3, ఏప్రిల్ 2018, మంగళవారం

సమస్య - 2640 (మగనికి గర్భమయ్యెనని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస"
(లేదా...)
"మగనికి గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్ "
(ఒక అవధానంలో శ్రీ నరాల రామారెడ్డి గారు పూరించిన సమస్య)

శ్రీ నరాల రామారెడ్డి గారి అవధానాన్ని క్రింది వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=9IY5cI8UiFM

111 కామెంట్‌లు:

  1. అత్త మామల తోపోరు నదిక మయ్యె
    సంతు లేకున్నమనబిడ్డ చచ్చి పోవు
    ననుచు గదిలోన చెప్పెను వనిత తోడ
    మగడు, నెల దప్పెనని దువ్వె మగువ మీస
    ముపతి యొక్క ము ఖముపైన ముద్దు బెట్టి

    రిప్లయితొలగించండి

  2. వాక్య మొక్కటి గాంచెను వయసు కుర్ర
    వాడు; చిలిపితనమ్మున పదముల నటు
    నిటుగ మార్చి జిలేబిని నెక్కి రించె
    మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెక్కిరించె అనుకుంటాను. ఎక్కిరించె అనవచ్చునా! 🤔 😃

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      విట్టుబాబు గారూ,
      వెక్కిరించు, ఎక్కిరించు రెండూ రూపాంతరాలు.

      తొలగించండి
  3. పెండ్లి జరిగిన వెంటనే పెండ్ల మనుచు:
    "మగఁడు! నెలతప్పెనని"; దువ్వె మగువ మీస
    మామె భర్తది ముద్దుగ మరల మరల
    తీరె కోరికయనుచును తియ్య గాను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. భావమేమి తిరుమలేశ మొదటి పాదమునకు?


      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు. వివరించండి.

      తొలగించండి
    3. పెండ్లైన పిమ్మట త్వరితముగా తనకు నెల తప్పినదని గర్వముగా తాను తన భర్త మీసమును దువ్వినదని

      తొలగించండి
  4. అమితమైనట్టి యనురక్తు లాలుమగలు
    నొండొరులు వేషముల్ మార్చి రొక్క యేడు ;
    పతిగ చరియించు పత్ని గర్భవతి యయ్యె ;
    మగడు నెలతప్పెనని దువ్వె మగువ మీస .
    (భార్యాభర్తల సయ్యాట )



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      దంపతుల సయ్యాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. తల్లిదండ్రుల పోరింక తాళలేక
    వివిధ వ్రతములఁ జేసెనే పిల్లల కని
    మగడు, నెలదప్పె నని దువ్వె మగువ మీస
    ములిల నుండడెవడనుచు ముగ్ద పలికె

    దువ్వె ......బుజ్జగించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పూరణ చివర కొంత సందిగ్ధత ఉన్నది.

      తొలగించండి
    2. మీ సములు ఇలలో యెవడుండుననుచు భర్తని పొగిడిందని భావంతో వ్రాసానండి

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    నగవులు చిందులాడ , శయనమ్మున చుంబనకోటినిచ్చుచున్
    మగనికి , గర్భమయ్యెనని , మానిని , మీసము దువ్వె వేడుకన్
    మగని ముఖమ్మునందు , బహుమానమిదంచును బల్కి గోముగా !
    మగడును జేరదీసి తన మానవతిన్ గొనియాడె నెంతయున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అకారణం...

      అమ్మ వచ్చివారమె యని యనుచు దువ్వె
      మగడు , నెల తప్పెనని దువ్వె మగువ , మీస
      మును బతియు ., రోసమున కాలు ముదిత ., యిట్టి
      యింటి జగడమునకు హేతువేమి వలయు ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. ముఖ్యంగా రెండవ పూరణలోని చమత్కారం అద్భుతం. అభినందనలు.

