20, ఏప్రిల్ 2018, శుక్రవారం

సమస్య - 2656 (శివపుత్రుఁడు మఱఁది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్"
(లేదా...)
"శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ"
(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)

95 కామెంట్‌లు:

 1. కవివర! తెలియుము! స్కందుడు
  శివపుత్రుఁడు; మఱఁది యగును శ్రీనాథునకున్
  ప్రవచన మందున పార్థుడు;
  వివరణమిది శంకరవర! వినుమా సుమతీ!

  రిప్లయితొలగించండి


 2. హమ్మయ్య నేటి జావళి అయిపొయింది :)


  అవనత సుబ్రహ్మణ్యుడు
  శివపుత్రుఁడు, మఱఁది యగును శ్రీనాథునకున్
  శివుడు గద కందివర్యా
  జవకట్టి కొనుమయ పద్య జావళి నొకటిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. వివరించు మెవరు గణపతి?
  ధవణాంశుండేమగు మరి తరిదాల్పునకున్?
  ఎవరికి లక్ష్మి సతి యగున్?
  శివపుత్రుఁడు, మఱఁది యగును, శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'తరిదాల్పునకున్ + ఎవరికి' అని విసంధిగా వ్రాయరాదు. మూడవ పాదాన్ని "సిరి యెవనికి పత్ని యగును?" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  వివరంబొప్ప పురాణ గాధలను నేర్పింతున్ సతీ ! జూడగా
  స్తవనీయమ్ముగ సిద్ధి బుద్ధులకునౌ షడ్వక్త్ర విఖ్యాతుడౌ
  శివపుత్రుండు మఱంది ., గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁ., డౌ ,
  ను వరాద్రీశతనూజకున్ సుతుడు , దానున్ జంపె నా తారకున్ !!

  కాడె....ఓ సతీ ! కాడె, (కాడు అని)
  పౌత్రుడు., ఔను వరాద్రీశ... అని అన్వయం.

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 5. అవనిన్ చుట్టిన వాడు సూవె స్థిరుడున్నాగ్నేయుడున్ కందుడౌ,
  శివపుత్రుండు; మఱంది గాఁడె! హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ
  జవరాలా మన నారదుండు ! రమణీ సామ్యంబు లేదమ్మరో !
  కవనంబన్న,జిలేబి, యింతయెగదా! కష్టంబదేలన్ రమా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. శివుడా చంద్రుని సుతునిగ
  నవధరియించెను;మరి సిరికా శశి తోబు
  ట్టువు గద!సిరి హరిసతి గద!
  శివపుత్రుడు మరది యగును శ్రీనాథునకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చుట్టరికం బాగుందండీ... పద్యం చాలా బాగుందండీ... నమోనమః 🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  2. బాపూజీ గారూ! బహు చతురతతో చుట్టరికాలను కలిపారు.
   👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి
  3. బాపూజీ గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. శివపుత్రుడు హనుమంతుడు
  సవివరమున నెంచగ వరుసకు భీమునికిన్
  భువిలో సోదరుడైనచొ
  "శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్"

  శ్రీనాథుడు = కృష్ణుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   చుట్టరికం బాగానే కలిపారు. పూరణ బాగుంది. అభినందనలు.
   కాని హనుమంతుడు శివపుత్రు డెలా అయ్యాడు? 'ఐనచొ' అని చో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

   తొలగించండి
  2. శివాంశను వాయుదేవుడు మోసుకెళ్ళి అంజనీ గర్భంలో ప్రవేశపెట్టాడని విన్నాను.
   🙏🏻

   తొలగించండి
  3. మూడవ పాదం
   భువిలో సోదరుడే గద
   అంటే సరినమపోతుందనుకుంటాను.
   🙏🏻

   తొలగించండి
  4. విట్టు బాబు గారికి వ్హాట్సప్ సమూహం ఆహ్వానం పలికినది

   👏👏👏

   తొలగించండి

  5. అయ్యో అయ్యో అయ్యో ఏదేదో జరిగిపోతావుందే :)

   జిలేబి

   తొలగించండి
 8. ధవుడెవ్వడి సుతుడంటిని?
  యవనిజకా భరతుడేమి యగునో తెలుసా
  కవివర! సిరియెవరికి సతి?
  శివపుత్రుఁడు, మఱఁది యగును శ్రీనాథునకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇక్కడ 'ధవుడు' అంటే ఎవరు?

