14, ఏప్రిల్ 2018, శనివారం

సమస్య - 2651 (మునికిన్ నేర్పంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్"
(లేదా...)
"మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్"

135 కామెంట్‌లు: 1. మనసున నైర్మల్యంబున్,
  చనవరి యైజను లకెల్ల చక్కగ విద్యా
  వినయమ్ములెల్ల నేర్పెడు
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వినయమ్ము నేర్పు, నెట్టుల
   మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్?" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. జిలేబిగారు యెక్కడ ఉన్నా తక్షణమే స్పందించి తమ ఊరి పేరును తెలుపదలరు! ఇది ఆకాశవాణి నుండి పదే పదే మరియు తుది హెచ్చరిక! మీ ఊరిపేరు తెలియక గందర గోళముగ నున్నది! మీ పేరుతో పాటు మీ ఊరిపేరును వ్రాసిన మరింత తియ్యగానుండును! 😀😀😀

   తొలగించండి

  3. ఏమయ్యిందండీ సీతాదేవి గారు

   ఆకాశవాణి విశేషాలేమిటి ?


   జిలేబి

   తొలగించండి
  4. ఈ రోజు ఆకాశవాణిలో పూరణలు పంపిన వారి పేర్లలో మీ పేరు చదివి ప్రత్యేకంగా మీరు ప్రతిసారీ ఊరిపేరు వ్రాయడం లేదని, మీ పేరులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తున్నామవీ, అలాగే (ఊరించకుండా) (ఇది నా కవిత్వము)
   ఊరిపేరు కూడ వ్రాస్తే యింకా బాగుంటుందనీ చమత్కరించారు! అదీ సంగతి! మీరు ముసుగు వీరులని వారికి తెలియక పోయె పాపం!!😀😀😀

   తొలగించండి

  5. ఊరి పేరు రాయ లేదని కినుకా !
   సరే నండి అలాగే రాసేస్తా ! వచ్చేవారం సమస్య ఏమిటండి?

   అనిమిషపురి
   జిలేబి

   తొలగించండి
  6. జిలేబీ గారూ,
   వచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య....
   "యతి సాంగత్యము లేని పద్యములె విద్యాదేవి వాద్యశ్రుతుల్"
   అప్పుడే 'అనిమిషపురి'కి వెళ్ళకండి. ఇంకా చాలాకాలం ఉంది.

   తొలగించండి

  7. కందివారు నమో నమః ! నెనరుల్స్ :)


   మతిబోవున్ చదువంగ హత్తుకొనదమ్మా మానసమ్మున్ సఖీ
   యతి సాంగత్యము లేని పద్యములె; విద్యాదేవి వాద్యశ్రుతుల్,
   వెతలున్ లేని పదంబు లెల్ల రమణీ వెన్వెంట రమ్యంబుగా
   జతజేర్చున్ విభుడిన్ మదిన్ పొదుపుచున్ సాక్ష్యమ్ముగా నిల్చుచున్ !

   జిలేబి

   తొలగించండి
 2. ఇంద్రుడు మేనకతో:

  వినుమా! మేనక! సుఖదా!
  మనకిక ముప్పులు కలుగును మహనీయునితో
  చనుమా! భూమికి త్వరగా!
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్!

  సుఖద = అప్సర

  రిప్లయితొలగించండి


 3. మనసాడన్ తను వాడ నివ్వడతడున్ మత్తేభమున్ గాదయా
  చనువున్ జూపి జనాళి కెల్ల భళి సత్సాంగత్యమున్జేర్చు తా
  వినయమ్మున్ సయి నేర్పు నాతడు గదా బీరమ్ములేలా స్వకా!
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. శూర్పణఖా పట్టేసుకొమ్మ రామున్ - లక్ష్మణు ఉవాచ


  మనువాడిన సతి తోడై
  చనవరి గాయున్నవాడు సరిజోదు సుమా!
  వినుమా యప్సరసా! రా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చనవరిగా నున్నవాడు..." అనండి.

   తొలగించండి
 5. (మహేంద్రుడు మీననేత్రి మేనకతో)
  మన స్వర్గంబుననిన్ను మించిన మహామాధుర్యధుర్యాంగనన్
  గనలేదింత దనుంక నేను ; రమణీ! గాధేయు దీవ్యత్తపం
  బును భంగంబొనరింపగావలెను ; సంపూర్ణంబుగా మేనకా!
  మునికిన్ నేర్పగనొప్పు రాజవదనా!మోహంపుబుద్ధుల్ దమిన్.

