లేని ప్రేమ పతి నెంచు పతివ్రత యౌచు, పృధ్వి రా
జిల్లుచు వచ్చె భూసుతగ సీతగ, నామెయె లోకమాత, యా
*తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-4-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
అల్లనల్లన నడకల నవనిజాత
రిప్లయితొలగించండివిల్లువిరిచిన రాముని వేడ్కమీర
నుల్లమలరగ వరమాల నుంచగళము
నెల్లజగతిని గాచెడు నల్లనయ్య
కల్లలెరుగని సీతమ్మ కల్పవల్లి
వల్లె యనగనె తండ్రి తా వధువు పైడి
తల్లికిం దాళిగట్టెను దాశరథియె!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని వింటిని విఱిచియ శేష సభికు
రిప్లయితొలగించండిలచ్చె రువునొంద జేసెను నాక్షణమున
పూల హారము తోడన చెలులు రాగ
దివ్య వేదిక సాక్షిగ భవ్య సీత
తల్లికిందాళి గట్టెను దాశరధియె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడను' అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
గురువర్యా క్షమించి నిన్నటి పూరణ. స్వీకరించండి
::::::::::::::::::: :::::::::::: :::::::::: :::::::::::: :::::::::::::::::::
తిరమే సంపద ? యెంత యుండినను సంతృప్తిన్ బ్రసాదించునే ?
వర చైతన్యధనాన లభ్య మగు గైవల్యం బహో యా దిగం
బరుడౌ వేమన శాశ్వతం బయిన విశ్వశ్రేయ మాశించి సు
స్థిర సూక్త్యావళి నందజేసి , కొనడే కీర్తిశ్రీని ? వేయేల , సం
వర కౌపీనము దాల్చువాడె గద సంపన్నుండు దర్కింపగా ! ! !
{ చైతన్య ధనాన = ఙ్ఞాన ధనము చే ; సంవరము = ఓరిమి , క్షమ }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో గణదోషం. "...జేసికొనె కీర్తిశ్రీని వేయేల..." అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
గురువర్యా క్షమించి నిన్నటి పూరణ. స్వీకరించండి
::::::::::::::::::: :::::::::::: :::::::::: :::::::::::: :::::::::::::::::::
తిరమే సంపద ? యెంత యుండినను సంతృప్తిన్ బ్రసాదించునే ?
వర చైతన్యధనాన లభ్య మగు గైవల్యం బహో యా దిగం
బరుడౌ వేమన శాశ్వతం బయిన విశ్వశ్రేయ మాశించి సు
స్థిర సూక్త్యావళి నందజేసి కొనె కీర్తిశ్రీని ? వేయేల , సం
వర కౌపీనము దాల్చువాడె గద సంపన్నుండు దర్కింపగా ! ! !
{ చైతన్య ధనాన = ఙ్ఞాన ధనము చే ; సంవరము = ఓరిమి , క్షమ }
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఅల్ల పలాశిఁ దాటకను నాశుగ ఘాతము చేతఁ గూల్చి, సం
పల్లలితాంగ్యహల్యకును బ్రస్తర రూపము డుల్చి, సం
ఫుల్ల సరోజ నేత్ర కరముం గొన, నీశు గుణమ్ము వ్రీల్చి, యా
తల్లికిఁ దాళిఁ గట్టిన యుదారుని దాశరథిం దలంచెదన్!
తొలగించండిఅద్భుతమండీ
జిలేబి
పరమాద్భుతము! 🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ జిలేబీ గారూ, సీతాదేవి గారూ!
తొలగించండి🙏🙏🙏
రెండో పాదంంలో చిన్న సవరణతో...
తొలగించండిఅల్ల పలాశిఁ దాటకను నాశుగ ఘాతము చేతఁ గూల్చి, సం
పల్లలితాంగ్యహల్యకును బ్రస్తర రూపము డుల్చి, వేగ సం
ఫుల్ల సరోజ నేత్ర కరముం గొన, నీశు గుణమ్ము వ్రీల్చి, యా
తల్లికిఁ దాళిఁ గట్టిన యుదారుని దాశరథిం దలంచెదన్!