   తొలగించండి
 9. జీవ వైవిధ్య మొక రూపు దాల్చెననగ
  ప్రకృతిలో తానుగ మమేకమై చెలగ
  ఏకదంతుడు శివపుత్రుడు మరి యది యగును
  శ్రీనాథునకున్ స్థితి గుణమొప్పి వెలుగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రమేశ్ గారూ,
   మెల్లమెల్లగా పద్యరచనా మార్గంలో పయనిస్తున్నారు. సంతోషం. మొదటి మూడు పాదాలు తేటగీతి లక్షణాలు కలిగి ఉన్నా గణ, యతి దోషాలున్నవి. మీరు తప్పక పద్యాలు వ్రాయగలరు. స్వస్తి!

   తొలగించండి
 10. శివరావు ప్రథమ తనయను
  వివాహ మాడిన కతమున వేడుక మీరన్
  వివరింపగ సహజమ్ముగ
  "శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్"

  రిప్లయితొలగించండి
 11. వివరింపుము గజముఖు డెవ
  డవలోకింపగ హరికిని నంబుజుడేమౌ?
  నెవనికి లక్ష్మియె సతియౌ?
  శివపుత్రుఁడు ; మఱఁది యగును ; శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టాసత్యనారాయణ
  (శివా పార్టీ,.శ్రీకాంతుని పార్టీలు స్వాతంత్ర్య సాధనకు పూర్వం.మధ్యన పోటీలు.శత్రువు భారత భూమిని కబళింప వచ్చినపుడు వావి వరసలతో నైక్య మవడానికి ప్రయత్నం జరుగుతుంది.ఆంగ్లంలో అలాంటి సంబంధాల పదములే తక్కువ..అంకల్,కజిన్, ఉదాహరణలు.)
  వివరముగన్నిరు పార్టీల్(శివునిది,శ్రీకాంతునిది)
  జవమునకై స్పర్ధ బడుట సహజము కాదే
  యవనుల బారిని బడగన్
  శివ పుత్రుడు మరది యగును శ్రీకాంతునకున్!(హిందూ ముస్లిమ్ సిక్కు ఇసాయీ.ఐక్య మైనారు కదా,వరుసలు,భాయీ బహన్లు అద్భుతంగా పనిచేస్తాయి అనే సాధారణీకరణకు సమస్యా పదములు పనికి వస్తాయి)

  రిప్లయితొలగించండి
 13. అవని ని చుట్టిన దె వ్వరు ?
  క వన ము తో నుతిని గన్న కవి పోతన తా
  నె వరి కి నే మగునని రో ?
  శివ పుత్రు డు ; మరిది యగును శ్రీనాథుని కి న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. శ్రీనాథ, పోతనలను ప్రస్తావించడం వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. డా}.పిట్టా
  సత్యనారాయణ
  IIT entrance tests లో analogy,relationship పై ప్రశ్నలుంటాయి.సంబంధాలు గూర్చడానికి విజ్ఞత అవసరం.సమస్య అలాంటిదే అని చెప్పడం.options aspirant ను a,b,cలతో తికమక పెడతాయి అనే అంశం తీసుకొని
  బవరాగ్రేసరు జేయుటే నెపముగా వర్తించు నై యై టి లో
  ప్రవరల్ బేర్కొనకుంద్రు వావి వరుసన్ వ్రాయన్రిలేషన్ ప్రభల్
  జవమున్ జార్చగ నే.బి.సీలు గలుగున్ సాపేక్షపుం దద్భ్రమన్
  శివ పుత్రుండు మరిందిగాడె హరికిన్ శ్రీకాంతుకున్ బౌత్రుడౌ