  రిప్లయితొలగించండి
 6. శూర్పణఖ సీతమ్మ తో :
  కందం
  కనగన్ వలపులు రేపెడు
  ఘనుడౌ నీపతిని మెచ్చి కామించితి కా
  దన నిను తినివేయుదు రా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
 7. వినగన్ చోద్యము గాదట
  తనువున్ సుష్కింప జేసి తపమొన రించన్
  కనినంత యప్సర మెరుపులు
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "కనగా నప్సర మెరుపులు" అనండి.

   తొలగించండి
  2. వినగన్ చోద్యము గాదట
   తనువున్ సుష్కింప జేసి తపమొన రించన్
   కనగా నప్సర మెరుపులు
   మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

   తొలగించండి
  3. అక్కయ్యగారికి అభినందనలు! ఈరోజు ఆకాశవాణి సమస్యాపూరణలో మీ పద్యం చదివారు!💐💐💐💐

   తొలగించండి
 8. ఇంద్రాదులదె మొదలు మునులు కాదె,
  తాపసులై పదవి నొందలేదె
  ఆశ్రమములన్ ఇంతులు లేరె,ఋషులదె
  వారు సంసారులు కారె
  మేనక మేనిగ వంపుల తుప్పు,విశ్వామిత్రుడదె
  హద్దుల్ మీరన్
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా
  మోహంపు బుద్దుల్ దమిన్

  రిప్లయితొలగించండి
 9. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  రమణీ నీమృదు భావజాన్విత సుధాస్రావంపు దృగ్జాలమున్
  కమనీయాకృతిదాల్చుచున్నిచట శృంగారాది సంభారమున్
  తమకాగ్రేసరి పంచుమాహొయలు పంతంబున్ సతంబా రా
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్దమిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర గణదోషం. "సతంబౌనె రా" అందామా?

   తొలగించండి
 10. డా.పిట్టాసత్యనారాయణ
  జన నిర్వేదము తగునా?
  కనడమె నిర్బంధమాయె( family planning తో)
  గణనము దప్పెన్
  మన హిందూ జన వృద్ధికి
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధిన్

  రిప్లయితొలగించండి
 11. మనమున్ భక్తిని వీడినీ కొఱకు నేమౌనం బుగావే చితిన్
  తనువున్ తాపము నాదిదై వికము నోపంజాల నింకే టికిన్
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్
  వినయం బున్నాదు సంతసం బునను ప్రీతిన్ వరింపం గననన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. నాల్గవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 12. మనమున జపమును చేయుచు
  వనమున తిరిగెడు మునికిన్ వనితల పొందే
  ల నిజము, రతి కోరెడు కా
  "మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "మునికిని/మునులకు..." అనండి.

   తొలగించండి
 13. డా.పిట్టాసత్యనారాయణ
  జన సామాన్యపు బాధలన్ మరిచెనో చాంచల్యమున్ బొందెనో
  మన రూకల్ గనరావు "యీ-మని(internet transaction)"నిడెన్ మాన్య ప్రధానుండు యే
  మనగావచ్చు నిరక్షరాస్య విదులన్, మాతల్, పితల్, భ్రాతలన్
  ఘనమౌ సంకట మందు ద్రోయ గనమే గాంధేయ మోడీశు కా
  మునికిన్ నేర్పగనొప్పు రాజవదనా!మోహంపు బుద్ధుల్ దమిన్!

  రిప్లయితొలగించండి
 14. రాధ ఆలోచన

  ఘన కేయూరంబులు నవ
  వనజాతంబులనుఁబోలు భవ్యాక్షి యగం
  బును,గల శ్రీమేఘ శ్యా
  మునికిన్ నేర్పంగనొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2651
  *మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా ! మోహంపు బుద్ధుల్ దమిన్.*
  మునికి మోహం కలిగేవిధంగా శిక్షణ ఇవ్వాలి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అంగదేశానికి రాజైన రోమపాదుడు అనావృష్టితో కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రజల బాధలు తీర్చేందుకోసం తన దేశం సుభిక్షంగా ఉండేందుకోసం విభండక మహర్షి కుమారుడు, బ్రహ్మజ్ఞానం తప్ప లోకజ్ఞానం తెలియనివాడు అగు ఋష్యశృంగుని తన రాజ్యంలోనికి తీసికొని రాదలచినాడు. తండ్రి గుఱించి తప్ప ఇక ఏమీ తెలియని ఆ మునిని ఎలా తీసికొని రాగలరు అని మహారాణి ప్రశ్నింపగా , ఓ రాజవదనా ! గణికలను పంపి ఆ మునికి శృంగార విషయాలు తెలిసేటట్లు చేస్తాను అని రోమపాదుడు విశదీకరించే సందర్భం.

