గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2649 సమస్య :: *సరసం బాడుట చేతకాదు గద కృష్ణా ! గోపికావల్లభా !* కృష్ణా ! నీకు సరస మాడటం రాదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ఓ కృష్ణా ! గోపికావల్లభా ! యశోదానందనా ! నీవు నవ్వుతూ పలుకరిస్తావు. రకరకాల కథలు చెప్పి నమ్మిస్తావు. సుందర రూపంతో దర్శన మిస్తావు. సుమధుర వేణు గానంతో పరవశింప జేస్తావు. అందరి మనసులను గెలుచుకొంటావు. ఇలా గొప్పగా సరసాలాడే నీ ముందు సరసాలాడటం నాకు చేతకాదు అని ఒక గోపిక కృష్ణునితో సరసాలాడే సందర్భం.
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. రెండవ పూరణ తృతీయపాదాంతంలో 'భర్తకున్' అని ఉండాలి కదా? దాని తర్వాత సరళాదేశం లేదు కనుక అక్కడ బిందువు రాదు.
శంకరాభరణ కవి వరులారా నమస్సులు. మీ యందఱి శుభాకాంక్షలతో గురు దేవులు పెద్దల యాశీర్వచన బలముతో నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” 23/3/2018 న సమాప్త మయినది. ఇప్పుడు విశేష పరిశీలనలో నున్నది. 68 సర్గములు, 2451 పద్యములు.
సీతారామయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పురిగొల్పంగను నేపనిం జలుప నామోదింపవచ్చున్... ముచ్చటల్సేయగన్...' అనండి. 'దాచి + ఉంచెదో' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
(చీరలావిధముగ చెట్లపై వేసి ఏమెరుగక ఉంటివి కదా మనోహరా (మనస్సులను హరించు వాడా) నువ్విలా రచ్చ చేస్తే ఎవరికి హాయిగా ఉంటుంది? అలా ఎందుకు చేశావో (కాత్యాయనీ వ్రత నియమాలు) అర్ధమైన పిదప గోపికలు ఆగలేరు కద. కృష్ణా! చక్కగా సరసమాడుట చేతకాదా?) శ్రీకాంత్ గడ్డిపాటి. (నా మొదటి మత్తేభ విక్రీడితము అండీ)
శ్రీకాంత్ గారూ, మొదటి మత్తేభమైనా చాలావరకు బాగున్నది. 'తానేమెరుంగన్' అన్వయదోషం. "తాత్పర్యమున్ అరయన్' అని విసంధిగా వ్రాయరాదు. "తాత్పర్యమే యరయన్" అనవచ్చు. 'లాగ' అన్నది సాధువు కాదు. పద్య రచనా వ్యాసంగం కొనసాగించండి. తొందరలోనే మీరు నిర్దోషంగా చక్కని పద్యాలు వ్రాస్తారు. స్వస్తి!
సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సురరాట్' అని సమాసంలో కాకుండా విడిగా ప్రయోగించరాదు. అక్కడ "సురరాడ్వందిత పాదయుగ్మము..." అనండి. 'శశిసూర్యాక్షముల్' అనాలి. కాని అలా అంటే గణదోషం అవుతుంది. మిగతా పద్యమంతా అద్భుతంగా ఉన్నది.
బావ ! యాదవా ! యని నిన్ను పలు విధముల సరస మాడిన నా కనుల్ తెరచు కొనెను నీదు విశ్వరూపము గాంచ నిజము తెలిసె "సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!" (భగవద్గీత లో విశ్వరూపసందర్శన యోగం లో అర్జునుడు ఇలా భక్తిపూర్వకంగా తన పశ్చాత్తాపాన్ని వెల్లడించాడు)
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివర సత్యాపతి ! వాదులాడగలనా ? , వైదర్భివోలెన్ నినున్
దురితధ్వంస ! ముదంబునన్ తులసితో దూచంగ నే నేర్తునా ?
స్మరియింతున్ భవదీయ పాదయుగళిన్ సద్భక్తితో నింతియే !
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆహాఁ!
తొలగించండినిజమే గరువుగారు. చాలా మనోహరంగా ఉన్నది.
అద్భుతం మైలవరపు వారూ!
అవధానుల సాటి యింకెవరూ!!
నమోన్నమః!
🙏🏻💐
కృష్ణార్జునయుద్ధం.... లో అర్జునుడు.....
తొలగించండివర గాండీవము చేతఁ దాల్చితిని యాపన్నాళి రక్షింపగా !
నరుడన్ మాయలు చేతకావు , గయుడున్ నమ్మెన్ ననున్ , కేశవా !
శరణంబే రణమింక , నాకు బలమే సాహాయ్యమౌ ! నీ వలెన్
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీ విట్టుబాబు గారికి... సందేశసంధానకర్త శ్రీ శాస్త్రి గారికి మనఃపూర్వకనమశ్శతములు... నమోనమః 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
నీ మాయలు నాకెరుకలే నల్లనయ్యా !
తొలగించండిమురిపెంబన్ననెరుంగవట్లె మురళిన్ మ్రోగింపగా నేర్వవే..
పరకాంతన్ దరిజేరబోవు , యమునా ప్రాంతమ్మునందిర్గుచున్
సరసంబాడుట చేతకాదుగద కృష్ణా ! గోపికావల్లభా !