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ ::నేటి సమస్య సంఖ్య-2656
  సమస్య :: *శివపుత్రుండు మఱంది గాడె హరికిన్ శ్రీకాంతకున్ పౌత్రుడౌ.*
  శివుని కుమారుడు విష్ణువునకు మఱది ఔతాడు. అతడే లక్ష్మీదేవికి మనుమడౌతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: బాద్రపద శుద్ధ చవితినాడు వినాయక వ్రతం చేస్తుంటే మా యింటికి విచ్చేసిన దేవతలలో గణపతి భార్యలైన సిద్ధి బుద్ధి మాతో మాట్లాడుతూ ఎవరెవరు వచ్చినారో , ఎక్కడ ఉన్నారో మాకు తెలియజె్స్తున్నట్లు నేను భావించిన సందర్భం.

  అవలోకింపుడు సిద్ధిబుద్ధులము మీకై వచ్చియున్నార మీ
  యవనిన్ మా పతిదేవుడీ గజముఖుం డౌ , షణ్ముఖుండైన యా
  *శివపుత్రుండు మఱంది గాడె , హరికిన్ శ్రీకాంతకున్ పౌత్రుడౌ*
  నవునా యా యనిరుద్ధు డచ్చట గలం డర్చింపుడీ భక్తితో.
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-4-2018)

  రిప్లయితొలగించండి
 16. కవితా! వినుమిది గణపతి
  శివపుత్రుఁడు, మఱఁది యగును శ్రీనాథునకున్
  భవుని శిఖలోన దాగిన
  ధవళకరుడు చంద్రుడతడె దశవాజికదే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చంద్రుడు శశి దశవాజి గదా" అంటే అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
 17. సివరపు వదనము వేలుపు
  శివపుత్రుడు, మఱఁది యగును శ్రీనాథునకున్
  పవన సుతుడైన భీముడు,
  యువిదయె గగనమున ఛాయ యుష్ణకరునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భీముడు + ఉవిద' అన్నపుడు యడాగమం రాదు. "భీముం। డువిదయె..." అనండి.

   తొలగించండి
 18. వివరణ కొఱకై యొక్కడు
  నవివేకి శకారుని వడి యడుగంబోగా
  వివరించె నాతడిట్టులు
  "శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శకారుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...యొక్కం। డవివేకి..." ఆనండి.

   తొలగించండి
 19. కవిమిత్రులు విట్టుబాబు గారిని కలవడానికి వెళ్తున్నాను. ప్రయాణంలో ఉన్నందున మీ పూరణలను సమీక్షించలేను. మధ్యాహ్నం వరకు మన్నించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరాక మహదానందం కలిగించినది. ధన్యవాదములు గురువుగారూ!
   🙏🏻💐

   తొలగించండి
 20. ధవళా! చెప్పవె యేకదంతుడు గణాధ్యక్షుండెవండంటి? నా
  శివ శీర్షమ్మున పుష్పమై విరియు రాజెవ్వండనన్ ? తెల్పు యా
  దవ వీరుండతగాడు రుక్మవతికిన్ దా పుత్రుడే లక్ష్మికిన్
  శివపుత్రుండు, మఱంది గాఁడె హరికిన్, శ్రీకాంతకున్ బౌత్రుఁడౌ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుక్మవతికిన్ దా పుత్రుడే లక్ష్మికిన్'... అర్థం కాలేదు.

   తొలగించండి
 21. సహజ కవి పోతన

  శివ వైష్ణవ భేదమ్ములు
  శవముల్ చేసెడి నవ్వేళ సరియైన భా
  గవతము రచించ గ నపర
  శివ పుత్రుడు, మరిది యగును శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. శివ వైష్ణవ భేదమ్ములు
   శవముల్ చేసెడి య వేళ సరియైన భా
   గవతము రచించ గ నపర
   శివ పుత్రుడు, మరిది యగును శ్రీనాథునకున్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. 'ఆ + వేళ = అవ్వేళ' అవుతుంది.

