"యోగవాశిష్ఠము (బృహద్)" లో 29,000 శ్లోకాలున్నాయట. దీని Condensed Version అయిన "లఘువాశిష్ఠము" లో 6000 శ్లోకాలున్నాయట. నాకు తెలుగే రాదు; ఇక సంస్కృతం మాట దేవుడెరుగు. నాదంతా వినికిడి (hearsay) బాపతే. మీ మాటకే నా అంగీకారము (ఎప్పటి వలెనే).
మెట్రో పాలిటన్ పట్టణములలో ఒక ఉద్యోగికి చిన్న ఇల్లు తల్లి తండ్రులు బందు జనముల తాకిడితో సంతానము కలుగటకు అవకాశము కలుగ లేదు. ప్రమోషన్ పై కొత్త చోట మంఛి వసతి లభించగా అవకాశము కలిగి సతి తో క్రీడించ పుత్రా సంతతి కలిగెను అను భావన
( *అమ్మాయి వేషం ధరించిన అబ్బాయి*.. అని *ఊహ* కలిగించిన అవధాని వరేణ్యులు *శ్రీ నరాల రామారెడ్డి గారికి* ధన్యవాదాలు )
ఒకడు శాంతి అనే అమ్మాయి ని ప్రేమించాడు... వాళ్లనాన్న రిటైరై ఇంటివద్దనే ఉంటున్నాడు... మనవాడి ప్రయత్నాలు ఫలించలేదు... అందుకని ఒక అమ్మాయి వేషం ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు... ఇంకేముంది... ఇదిగో పూరణ...
వితథములయ్యె యత్నములు , వీడు గృహంబును వీడడెప్పుడున్ ! సతమతమయ్యె మానసము , శాంతిని జూడక శాంతి లేదు నా బ్రతుకునకంచు , జేరెనొక భామిని వేసమునందలీకపుం సతి సతి క్రీడసల్ప మగసంతు జనించెను, మెచ్చిరందరున్ !!
డా.పిట్టా సత్యనారాయణ ఈ మధ్య ఇంటి వరకు వచ్చు ఏ.సి బస్సులలో రాస క్రీడలు అన్న వార్త లాధారముగా, అతి శీతల 'సతి' యను బ స్సతి మోహము నింపె దారి సరగున గడువన్ బతి సతులే యాత్రికులట సతి(౦÷2) సతి క్రీడింప బురుష సంతతి గల్గెన్.... అని అమ్మలక్కల వార్తాలాపము.అర సున్న నందక పోయి(0/2)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2663 సమస్య :: *సతి సతి క్రీడ సల్ప మగ సంతు జనించెను మెచ్చి రెల్లరున్.* ఒక స్త్రీ మరొక స్త్రీ తో కలిస్తే మగబిడ్డ పుట్టినాడు. అందరూ మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: పరమ శివుని భార్యయైన సతీదేవి యోగాగ్నిచే తనను తాను దహింపజేసికొని మరణించింది. ఆ సతీదేవి మరుజన్మలో పార్వతిగా జన్మించింది. లోకములకు శివపార్వతులే దిక్కు. వారి కుమారుడే తారకాసుర సంహారం చేయగలడు అని భావించిన మన్మథుడు వారిపై పూలబాణాలను సంధించాడు. అప్పుడు శివుడు మరియు పార్వతీసతి అంటే పూర్వజన్మలో సతి కలసినారు. వారికి కుమారస్వామి కుమారుడుగా జన్మించాడు. అందరూ సంతోషించి ఆ ఆదిదంపతులను ప్రశంసించారు అని విశదీకరించే సందర్భం.
పానకంలో పుడక - కలువాయి అన్న పదానికి అర్థమేమిటండి ? కలువాయి బ్రహ్మజ్ఞానము అన్న పదాన్నేమో ఉపయోగించేసా తెలియక అసలే అరవం వాళ్ళైతిమి, నా వెనుక బడ్డారు కలువాయి కి అర్థం చెప్పమంటూ .!
నమో నమః ! వూరుంది సరే ! ఈ పదానికి - కలువాయి కి - కలువాయి బ్రహ్మ జ్ఞానానికి - మెట్ట వేదాంతానికి లింకు యేదన్నా వుందా అన్నదే సందేహం ! ఇంతకీ కలువాయి కి అర్థమేమన్నా వుందా?
కలువాయి అంటే కలువల బావి ఉన్న ఊరేమో నని నా అనుమానం. కలువల బావి వద్ద గల ప్రదేశంలో ఎవరైనా యోగి ఉండేవాడేమో. ఆతడందించిన జ్ఞానం కలువాయి వేదాంతమనీ, కలువాయి బ్రహ్మజ్ఞానమనీ పిలువబడేదేమో! పరిశోధించాలి...వాకబుచేయాలి...తెలిసినవారినుండి.
కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె
డా.పిట్టా సత్యనారాయణ అతి సన్నిహిత సతులు విడమరచి పలికిన పలుకులు: పతికిని యూహలుండకనపౌరుష క్రీడ లటంద్రు బెద్ద లా సతిగనె *కామ సూత్రముల*చక్కని యోగపు గ్రంథ మందుకై జత న తనే సు ప్రేరితగ స్థానము దప్పి రమింప మేలయెన్ సతి!సతి క్రీడ సల్ప మగ సంతు జనించెను, మెచ్చి రెల్లరున్
రిప్లయితొలగించండిఅతిగా చదువన్ కనులు
న్నతివ జిలేబియకు బోవ నలుపుచు వాటిన్
పతినిసతిగ చదివెనయా
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఅలసిన కనులకు పతి సతిగా కనిపించిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జీలేబీకి బోవ" అనండి.
జిలేబీ గారి నిన్నటి ప్రశ్నకు సమాధానం 👆
తొలగించండి
తొలగించండిఫిట్టింగు లాగుందండోయ్ జీ పీయెస్ వారు
యోగ వాశిష్ట - ఉత్పత్తి ప్రకరణము - లీలోపాఖ్యానము - సప్త దశ సర్గము -
శ్రీ దేవ్యువాచ
చిత్తాకాశం చిదాకాశ మాకాశంచ తృతీయకమ్
త్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం వరాననే
వరాననా ! చిత్తాకాశము చిదాకాశము ఆకాశము లను త్రివిధాకాశములలో చిదాకాశమే శూన్యతరమని గ్రహింపుము.
ఇట్లు
వాశిష్ట జిలేబి :)
🙏🙏🙏
తొలగించండి"యోగవాశిష్ఠము (బృహద్)" లో 29,000 శ్లోకాలున్నాయట. దీని Condensed Version అయిన "లఘువాశిష్ఠము" లో 6000 శ్లోకాలున్నాయట. నాకు తెలుగే రాదు; ఇక సంస్కృతం మాట దేవుడెరుగు. నాదంతా వినికిడి (hearsay) బాపతే. మీ మాటకే నా అంగీకారము (ఎప్పటి వలెనే).
"The space is physical ether (bhootakasa). The mind is mental ether (manaakasa) which is contained in the transcendental ether (chidakasa)."
తొలగించండి...Talks with Sri Ramana Maharshi, page 426, Ninth Edition 1994
సతతము యెడదెగని పనులు
రిప్లయితొలగించండిజతకు యిరుకు యిల్లు, బంధు జనముల్ యెపుడున్,
పతి బదిలి తోడ కలిగె వ
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్"
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివసతి సమకూరిన సతికి సంతతి కలిగిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సతతము + ఎడతెగని... జతకు + ఇరుకు + ఇల్లు... జనముల్ + ఎపుడు' అన్నపుడు యడాగమం రాదు. "సతత మ్మెడదెగని పనులు। జతకు నిరుకు టిల్లు బంధు జను లెల్లపుడున్" అనండి.
మెట్రో పాలిటన్ పట్టణములలో ఒక ఉద్యోగికి చిన్న ఇల్లు తల్లి తండ్రులు బందు జనముల తాకిడితో సంతానము కలుగటకు అవకాశము కలుగ లేదు. ప్రమోషన్ పై కొత్త చోట మంఛి వసతి లభించగా అవకాశము కలిగి సతి తో క్రీడించ పుత్రా సంతతి కలిగెను అను భావన
రిప్లయితొలగించండిఅతిమోద మట్లతదియను
రిప్లయితొలగించండిసతి సతి క్రీడింపఁ ; బురుష సంతతి గల్గెన్
సతి కూడగ పరమేశుని;
వెతలుడిగెను వానివలన వేల్పులకపుడున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅతడున్నామెయు నొకరై
వెతలన్ మరచి మరులొలుక వెసగన్ మంద
స్మితముగ గడుపంగన్నవ
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
అవసతి - రాత్రి
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివసతితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"అతడును నామెయు" అనండి. 'వెసన్' అనడం సాధువు. "వెస నట మంద..." అనవచ్చు కదా?
మితిమీరిన విజ్ఞానము
రిప్లయితొలగించండికతలెన్నో మార్పు జేసి కలతలు రేపన్
మతిమాలిన క్రియ గాదట
సతిసతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
అక్కయ్యా,
తొలగించండివిజ్ఞానపు వింత పోకడలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండిసతతము వ్రతములు జేయుచు
రిప్లయితొలగించండిపతిచెంతకు జేరనట్టి భామయె నిశిలో
రతికొరకై పిలిచె పతిని
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భామయె, సతి' అని ఒకే వాక్యంలో అనడం పునరుక్తి.