  కన డెన్నండును ఋష్యశృంగముని లోకమ్మున్ , విభూ! యెట్లు వ
  చ్చునొ ? నాథా ! యన రోమపాదు డనియెన్ ‘’శోభిల్లు శృంగార మో
  హినులన్ వేశ్యల బంపెదన్ గనుము నీవే , నేర్పునన్ వారలా
  *మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా ! మోహంపు బుద్ధుల్ దమిన్.’’*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (14-4-2018)

  రిప్లయితొలగించండి
 16. ఘనుడౌ గాధేయుని తప
  మును భగ్నమొనర్చకున్న ముప్పగు మనకున్
  జనుమా మేనక యవనికి
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్!!!

  రిప్లయితొలగించండి
 17. రిప్లయిలు
  1. దనుజుడు తారకు పీడను
   వెనువెంటనె తొలగజేయ వేడ్కగ గిరిజన్
   మనువాడ, కామునికి, సో
   మునికిన్ నేర్పంగనొప్పు మోహపుబుద్ధుల్!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మనువాడగ హిమనగ ధా।మునికిన్..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  3. అద్భుతంగా ఉంటుంది గురుదేవా! సవరిస్తాను! ధన్యవాదములు, నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి
  4. దనుజుడు తారకు పీడను
   వెనువెంటనె తొలగజేయ వేడ్కగ గిరిజన్
   మనువాడగ హిమనగ ధా
   మునికిన్ నేర్పంగనొప్పు మోహపుబుద్ధుల్!

   తొలగించండి
 18. వనమున కనుగొని భీముని
  వనితామణి యా హిడింబ వలపే రేగన్
  మనమున ననుకొనె, "నీ సో
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్."
  ***)()(***
  (సోముడు = చక్కని వాడు)

  రిప్లయితొలగించండి
 19. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  తనుమధ్యా !మృదు భావజాన్విత సుధా ద్రావంపు దృగ్జాలమున్
  కన నీయాకృతి నింపగ న్నెపుడు శృంగారాది సంభారమున్
  తనతో సౌఖ్యము పొందుమంచు నిక పంతంబున్ నరేంద్రుండు రా
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్దమిన్

  రిప్లయితొలగించండి
 20. మనమున గ్రుచ్చెన్ జూపులె
  యనంగుని శరముల వోలె యద్భుత రీతిన్
  వనితా నీవే యా కా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..వోలె నద్భుతరీతిన్...' అనండి.

   తొలగించండి
 21. మును కొని విశ్వామిత్రుo
  డొ న రించె డు తపము మాన్ప నొ య్యన బంపె న్
  జన గోరె నింద్రుడ ప్సర
  ముని కి న్ నేర్పoగనొప్పుమోహ పుబుద్దుల్

  రిప్లయితొలగించండి

 22. శ్రీకృష్ణ మాయ నారద సంసారం


  మనుజులదేల వలపుల బ
  డి నలుగుదురని నుడువుచు పడిపడి హసించం
  గ నగధరు తలచె ననిముష
  మునికిన్ నేర్పంగనొప్పు మోహపుబుద్ధుల్!

  ಜಿಲೇಬಿ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనిమిష' టైపాటు...

   తొలగించండి
  2. అది "అనిమిషముని". పర్యాయపద నిఘంటువులో అచ్చుతప్పు.
   'అనిమిషము' అంటే రెప్ప కొట్టనిది (చేప). 'అనిమిషులు' అంటే రెప్ప కొట్టనివారు దేవతలు. అనిమిషలోకం = దేవలోకం. అనిమిషముని = దేవముని (నారదుడు).
   (దమయంతి స్వయంవరానికి అష్టదిక్పాలురు వచ్చారు. ఆమె నలుణ్ణి వరించనున్నదని తెలుసుకొని వాళ్ళు నలుని రూపంతో నలుని ప్రక్కన కూర్చున్నారు. దమయంతి వాళ్ళను పరిశీలనగా చూసింది. ఒక్కడు తప్ప మిగిలినవా రెవ్వరూ కనురెప్పలు కొట్టడం లేదు. వారికి చెమట పట్టడం లేదు. వారి పాదాలు నేలను తాకడం లేదు. కనురెప్పలు కొడుతూ, చెమట తుడుచుకుంటూ, పాదాలను నేలకు ఆనించినవాడు ఒక్కడే. ఆ ఒక్కడే నలుడని గుర్తించి అతని మెడలో మాల వేసింది.... )

   తొలగించండి

  3. ధన్యవాదాలండి కంది వారు !అనిమిషముని యే సరి.