   తొలగించండి
 22. భువివరులకె నీ వరుసలు
  దివిజుల బాంధవ్యములకు దీరులు వేరే
  ప్రవిమల ప్రతీకలెన్నగ
  శివపుత్రుడు మఱది యగును శ్రీనాధునికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. భువివరులకె యీ వరుసలు
   దివిజుల బాంధవ్యములకు దీరులు వేరే
   ప్రవిమల ప్రతీకలెన్నగ
   శివపుత్రుడు మఱది యగును శ్రీనాధునికిన్

   తొలగించండి
 23. స్తవనీయుఁడు భువి జనుల క
  నవరత మాహ్లాద కరుఁడు నవ వర్ణ మహా
  ధవళ తను చంద్రుఁ డంబుధి
  శివ! పుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్


  వివరింపంగ వశంబె యేరికిని వైవిధ్యంపు బాంధవ్యముల్
  భువి దేవర్షి మునీంద్ర దైవ వర సంభూత వ్రజం బందునన్
  శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ
  నవనిం దా ననిరుద్ధుఁడే విశిఖ విద్యా నైపుణ శ్రేష్టుఁడే

  [శివము =జలము; శివ పుత్రుఁడు = జలము నందు (ఉదధి) పుట్టిన వాఁడు, చంద్రుఁడు;]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు సహజంగానే వైవిద్యంగా, ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.
   "చంద్రుఁ డబ్ధికి। శివ! పుత్రుఁడు..." అంటే అన్వయం ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. అవునండి . కడు రమ్యమైన సూచనకు ధన్యవాదములు.

   తొలగించండి

 24. .. సమస్య
  శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్

  సందర్భము: శివాంశ సంభవుడు ఆంజనేయుడు. ఏకపాద రుద్రు డని శివపుత్రు డని యాతనికి ప్రతీతి.
  పార్వతీ గర్భ సంభూతేః
  పార్వతీ గర్భ నామవాన్
  పార్వతీ గర్భమున సంభవించుటచే పార్వతీ గర్భు డను పేరు గల వాడ వౌతావు.. అని బ్రహ్మ పలికినట్టు పరాశర సంహిత (హనుమజ్జన్మకథనం) పేర్కొంటున్నది.
  సీతాన్వేషణలో సఫలీకృతుడై తిరిగివచ్చిన మారుతిని శ్రీ రామచంద్రుడు కౌగలించుకొని "నీ ఋణము తీర్చుకొనలేను. నీవు నాకు భరతునితో సమానము.." అన్నాడు.
  అంటే రాముని దేవేరియైన జానకీ మాతకు భరతు డే విధంగా మఱది అవుతున్నాడో భరతునితో సమానుడుగా మన్నించ బడుతున్న ఆంజనేయుడు కూడ మఱదియే అవుతున్నాడు.
  రఘుపతి కీన్ హీ బహుత బఢాయీ
  కహా భరత సమ తుమ ప్రియ భాయీ
  (శ్రీ రాముడు నిన్ను గొప్పగా పొగడి సోదరా! నీవు భరతునితో సమానమైన వాడ వని పలికెను.)
  అని తులసీదాసు *హనుమాన్ చాలీసా* లో ప్రశంసించడం గమనార్హం.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  అవనీజాతకు సీతకు
  శివపుత్రుడు మఱది యగును;
  శ్రీ నాథునకున్,
  నవ జలజ నయనునకు, రా
  ఘవునకు పావని భరతునిగా తోచె గదా!

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 25. నేటి శంకరాభరణం వారి సమస్య
  "శివపుత్రుండు మఱంది గాడె హరికిన్ శ్రీకాంతకున్ పౌత్రుడౌ"
  స్తవనీయమ్మముగ సిద్ధిబుద్ధికిని షడ్సంఖ్యాకవక్త్రుండునౌ
  శివపుత్రుండు మఱంది గాడె;హరికిన్ శ్రీకాంతకున్ పౌత్రుడౌ
  వివరించం దగు బద్మయోనిసుతుడై వేనోళ్ళ నారాయణున్
  శ్రవణీయమ్ముగఁ బాడు నారదమహర్ష్యగ్రేసరుం, డట్లుగన్.