కం
పతి పత్నులు నీ జన్మన
గతజన్మన పతి సతియగు గమనించంగన్
మతిజేయగ నిజమిదియే
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ జన్మలో పతిపత్నులు మరుజన్మలో సతీపతు లౌతారని వినడం ఇదే మొదటిసారి.
తొలగించండిఎప్పుడూ ఒక్కరే వాయిస్తా వుంటే ఎట్లా మార్చి మార్చి వాయించాలని కామోసు :)
జిలేబి
అంతేగా మరీ....,😀😁😂
తొలగించండిభూషణ్
మతి గల్గి గురువు చెప్పెను
రిప్లయితొలగించండి"సతి పతి క్రీడింపఁ బురుష సంతతి గలిగెన్"
మతి లేక వ్రాసె శిష్యుఁడు
"సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గలిగెన్"
రిప్లయితొలగించండిఅతివయు సిగ్గు లొల్క సయి యార్యుడు సౌమ్యము గా తలోదరిన్
జతగని ముద్దు లన్గునిచి జంకును ద్రోలగ మత్తు గాంచుచున్
స్థితిపథ జీవ నమ్మున వశీకరమౌనుగదా జిలేబి యై
సతి! సతి క్రీడ సల్ప మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసంబోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిపతిదేశాటనమేగెను
పతకములెన్నియొ గొనుచును వచ్చిన గని శ్రీ
మతి నొసగి విందు,పొందు వ
సతి,సతి క్రీడింప బురుష సంతతి కలిగెన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వచ్చిన గని యా। పతి కొసగి విందు, పొంది వ।సతి..." అనండి. బాగుంటుంది.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,
రతి సల్పె వరూధిని ని కు
మతి యై కన్నులను గప్పి మాయా ప్రవరుం ;
డత డటు సృష్టించుకొని వ
సతి , సతి గ్రీడింప పురుష సంతతి కలగెన్ !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమాయా ప్రవరుని ప్రస్తావనతో, వసతితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యా ! ధన్యవాదములు
తొలగించండి.
రిప్లయితొలగించండిపతి యొక్కడె సతులిద్దరు
ప్రతిదినమొక పండుగౌచు పడకల గదిలో
సతమత మౌచును పతితో
సతి,సతి గ్రీడింప పురుష సంతతి గల్గెన్ .
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతి సతి వేష ము దాల్చి యు
రిప్లయితొలగించండిచతుర త తో నటన సల్పి సడి సేయక తా
న తి మోహము తో వచ్చి యు
సతి సతి క్రీడింప పురుష సంతతి గ ల్గేన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(సహజనటుడైన అల్లుడు కార్యం చేయని మామగారింట చేసిన ఘనకార్యం)
రిప్లయితొలగించండిమతిగతి బాగులేక తనమామయె కార్యము సేయకుండినన్
జతనిక వీడలేని పతి చక్కగ భామిని స్నేహభామయై
యతినిపుణంబుగన్ గలసె నాంతరికంబుగ ; నాయసత్యపుం
సతి-సతి క్రీడసల్ప మగసంతు జనించెను ;మెచ్చి రెల్లరున్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపతులను బంపి వృత్తులకు , భామినులొక్కటఁ జేరనందు నొ...
క్కతె కథజెప్పుచుండె " ననగా ననగా మనభారతంబునం
దతులిత సేవ సల్ప గని , యమ్ముని యివ్వ వరమ్ము , కుంతి ప్ర...
స్తుతమదసత్యమో నిజమొ జూడగ క్రీడగ బిల్చె సూర్యునిన్
సతి ! సతి ! క్రీడసల్ప మగసంతు జనించెను , మెచ్చిరందరున్
చతురుడు యుద్ధమందనుచు సత్యము కర్ణుడతండె ! వింటిరే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిసతులను సంబోధిస్తున్న మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
( *అమ్మాయి వేషం ధరించిన అబ్బాయి*.. అని *ఊహ* కలిగించిన అవధాని వరేణ్యులు *శ్రీ నరాల రామారెడ్డి గారికి* ధన్యవాదాలు )
తొలగించండిఒకడు శాంతి అనే అమ్మాయి ని ప్రేమించాడు... వాళ్లనాన్న రిటైరై ఇంటివద్దనే ఉంటున్నాడు... మనవాడి ప్రయత్నాలు ఫలించలేదు... అందుకని ఒక అమ్మాయి వేషం ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు... ఇంకేముంది... ఇదిగో పూరణ...
వితథములయ్యె యత్నములు , వీడు గృహంబును వీడడెప్పుడున్ !