   అని - కలహము
   ముష - మూస

   కలహమే మూసగా గల ముని :)

   జిలేబి

   తొలగించండి
  4. అనిముషముని.. కలహమే మూసగా గల ముని... ఎవరూ పుట్టించకపోతే కొత్త పదాలు ఎలా వస్తాయి? వేసుకొనండి ఓ వీరతాడు!

   తొలగించండి


  5. అరనిముషముని చెలియ ! జిలే
   బి! నిమిషమున కొక్క మారు బిరబిర బరుకున్
   పనిలేక కంద పద్యము
   లను! గణ యతులుండు గాని లావణ్యము లే :)

   జిలేబి

   తొలగించండి
  6. నా తరఫున కూడ ఓ వీరతాడు వేసుకోండి!!👍👍😀😀

   తొలగించండి

  7. ధన్యవాదాలండీ సీతాదేవిగారు

   జిలేబి

   తొలగించండి

  8. నా తరపున వేసుకొనం
   డీ తరుణీ వీరతాడు! డీకొల్పెను సు
   మ్మీ తరమగు కొత్త పదము
   యేతావాతా జిలేబి యేయిది బామ్మా !

   జిలేబి

   తొలగించండి
 23. తనసతిఁ యచ్చర సరియై
  నను తమిగొనిఁ యేలుకొనక ననవరతము సా
  మునుచేసెడు మూర్ఖపు భీ
  మునికిన్ నేర్పంగనొప్పుమోహపుబుద్ధుల్

  --- శ్రీకాంత్ గడ్డిపాటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీకాంత్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండు అరసున్నాలను అవసరం లేని చోట ప్రయోగించారు. "తనసతి నచ్చర.." అనండి.

   తొలగించండి
  2. కృతజ్ఞతలండీ.. వద్దు వద్దనుకుంటూనే ఆఖరి క్షణంలో పెట్టాలేమో అనుకుని పెట్టవలసి వచ్చింది.
   ఒకసారి ప్రత్యేకంగా అరసున్నా మీద కూర్చోవాలి(తప్పు)దొర్లకుండా..

   తొలగించండి
 24. వని లో గాంచె హి డం బి ధీరయుతు డై భాసి oచు యోధా గ్రణిన్
  మనమంతా తన మాట మీరి యతని న్ మౌనమ్ముగా కోర గా
  తనదౌ చిత్తము నిర్ణ యింక చె నపుడు న్ దా దా త్మ్య భావాన భీ
  ముని కి న్ నేర్పగ నొప్పు రాజ వదనా మోహ oపుబుద్ది న్ దమి న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదం లో అదనం గా క పొర పాటు న టైపు అయింది మన్నించoడి

   తొలగించండి
 25. పనిగొని విశ్వామిత్రుని
  మునికిన్నేర్పంగనొప్పుమోహపు బుధ్ధు
  ల్నొనరెడు నాతని తపమును
  మిన్నునకున్రాకుండజేయ మేనకనంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బుద్ధుల్ + ఒనరెడు = బుద్ధు లొనరెడు' అవుతుంది. నుగాగమం రాదు. "బుద్ధుల్ పొనరెడు..." ఆనండి.