ముందు ఇలా వ్రాసుకొన్నాను. కాని, ఎందుకో ఆ రెండక్షరాలు పడలేదో, నేనే టైపుచేయలేదో...
తొలగించండిఅల్ల పలాశిఁ దాటకను నాశుగ ఘాతము చేతఁ గూల్చి, సం
పల్లలితాంగ్యహల్యకును బ్రస్తర రూపము వేగ డుల్చి, సం
ఫుల్ల సరోజ నేత్ర కరముం గొన, నీశు గుణమ్ము వ్రీల్చి, యా
తల్లికిఁ దాళిఁ గట్టిన యుదారుని దాశరథిం దలంచెదన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండి
రిప్లయితొలగించండిమ్రొక్కె తన తండ్రికిన్ సయి మ్రొక్కె నతడు
తల్లి కౌసల్యకున్ సుమిత్రకును కైక
తల్లికిం, దాళిఁ గట్టెను దాశరథియె,
జగము నేలు తల్లికి పురజనులు చూడ,
దహరులున్ను కాలుత్రొక్క తమ సతులను!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుగ్గ పై చుక్క ముఖమున పూర్ణ మసుని
రిప్లయితొలగించండిపైన పొడవోలె మెరియగ, పాద దోయి
పసుపు పారాణి తో కూడ, కనుల లోన
సిగ్గు దొంతరలు కురియ, శిరము వంచి
పెండ్లి పీటపై కూర్చుండె పేర తనయ,
తల్లి తండ్రులు దీవిoచ ధరణి చిట్టి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూర్ణ మసుని'...? 'పాద దోయి' దుష్టసమాసం.
ధర్మమును నిలబెట్టగ ధరణిలోన
రిప్లయితొలగించండిసామగర్భుడె జనియించ రామునిగను
విష్ణువల్లభ సీతయై వెలయ, జగము
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివధనువునువిరువ సంతసించి జనులు
రిప్లయితొలగించండిజోరుగ కరతాళిజరుపుచుండ జనక
పుత్రి మిధిలాపురజన ముద్దులొలుకు
తల్లికిందాళిగట్టెను దాశరధియె
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముని యనుజ్ఞను విల్లును ముదమున గొని
రిప్లయితొలగించండివిరువ రాముడు చూడరే విరుల జల్లు
భూసుత చిరునగవు నవ్వ భువిని ,నాడు
తల్లికిం దాళి గట్టెను దాశర ధియె
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచల్లని చూపులన్ పఱచి శాశ్వత సంపద లిచ్చుచున్ విరా
జిల్లెడి లక్ష్మియే భువిని సీతగ వృధ్ధిని బొందు వేళలో
పెల్లుగ శైవ చాపమును వీకగ నెత్తి తరస్వియౌచు నా
తల్లికి దాళి కట్టిన నుదారుని దాశరధిందలంచెదన్
(తరస్వి= శూరుడు)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగాధిజు నపేక్ష మేరకు కాన కేగి
తాటకాది రాక్షసులను తట్టి జంపి
యిష్టి గాచి శివధనస్సు నెత్తి సిరుల
తల్లికిం దాళిగట్టెను దాశరధియె
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
తొలగించండితల్లిని “గ్లో” ను కోరిన సుదారకు డా ముని కోర తాటకిన్
రిప్లయితొలగించండితల్లడ పాటు నొందక విదారణ మున్నిడి నట్టి శూరుడున్,
కల్లును దాకి నాతికి విగానము బాపిన మోక్ష దాతయున్,
విల్లును ద్రుంచి రాజులకు వేండ్రము నిచ్చిన మాసటీ కుడున్,
నల్లని దేహమున్ గలిగి నాతుక మానస రేరిహాణుడున్,
చల్లని తేజమున్ గలిగి, సాగరమేఖల పుత్రి జానకీ
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జానకీ తల్లి' అనడం దుష్టసమాసం.