సతమతమయ్యె మానసము , శాంతిని జూడక శాంతి లేదు నా
బ్రతుకునకంచు , జేరెనొక భామిని వేసమునందలీకపుం
సతి సతి క్రీడసల్ప మగసంతు జనించెను, మెచ్చిరందరున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిసతి యర్ధపతి! పతియున
ర్ధ తరుణి! కలువాయిలోన రాసపు కేళిన్
సతిపతి యో? మరి పతియో
సతి? సతి క్రీడింపఁ బురుష! సంతతి గల్గెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఈ మధ్య ఇంటి వరకు వచ్చు ఏ.సి బస్సులలో రాస క్రీడలు అన్న వార్త లాధారముగా,
అతి శీతల 'సతి' యను బ
స్సతి మోహము నింపె దారి సరగున గడువన్
బతి సతులే యాత్రికులట
సతి(౦÷2) సతి క్రీడింప బురుష సంతతి గల్గెన్....
అని అమ్మలక్కల వార్తాలాపము.అర సున్న నందక పోయి(0/2)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుత్రునినదె బడయగ పడతి తను వేడెను
రిప్లయితొలగించండివేల్పుల మిక్కిలి
ఫలసిద్దిగ పతి మంత్రం పొంద ఎరుపెక్కెను
చెలియ చెక్కిలి
మనమున పతి తలచి చేరెను తన నిజవసతి
సతి క్రీడ సల్ప
మగసంతు జనించెను మెచ్చిరెల్లరున్
విరిసె మోదమనల్ప
అతడికి లభింపగ కొలువు
రిప్లయితొలగించండికుతుకముతో నగరి జేరి కోరినటులనే
వెతికిన దొరుకగ కడకు వ
సతి ; సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్ !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(1)
అతిశయిత కామవశమున
సతిఁ గూడెడి పారవశ్య సంస్థితి పతికిన్
మితిమీఱఁ, గలుగఁగ స్మరవ
సతి, సతి క్రీడింపఁ, బురుష సంతతి గల్గెన్!
(2)
కతలకు రాజగు పింగళి
సతినిఁ బతిగఁ, బతిని సతిగఁ జలుపంగ నటన్
సతి వరమున, వెసఁ బతియౌ
సతి, సతి క్రీడింపఁ, బురుష సంతతి గల్గెన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిచతురానన సృష్టి సహజ
రిప్లయితొలగించండిపతిసతి మమతా సరసము పరిమావధియే.
మతిహీ నుడొకడు బలకెన్
సతిసతి క్రీడింప పురుష సంతతి గల్గెన్.
గురువు గారికి నమస్సులు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బలికెన్' టైపాటు!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2663
సమస్య :: *సతి సతి క్రీడ సల్ప మగ సంతు జనించెను మెచ్చి రెల్లరున్.*
ఒక స్త్రీ మరొక స్త్రీ తో కలిస్తే మగబిడ్డ పుట్టినాడు. అందరూ మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: పరమ శివుని భార్యయైన సతీదేవి యోగాగ్నిచే తనను తాను దహింపజేసికొని మరణించింది. ఆ సతీదేవి మరుజన్మలో పార్వతిగా జన్మించింది. లోకములకు శివపార్వతులే దిక్కు. వారి కుమారుడే తారకాసుర సంహారం చేయగలడు అని భావించిన మన్మథుడు వారిపై పూలబాణాలను సంధించాడు. అప్పుడు శివుడు మరియు పార్వతీసతి అంటే పూర్వజన్మలో సతి కలసినారు. వారికి కుమారస్వామి కుమారుడుగా జన్మించాడు. అందరూ సంతోషించి ఆ ఆదిదంపతులను ప్రశంసించారు అని విశదీకరించే సందర్భం.
‘’సతి’’ మరణించె, శంభునికి సంతు జనించిన జచ్చు తారకుం,
డితరుల చేత జావడని యెంచి, సదాశివ పార్వతుల్ సదా
గతి యని పుష్ప బాణముల కాముడు వేసె, శివుండు పార్వతీ
*సతి ‘’సతి’’ క్రీడ సల్ప మగ సంతు జనించెను, మెచ్చి రెల్లరున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-4-2018)
తొలగించండికోట రాజశేఖర్ వారు
పానకంలో పుడక - కలువాయి అన్న పదానికి అర్థమేమిటండి ? కలువాయి బ్రహ్మజ్ఞానము అన్న పదాన్నేమో ఉపయోగించేసా తెలియక అసలే అరవం వాళ్ళైతిమి, నా వెనుక బడ్డారు కలువాయి కి అర్థం చెప్పమంటూ .!
తెలియజేయ గలరు.