యరవిందాక్ష ! యటన్న నమ్మ నెటులయ్యా ! కొంటె గోపాలకా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిస్వామి వారు మీకీ జవాబు పంపించేరండీ మైలవరపు వారు :)
మురళీ! మైలవ రంపు మిత్రుడ! భళీ మోదావు! నాతోనయా
తిరకాసుల్? విను నాదు గీత యిదిగో! తీండ్రమ్ముగా చెప్పితిన్
వరుసల్ గట్టి జిలేబు లెల్ల కనరావా!నల్లనయ్యా యనన్
పరుగెత్తానయ ! వెంబడించి యనిరే "వంశీధరా!ధర్మమా
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా"!
మెసేజ్ ఫ్రమ్ ది లార్డ్ :)
జిలేబి
చదువగ భగవద్గీతను చక్కగాను
రిప్లయితొలగించండితెలియదె పరమాత్మ తెఱగు తేటగాను
నవ్వులాటలు లేవిట నందగోప!
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకములనేలు వాడవు శోకములను
రిప్లయితొలగించండిదీర్చెడు భవ బంధములకతీతుడవట
ధర్మ రక్షకుడవు నీవు ధాతవీవు
సరస మాడగ దగవు కృష్ణా ముకుంద
ధాత......రక్షకుడు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివలపు గోర నుద్ధవగీత వరుస బెట్టి
నైపుణము గనమని పంపి నావు యాద
వు డొకడిని! నీ సరి మురళి నూద గలడె?
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
కృష్ణం వందే జగద్గురు!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కృష్ణం వందే జగద్గురుమ్'
సర్వదుష్టుల సమయించు చక్రధారి!
రిప్లయితొలగించండివిశ్వగీతను బోధించు వినుతచరిత!
భక్తవరులను కరుణించు భద్రవదన!
సరసమాడగ దగవు కృష్ణా!ముకుంద!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నొచ్చు నేమోవితా నము గుచ్చు కొనగ
రిప్లయితొలగించండిసత్య దన్నిన డాకాలు చక్క బరచి
చెలుల ప్రేమను ముదమందు చిలిపి దొంగ
సరస మాడఁగ దగవు కృష్ణా ముకుంద
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివిరసం బేలర వెన్న దొంగ యెలమిన్ వృందావ నంబందునన్
పరిచర్యల్ సయి మేలు వేడబములన్ పాటించినామే సదా
హరిగోలై నిను నమ్మినాము గదరా !హాసించి భాషించుమా
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!
నాటి గోపికలు నేటి జమానాలో !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బృందావనం బందు నీ। పరిచర్యల్..." అనండి. 'అందు, నన్' సమానార్థకాలైన ప్రత్యయాలు.
మదను బాణము లన్ వైచి మనసుదోచి
రిప్లయితొలగించండితప్పుకొని తిరుగుట నీకు ధర్మమగున
తనువు వేడిని చల్లార్చ తత్క్షణమ్ము
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద
తగవు: న్యాయము
అన్నపరెడ్డి వారూ,
తొలగించండి'తగవు' శబ్దానికి ఉన్న అర్థభేదంతో వైవిధ్యమైన పూరణ చెప్పారు. బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిశంకరాభరణం...12/04/2018...గురువారం
రిప్లయితొలగించండిసమస్య:
సరసమాడగ దగవు కృష్ణా! ముకుంద!
**** **** ********
తే.గీ.
ఒక గోపిక ఉవాచ....
సరసమాడుటలో నీకు సాటి నీవె!
చిలిపి చేష్టలకును జగత్ జెట్టి నీవె!
లీలలెన్నొ జూపితివి చక్రి!తెలుపేల
సరసమాడగ దగవు కృష్ణా! ముకుంద ?
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెలుపేల'...?
వలువలు దాచి ఒలువగ శరీర ప్రేమ
రిప్లయితొలగించండిజ్ఞానదాతవని శరణనె గొల్ల భామ
వేణువూది వేదము తెలుప అరవింద
సరస మాడగ దగవు కృష్ణా ముకుంద
తొలగించండివలువలను దాచి ఒలువగ వనిత లెల్ల
భక్తి మార్గమున శరణు! భామినులకు
వేణు వూద వేద్యమ్మాయె విశ్వమెల్ల
సరస మాడగ దగవు కృష్ణా ముకుంద!
జిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి చక్కని పద్యరూపాన్నిచ్చారు. ధన్యవాదాలు!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2649
సమస్య :: *సరసం బాడుట చేతకాదు గద కృష్ణా ! గోపికావల్లభా !*
కృష్ణా ! నీకు సరస మాడటం రాదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ఓ కృష్ణా ! గోపికావల్లభా ! యశోదానందనా ! నీవు నవ్వుతూ పలుకరిస్తావు. రకరకాల కథలు చెప్పి నమ్మిస్తావు. సుందర రూపంతో దర్శన మిస్తావు. సుమధుర వేణు గానంతో పరవశింప జేస్తావు. అందరి మనసులను గెలుచుకొంటావు. ఇలా గొప్పగా సరసాలాడే నీ ముందు సరసాలాడటం నాకు చేతకాదు అని ఒక గోపిక కృష్ణునితో సరసాలాడే సందర్భం.
దరహాసమ్మున బల్కరించి, కథలన్ తాదాత్మ్యమున్ గూర్చి, సుం
దర రూపమ్మును జూపి, వేణు రవళిన్ ధన్యాత్ములన్ జేసి, యం
దరి చిత్తమ్ముల గెల్చుచుందువు యశోదానందనా ! నీ యెడన్
*సరసం బాడుట చేతకాదు గద కృష్ణా గోపికావల్లభా !*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-4-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమూ, మనోహరమూ అయిన పూరణ. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండికోటా వారూ!