   తొలగించండి
 26. అనునయ వచనమ్ములు పలి
  కిన మేలగు సుమ్మి యింకఁ గృత పరిణయ బా
  లునకు ధృతి విసర్జిత కా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్


  కన మీ నైమిశ కానన మ్మిపుడు సంకాశాటవీ రత్నముం
  బునరుజ్జీవన హీన కారక మిలన్ మున్యాశ్రమ శ్రేణి కాం
  చన దేహద్యుతి హీన తామస గుణశ్రాంత వ్రజంబుండ లే
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్

  [లేము+ఉనికిన్ లేమునికిన్; ఉనికి = స్థానము; ఒప్పు = సమ్మతించు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 27. మన్మథుడు రతీదేవితో:

  కనుమా పార్వతి సేవలన్ వలచి శ్రీకంఠున్ సమాళింపగా...
  మనమున్ రూపుగ తీర్చెదన్ రగుల కామార్చుల్ నితాంతమ్ముగా
  వనికిన్ పోయెద దీటుగా నిపుడె పూబాణమ్ములన్ కూర్చుమా
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్

  సమాళించు = సంబాళించు = ఆదరించు
  ముని = మౌని

  రిప్లయితొలగించండి
 28. వందనం.. అభివందనం.. జీవితమన్నది మూడునాళ్ళని... యవ్వనమన్నది తిరిగి రానిదని...

  తనువే కూలను స్వల్పకాలమున తాత్సారమ్ములన్ మానుడీ
  వనితా భోగములందు యవ్వనమునే వర్ధిల్లగా జేయుడీ
  కునుకుల్ మానుచు క్రొత్తజంటలిక సంకోచమ్ములే వీడి,కా
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 29. మనువాడ నిప్పుడేయన
  వినినంతనె భయమునొంది వేగమెయా భా
  మినియనె "యిక నాయభిరా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపుబుద్ధుల్"

  రిప్లయితొలగించండి
 30. శ్రీరామునిచే తిరస్కృత యైన శూర్పణఖతో తన సఖి ఒకతె అంటున్న మాటలు.

  వనవాసమ్మును జేయు వానిఁ గనగన్వ్యామోహముల్ గల్గి రా
  మునిచే నట్లు తిరస్కరింప బడితే, ముగ్ధస్వరూపుండు సో
  ముని సౌందర్యనిభుండు లక్ష్మణుడు నామోదించు నో?రాము త
  మ్మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా! మోహంపు బుద్ధుల్ దమిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 31. అనయము తిని నిదురించెడు
  ననిలసుతుడు గృహమునందు నాదమరచి తాన్
  తనువును పెనగొని యా భీ
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   పద్యం బాగున్నది. అభినందనలు.
   కాని పూరణలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది.

   తొలగించండి
 32. శూర్పణఖతో రాముడు

  వనిలో తాపసి నైతినే వనిత నాభాగ్యమ్ము క్షీణించగా!
  నినునా రాణిగ జేకొనన్ దగదుగా నిక్కమ్ము సీతాపతిన్!
  కనుమా! పచ్చని దేహమున్ దనరెడిన్ కంజాక్షుడౌ లక్ష్మణున్!
  యనుమానించకు !భార్యలేదిచట ! వయ్యారీ! స్వతంత్రుండు! త
  మ్మునికిన్ నేర్పగనొప్పు రాజవదనా! మోహంపు బుద్ధుల్ దమిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవా! దనరెడిన్ కంజాక్షుడౌ సరయైనదా? దనరుచున్ కంజాక్షుడౌ సరియైనదా? రెండూ ఒప్పేనా? వివరించ ప్రార్ధన!🙏🙏🙏

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పచ్చని దేహమున్ గలుగునా కంజాక్షుడౌ లక్ష్మణుం। డనుమానించకు..." అంటే బాగుంటుంది.

   తొలగించండి
 33. గురువు గారికి నమస్సులు.
  కొనితెచ్చిన షోకులతో
  వనితల్ విటులన్ పిలుతురు వయ్యారముగాన్
  పనిలేని భావనారా
  మునికి నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
 34. ధనదాహమున్న?మోసము
  మనసున సద్భక్తియున్న?మౌనము యతిగా
  వినయము?టక్కరులున్ కా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
 35. గురువు గారు మూడవ పాదము సవరించినాను.పనిలేని ఖలుడయిన సోమునికి చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 36. ఇంద్రుడు మేనకతో:

  కనుమా కాంగ్రెసు నాయకున్ తపము ముక్కంటిన్ వలెన్ జేయడే!
  వినుమా మోదికి ముప్పులన్ వడిగ వేవేలన్ నివారించగన్
  చనుమా ఢిల్లికి దాల్చుచున్ వలపు పాశమ్ముల్ సుశీఘ్రమ్ము భీ
  ష్మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్

  రిప్లయితొలగించండి
 37. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వామ్మో ! శ్రీకాంత్ గారు ఫ్యూచర్ పోచిరాజు

   శ్వరరావు గారు !