  రిప్లయితొలగించండి
 26. కందం
  భవుఁ బాశుపత మ్మందఁగ
  స్తవమ్ములన్ ఫల్గుణుండు తండ్రీ యనుచున్
  వివశున్ జేయుచు పొందిన
  శివపుత్రుఁడు! మఱఁది యగునుశ్రీనాథునకున్!

  రిప్లయితొలగించండి
 27. అవధానములకు పరుగిడు
  యవధానిగ గాక నొక్కడట పృచ్ఛకుడై
  కవి మేధనుగన ననెనిటు
  శివపుత్రుఁడు మఱఁది యగును శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
 28. ఎవరయ్య కార్తికేయుడు?
  శివశేఖర మెవ్వరగును శ్రీధరునకిలన్?
  ఎవరికి సుతుఁడౌను నలువ?
  శివ పుత్రుడు! మఱది యగును! శ్రీనాథనకున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇలన్ ఎవరికి' అని విసంధిగా వ్రాయరాదు. "శ్రీపతికిన్ దా। నెవరికి.." అనండి.

   తొలగించండి

  2. సవరించానండి, ధన్యవాదాలు.

   ఎవరయ్య కార్తికేయుడు?
   శివశేఖర మెవ్వరగును శ్రీపతికిన్ ? దా
   నెవరికి సుతుఁడౌను నలువ?
   శివ పుత్రుడు! మఱది యగును! శ్రీనాథనకున్!

   తొలగించండి
 29. కవివర! వినుమా ,గణపతి
  శివపుత్రుడు,మఱది యగును శ్రీనాధునకు
  న్బవమానసుతుడు వలలుడె
  యవనిన్దానిష్టుడగుచునాప్తుడునగుచున్

  రిప్లయితొలగించండి
 30. సరదాకి సుప్రభాతమ్మున:
  (ఏక వచనమును మన్నించుడు)

  కవనమ్మందున నింద్రుడౌ మురళి శ్రీకారమ్ము చుట్టించగా
  నవధానుల్ కవి రాజశేఖరులు నాహాయంచు రెట్టించగా
  స్తవనీయుండగు కంది శంకరుడు ప్రస్థానమ్ము తోషించగా
  శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ!!!

  ప్రస్థానము = ప్రయాణము (భాగ్యనగరపు ట్రాఫిక్కులో)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సరదాకి సుప్రభాతమ్మున:

   కవనమ్మందున నింద్రుడౌ మురళి శ్రీకారమ్ము చుట్టించగా
   నవధానుల్ కవి రాజశేఖరులు నాహాయంచు రెట్టించగా
   స్తవనీయుండగు కంది శంకరులు నుత్సాహమ్ము పుట్టించగా
   శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ!!!
   అని అనవచ్చునా శ్రీ ప్రభాకర శాస్త్రి గారూ! నమోనమః

   (స్తవనీయుల్ వర కంది శంకరులు)

   ...కోట రాజశేఖర్

   తొలగించండి
  2. సమస్యా పాదములో ఏకవచన ప్రయోగం ఉన్నది..."శివపుత్రుండు"

   ఇది సబబే.. అతడు "దేవుడు" కాబట్టి...

   నాకు మీరందరూ దైవసమానులే సుమీ...

   ...ప్రభాకర శాస్త్రి

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ సమయోచితంగా ఉన్నది. అభినందనలు.
   *****
   రాజశేఖర్ గారూ,
   మీ సవరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భవుని శిరమెక్కి కులికెడు
  సవుడా మాపతి గృహిణికి సహజుండగుచు
  న్నవరతముత్స్మితములనిడు
  శివపుత్రుడు మఱది యగును శ్రీనాథునకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని టైపు దోషాలున్నట్టున్నవి?