తొలగించండిమీ పూరణ వేనోళ్ళ ప్రశంసనీయం!!
🙏🏻💐
సహృదయులు శ్రీ Ps Rao విట్టుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపల్లె లందున వరుసలు పరిఢవిల్లు
గాన పరిహాసములు లేక గడువ దచట
నగరమున నెవరికెవ్వరో నగవుకైన
సరసమాడ దగవు(జగడము)కృష్ణా!ముకుంద!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిధరణిన్ తొమ్మిది భక్తి రీతులను తాదాత్మ్యమ్ము బోధించినన్
వరదా! యాత్మనివేదనా భరితులౌ భక్తాది సఖ్యమ్ము లే
క రసాస్వాదన జేయ నెవ్వరికి సౌకర్యమ్మె? మీతో సదా
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా!గోపికావల్లభా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివరుడే తెల్గును మాధ్యమంబు గొనగా వచ్చెన్ మహా యోగమే
పరదేశంపు విభాషనున్ గనినదౌ భార్యా మణిన్ జేకొనెన్
సరిగా నాంగ్లము రాకపోగ గదిలో సల్లాపముల్ నాస్తి గాన్
సరసంబాడుట చేతకాదు గద, కృష్ణా! గోపికా వల్లభా!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విభాష'...?
తేటగీతి
రిప్లయితొలగించండిధరణి పై నవ విధ భక్తి తత్వమున్న
సఖ్య మాత్మ నివేదనా సరళిఁ దెలిసి
దగ్గరైన వారికి తప్ప తదితరులకు
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మధురా నగరిలో చల్లలమ్మబోదు!
రిప్లయితొలగించండిమధుర నమ్మగ చల్లల మంచివెన్న
చెలుల గూడుచు జనుచున్న చిన్నదాన
చెయ్యి విడువరో చెలికాడ! చిక్కుబెట్టు
సరసమాడ తగవు, కృష్ణా! ముకుంద!
తగవు = కయ్యము
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపరువంబొల్కుచు పెన్మిటిన్ సయిగలన్ పైటాల బిల్వంగ తా
హరిమన్నర్థము గాన లేక కవితల్ హాహాయనన్ గూర్చుచుం
డెర!గోపాల!నెటుల్ ధవున్కొలుచుచున్ డీకొల్పుదున్!యాదవా!
సరసంబాడుట చేతకాదు గద, కృష్ణా! గోపికా వల్లభా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పైటాల, హరిమన్'...?
తొలగించండిపైటాల - మధ్యాహ్నము
హరిమ - కాలము
ధర్మ రక్షణ సేయగా ధరణి వెలసి
రిప్లయితొలగించండిపాండవు ల కండ యై నిల్చి పర గి తీవు
గీత బోధను జేసిన పూత చరిత
సరస మా డ గ తగవు కృష్ణా !ముకుంద !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియమునా తీరమునా...సంధ్యా సమయమునా....
తొలగించండిజయహో జయభేరి! ☺️
రాధను! నిను చూడగనిట రాగమునను
తొలగించండియెదురు చూచు బేలను నేను; యేర! జాలి
యె కలుగద యదు నందన! యే వనితల
కొంగుల గొని యేమిమ్మని కొసరి నావొ!
యే సఖియతొ కులికితివొ! యేమని మరి
యింత సేపు యే యింతికి వంత పాడి
నావొ దాని చెం తకె పోర! నంద గోప!
"సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాగమునను + ఎదురు = రాగమున నెదురు' అవుతుంది. యడాగమం రాదు. అలాగే 'నేను + ఏర' సంధి నిత్యం.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
సరసం బాడుట చేత గాదు గద కృష్ణా ! గోపికావల్లభా !
సరసన్ జేరి నిమేష మైనను పరిష్వంగంబు నందుంచి మా
ధురి జూపింపవు | ముద్దు వెట్ట | వెచటో దూరమ్ముగా నక్కుచున్ ,
విరహాగ్నిన్ రగిలింప జేతువు , భవద్వేణు స్వరాలాపనన్ |
సరసీజాక్షులు వారికేళి నలరించన్ జుచి కోకల్ హరిం
చి రివంచును చాటుగా గల మహా సిధ్రమ్ము పైకెక్కు తుం
టరి వీవే సుమ ! మోహ యుక్త మగు క్రీడన్ స్త్రీల దేలింతువే ?
రివంచు = రివ్ + అంచు
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
"చి రివంచును.." అన్నచోట గణదోషం. సవరించండి.
గురు మూర్తి ఆచారి గారు నమస్సులు. రివ్ + అంచు= రివ్వంచు సాధువు.
తొలగించండిఅనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.
కింతత్ + అనియె = కింతత్తనియె
కస్త్వమ్ + అనియె = కస్త్వమ్మనియె
దో ష ము తె లి పి నం దు కు ధ న్య వా ద ము లు
తొలగించండిపోచిరాజ కామేశ్వర సత్కవి శేఖరులకు ప్రణామములు
నేను సవరణగావింప యత్నించెద
“హరిం/ చి రవక్షీణపదద్వయమ్మున మహా...” అన్న బాగుంటుంది. జూచి ముద్రణ దోషము.