   జిలేబి

   తొలగించండి

  2. *ఫ్యూచర్ పోచిరాజు కామేశ్వరరావు గారు అవుతారనడం ఖాయం

   చాలా బాగుంది

   జిలేబి

   తొలగించండి
  3. పరవాలేదా అండి?.
   జీవితంలో గత కొద్ది నెలల నుండే పద్యాలు గిలకడం. గత రెండు మూడు రోజులనుండే వృత్తాలు మొదలు. అధ్యయన లోపం తెలుస్తూనే ఉంది. పదకోశజ్ఞానం పెంచుకోవాలి ఇంకా..
   సమయంతో పోరాటం.. చూడాలి..
   ..కృతజ్ఞతలు..._()_
   --- శ్రీకాంత్ గడ్డిపాటి..

   తొలగించండి
 38. భీమునితో ద్రౌపదికి ఆరోజు తొలిరాత్రి యని కుంతి భీముని గూర్చి కోడలికి చెప్పు మాటలుగా నూహించిన పద్యం....


  అనిలో నేనుగు నైన గూల్చడె యనాయాసమ్ముగన్ గాంచినన్
  ఘనుడే యాతడు పౌరుషమ్మునను సంగ్రామమ్ములో ధీరుడే
  కనుమా ద్రౌపది సౌకుమార్యమునెఱుంగన్ లేడతండంటి భీ
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా మోహంపు బుద్భుల్ దమిన్

  రిప్లయితొలగించండి
 39. కనుమాసృష్టి రహస్య మందుగల సంకల్పంబులేన్నెన్నొ|మీ
  మనసున్ మార్పుకుకాలమే దెలుపు|ప్రామాణ్యంబులూహించ?కా
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా|మోహంపు బుద్ధుల్ దమిన్
  జననం బందునబిడ్డడేగుడువడా?స్తన్యంబు నూహించుమా|


  రిప్లయితొలగించండి
 40. తన లోలాక్షి విరాళికౌతుక నితాంతాసమ్మితమ్మై కనుం
  గొనియున్గేళినిఁదేల్చకన్ వపువుపై గోరోజనా గౌరవం
  బున వైధేయునిఁ బోలనెల్లపుడు సాముల్జేయు నక్కాడు భీ
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా! మోహంపు బుద్ధుల్ దమిన్


  (ముందు రాసిన కందానికే మత్తేభవర్తనమండి)
  ---శ్రీకాంత్ గడ్డిపాటి

  రిప్లయితొలగించండి
 41. మిత్రులందఱకు నమస్సులు!

  [తపోనిమగ్నుఁడైయున్న శివుని మనస్సును, పార్వతియందు లగ్నము చేయించుటకై యింద్రుఁడు మన్మథునిఁ బ్రోత్సహించుచుఁ బలికిన వాక్కులు]

  "దనుజుఁడు తారకు వధ యీ
  శుని పుత్రునిచే నగుఁ! జని, సుదతి నగజ యు
  గ్రుని సేవింపఁగ, జంగమ
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్!"

  రిప్లయితొలగించండి
 42. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణమిత్రులకు నమోవాకములు... నేను ఇతరేతర కారణములవలన గ్రామాంతరమందుంటిని... అందుచే ప్రభాతవేళలో పూరణలను పంపలేకున్నాను... విలంబమునకు మన్నించండి.... క్రమం తప్పకుండా ఇటూ అటూగా పంపిస్తాను... అవధరించండి 🙏

  ఘన ధర్మాచరణమ్ము కాయిక తపఃకార్యమ్ముగా , మౌన సా..
  ధనయే వాచికమౌ తపంబనుచు వేదంబుల్ విశేషమ్ముగా
  మునికిన్ నేర్పఁగ నొప్పు ., రాజవదనా ! మోహంపు బుద్ధుల్ దమిన్
  గన వ్యర్థమ్ములు గావె నేర్ప , వరదీక్షాభగ్నతన్ గూర్పవే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ విరుపుతో, వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 43. (2)
  "దనుజుం దారకుఁ జంపఁగా, సుబలుఁడౌ దక్షాధ్వరధ్వంసు పు
  త్రునిఁ బుట్టింపను, నీశు మ్రోల సుదతిన్ దుర్గాంశ సంభూత గౌ
  రిని నిల్పంగనుఁ గాంచఁడే! విడిచి నీ శృంగార బాణాళిఁ, ద
  న్మునికిన్ నేర్పఁగ నొప్పు, రాజవదనా! మోహంపు బుద్ధుల్ దమిన్!"