      తొలగించండి
    3. జిలేబిగారి వ్యాఖ్యను బలపరచుచున్నాను ☺️

      తొలగించండి


  7. సిగరము నెక్కె నాపతియె! చెప్పగ సిగ్గుల దొంతరై భళా,
    మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్
    సగపడు కైపుగానతడు చక్కగ భార్యకు ముద్దు లిచ్చుచున్
    జగమెరు గున్నికన్ సతిని చక్కని తల్లిగ మేలు బంతిగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సతి శరీర మార్పుల గూర్చి సంతసింప
    మగఁడు, నెలతప్పెనని దువ్వె మగువ మీస
    ములను కౌగిలించి పతిని ముదము కదుర
    నధరముల నాని కరమగు నర్థితోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శరీర మార్పులు' దుష్టసమాసం. "సతి శరీరము మారగ సంతసింప" అనండి.

      తొలగించండి
  9. తొల్లి మగవారె కందురు పిల్ల లంట
    యుగము మారెను కనవయ్య జగము వింత
    మంత్ర జలమును గ్రోలిన మహిమ వలన
    మగడు నెలతప్పె ననిదువ్వె మగువ మీస
    ములను ఠీవిగ మెలివేసి మురిసె ఘనము




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'తొల్లి' అని మీరు చెప్పినది నిజం కాదు. సృష్ట్యారంభం నుండి నెలతప్పేది స్త్రీలే కదా!

      తొలగించండి
    2. ఎందుకు ?
      మంత్ర జలము వలన మాంధాత , నాభికమలం నుండి బ్రమ్మ , శివుడికి మానస పుత్రిక , ఊర్వసి , ఇలా మగవారికి , పుడుతూనె ఉన్నారుగా ? అందుకే రాసానన్నమాట . [అదన్నమాట అసల్ సంగతి ]

      తొలగించండి
  10. హార్మోను చొరవతో జన్యు కదలికలుగ లింగమార్పిడులు
    మారినవి గర్భ సంచులె కాదు మూతుల మీసనూర్పిడులు
    సతి గ్లామరునెంచి పతి కడుపు తా ధరించె ప్రేమమీరగన్
    మగనికి గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్

    రిప్లయితొలగించండి

  11. తే.గీ.
    కోవెలలు సతితో సంతు కొరకు తిరిగె

    మగడు; నెల దప్పెనని దువ్వె మగువ, మీ స

    కల విభువులు మీ మది వేదనలను తీర్చి

    రనుచు,భర్త మీసములను హ్లాదనమున


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  12. భోళాశంకరుడు వరమిస్తే :)


    జగడకత్తెలు కోరగ శంకరుండు
    వరముల నొసగె మగవాండ్లు వలపు మీర
    నీరు మోసెదరికబో! తనిచనుచు మజ
    మగఁడు నెలతప్పెనని, దువ్వె మగువ మీస!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కొంత గడబిడ ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మగవారు/మగవాండ్రు' అనండి.

      తొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2640
    సమస్య :: *మగనికి గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్.*
    భర్తకు గర్భం వచ్చింది అని భార్య మీసం దువ్వింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వివాహమై చాలాకాలమైనా సంతానం కలుగలేదు అని స్త్రీలు బాధపడుతున్న ఈ రోజుల్లో ఒక యువతి పెండ్లియైన నెలరోజులకే నెల తప్పింది. పరమానందాన్ని పొందింది. స్త్రీ జన్మకు సార్థకతను చేకూర్చే అమ్మ పదవి తనను వరించిందని, తాను ధన్యురాలనని, ఉత్తమ గతులు లభిస్తాయని, సంబరపడుతూ భర్తను చేరి అతని ముఖమున ముద్దు పెడుతూ *నేను గర్భవతి నయ్యాను* అని గోముగా చెబుతూ ఆయన మీసాన్ని దువ్విన సందర్భం.

    మగువ వివాహమాడి, యొక మాసములో నెల దప్పి, యమ్మగా
    నగణిత మోద మందగల నంచును, ధన్యత గాంతు నంచు, శ్రీ
    సుగతులు గల్గు నంచు, బతి జూచి , ముఖమ్మున ముద్దు బెట్టుచున్
    *మగనికి , గర్భ మయ్యె నని మానిని మీసము దువ్వె వేడుకన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (3-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఇటువంటి సమస్యనే
      మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
      శ్రీ నరాల రామారెడ్డి గారు నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అవధానంలో పూరించారు.
      సందర్భం :: ఎన్నో ఏళ్లకు గర్భవతియైన పొరుగింటి ఇల్లాలిని ఆమె స్నేహితురాలు అభినందించిన సందర్భం.