తొలగించండిగురుమూర్తి ఆ చా రి
తొలగించండిచివరి నుండి రెండవపాదము సవరణ
..............................
చి రయానన్ దరి యందు నుండిన మహా సిధ్రమ్ము పైకెక్కు తుం
భేద బావము లేకయె ప్రేమ బంచి
రిప్లయితొలగించండికొంటె యనిపేరు కొనితెచ్చు కొంటివీవె
యెవరి తోడను మఱినీవు నెప్పుడైన
"సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద?"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేణు గాన లోల పదము విడువ జాల
రిప్లయితొలగించండిమేరు ధీర గంభీరనీ మేధ చూడ
తీరు తెన్నులు నీవనే తెల్ల మాయె
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
Dr Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కన్నె పిల్లల తోడన గలను నైన
రిప్లయితొలగించండిసరస మాడగ తగవు కృష్ణా! ముకుందా!
వారి గాపాడు దుష్టుల బారి నుండి
యార్త రక్షకు డవుగాన నడుగు చుంటి
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలు బట్ట్టగ వచ్చిన పడతి నడచి
రిప్లయితొలగించండినావు,బండి చక్రమ్మును నట్ట నడుమ
త్రుంచి రక్కసు ప్రాణముల్ త్రోఛి నావు,
రోలు నడుముకు జుట్ట తరువుల జతను
గూల్చినావు, గోవర్ధనమ్ కొండ నెత్తి
జనతకు ముదము నిడినావు, సరస గతిని
పాము పడగ నె క్కి నటితి పఱచి నావు ,
యిళ్ళ లోదూరి వెన్నను కొల్ల గొట్టి
నావు, తరచి చూడ నిలలో నీవు యిట్టి
పనులనే జేసితివి గదా, పడతి తోడ
"సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గోవర్ధనమ్' అని హలంతంగా వ్రాయరాదు. "...గూల్చి గోవర్ధనమ్మను కొండ నెత్తి"... అనండి. 'పరచినావు + ఇళ్ళలో' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పఱచినాడ । విళ్ళలో దూరి..." అనండి.
సరసీజాక్షుడ !నీకు సాటి యెవరో చర్చింప మృగ్యమ్మగున్
రిప్లయితొలగించండిమురిపెమ్ముల్ గురిపించినావు గదరా ! మోహమ్మె బుట్టించుచున్
తరుణుల్ వేలుగ నిన్నుజేరుదురుగా ! తర్కింప నింకేరికిన్
"సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అవునండీ! చక్కని పూరణ! అభినందనలు! 💐💐💐
తొలగించండిసరసం బాడుట చేత కాదు గద కృష్ణా? గోపికావల్లభా?
రిప్లయితొలగించండిసరసం బాడగ నాది సద్గురువువై సాధించితే కీర్తి, నా
సరసత్వంబుల నాడ గోపసఖినే!, సాన్నిధ్యమేపారగన్
గరమర్థించెద నీదు భక్తికొరకై, కాపాడుమో!శ్రీహరీ!.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర మౌ చల్లని చూపుల న్ బరపుచు న్ కం జా క్షులౌ గోపికా
రిప్లయితొలగించండివి ర హం బు ల్ వదలిoచి వేణు సడి తో విశ్వాన్ని మో హాం బు ధి న్
త రి యింపం గ నొ న ర్చు యో గ్యపరుడౌ దామోదరా నీ యె డ న్
సరస oబాడు ట చేత కాదు గద కృష్ణా !గోపికా వల్ల భా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఝరిగా చంద్రుడు వెన్నెలన్ విడుచు శారదా నిషల్లోన గో
రిప్లయితొలగించండిప్పరివరాంగనలందరూ మురళి దివ్య గాన యాసక్తులై
హరితో రాధిక పాట బాడు తరి నాయ్యో! గోప బాలుడిట్లనెన్
"సరసంబాడుట చేత కాదు కద కృష్ణా గోపికా వల్లభా!"
సరసన + పాడుట గా తీసుకోవడం జరిగింది
గోప బాలుడు రాధిక కు కూడా కృష్ణుని వేణు గాననికి అనుకూలము గా పాడలేకున్నది అని ఆమెను ఆట పట్టిస్తున్నాడు
తప్పులు ఉంటే సరిదిద్దగలరు
శ్రీకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, రెండవ పాదాలలో గణదోషం. మూడవపాదంలో యతి తప్పింది. సవరించండి.
(కృష్ణుని చేష్టలు భరించలేని గోపిక తలపులు)
రిప్లయితొలగించండివేణువూదుచు మము జేసె వివశు లంచు
పరమ ప్రీతిచే నిను జేర పడెద వేల
సరసమాడఁగఁ దగవు? కృష్ణా! ముకుంద!
ప్రేమరాహిత్యము తగునా వెన్న దొంగ?
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రవణమ్మున్ స్మరణమ్ముఁ గీర్తనములన్ సంసేవనార్చాదులన్
రిప్లయితొలగించండిచరణాబ్జద్వయి మ్రొక్కి సల్పెదను, దాస్యత్వమ్ము సఖ్యమ్ములన్
హరి! నీ కై యెనరింతునయ్య,తుది నా యాత్మార్పణం జేతు,నీ
సరసంబాడుట చేత కాదు గద కృష్ణా!గోపికావల్లభా!.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'ఆత్మార్పణం' అనడం వ్యావహారికం. "నా యాత్మార్పణం బిత్తు" అందామా?
నమస్కారములు.