క్యూరిసిటీ క్యాటు
జిలేబి
జిలేబిగారూ! మా నెల్లూరు జిల్లాలో కలువాయి అనే ఒక ఊరు ఉంది! అందుచేత మీ పూరణ సమంజసమే! 😀😀😀
తొలగించండి
తొలగించండిసీతాదేవి గారు
నమో నమః ! వూరుంది సరే ! ఈ పదానికి - కలువాయి కి - కలువాయి బ్రహ్మ జ్ఞానానికి - మెట్ట వేదాంతానికి లింకు యేదన్నా వుందా అన్నదే సందేహం ! ఇంతకీ కలువాయి కి అర్థమేమన్నా వుందా?
జిలేబి
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
******
జిలేబీ గారూ,
'కలువాయి' అర్థం నాకైతే తెలియదు.
కలువాయివేదాంతం : మాండలిక పదకోశం (తె.అ.) 1985
తొలగించండిఆచరణ శూన్యమైన నీతులు, అట్టి నీతిని బోధించటం [దక్షిణాంధ్రం]
కలువాయి వేదాంతము : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
మెట్టవేదాంతము, నీతులుమాత్రం చెప్పి ఆచరణ లేని మాటలు; కలువాయి నెల్లూరు మండలములో వెలిగొండలదగ్గర ఉన్న పెద్దగ్రామము; కలువాయి శతకమని ఒక శృంగారశతకము గలదు; కలువాయి బ్రహ్మజ్ఞానము. [నెల్లూరు]
కలువాయి శతకములోని యొక పద్యము:
సీ.
సిగ్గింతయును లేక చెల్లెలికై తాను
గుంటెనకాఁడైన కొంటె యితఁడు
తన మేనమామను దయ యింతయును లేక
ద్రుంచివైచిన గొప్పద్రోహి యితఁడు
జనకుని తోఁబుట్టుఁ జెనక రాదనక యా
రాధను బొందిన వ్రాత్యుఁ డితఁడు
కులసతీమణు లింటం గోరి చరింపఁగాఁ
బరభామల బొందు పాపి యితఁడు
గీ.
అనుచుఁ జెప్పుట నిజమయ్యె నతివలార
యిట్టికఠినాత్ముఁ డిఁక నన్ను నేఁచడఁటరె
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ
దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!
-"కలువాయి శతకము" నుండి
(రచయిత పేరు తెలియదు)
కలువాయి సమాసము.
తొలగించండికలు = ఱాయి, కల్లు (మద్యము);
వాయి = నోరు
కలువాయి = ఱాతి నోరు ( దృఢమైన నోరు)
కలువాయి = కల్లు త్రాగిన నోరు
గా భావించ వచ్చును.
"కల్లు ద్రాగిన నోరు" సరైన అర్థం కావచ్చు. కల్లు ద్రాగినవాడే కదా మెట్ట వేదాంతం పలికేది. ఱాతినోరు అసలు పలుకనే పలుకదు.
తొలగించండిఱాతి నోటిని కొండగుహ గా కూడా భావించ వచ్చును.
తొలగించండిమనం కొండను త్రవ్వి యెలుకను పట్టే పనిలో ఉన్నామనిపిస్తోంది! దీనిని మార్గాంతరం ఉందో, లేదో... ప్రయత్నించాలి...
తొలగించండిదీనికి...
తొలగించండి
తొలగించండిగుండు వారు కలువాయి పద్యం లో
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ
దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!
ఇందులో కలువాయి చిన్నికృష్ణుడు - కలువాయి వూరి చిన్నికృష్ణుడనుకోవచ్చా ?
ఈ శతకం మొత్తం పీడీఎఫ్ లింకు ఏదన్నా వుందాండీ ?
జిలేబి
మీ యూహ సరియైనదేనండీ జిలేబీ గారూ!
తొలగించండిపై పద్యం దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు ప్రకటించిన thepictame.com Online Instagram Posts Viewer నుండి సంగ్రహించాను. మీరూ క్లిక్ చేయండి.
కలువాయి అంటే కలువల బావి ఉన్న ఊరేమో నని నా అనుమానం. కలువల బావి వద్ద గల ప్రదేశంలో ఎవరైనా యోగి ఉండేవాడేమో. ఆతడందించిన జ్ఞానం కలువాయి వేదాంతమనీ, కలువాయి బ్రహ్మజ్ఞానమనీ పిలువబడేదేమో! పరిశోధించాలి...వాకబుచేయాలి...తెలిసినవారినుండి.
తొలగించండినాకును మీయూహయే సరియైనదనిపిస్తున్నది ఆర్యా! మా జిల్లాయే కనుక పెద్దల నెవరినైనా కనుక్కుని చెబుతాను!
తొలగించండి
తొలగించండికలువాయి శతకము నుండి మరొక్కటి
కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె
నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె
యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె
వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె
ఇట్టివానికి మావార లిచ్చినపుడె వడ్లతోఁ దట్ట యెండఁగా వలసివచ్చె
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి!