      సగము గతించె యౌవనము, సంతతి కల్గక పోయె నంచు, పె
      న్వగపున క్రుంగిపోవ, భగవంతుడు చల్లని చూపు జూచె ; గ
      ట్టిగ ఫలియించె నీ కడుపు ; డెందము పొంగగ ఠీవి వచ్చె నీ
      మగనికి ; చూలు వచ్చెనని ; మానిని ! మీసము దువ్వకుండునే ?
      శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ
      సేకరణ :: కోట రాజశేఖర్

      తొలగించండి
  14. చాల సంతోషముంజెందె సతిని గనుచు
    మగడు, నెలతప్పెనని, దువ్వె మగువ మీ స
    ములెవరని వచియించుచు ముద్దుగాను
    భర్త మీసము మెలిబెట్టె బాళి తోడ!!!

    రిప్లయితొలగించండి
  15. చాల కాలము సంతాన జాడలేమి
    విసిగి వేసారి వినగనె వీనులలర
    మగడు, నెలతప్పెనని, దువ్వె మగువ మీ స
    కల మనోభీష్టము దీర్తు గాంచు మనెను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దువ్వు = వలపుచే స్పృశించు ( ఆంధ్ర బారతి)

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      విరుపు అద్భుతంగా ఉన్నది. పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  16. విజయదశమి యెపుడనుచు ప్రియునియడుగ
    నాపతియు తికమకపడి యామెతోడ
    కార్తికమనుచుచెప్పగ కాదనుచునె
    మగడునెలతప్పెనని దువ్వె మగువమీస

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  17. దూర దేశంబు నుంటిమి తోడు లేర
    నుచును కోపించె విసుగుతో విచలితుడగు
    మగడు,-నెల తప్పెనని-దువ్వె మగువ,మీ,స
    ములును లేరయ్య నాథ!నమో యటంచు.

    రిప్లయితొలగించండి
  18. సొగసు న మిన్న యౌసు ద తి సుందరు ని న్ వరి యించి నంత నా
    మగడు మనోహరు oడగుచు మక్కువ తో నను రాగ వర్తియై
    తగిన విధం బు న న్ మెలగ ధన్య త తో పలికెన్ ముద oబున న్
    మగ ని కి గర్భ మ య్యేన ని మానిని మీసము దువ్వేవే డు క న్

    రిప్లయితొలగించండి
  19. సంతు లేదనుచు వగచు సతియె మురిసె
    వైద్యు రాలామె కును శుభ వార్త జెప్ప
    నంతు లేని సంబరమున సంతసిల్ల
    మగఁడు;నెలతప్పెనని,దువ్వె మగువ మీస!
    ***)()(***
    (నెల తప్పిన సంబరమున ఆసతి మగని మీసము దువ్వినది)

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా సత్యనారాయణ
    వంద్యా !రమ్మిట స్తోత్ర పాఠముల సద్వైనమ్ము పాటింపగన్
    నంద్యర్చన్ గన నాత్మలింగ విభుడే నన్ బ్రోచు :దుర్వాఖ్యలన్
    నింద్యమ్మన్నది లేదు యీ జగతిలో నేర్పున్ గనన్నిప్పుడీ
    నంద్యాల ప్రజ లెట్లస్తుత్యులననర్హార్యజ్ఞ దుర్నీతులున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      సమస్య ఉత్పలమాల అయితే మీరు శార్దూలం వ్రాసారు. చివరి పాదం కొంత గందరగోళంగా ఉన్నది.

      తొలగించండి
  21. డా.పిట్టానుండి
    ఆర్యా,
    నిన్న Day.C.M,&శ్రీ పేర్వారం రాములు గారు "కాకతీయ వైభవం"ను ఆవిష్కరించి,రచయితలకు తత్ప్రతులను పంచినారు.నావ్యాసం
    తెలంగాణా సామెతలు అచ్చైంది
    ఆకాశవాణి సమస్య
    అన్నల వేట,పన్నులవిహారము,గల్గిన నోట్ల మార్పిడిన్
    గన్నవి బాధ,లే.సి.బి.ని గాంచెడి దుర్దశ, యింట నొంటిపై
    యున్నను పైడికిన్ రుసు మయోమయ బ్యాంకులు, మమ్ము జూచు వే
    కన్నులు; "లేనివాడు"కన గల్గెను లోకము కన్నువిందుగన్!