   తొలగించండి
 32. శివపుత్రుండు మఱంది గాడె హరికిన్ శ్రీకాంతకున్ బౌత్రుడౌ
  టవినినవెంటనె కూడికల్సలిపి చుట్టాలందరి న్తల్చగా
  కవితల్చేయుచు కాలముంగడుపు యోగ్యంబిచ్చు శ్రీకాంతకున్
  కవయిత్రామెను నీపౌత్రుం డెవర నంగాయెవ్వరుం లేరనెన్

  రిప్లయితొలగించండి
 33. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం ప్రారంభంలో గణదోషం. 'కవయిత్రి + అమెను' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 34. 🙏🏽 ధన్యవాదములు శంకరయ్యగారూ.
  కవయిత్రిప్పుడు..అనవచ్చా?

  రిప్లయితొలగించండి
 35. భువి గన వినాయకుడు గద
  శివపుత్రుడు, మఱది యగును శ్రీనాధునకున్
  కవికుల తిలకుడు పోతన
  వివరంబుగ భాగవతము విరచించె నిలన్!!!


  వివరించుమ గణపతియన?
  ధవళకరుండేమగు నిల తరిదాల్పునకున్
  శివ యెవరికి సోదరి యగు?
  శివపుత్రుడు, మఱది యగును శ్రీనాథునకున్!!!

  రిప్లయితొలగించండి 36. జవమున విను హేరంబుడు

  శివపుత్రుఁడు,మఱఁది యగును శ్రీనాథునకున్

  పవిధరు సుతుడిక శశియును

  సవితృలగుదురునయనములు జగతీపతికిన్.


  కువలయమెల్లను చుట్టెను
  శివపుత్రుడు,మఱిది యగును శ్రీనాథునకున్
  నవకముతోడను మ్రొక్కెను
  బవరమునికచేయలేను బావా యనుచున్.

  రిప్లయితొలగించండి
 37. మిత్రులందఱకు నమస్సులు!

  [విష్ణువు మఱఁదియైన చంద్రునకు శివుఁడు తోడియల్లుఁడగుటచే, విష్ణువునకును మఱఁది యగును. అటులనే, గంగాదేవి విష్ణుపాదోద్భవ కాఁబట్టి, విష్ణువునకు కూఁతురును, శివునకు భార్యయు నగుటచే, విష్ణువు వావివరుసల క్రమమున నామెకు శివపుత్రుఁడు మఱఁదియు, కొడుకును నగును. ఈ విధమునఁ బరికించినచో, శివపుత్రుఁడు గంగకు మఱఁదియు, శ్రీకాంతకు మఱియు విష్ణువునకు పౌత్రుఁడును నగుచున్నాఁడని నా పూరణ సారాంశము]

  రవణింపంగనుఁ గూఁతురయ్యు హరికిన్, రమ్యమ్ముగాఁ ద్ర్యంబకున్
  బరిణేత్రుండుగఁ బొందియున్న కతనన్ బ్రాణేశయై యొప్పఁగాఁ
  బరమార్థమ్మిదె చూడ విష్ణువునకున్ వ్యత్యస్తమై గంగకున్
  శివపుత్రుండు మఱంది గాఁడె హరికిన్ శ్రీకాంతకుం బౌత్రుఁడౌ!

  రిప్లయితొలగించండి
 38. మత్తేభవిక్రీడితము

  భవునిన్ బార్వతి వైపుఁ జూచునటులన్భావాలు రేకెత్తఁ జే
  సి విధేయుండుగ, కాలిబూడిదగ నిర్జీవుండు నౌ వానికిన్
  శివపుత్రుండు మఱంది గాఁడె! హరికిన్శ్రీకాంతకున్ బౌత్రుఁడౌ 
  నవనీ వాసులు బిల్చు వావివరుసన్నాగ్నేయు సూనుండటుల్.

  రిప్లయితొలగించండి