తొలగించండిఅలాగే "యాత్మార్పణం బిత్తు",మరియు
మొదటి పాదంలో
"శ్రవణమ్మున్ స్మరణమ్ము"కు బదలుగా
స్మరణమ్మున్ శ్రవణమ్ము"గా చదువగలరు.
భాగ్యవంతునకీయవు బహుళసుతులు
రిప్లయితొలగించండిపేదవానికి యిత్తువు పెక్కుసంతు
చదువు యిచ్చినయెడ లచ్చిలేదు! ఇట్టి
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
భాగ్యవంతునకీయవు బహుళసుతులు
పేదవానికి యిత్తువు పెక్కుసంతు
చదువు యిచ్చినయెడల లచ్చినొసగవుగ
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
- శ్రీకాంత్ గడ్డిపాటి
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పేదవానికి నిత్తువు... చదువు నిచ్చిన...' అనండి. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
అలాగేనండీ.. _()_
తొలగించండిభాగ్యవంతునకీయవు బహుళసుతులు
పేదవానికి నిత్తువు పెక్కుసంతు
చదువునిచ్చిన చోటుల చాల లేమి
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
అక్షయ పాత్రలో నొక్క మెతుకైన నున్న నిమ్మనిన కృష్ణునితో ద్రౌపది మాటలు:
రిప్లయితొలగించండిముని వరుండు దుర్వాసుఁడు సనెను నదికి
భోజనార్థి యన నడుగ భాజనమ్మె
కడుగ నక్షయ పాత్రను గలదె మెతుకు
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
వర పుష్పాదులు తేఁడు ముచ్చటగ నే వాచ్యంబులం బల్కఁడే
నిరతం బా ధన సంచయ వ్యసన సాన్నిధ్యుండు మూర్ఖుండు దా
నొరులం జూచియు నేర్వ నొల్లఁ డితఁ డయ్యో రామ! నా భర్తకుం
సరసం బాడుట చేత కాదు గద కృష్ణా! గోపికా వల్లభా!
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
రెండవ పూరణ తృతీయపాదాంతంలో 'భర్తకున్' అని ఉండాలి కదా? దాని తర్వాత సరళాదేశం లేదు కనుక అక్కడ బిందువు రాదు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. అవునండి పొరపాటైనది. గమనించ లేదు. ధన్యవాదములు.
తొలగించండివర పుష్పాదులు తేఁడు ముచ్చటగ నే వాచ్యంబులం బల్కఁడే
తొలగించండినిరతం బా ధన సంచయ వ్యసన సాన్నిధ్యుండు మూర్ఖుండు దా
నొరులం జూచియు నేర్వ నొల్లఁ డితఁ డయ్యో రామ! నా భర్తకున్
సరసం బాడుట చేత కాదు గద కృష్ణా! గోపికా వల్లభా!
అద్భుతమైన పూరణలార్యా!! నమస్సులు!!🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిడా. సీతా దేవి గారు నా పూరణములకా మీ ప్రశంస! ధన్యవాదములు (అన్య పూరణముల కైనను).
తొలగించండిమీకే నార్యా! మీ అనుమతి లేకయే ఈ రోజు వాట్సప్ గ్రూపులో మీ పూరణ నుంచితిని!!
తొలగించండి🙏🙏🙏🙏
👌👌👌👌
తొలగించండిప్రసాద్ ఆత్రేయగారి స్పందన
శారదా నిల యాభిధాన శంక రాభర ణాంకిత పూరణముల కేల యనుమతి? మీకును మఱియు ప్రసాద్ ఆత్రేయ గారికి ధన్యవాదములు.
తొలగించండిశంకరాభరణ కవి వరులారా నమస్సులు. మీ యందఱి శుభాకాంక్షలతో గురు దేవులు పెద్దల యాశీర్వచన బలముతో నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” 23/3/2018 న సమాప్త మయినది. ఇప్పుడు విశేష పరిశీలనలో నున్నది. 68 సర్గములు, 2451 పద్యములు.
రిప్లయితొలగించండి🙏🙏🙏👌👌👌👏👏👏
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమహదానందం! శుభాకాంక్షలు!
చాలా సంతోషం కామేశ్వరార్యా!
తొలగించండి👌🏻👏🏻🙏🏻💐
చాలా సంతోషదాయకమైన విషయం. మీకు హృదయపూర్వక అభివందనములు
తొలగించండిగురుమూర్తి ఆచారి
తొలగించండిమహదానందము మహద్భాగ్యము పోచిరాజ సత్కవి శేఖరా !
అందఱికి వందనములు.
తొలగించండిఅభినందన సుమాంజలి కవిశేఖరా! త్వరలో పుస్తక రూపంలో రావలెనని ఆకాంక్ష!!💐💐💐🙏🙏🙏
రిప్లయితొలగించండి"కుప్పించి యెగసిన..." కు
రిప్లయితొలగించండిముందు రోజు అర్జునుడు:
శరముల్ జొచ్చగ కంచుకమ్మునను నాశమ్మాయె నా క్షాంతియున్
కరముల్ భీతిలి సంచలించగను సంకల్పమ్ము కోల్పోవగా
తరుణమ్మా యిది నీవిటుల్ నగుచు నిందల్ మోపగన్ ; నీవలెన్
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిపురిగొల్పంగక నేపనించలుప నామోదించవన్చున్ తలం
రిప్లయితొలగించండితురుగా! గోపికలందరుంగలిసి నీతోముచ్చటల్చేయగన్
సరసుంజేరగ విడ్చువస్త్రముల నేసాకుండి దాచుంచెనో
సరసంబాడుటచేత కాదుగదా ! కృష్ణా !గోపికావల్లభా!