    రిప్లయితొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    స్త్రీ చూలా లైనపుడు ఆమె మనోప్రవృత్తి మరియు భర్త బింకము
    . . . . . . . . . . . . . . . .



    నగుచును , చింతకాయను దినన్ మన సుంచుచు , సిగ్గు మొగ్గలై

    నిగనిగలాడ మోము పయి , నెక్కొనగా నరుసంబు :-- తెల్పె దా

    మగనికి , గర్భ మయ్యె నని మానిని | మీసము దువ్వె వేడుకన్ >

    మగ డపు డామె c జుంబన మొనర్చుచు | సందిట జేర్చె , నేనె పో

    మగడను లోక మందున సుమా యను బింకము పొంగుచుండగా |


    { మగడు = భర్త. , శూరుడు }

    ...........................................

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  23. తగఁ దిరుగంగ తీర్థములు తద్దయు భక్తినిఁ జెప్పె ప్రీతితో
    మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్
    మగువ శరీర మందు పలుమార్పులు కన్గొని భర్త వీఁకతో
    స్వగణము సంతసింపగను వచ్చెడి బిడ్డను గూర్చి తల్చుచున్

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    (పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమ[బ్రహ్మవాక్కు, సరస్వతీవరము]చే సుముఖాసత్తిగ మాఱిన మణిస్తంభుఁడు...మణిస్తంభునిగ మాఱిన సుముఖాసత్తి వలన...గర్భముం దాల్చి, కళాపూర్ణునిం బ్రసవించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

    భగవతి శారదా వర శుభంకర సంచిత కృద్విరూప స
    త్ప్రగతులునై మనోరథ ఫలమ్మునకై విహరించి దంపతుల్
    నగరముఁ జేర, నచ్చటనె నారికిఁ గన్పడ గర్భచిహ్నముల్,
    "మగనికి గర్భమయ్యె" నని, మానిని మీసము దువ్వె వేడుకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరాభరణం వాట్సప్ బృందములో మాన్యులు శ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారు నన్నభినందించుచుఁ బ్రకటించిన పద్యము:

      మధురము రసమధురము చి
      న్మధురము బిసరుహమరందమధురమ్ము సుధా
      మధురము హృన్మధురము మా
      మధురకవీ! నీదు కవిత మధురము సుమ్మీ!

      తొలగించండి
  25. సంతసమ్మున నుప్పొంగె నంతరంగ
    మెల్ల ముదముగ నుడువుచుఁ జల్ల నైన
    వార్త నెల్ల నుఱికి వేగ భార్య కంత
    మగఁడు నెల తప్పెనని దువ్వె మగువ! మీస

    [నెల =స్థానము; తప్పు = అతిక్రమించు; ఉన్నతపుఁ బదవి పొందుట]


    అగములు తోయసంభవము లభ్ర చరమ్ములు విశ్వ మందునన్
    మృగములు మానవోత్తములు మెత్తురు నిచ్చలు సంతు వుట్టినన్
    మగువల జన్మసార్థకము మాన మొసంగును భర్త కంచుఁ దా
    మగనికి గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్

    [అని = చెప్పి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. సొగసు చూపుతు నయముతో సొంపు మీర
    మొగము చేతుల దాచుచు మగని జూడ
    పాగ తననెత్తి బెట్టుచు పంటి నొక్క
    మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస


    Dr Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చూపుచు' అనండి.

      తొలగించండి
  27. అత్తమామలున్నట్టింటయల్లుడుండ
    రాదను నియమ మాషాడ రాకదెలుప
    కొత్తజంటకు యిబ్బందిగూడ?లలిత,
    మగడు"నెలతప్పెనని దువ్వె మగువ మీస
    ములను బట్టిసంతోషపున్ ముద్దునిడుచు
    శ్రావణంబున రాకతోసంబరాన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆషాఢ రాక' అన్నది దుష్టసమాసం.