  రిప్లయితొలగించండి
 44. ఋష్యశృంగుని రప్పించుట కొరకు దశరథుడు శాంతను పంపే సందర్భంలో

  వనమున తిరిగెడి వానిని
  ఘనముగ పురికి పిలిపించ కలుగును వానల్
  యనవిని పంపగ సుతనా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్.

  వినుమా మేనక వడిగా
  చనుమా తపమును చెరుపగ జవమున నీవున్
  వనమున తపమొనరించెడు
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్.

  శూర్పనఖ తనమదిలో

  మదిలో మరులు గొనుచు రా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్
  ననిశము నను వీడనటుల
  వినయముతో నేర్పుదునని వెకిలిగ తలచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'వానల్ + అవనిని = వాన లవనిని' అవుతుంది. యడాగమం రాదు. (అయినా పంపింది శాంతను కాదు, వేశ్యలను. అతడు వచ్చిన తర్వాత శాంతనిచ్చి వివాహం చేసారు).
   మూడవ పూరణలో 'బుద్ధుల్ + అనిశము = బుద్ధు లనిశము' అవుతుంది. నుగాగమం రాదు.

   తొలగించండి
 45. వినయంబొప్పుచు నింతులన్గనగ నెవ్వేళన్బ్రవర్తించుమా
  మునికిన్నేర్వగనొప్పురాజవదనా! మోహంపు బధ్ధుల్దమిన్
  దనివిందీరగ జూతురేసతతమెత్తరిన్సుఖంబున్దగ
  న్వినుమా యయ్యది వారికి న్నగును నెవ్వేళన్బటాపంచలే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 46. హిడింబ అంతరాత్మలో
  తనువందున్ సెగ హెచ్చుచుండెను, లతాంతాస్త్రుండు వేగమ్ముగా
  ఘనమౌ బాణములెన్నియో విడచుచున్ కారించ, నేనిచ్చటన్
  కనుచుంటిన్ కడుఁ దాపమున్, గొనగ సౌఖ్యమ్ముల్ గరంమిచ్చ భీ
  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా! మోహంపు బుద్ధుల్ దమిన్

  రిప్లయితొలగించండి
 47. మన రాజ్య సుభిక్షమునకు
  వనమున కావశ్యకముగ వారాంగనలన్
  పనుపవలయు, వైభాండక
  మునికిన్ నేర్పంగనొప్పు మోహపు బుద్ధుల్

  రిప్లయితొలగించండి
 48. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన
  --------------------- ---------------------------------------------------
  ------------------------ ----------------------------------------------------  దరికి వచ్చెడు శూర్పణఖను జూచి , లక్ష్మణుడు ముందుగా దాని

  అవయవ ‌ సంపదను బాగా పొగిడాడు • నిన్ను మన్మథ లీలలో

  దేలింతు రమ్మని ఊరించాడు • పొంగిపోయి అది‌ దగ్గరకు‌ చేరగా

  ముక్కు చెవులు కోసి పంపించాడు ‌ •

  అసలు రామ కథకు లక్ష్మణుడే నాంది పలికి నాడు • ఇది తథ్యం •


  -------------------------------------------------------------------------
  ఘన శైల ద్వయ ముద్గమించు గతి బొంగారున్ భవ ఛ్ఛ్రోణులే |

  స్తన యుగ్మంబు పరిప్లవించును మహా సంపుష్ట శృంగార ‌ మో

  హ నికేతమ్మయి | సుందరీ ! దరికి రావా ! యూర్మిళాత్మాభిరా

  మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా ! మోహంపు బుద్ధుల్ దమిన్ |

  నును మోవిన్ - నునుమోవి సంఘటిల , ‌ మేనున్ - మేను సంధిల్లగా

  దనియం జేయుము నన్ను | నిన్ను గుసుమాస్త్ర క్రీడ దేలింతు - ర

  మ్మనుచున్ శూర్పణఖన్ , దళించె గద నాసాగ్రంబు కర్ణద్వయిన్ |

  గన , సౌమిత్రియె పల్కె రామ కథకున్ నాంద్యుక్తి సంసక్తి తో  [ ఉద్గమించు = ఎగురు ; పరిప్లవించు = దుముకు ;

  సంపుష్ట = పుష్టి గా పెరిగిన ; నికేతము = సంకేతము , గురుతు;