రెండును సంస్కృత పదాలైనపుడు యేకారణము చేత అది ('జానకీ తల్లి')దుష్ట సమాసమౌతుందో దయయుంచి నా సందేహం తీర్చగలరు.సంస్కృతమున 'తల్లి'యనగా తరుణి కదా! సమాసాలు రూపొందించుటలో పాటించవలసిన అన్ని నియమ నిబంధనలు నాకు తెలియవు.అందుకని యీ సందేహం ! తీర్చ.ప్రార్థన !
తొలగించండిరాముఁడు మహా భుజుండు సురవ్రజార్చి
రిప్లయితొలగించండితారవిందాక్షుఁ డెలమి మహా సుగుణవ
తి ధరణిజ లోకవిదిత పతివ్రతా మ
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె
పోతనామాత్యుని పాద పద్మములకు నమస్కృతులతో:
నల్లని వాఁడు పద్మ నయనంబుల వాఁడు కృపారసమ్ము పైఁ
జల్లెడి వాఁడు రాఘవుఁడు జానకి నిర్దయ వీడె నక్కటా
చల్లని తల్లి యేగె ఘన సానువు రావల దిట్టి బాధ లే
తల్లికిఁ, దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅల్లన జన్మ మందె న సు రాళివినాశ న మూల మ య్యు దా
రిప్లయితొలగించండిచల్లని చూపుల న్ గలిగి శాంత మనోహరసౌమ్య రూ పి యై
యె ల్లరి సేమమార యుచు నీప్సితము ల్ నెర వేర్చు నుర్వి జా
తల్లి కి దాళిగట్టి న ను దారు ని దాశరథి న్ ద లె oచె ద న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉర్విజా తల్లి' అన్నది దుష్ట సమాసం. "నేరవేర్చు సీత మా। తల్లి..." అనవచ్చు.
డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిఅల్లన విల్లునే విఱచి నచ్చటి ప్రేక్షక సంఘమొప్పగా
వెల్లువగా ప్రశంసలును వేల్పులు జల్లెడు పుష్పవృష్టి యున్
మెల్లన తోడుకాగ తన మేనుకు వెల్గగు జానకమ్మ కా
తల్లికిం దాళి గట్టెను నుదారుని దాశరథిం దలంచెదన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విఱచి యచ్చటి" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధనువును' అనండి.
రామనవమికి భద్రాద్రి రామ గుడిన
రిప్లయితొలగించండిరామదాసుని తాళి సంబ్రంబమందు
లక్షలాదియు జనులలో లవకుశులగు
తల్లికిందాళి గట్టెను దాశరథియె
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గుడిని...లవకుశులకు..' అనండి.
తేటగీతి
రిప్లయితొలగించండినవమి తిధి దాటి వచ్చు పౌర్ణమి వెలుగుల
ఒంటిమిట్టను రేరాజు మింట మెరయ
మేను పులకించ సీతకు మానినీమ
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండితే.
రిప్లయితొలగించండిజల్లగ సురులు పూలను జవము తోడ
ఝల్లున మది త్రుళ్ళగనిక జానకీమ
"తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె"
పెళ్ళున విరచి విల్లును పెనిమిటాయె
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తల్లియు జెప్పెనే మనకు తాతలు చిత్రము వేయిగాథలన్
రిప్లయితొలగించండిమల్లియ బోలునే యతివ మంత్రము రాముని చేయి బట్టగన్
చల్లిరి దేవదాదులును చల్లని చూపుల రక్ష నక్షతల్
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
Dr H varalakshmi, Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.
రిప్లయితొలగించండిశివుని ధనుసును విరిచెను, చిత్తమందు
నంజలి ఘటించి సూర్యున కయ్యకు మరి
తల్లికిం, దాళి కట్టెను దాశరథియె
జానకి మెడలో జనులెల్ల జయము పలుక..