      తొలగించండి
  28. డా.పిట్టా సత్యనారాయణ
    పగతుర దుస్సమీక్ష వినె బల్లిదుడా పతి కాడు కాడనన్
    వగవక దాన కాపురమువాల్చెను దైవమె గాచు నంచు వే
    సెగలకు తావు నీయదు ససేమిర,పుంసవనమ్ము వేళ,"నా
    మగనికి గర్భమయ్యె"నని మానిని మీసము దువ్వె వేడుకన్

    రిప్లయితొలగించండి
  29. మగువకు సంతు లేక పలుమారులు నోచి నోములం
    దగిన విధమ్ము, సిద్ధిగని ధన్యతఁగాంచుచు ముద్దొసంగెఁదా
    మగనికి గర్భమయ్యెనని; మీసము దువ్వె వేడుకన్
    మగటిమిఁజూపునట్లు నభిమాధనుండగు భర్త ధీరతన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "పలుమారులు శ్రద్ధగ నోచి నములం" అనండి.

      తొలగించండి
  30. తేటగీతి

    తండ్రి కాక మీసమును క్రిందకును ద్రిప్ప
    మగడు, నెలతప్పెనని దువ్వె మగువ మీస 
    మెగయ పైకి మగటిమికి నింపు దాని
    చిన్న బోనివ్వకు మనుచుఁ గన్నుగీటి!

    చంపకమాల

    సుగతుల నిచ్చు సంతతిని జూచెడు భాగ్యము నీయమంచుఁ దా
    పొగులుచు షణ్ముఖున్ గొలువ మ్రొక్కుల మీసము జార క్రిందకున్
    మగనికి, గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్ 
    మగటిమి గుర్తుగా నెగయ మన్నన జేయుచుఁ గన్నుగీటుచున్

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టాసత్యనారాయణ
    అగడు దినముల నాసతి యమ్మగారి
    ఇంట నుండియు నెల దాటనైన రాదు
    విసిగి సతి నీడ్వ కోర్టుకు వెకిలి బుద్ధి
    మగడు, నెల తప్పెనని దువ్వె,మగువ!మీస
    (ఆడవారి సామూహిక వార్తాలాపములలో విచార వినిమయము)

    రిప్లయితొలగించండి
  32. గుండు మధుసూదనార్యా ! మహత్తర మైన పూరణము

    రిప్లయితొలగించండి
  33. జగములు గెల్చితో ననగ,సంతస మందుచు దెల్ప వేగమే
    *మగనికి, గర్భమయ్యెనని, మానిని! మీసము దువ్వె వేడుకన్*
    మొగఁడది విన్నవేళ, వడి, ముద్దుల ముంచుచు భార్యనక్కటా!
    యగణిత మైన భావమదె,యమ్మగ నాన్నగ మారుటయ్యరో!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  34. గురువుగారు...జిలేబి గారికి శకారుడిలాగ నాకు ఇటువంటప్పుడు ఈవీవీ వారే దిక్కవుతున్నారు 🤣

    చూడ జంబలకిడిపంబ చిత్రమదియె
    ఆలుమగల గతులె మారి యటు దిటాయె
    తాళి గట్టె నాలి మగడె తలను దించ;
    "మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జంబలకడిపంబ అంటే అర్థమేమిటండి విట్టుబాబు గారు ? :)


      జిలేబి

      తొలగించండి
    2. అందరూ సతీపతుల ముద్దుముచ్చట్లే రాస్తున్నారు. ముదురు బెండకాయను నాకేమి తెలుసవీ..అందుకే ఇలా ఈవీవీ గారిని వాడుకున్నాను. ☺️

      తొలగించండి
    3. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. జిలేబిగారూ! జంబలకిడి పంబ అనేది ఈవివి సత్యనారాయణ అనే దర్శకుడు తీసిన సినిమా! అందులో స్త్రీలంతా పురుషుల వలె , పురుషులు స్త్రీల వలె ప్రవర్తిస్తారు!
      ఈ రహస్యం మీకు చెప్పేస్తే మీరు వాడేసుకుంటారని విట్టుబాబు గారు దాస్తున్నారు!😄😄😄

      తొలగించండి
    5. వచ్చేసా వచ్చేసా !