  ‌‌‌‌‌‌ తనియం జేయు = తృప్తి పరుచు ; దళించె = కోసెను ;

  ‌‌‌ ‌ నాంది + ఉక్తి = నాంద్యుక్తి = నాంది వచనము ;

  సంసక్తి = ఆసక్తి , close connection ]


  -----------------------------------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 49. మత్తేభవిక్రీడితము
  కనుచున్ మేటి నటుండు దర్శకుడుఁ దా గాధేయుఁడై నిల్వగన్
  జనులే మెచ్చఁగ మేనకన్ గలుప గూర్చన్ నాట్య విన్యాసమున్
  వెనుకాడన్నొక నృత్య దర్శకియె నావిద్వన్నటుండిట్లనెన్
  మునికిన్ నేర్గపఁ నొప్పు రాజవదనా!మోహంపు బుద్ధుల్ దమిన్

  రిప్లయితొలగించండి
 50. 14-4-18 సమస్య
  *"మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా*
  *మోహంపు బుద్ధుల్ దమిన్"*

  సందర్భము: విశ్వామిత్రుని తపోభంగానికి అప్సరసయైన మేనకను పంపుతూ ఇంద్రు డామెతో జాగ్రత్తగా వుండు మని యిలా చెబుతూ వున్నాడు.
  విశ్వమిత్ర మహర్షితో వ్యవహారం మామూ లనుకుంటున్నావా! ఆతడు కామాన్ని నిగ్రహించడంలో మహా బలవంతుడు. అతని బలాన్ని మనం అంచనా కట్టలేము.
  ఒక్కొక్కసారి తపస్సంపన్నులలో వుండే కామం వారి చెప్పుచేతల్లో వున్నట్టే భ్రమ గొలుపుతుంది. వారు యేమాత్రం యేమరుపాటుగా వున్నా ఒక్కసారిగా మహా క్రోధంగా పరిణమిస్తుంది. అది సామాన్య మయింది కాదు. ప్రళయ కాలంలో ప్రజ్వరిల్లే అగ్ని లాంటిది.
  వారి వాక్కునుంచి వెలువడే ప్రతిమాటా ఆ సమయంలో యథార్థమై తీరుతుంది. ఘోరమైన శాపంగా మారుతుంది. ఏ విపరీత పరిణామానికో దారితీస్తుంది. కాబట్టి యెంతో జాగ్రత్తగా మసలుకోవాలి సుమా!
  అలా మసలుకుంటూనే నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాల్సి వుంటుంది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  మునితోడన్ వ్యవహార మన్న నది మా
  మూ లంచు భావింతువే!...
  ముని కామంబును ద్రొక్కి పెట్టెడు బలం
  బున్ జెప్పగాలేము.. దా
  గిన కామం బది యొక్కసారి బ్రళయా
  గ్ని భ్రాంతిమ త్క్రోధమౌ...
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా!
  మోహంపు బుద్ధుల్ దమిన్..

  మరొక పూరణము....

  .. ..సమస్య
  *"మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు*
  *బుద్ధుల్"*

  సందర్భము: రాముడో శివుడో మనసులో స్థిరంగా నిలిచిపోతే యిక అతడు మనలోకంలో వుండడు. ముని యైపోతా డనవచ్చు. ఐహికం అతని కిక పట్టదు.
  ఒకవేళ అతనిని మన దారిలోకి యెలాగైనా మరలించుకోవా లనుకుంటే మోహపు బుద్ధులు నేర్పేందుకు ప్రయత్నించాలి.
  (చి.మేడిచర్ల హరి నాగభూషణం
  చి.ముమ్మడి చంద్రశేఖరాచారి ప్రేరణతో)
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  అనయము హరియో హరుడో
  మనమున నిలిచిన నతండు
  మహిని ముని యగున్
  మనలోఁ గలుపుకొనగ నా
  మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 51. రాజవదనకు ఒక అర్జీ:

  కనుమా! దీదిని వంగభూమినట తా కాంక్షింప లేరే వరుల్
  పనిలో మున్గగ దేశమేలగను తా ప్రాధాన్యమున్ గోరుచున్;...
  కనుగొన్ దెచ్చుచు కాననమ్ములనటన్ గాలించు కోదండ రా
  మునికిన్ నేర్పఁగ నొప్పు రాజవదనా మోహంపు బుద్ధుల్ దమిన్

  రిప్లయితొలగించండి