తల్లిని పుత్రునిన్ యముని తావుకు పంపి మఖమ్ము గాచి యో
రిప్లయితొలగించండితల్లికి రూపునిచ్చి ముని తావుకు పంపి హరించి నిందలన్
తల్లికి బుట్టనట్టి వసుధాత్మజ మైథిలి సీత సాధ్వులం
దల్లికిఁ దాళిఁ గట్టిన యుదారుని దాశరథిం దలంచెదన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లదె యామహామహుని నాత్మదరించెదనెల్లవేళల
రిప్లయితొలగించండిన్దల్లికి దాళిగట్టిన నుదారుని దాశరధిన్దలంచెదన్
విల్లునుజేతబూనుచును వైరిజనంబుల మీదకేగగా
నెల్లరు భీతినొం దుచును నిండ్లను వీడుచుబాఱి పోదురే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గాదిసుతుని యాగమునట కాచి తాను
రిప్లయితొలగించండిచనియె భ్రాతతో ముని వెంట చక్కగాను
చేరి మిథిలా పురమ్మును ,శివుని ల్లు
విరిచి సురలు నరులు మెచ్చ వేగ జగతి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె.
చల్లని తల్లికిన్ వసుధజాతకు సుందర మందయానకున్
నెల్లరు జూచుచుండ రజనీశుని కాంతిని బోలినట్టి యా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
నుల్లము నందు నెప్పుడును నొప్పుగ నుండు మటంచు వేడెదన్
ఎల్లరు మెచ్చుచుండనట నెల్లలు మీరిన పౌరుషమ్ముతో
విల్లును నొక్కపెట్టునను విర్వగ హర్షము తోడ సీతకున్
యుల్లము ఝల్లనన్ జయజయోస్తని వేల్పులు పల్కు చుండ నా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.
డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండిగాదిసుతుని యాగమునట కాచి తాను
చనియె భ్రాతతో ముని వెంట చక్కగాను
చేరి మిథిలా పురమ్మును ,శివుని ల్లు
విరిచి సురలు నరులు మెచ్చ వేగ జగతి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె.
చల్లని తల్లికిన్ వసుధజాతకు సుందర మందయానకున్
నెల్లరు జూచుచుండ రజనీశుని కాంతిని బోలినట్టి యా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
నుల్లము నందు నెప్పుడును నొప్పుగ నుండు మటంచు వేడెదన్
ఎల్లరు మెచ్చుచుండనట నెల్లలు మీరిన పౌరుషమ్ముతో
విల్లును నొక్కపెట్టునను విర్వగ హర్షము తోడ సీతకున్
యుల్లము ఝల్లనన్ జయజయోస్తని వేల్పులు పల్కు చుండ నా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్.
శివుని వింటినే బంతికై జరిపిన సీతకు
రిప్లయితొలగించండిపూలదండ భారమైనదా? అని వచ్చెడు నవ్వును మెల్లగ నాపి విల్లుఁ ద్రుంచి బేలకు సీతకు మా తల్లికి ఉదారస్వభావముతో తాళిఁ గట్టిన రాముని తలంచెదను అను భావంతో:
ఉత్పలమాల
విల్లును బంతికై జరిపి వేడుక జేసి స్వయంవరమ్మునన్
పల్లవపాణి దండగొని వాలెనె ముందుకు భారమయ్యె నో?
మెల్లగ నవ్వునాపి యటు మీదటఁ ద్రుంచుచు విల్లు బేల మా
తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
(ముందుకు వాలి తలవంచి నిలబడడము వధువుకు సహజమే ఆ మాత్రం తెలియని వాడు కాదు మా రామచంద్రుడన్నది కాసేపు ప్రక్కనుంచుదాం)
అల్లన రాక్షసాధముల నంతము జేసి మునీంద్ర యజ్ఞమున్
రిప్లయితొలగించండిజల్లగ బ్రోచి కౌశికుని సార యతీంద్రుని వెంటనేగి యా
విల్లును ద్రుంచి జానకికి విశ్వమనోహరి లోకపూజ్యమౌ
తల్లికి దాళిగట్టిన నుదారుని దాశరథిం దలంచెదన్
డా.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా, Plato's Republic లో తలి దండ్రులెవరో తెలియకుండా,అలా పెంచబడిన సుశిక్షితులైన వారే నాయకులు(పాలక వర్గం) కావాలని ,స్వార్థ బుద్ధి,Nepotism ఉండ బోవని Plato సిద్ధాంతం.