      జంబల మన "నిమ్మ" సుమా
      అంబా! కడిపెండ ముద్ద గాద జిలేబీ !
      జంబల కడిపెండయె భళి
      జంబల కడిపంబ సుదతి సంబరముగనన్ !

      తొలగించండి


    6. కావున జంబలకడిపంబ అనగా నిమ్మ కాయ తో చేసిన అన్నము :) చిత్రాన్నము :)


      జిలేబి

      తొలగించండి
    7. ఆహా! జిలేబిగారూ! మీ బుర్ర పాదరసమండీ! 👌👌👌👌👌

      తొలగించండి
    8. సీతాదేవిగారికి ధన్యవాదములు🙏🏻
      జిలేబివారి చిత్రాన్నము జంబలహాట్ 🙏🏻

      తొలగించండి
  35. నగరము నుండి వచ్చెనని నాథుని జేరిన కోమలాంగియౌ
    మగువను కౌగిలించుకునె మన్మథుఁ బోలిన సుందరాంగుడే
    వగలొలికించుచున్నతని వక్షము పై తలనాంచి చెప్పెనా
    మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్
    మగటిమ చూపితిన్ననుచు మత్తుగ నవ్వుచు ముద్దులాడెనే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నగరము పోయి వచ్చెనని" అనండి. లేకుంటే మగడు నగరంలో ఉంటే గ్రామంలోని భార్యకు గర్భమెలా అయిందన్న సందేహం వస్తుంది.

      తొలగించండి
  36. ఇటువంటి సమస్యనే
    మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
    శ్రీ నరాల రామారెడ్డి గారు నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అవధానంలో పూరించారు.
    సందర్భం :: ఎన్నో ఏళ్లకు గర్భవతియైన పొరుగింటి ఇల్లాలిని ఆమె స్నేహితురాలు అభినందించిన సందర్భం.

    సగము గతించె యౌవనము, సంతతి కల్గక పోయె నంచు, పె
    న్వగపున క్రుంగిపోవ, భగవంతుడు చల్లని చూపు జూచె ; గ
    ట్టిగ ఫలియించె నీ కడుపు ; డెందము పొంగగ ఠీవి వచ్చె నీ
    మగనికి ; చూలు వచ్చెనని ; మానిని ! మీసము దువ్వకుండునే ?
    శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ
    సేకరణ :: కోట రాజశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ ఉత్తమంగా ఉన్నది. వారికి నమస్సులు.

      తొలగించండి
  37. సగమయి జీవితమ్మునను చక్కని తోడయి వచ్చెనంచు చి
    ర్నగవుల స్వీకరించి తన నాతిని డెందము నందు దాచగా
    సగమయి మేన పొందె సతి సౌఖ్యము లన్నియు పండ ప్రేమలే
    మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్

    రిప్లయితొలగించండి


  38. సంతు లేదని మదిలోన చింత చేసె
    మగడు,నెలతప్పెననిదువ్వెమగువ..మీస..
    ములకు సంతులేదన్న నెట్టు పుడమి యందు
    దైవ మొసగెను త్వరలోన తండ్రి వౌదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "సంతు లేదన నెట్టు..." అనండి.