"కలువాయి శతకము""
Source
http://mallapragadaramakrishna.blogspot.com/2016/02/blog-post_4.html
తొలగించండికలువాయి వేదాంతము - వావిలకొలను సుబ్బారావు ( వాసుదాసుడు)/ఒంటిమిట్ట వారి వ్యాసం
శ్రీ భక్తి సంజీవిని మే 1929 పత్రిక
http://sribhakthisanjeevani.org/sbs/1929/may.pdf
జిలేబి
కలువాయి గుఱించి చర్చ చేసిన వారికందఱికీ హృదయపూర్వక ప్రణామాలండీ.
తొలగించండి
తొలగించండిఏమండీ కోటా వారు ఇది మరీ అన్యాయం. మీరేదో విషయం వివరిస్తారని ఆశిస్తా వుంటే ఇట్లా శుభం కార్డు ముక్క వేస్తే యెట్లాండి ?
కలువాయి కి అర్థం చెప్పండి
జిలేబి
జిలేబీ గారూ:
తొలగించండిదీన్ని మా 1958 ఆంధ్రా యూనివర్సిటీ పరిభాషలో ఇలా అనేవారు:
"దబాయింపు సెక్షను"
తొలగించండికవన శర్మ గారి బంగారు రోజులు :)
జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅతి సన్నిహిత సతులు విడమరచి పలికిన పలుకులు:
పతికిని యూహలుండకనపౌరుష క్రీడ లటంద్రు బెద్ద లా
సతిగనె *కామ సూత్రముల*చక్కని యోగపు గ్రంథ మందుకై
జత న తనే సు ప్రేరితగ స్థానము దప్పి రమింప మేలయెన్
సతి!సతి క్రీడ సల్ప మగ సంతు జనించెను, మెచ్చి రెల్లరున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పతికిని నూహ లుండక యపౌరుష..." అనండి.
వ్రతముగ తపమును జేయుచు
రిప్లయితొలగించండిసితికంఠుని మదినిగెల్చి ,శీఘ్రముగానే
పతి గోల్పోవగ తారకు
సతి, సతి క్రీడింప పురుష సంతతి గల్గెన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
[28/04, 05:59] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిపతిదేశాటనమేగెను
పతకములెన్నియొ గొనుచును వచ్చిన గని యా
పతికి నొసగి విందు,పొంది వ
సతి,సతి క్రీడింప బురుష సంతతి కలిగెన్
[28/04, 07:49] Nvn Chary: అతివనుపెండ్లాడెనతివ
అతిహార్మోనుల ప్రభావ మతనిగ మార్చన్
చతురాస్యు ఘనత బతియౌ
సతి ,సతిక్రీడింప బురుష సంతతి గల్గెన్
చారి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
శ్రుతిలయ రాగంబట్లుగ
రిప్లయితొలగించండినతులిత ననురాగమందు నాత్మీయతతో
పతిభావన కనుకూలవ
సతి సతి క్రీడింప బురుష సంతతిగల్గెన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికం
వ్రతములు జేసెడు నొక సతి
పతి వాంఛలను గమనించి వ్రతమును వీడెన్!
రతి సలుపగ పతిని పిలిచె
సతి , సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపొతవగు పిల్లల పటములు
మతించుచు మనోహరుడగు మగని నొలయుచు
న్నతనిని గూడి ఋతియగు వ
సతి, సతి క్రీడింప బురుష సంతతి గల్గెన్
(మతించుచు= ఊహించుచు; ఒలయుచు= కోరుచు; ఋతి=శుభము; వసతి= రాత్రి)
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారములు
తొలగించండిమితి మీరిన పరివారము
రిప్లయితొలగించండిసతిపతు లకువీలులేదు సరసము లాడన్
వెతకగ వారికి దొరికె వ
సతి, సతి క్రీడింప బురుష సంతతి కలిగెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతిమంతులు సానులతో
రిప్లయితొలగించండిజతగూడరనుచు నతనికి జనులు దెలుపగా
హితమును గొనుచు వదలియు న
"సతి ; సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్"
****)()(****
అసతి + కులట ; ఱంకుటాలు
సవరణ:
తొలగించండిఅసతి = కులట ; ఱంకుటాలు
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రతిదినము వీలుకుదరక
రిప్లయితొలగించండిసతమతమగుచుండ నిన్న సమయము దొరకన్
బతినామంబున బరగెడు
సతి,సతిక్రీడింపబురుష సంతతి గల్గెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతివలు దాముమారగ సహాయక ద్రవ్య పదార్ధసంపదన్
రిప్లయితొలగించండిబతులుగభామలయ్యెడనభర్తలుగాగనుమారగోరగన్
సతిసతి క్రీడసల్పగ మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
పతిసతులిట్లుమార్పులను భావనజేయుట వింతయేగదా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అయ్యెడను' అనండి.