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పురిగొల్పంగను నేపనిం జలుప నామోదింపవచ్చున్... ముచ్చటల్సేయగన్...' అనండి. 'దాచి + ఉంచెదో' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
🙏🏽 ధన్యవాదములు శంకరయ్యగారూ.
తొలగించండిసవరణలు గ్రహించాను
తొలిసారిగా మత్తేభాన్ని ఎదుర్కొనే స్పూర్తి నిచ్చినందుకు మీకూ శంకరాభరణానికీ ధన్యవాదములు
ఏకారణం వల్లనైనా ప్రేరేపింప బడకుండా ఏ పని చేయనొప్పవు
గోపికల వలువలు దాచడం
సరసములాడుట చేత(వలన) కాదుకదా!
అనే భావంతో వ్రాయ యత్నంచాను
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండికరచేవానికి చేతకాదుగద సంస్కారం బు శోభిల్లగన్
సరసంబాడుట; చేతకాదుగద "కృష్ణా'గోపికావల్లభా"
వరుసన్నిట్లని బిల్వ కంస శిశుపాలుం డున్ పరంధామ నిన్
సరగున్ బిల్చిరే ?సదయ!సంప్రాప్తించె సన్ముక్తియున్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కరచే' అన్నది వ్యావహారికం. 'కంస శిశుపాలురు' అని కదా ఉండాలి. 'సరగున' అనడానికి 'సరగున్' అన్నారు.
ధరణింబ్రోవగ ధర్మమున్ నవనిలో స్థాపించు యత్నమ్మునన్
రిప్లయితొలగించండిగురుసేనన్ గని బంధుజాలమని సంకోచించెడిన్ వేళలో
కరుణం గీతను జెప్పినావనిని సత్కారుణ్యమున్ జూపుచున్
సరసంబాడుట చేతకాదుగద కృష్ణా గోపికా వల్లభా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధర్మమున్ + అవనిలో = ధర్మము నవనిలో' అవుతుంది. "ధర్మమున్ వసుధపై" అనండి. అలాగే "సంకోచించు నవ్వేళలో.... జెప్పినావుగద..." అనండి.
బాలగోపాలమురిపాల జోలయందు
రిప్లయితొలగించండిచేతులన్నవి గాలిలో చిందులేయ
కాలగమనాన్ని కాళ్లచే గదుముచుండ
సరసమాడగ దగవుక్రష్ణా!ముకుంద!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గమనాన్ని' అన్నది వ్యావహారికం. "గమనమున్" అనండి.
విరులున్ నవ్వగ రంగులుంచుచును నిర్వీర్యంబు గానీయకన్
రిప్లయితొలగించండితరులున్,జీవులరక్షగూర్చగల సంధానమ్ము జేకూర్చుచున్
మరువన్ జాలని భక్తవర్యులను సౌమ్యంబందు గాపాడు నీ
సరసం బాడగ చేత గాదుగద కృష్ణా|గోపికావల్లభా|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేడ వలువలిచ్చితి వీవువిజయు సతికి
రిప్లయితొలగించండివిప్రవనితలొసంగిన విందు కుడిచి
ముదము చేకూర్చిన ఘనుడవో మురారి
సరసమాడగ దగవు కృష్ణా ముకుంద.
నామొర పెడచెవి నిడుచు .
నన్ను వీడి
చనిన నీదుమాటలికనే సమ్మతింప
సరసమాడగ దగవు కృష్ణా ముకుంద
వేయిమాట లాడగనేల వెడలు మింక
విరహమున నను ముంచిన వేణుగోప
బాల వేచిన నను వీడి పరుల తోడ
సరస మాడcగc దగవు,కృష్ణా!ముకుంద
వాసుదేవ వడిగ రార వలపు పంచ.
చేరితి యమునా తీరము శీఘ్రముగను
నీకొరకిట నేనుండగ నీరజాక్ష
పరపడతులతో కులుకుచు మరల మరల
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తరులన్ వైచియు చీరలవ్విధముగన్, తానేమెరుంగన్, మనో
రిప్లయితొలగించండిహర! నీవీ గతి రచ్చజేసినయెడన్ హాయౌనె? తాత్పర్యమున్
అరయన్ గోపిక లాగలేరుకద, అయ్యో! నీటుగా ప్రేమగా
సరసంబాడుట చేత కాదు కద కృష్ణా! గోపికా వల్లభా!
(చీరలావిధముగ చెట్లపై వేసి ఏమెరుగక ఉంటివి కదా మనోహరా (మనస్సులను హరించు వాడా)
నువ్విలా రచ్చ చేస్తే ఎవరికి హాయిగా ఉంటుంది? అలా ఎందుకు చేశావో (కాత్యాయనీ వ్రత నియమాలు) అర్ధమైన పిదప గోపికలు ఆగలేరు కద. కృష్ణా! చక్కగా సరసమాడుట చేతకాదా?)
శ్రీకాంత్ గడ్డిపాటి.
(నా మొదటి మత్తేభ విక్రీడితము అండీ)
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమొదటి మత్తేభమైనా చాలావరకు బాగున్నది. 'తానేమెరుంగన్' అన్వయదోషం. "తాత్పర్యమున్ అరయన్' అని విసంధిగా వ్రాయరాదు. "తాత్పర్యమే యరయన్" అనవచ్చు. 'లాగ' అన్నది సాధువు కాదు.