*27-4-18*
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
.. ..సమస్య
*"తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె"*
సందర్భము: సీతమ్మ పెండ్లి నాడు జనక మహారాజు యిలా సంబర పడిపోతున్నాడు.
"నా చిట్టి తల్లి సీత ఎంత అల్లారు ముద్దుగా పెరిగిందో! ముందే లక్ష్మీ కళ కలిగినది. ఆ మీద ఇప్పు డిక పెండ్లి కళ కూడా వచ్చేసింది.
నా చిట్టి తల్లికి దాశరథి యంతటి వాడు తాళి గట్టినాడు. ఇక నా భాగ్య మే మనవచ్చు?"
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"ఎంత యల్లారు ముద్దుగా నెదిగె సీత
లక్ష్మి కళతోడ నా తల్లి లక్షణముగ..
మీద నిదె పెండ్లి కళ వచ్చె.. నాదు చిట్టి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె.."
2 వ పూరణము:
సందర్భము: అమ్మాయిని తల్లి దండ్రులే ముందుగా చూడాలి. అబ్బాయి పెండ్లి చేసుకోవాలి. ఇదీ భారతీయ సంప్రదాయం.
ఇక్కడ తల్లి దండ్రులు ముందుగా చూడలేదు. కాని ఆ లోటు లేకుండా గురుడు అనగా విశ్వామిత్రుడు చూచినాడు. రాముని తల్లి దండ్రులకు తెలిపినాడు. వాళ్ళు నిశ్చింతగా తరలివచ్చినారు. అట్లాగైనా పరవాలేదు.
అని భావించి శ్రీ రామ చంద్ర మూర్తి తాళి గట్టినాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఇలను దలిదండ్రులే చూడవలెను తొలుత
పిల్ల, నది చాలు పెండ్లాడఁ బిల్లవాడు...
తాను జూచి, గురుడు దెల్పెఁ దండ్రికి మరి
తల్లికిం; దాళిఁ గట్టెను దాశరథియె..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
*27-4-18* 3 వ పూరణము:
రిప్లయితొలగించండి.. .. .. .సమస్య
*"తల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని*
*దాశరథిం దలంచెదన్"*
సందర్భము:
కాలాంబుదాళి లలితోరసి కైటభారే
ర్ధారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః
అని ఆది శంకరులు కనకధారాస్తవములో (7 వ శ్లో) లక్ష్మీ దేవిని ప్రస్తుతించినాడు.
కాఱుమబ్బునందు మెఱపు తీగ లాగున నల్లని శ్రీ హరి యుల్లమునందు వెలుగు చిందు లోకమాత భార్గవి మహనీయ దృష్టి నాకు భద్రము లందించు గాక!
ఆ జగజ్జననియే సీతాదేవి. ఆ శ్రీమ న్నారాయణుడే శ్రీ రామచంద్రుడు. అతడే దశరథ పుత్రుడు. సీత మెడలో తాళి కట్టినాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నల్ల మొయిళ్ళ యల్లిక య
నం దగు వెన్నుని యుల్లమందు వి
ద్యుల్లత మేఘమందు వలె
తోచెడు తల్లియె సీత; వెన్నుడే
యిల్లిదె! రామచంద్రు డట!
యీ పదునాల్గు జగాల నేలు నా
తల్లికిఁ దాళిఁ గట్టిన ను
దారుని దాశరథిం దలంచెదన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
ఉల్లము పొంగ నేనికను నోపిక తగ్గగ నా కుమారునిన్
రిప్లయితొలగించండితల్లికిఁ దాళిఁ గట్టిన నుదారుని;...దాశరథిం దలంచెదన్
చల్లగ జూడు మమ్మనుచు చక్కగ మ్రొక్కుచు దొర్లి పొర్లుచున్...
కల్లలు కావు నా నుడులు కమ్మగ నిత్తును వేయి రూప్యముల్ :)