పతిపై మరులుగొనగ నా
రిప్లయితొలగించండిపతిని నెమ్మదిగా కవించు బాసన తారా
పతి నిండుగనున్నట్టి వ
సతి సతి క్రీడింప బురుష సంతతి గల్గెన్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
ధన్యవాదాలు శంకరయ్య గారూ. సవరణ చేస్తాను
తొలగించండిఅతులిత మధురమ్మీ దం
రిప్లయితొలగించండిపతుల సరళ జీవ నమ్మవనినిఁ దలంపం
బతివరు ముదమున నిజ నివ
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
స్థితమతి రుక్మిణీ సతి సుతీక్ష్ణుఁడు రుక్మి తలంప నా దురా
గతమును ద్రోసిపుచ్చి తమిఁ గంస రిపూత్తముఁ బెండ్లి యాడ లో
లతర నవాంక పీఠ సుతలస్థిత సద్విలసన్మహా రసా
సతి సతి క్రీడ సల్ప మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
[రసాసతి = భూదేవి; లోల తర నవాంక పీఠ సుతల స్థిత సద్విలస న్మహా రసాసతి = విష్ణువు, ఒడిలో కదులుచు నుండి విలసిల్లుచున్న భూదేవి కలవాఁడు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిగత మతడన్న?ధైర్యమున గర్వము చేతనుయున్నవాడె!సం
రిప్లయితొలగించండిగతి విన?యబ్బురంబగు వికారము:జంబలబంబచేతనే
పతిసతియయ్యె మార్పులకు భావనభాగ్యముమారిపోవగా
సతిసతి క్రీడసల్పమగసంతు జనించెను మెచ్చిరెల్లరున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చేతను నున్నవాడె... విన నబ్బురంబగు...' అనండి.
రిప్లయితొలగించండిమితిమీరుచు నాస్వాదిం
చితివో దుష్టుడ మధూళి? చిత్తభ్రాంతిన్
మతితప్పిపల్కుటే? యే
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతివల పండుగన్ వడిగ, హాయిగ నూగుచు; నట్లు పోయుచున్
రిప్లయితొలగించండిపతులకు నాయువిమ్మనుచు పాటలు పాడుచు గౌరి పూజలన్
సతి సతి క్రీడ సల్ప; ...మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
సతియును నీశు కూడగనె;...షణ్ముఖ ప్రాప్తికి సంతసించుచున్
అతివల పండుగ = అట్లతద్ది
"త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది"
https://te.m.wikipedia.org/wiki/అట్లతద్ది
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅతుకుల బొంత గాధయిది! హద్దులు దాటి మధూళి త్రావినా
వ?తరము కాదు పల్కనిటు వంకరకొంకర మాటలెల్ల మా
దతెవుల తోడు! పాతకుడ! ధర్మముగాదిది చెప్పకోయి!యే
సతిసతి క్రీడసల్పమగసంతు జనించెను, మెచ్చిరెల్లరున్?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మెచ్చే' అనడం వ్యావహారికం. "మెచ్చెడి" అనండి.
పతియుండి సంతు లేకను
తొలగించండిసతి మెచ్చెడి క్రొత్తరీతి సంతున్ బొందన్
పతి కణమే గర్భమున, వ
సతి, సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
మతి చలియించిన సతిగా
రిప్లయితొలగించండిసతతము నాటకములందు సాగెడి పతియే
సతి రూపున జేరె సతిని
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్
నిన్నటి సమస్యకు నాపూరణ
దశరధుని భాగ్య మన బుట్టి దాశరధియె
క్షితిని దున్నుచు జనకుడు సీతను గన
శివుని విలు బట్టి చెంతకు చేర్చ , చిట్టి
తల్లికిం దాళిఁ గట్టెను దాశరథియె
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు.
చంపకమాల (సరసీ)
రిప్లయితొలగించండిచంపకమాల
పతి సతు లిద్దరిన్ గలుపు బాధ్యత వియ్యపురాళ్ల పంతమై
యతులిత పాటవమ్ముల నయమ్ముగ నొక్కటి జేసి వారలున్
జతపడు నంకమొక్కటిని చక్కగ నల్లి జయమ్ము నందగన్
సతి సతి క్రీడ సల్ప మగసంతు జనించెను! మెచ్చి రెల్లరున్! !
కందం
రిప్లయితొలగించండిపతి సతుల మధ్య సఖ్యత
గతించ, వియ్యంపురాళ్లు కథనము తోడన్
జతగూడఁజేయ వారిన్
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్!
ఈ మధ్య వస్తున్న వార్తలు విని, నిజమో కాదో తెలియక -
రిప్లయితొలగించండిఒక పాతకాలపు ఛాందస వ్యక్తి స్పందన -
కృతకపు సంయోగములన్
సతులకు గర్భములగునను చరితలు వింటే?