పద్య రచనా వ్యాసంగం కొనసాగించండి. తొందరలోనే మీరు నిర్దోషంగా చక్కని పద్యాలు వ్రాస్తారు. స్వస్తి!
అలాగేనండి. చాలా కృతజ్ఞతలు.. _()_
తొలగించండిసురరాట్గొల్చెడి పాదయుగ్మము శశీసూర్యాక్షులున్ నిత్యమౌ
రిప్లయితొలగించండివరశీర్షంబును బర్హిపింఛమును శ్రీవత్సాంకమున్ మోవిపై
మురళీ వాద్యము కౌస్తుభాంగమును నెమ్మోమున్ మదిన్దల్చగా
గిరిధారీ! వనమాలికాభరణ! సిగ్గెంచన్ కుచేలుండనే!
సరసంబాడుట చేతగాదు గద కృష్ణా ! గోపికావల్లభా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సురరాట్' అని సమాసంలో కాకుండా విడిగా ప్రయోగించరాదు. అక్కడ "సురరాడ్వందిత పాదయుగ్మము..." అనండి. 'శశిసూర్యాక్షముల్' అనాలి. కాని అలా అంటే గణదోషం అవుతుంది. మిగతా పద్యమంతా అద్భుతంగా ఉన్నది.
ధన్యవాదములు గురుదేవా! సవరించడానికి ప్రయత్నిస్తాను!🙏🙏🙏
తొలగించండిసురరాడ్వందిత పాదపద్మముల శ్రీ సోమార్కనేత్రంబులన్
తొలగించండివరశీర్షంబును బర్హిపింఛమును శ్రీవత్సాంకమున్ మోవిపై
మురళీ వాద్యము కౌస్తుభాంగమును నెమ్మోమున్ మదిన్దల్చగా
గిరిధారీ! వనమాలికాభరణ! సిగ్గెంచన్ కుచేలుండనే!
సరసంబాడుట చేతగాదు గద కృష్ణా ! గోపికావల్లభా!
శ్రీ = శ్రేష్ఠమైన
మాయాబజారులో ఘటోత్కచుడు:
రిప్లయితొలగించండిపరిహాసమ్మని పూనితిన్ ముసలి యౌబాపణ్ణి లేపించగా
విరసమ్మాయెను నాదు దార్ఢ్యమిక నీవే నా గతిన్ దెల్పవే
కరముల్ మోడ్చుచు వందనమ్మిడుదు నీ కారుణ్యమున్ జూపుమా!
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఎక్కడినుంచి వస్తాయండీ ఈ విలక్షణమైన ఆలోచనలు? చక్కని పూరణ. అభినందనలు.
'బాపణ్ణి' అనడం వ్యావహారికం. "ముసలియౌ పాఱున్ దగన్ లేపగన్" అనండి.
🙏🙏🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ గారు ఉవాచ:
తొలగించండిశ్రీ శాస్త్రి గారూ.. సందర్భశుద్ధి... ధారాశుద్ధి గల పద్యం... చిన్న సవరణ అవసరం.. ఇలా 👇
✅✅✅✅
మాయాబజారులో ఘటోత్కచుడు:
పరిహాసమ్మని పూనితిన్ ముసలి విప్రశ్రేష్ఠునిన్ లేపగా ,
విరసమ్మాయెను నాదు దార్ఢ్యమిక నీవే నా గతిన్ దెల్పవే
కరముల్ మోడ్చుచు వందనమ్మిడుదు నీ కారుణ్యమున్ జూపుమా!
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!
🙏🙏🙏
రిప్లయితొలగించండితే.గీ.
పారిజాతపుష్పము సత్యభామకిడక
సరసమును రాధతో నీవు సల్పుచుండ
సతుల తగవు దీర్చగ స్వర్గ సమరమేన!
సరసమాడగ తగవు కృష్ణా! ముకుందా!
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కదా' అనే అర్థంలో 'న' ప్రయోగం సాధువు కాదు. "సమరమైన" అందామా?
కట్ట లేనయ్య నినురోట కంబుధరుడ
రిప్లయితొలగించండిసత్య వలెనిన్ను సాధించ శక్యమగునె
మదిని దలచుచు నీకొర కెదురు జూతు
సరసమాడగఁ దగవు, కృష్ణా !ముకుంద !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయం జాలక నిన్ను నా మనములో నచ్చోట నిచ్చోటలన్
రిప్లయితొలగించండిమరుగై యుంటి వటంచు వెర్రిని గదా మాల్మిన్ సదా జూతు నా
తరమా బేలను బాల గోపికనురా తప్పెన్నుటల్ న్యాయమా
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండిమనోహరమైన పూరణ మిస్సన్నగారూ! అభినందనలు!🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిసంతోషం సీతా దేవి గారూ.
తొలగించండివ్రతము చేయగ నెంచగ వలువ లెల్ల
రిప్లయితొలగించండిదాచి తరువుపై నుంచుట ధర్మ మౌనె
సరస మాడగ తగవు కృష్ణాముకుంద
వలువ లొసగి పొమ్మిటనుండి వాసుదేవ.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీకృష్ణ రాయబారమున సయోధనుడు పరమాత్మతో:
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
మరియాదా? హరి రాయబారమున సంభాషించగా నిట్టులన్!
