విపులను
కదుమి విఖురుడు విషధిని నడ
చగ, ఖగవతి
మొరను విని జలశయనుడు
వడి వడిగ పరుగిడి కిరి పొడమిని
బడ
సి
ఖచరుని దునిమి మహికి సుఖము నొసగ
గ సురలు
కపిలుని ఘనముగ నుతుల నిడె
హిరణ్యాక్షుడు భూమిని
పట్టి బంధించగా భూదేవి ప్రార్ధన విని
హరి వరాహ రూపమున అవతరించి రాక్షసుని జంపి భూదేవికి విముక్తి కలిగించగా దేవతలు
హరిణని పొగడిరి .
విపుల = భూమి, కదుమి = ఆక్రమించి, విషధిని = సముద్రమునందు, అడచగా = దాచగా, ఖగవతి = భూమి, జలసయనుడు = హరి, కిరి= పంది, పొడమి = రూపు, బడసి = దాల్చి, ఖచరుని = రక్కసుని.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
బాగుంది హరి ప్రార్ధన , తగిన చిత్రము. సరస్వతీ పుత్రులకే ఇవి సాధ్యమగును
రిప్లయితొలగించండిధన్యవాదాలు అక్కయ్య గారు
రిప్లయితొలగించండిసూర్య కుమార్ గారు బాగుంది మీ వరాహ బంధ తేటగీతి చిత్రమాలిక. కదిమి యనండి. సురలు – ఇడె వచన భేదము. సవరించ గలరు.
రిప్లయితొలగించండి