మతిచెడె! కనుగొనుమెక్కడ
సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్?
- శ్రీకాంత్ గడ్డిపాటి
అనవుడు నావిని యొకడు
తొలగించండిహనుమయ్య యెవరు? గాలికింబుత్తలే?
ఇనకుల తిలకుడు యెవరు? పాయసమునకుంబుత్తలే?
జానకి యెవరు? నాగటికింబుత్తలే?
సతిసతులకుఁ బురుష సంతతిఁ గలుగునుయత్తులే
యనినంత నచ్ఛాందసుండుఁ దడబడుచు నొడబడెన్
క్షమించగలరు – కొంచెం సరదాగా...
కతిపయ దినముల తదుపరి పతి సాంగత్యమ్ముకలుగ భాగ్యనగరిలో నతిసులభముగా కలుగ వ సతి, సతిక్రీడింప బురుష సంతతి గల్గెన్
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమతిజెడి మాటలాడకు సుమా యిది ధర్మము కాదు శాస్త్ర స
రిప్లయితొలగించండిమ్మతమది కాదు కాంచినను, మర్మమెఱుంగు మధర్మమే గదా
సతి సతి క్రీడసల్ప, మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
సతి శితి కంఠుకున్ గదర షణ్ముఖుడే నిలయగ్ని జన్ముడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతులిత ప్రేమము గల్గగ
రిప్లయితొలగించండిసతిగా గాంధర్వ విధిని దగ బెండ్లాడె్న్,
అతిధిగ కణ్వాశ్రమపువ
సతి,సతిక్రీడిం ప బురుష సంతతి గల్గెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమచే సుముఖాసత్తి పతిగను, మణిస్తంభుఁడు సతిగను మాఱి, కామకేళీ విలాసులై క్రీడించి, మగబిడ్డఁడైన కళాపూర్ణునిం బ్రసవించఁగా, నందఱును మెచ్చినట్టి ఘట్టము నిట ననుసంధానించుకొనునది)
సతి పరమేశ్వరీ వర ప్రసన్నత, నంచిత సత్స్వరూపు, లా
యత ప్రతికూల రూపులయి, హర్షభరప్రకటాతిరేక స
త్ప్రతిభులునై, స్వకీయ ఫలితాప్తికి, సద్వ్యతిరిక్త భర్తయౌ
సతి, సతి క్రీడ సల్ప, మగసంతు జనించెను! మెచ్చి రెల్లరున్!!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. సమస్య
*"సతి సతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్"*
సందర్భము: ఒక గోపకాంత రాధిక పాత్ర ధరించింది. మరొక గోపకాంత కృష్ణుని పాత్ర ధరించింది. ఆ రూపకం చూడడానికి వచ్చిన ప్రేక్షకులను చూచి మరో గోపిక యిలా అంటున్నది..
*"సతి..సతి క్రీడింపగా పురుష సంతతి కలిగినట్లున్నది కదా!"*
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
సతి యొకతె రాధ యయ్యెను..
సతి యొక్కతె కృష్ణు డయ్యె..
సందర్శక సం
తతిఁ గని యొక గోపిక యనె..
*"సతి సతి క్రీడింపఁ బురుష*
*సంతతి గల్గెన్"*
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
2 వ పూరణము:
రిప్లయితొలగించండిసందర్భము: అప్సరస యైన మేనక విశ్వామిత్రుని తపోభంగ మొనరించడాని కేతెంచి ఆ మహర్షివలన శకుంతలను కని దేవలోకానికి వెళ్ళిపోయింది.
శకుంతలను కణ్వమహర్షి తన ఆశ్రమంలో అతి గారాబంగా పెంచినాడు. ఒకనాడు ప్రభువైన దుష్యంతు డేతెంచి ఆ కన్యను ప్రేమించి ఏకతమున అనగా ఏకాంతంలో తగిన వసతి యేర్పడగా ఆమెతో సుఖించినాడు. పురుష సంతతి అనగా భరతుడు జన్మించినాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
యతి కణ్వు డాశ్రమంబున
నతి ప్రేమను బెంచె మేనకాత్మజఁ.. బ్రభు డే
కతమున గలిసెను తగిన వ
సతి.. సతి క్రీడింపఁ బురుష
సంతతి గల్గెన్..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండిసతిపతులకు నేకాంతము
యతనము చేసినను దొరక యాతనమవగా
రతిపతిపితనట తలచి వ
సతి సతి గ్రీడింప పురుష సంతతి కలిగెన్.
2.మతిలేని మాట లివియే
సతిసతి గ్రీడింప పురుష సంతతి గల్గెన్
మతియున్న వారలనరిటు
సతికిల పురుషుని వలననె సంతతి కలుగున్.