పరశౌర్యమ్ముల భీతిఁ గౌరవుల నే బారంగ నాశింతువో?
మురిపాలందున తేలియాటలనుచున్పోరెంచి మాకెన్నడున్
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా!గోపికావల్లభా!!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బావ ! యాదవా ! యని నిన్ను పలు విధముల
రిప్లయితొలగించండిసరస మాడిన నా కనుల్ తెరచు కొనెను
నీదు విశ్వరూపము గాంచ నిజము తెలిసె
"సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!"
(భగవద్గీత లో విశ్వరూపసందర్శన యోగం లో అర్జునుడు ఇలా భక్తిపూర్వకంగా తన పశ్చాత్తాపాన్ని వెల్లడించాడు)
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరగ పదియారు వేలుగ పడతులందు
రిప్లయితొలగించండిసరసముల దేలు నీవు దేవరవు కాదె !
ఒక్క కాంతనే బ్రేమించి యోడి పోతి
సరస మాడంగ , తగవు- కృష్ణా ముకుంద
వైవిధ్యభరితం 👌👏🙏
తొలగించండిధనికొండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరి 'తగవు'నకు అన్వయం?
12-4-18
రిప్లయితొలగించండి.. .. .. ..సమస్య
సరసం బాడుట చేతకాదు గద
కృష్ణా! గోపికావల్లభా!
సందర్భము: ఒక గోపిక అంటున్నది కృష్ణునితో...
ఈసు నసూయలు జీవులకు సహజములు. వారి ప్రేమలో.. నా ప్రియుడు నాకే దక్కా లనే స్వార్థం పా లెక్కువ.
అట్లే కష్ట సుఖా లనే ఆటుపోట్లతో జీవితాంతం కొట్టుమి ట్టాడుతూనే వుంటారు. ఇక నీవా! నిరంతరం ఆనంద స్వరూపుడవే! దేవుడవే! నీ కిదంతా ఒక క్రీడ. కాని మాకు కాదు సుమా!
మా కేమో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాంటిది. ఇక నే నంటావా అలవికాని మోహంచేత ఆక్రమించబడిన దానను. మా మనసే అలాంటిది.
కాబట్టి నిజం చెప్పా లంటే నీతో సరసా లాడడానికి నాకు చేతకాదు సుమా!
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ధరలో నీసు నసూయలున్ మరియు స్వా
ర్థ ప్రేమలున్ జీవు లం
దరికిన్ సాజము లాటు పోట్లును, చి దా
నంద స్వరూపుండ వీ
వరయన్ దేవుడ, వాట నీ కిదియ, మో
హాక్రాంతనే! నీ యెడన్
సరసం బాడుట చేతకాదు గద కృ
ష్ణా! గోపికావల్లభా!
2 వ పూరణము:--
సందర్భము: ప్రాణేశ్వరుడైన కృష్ణునితో రాస క్రీడలో పాలుగొన్న ఒక గోపిక ఇలా భావించుకుంటున్నది...
"నారీ నారీ నడుమ మురారి హరికీ హరికీ నడుమ వయారీ" అనే భావన సుప్రసిద్ధమైనదే! అది కృష్ణ పరమాత్ముడు గోపికలతో అద్భుతమైన రాసలీలను నెఱపిన ఘట్టం. ఆతనిది దివ్యమైన ప్రేమ యనే యమృతం రూపు దాల్చగా దిగివచ్చిన జగన్మోహనాకారం.
ఆమె ఇంకా ఇలా అంటున్నది...
"మాధవా! ఆ సందర్భంలో వెలిగిపోయే నిన్ను స్మరించుకుంటున్నాను. అది చాలు నాకు.. రావా!
నిజం చెప్పా లంటే నీతో సరసా లాడడానికి నాకు చేతకాదు సుమా!"
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
తరుణీ రత్నము లిద్ద రొక్కొక దెసన్
దన్మధ్యమందున్ దగన్
వర ప్రేమైక సుధార సాకృతివినై
భాసిల్లగా నీవు భా
స్వర రాసోత్సవ మొప్పె; నిన్ దలతు, రా
వా! నాకు నీతోడ నే
సరసం బాడుట చేతకాదు గద కృ
ష్ణా! గోపికావల్లభా!
3 వ పూరణము...
సందర్భము: ఆనంద బాష్పాలతోనే సతమతమైపోతూ ప్రాణేశ్వరుడైన కృష్ణుని దర్శించడానికే విఫల ప్రయత్నం చేస్తున్న తనకు సరసములాడే తీరిక యెక్కడి దని ఒక గోపిక ఇలా వాపోతున్నది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
కురియున్ బాష్పము లొక్కతీరుగ నినున్
గోపాల! భావించి, నే
మురియన్.. బాష్పములందు చూపులను నే
పోనిచ్చి, నీదౌ మనో
హర రూపంబును చూడగా విఫలమౌ
యత్నంబె కావింతునే!
సరసం బాడుట చేతకాదు గద కృ
ష్ణా! గోపికావల్లభా!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
పరువుల్ బెట్టెను గుండె నాదిటను నా బంధుల్ని జూడంగ నా
రిప్లయితొలగించండిగురువుల్ మామలు భీష్మ తాతనిట నే గుడ్లుర్మి కాంచంగహా!
దరహాసమ్మిక మానుమా యదుకులా! దండంబురా! నాకిటన్
సరసం బాడుట చేతకాదుగద కృష్ణా! గోపికావల్లభా!