      తొలగించండి

  39. ............సమస్య
    మగఁడు నెల తప్పె నని దువ్వె
    మగువ మీస

    సందర్భము: సంతానాన్ని కోరే దంపతులు స్నానం చేసి తడి బట్టలతోనే జల కలశాన్ని ధరించి జలాన్ని సన్నటి ధారగా వదలుతూ మూడు మార్లు ప్రదక్షిణం చేయాలి. (మూడవ సారి ప్రదక్షిణం ముగిసేసరికి నీళ్ళు మిగులరాదు.) దీనినే వారు వోయడం అంటారు. ఇక్కడ తరతరాలుగా వస్తూ వున్న సంప్రదాయ మిది.
    తరువాత దీర్ఘ చతురస్రాకారంలో వున్న బండమీద సర్పాకారంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని పంచామృతాలతో అభిషేకించాలి. తదుపరి చలిమిడి నువ్వుల వుండలు స్వామికి భక్తితో సమర్పించుకోవాలి. తమ కోరికలు నివేదించుకోవాలి.
    ఇవీ ఎస్.కొత్తూరు లేదా సుబ్బరాయ కొత్తూరులో సంతానాభిలాష గలిగిన దంపతులు శ్రద్ధా భక్తులతో ఆచరిస్తున్న విధానాలు.
    ఒక జంట సంతు నాశించి ఇవన్నీ ఆచరించింది. భర్త ఇక తమ కోరిక తీరుతుం దని సంతోషించాడు. భార్య తనకు నెల తప్పిం దని మగని మీసమును సుతారంగా దువ్వింది. నా (స్త్రీ) జన్మ ధన్యమైం,దని పలికింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కోరి సంతానంబు వారు వోయుదు రంట!
    వారు వోయుట యన్న నీర మాడి,
    తడి తడి గుడ్డలన్ విడువకే జల కల
    శము ధరియించి, జలము వదలుచు
    మూడు ప్రదక్షిణల్ బొనరించు; టటుఁ జేసె
    నపు డొక్క జంట... పంచామృతాల
    నభిషేక మొనరించి, యతి భక్తితో నూవు
    లుండలు, చలిమిడి నుంచి, కొలిచి;

    రొనర కొత్తూరు సుబ్బరాయుని కరుణను
    సంతు గలుగు నటంచును సంతసించె
    *మగఁడు; నెల తప్పె నని దువ్వె*
    *మగువ మీస*
    మును మగనికి.. నా జని ధన్య
    మని పలికెను..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  40. ...............సమస్య
    మగఁడు నెల తప్పె నని
    దువ్వె మగువ మీస

    సందర్భము: సత్పుత్ర సంతాన యోగా న్నొకదాన్ని సంప్రదాయజ్ఞులు సారస్వత ప్రియులు గురుతుంచుకోవడానికి వీలుగా ప్రస్తావించ బోతున్నాను.
    వాల్మీకి విరచించిన శ్రీ మద్రామాయణము బాలకాండములోని పుత్ర కామేష్టి, పాయస దానం అనే అంశా లున్న 15 వ 16 వ సర్గములను 25 రోజులు పారాయణం చేయాలి. ఇల్లాలు కూడా వినాలి. నేయి కలిపిన పాయసం నివేదన చేయాలి. ఒక మంచిరోజున ఆరంభించాలి. తమ సంప్రదాయా న్ననుసరించి ముందు ప్రార్థన శ్లోకాలు పఠించాలి. పుస్తక పూజ షోడశోపచారాలతో చేయాలి.
    శ్రీ రామచంద్ర ప్రసాదేన సత్పుత్ర సంతాన సిద్ధ్యర్థం పారాయణ మహం కరిష్యే... అని సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ రాముని ధ్యానించి భక్తితో చదువాలి. చివరకు మంగళ శ్లోకాలు పఠించాలి. గ్రంథానికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. దీనికి ప్రమాణం ఉమా సంహిత.
    పై విధంగా వివరించగా సంతా నాభిలాష గల దంపతులు అనుసరించారు. అనతి కాలంలోనే వారికి శుభ శకునాలు కనిపించినవి. మగువ తనకు నెల తప్పిం దని సంబరపడి తెలియజేస్తూ మగని మీసాలు దువ్వింది. అప్పుడు కూడ రాముని విస్మరించలేదు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఆర్య!వాల్మీకి రామాయణ బాలకాం
    డమున పంచ దశ షోడశములైన
    సర్గములను భర్త.. సతి చేరి వినుచుండఁ
    బారాయణము చేయ వలయు భక్తి
    దినము లిర్వది యైదు దీక్షగా నేయి పా
    యసము నివేదింప నగును శ్రద్ధ..
    సుదినాన మొదలిడి తుదిఁ బ్రతి దినమును
    మంగళ శ్లోకాలు మరి చదువుడి!"

    యని వచింపగ దైవజ్ఞు, డటులఁ జేసి
    నారు దంపతుల్; శుభ శకునాల మురిసె
    *మగఁడు; నెల తప్పె నని దువ్వె*
    *మగువ మీస*
    ములను దన మగనికిని..
    రామునిఁ దలంచి..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  41. ...సమస్య
    మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస

    సందర్భము: సులభము.
    ముద్ద అక్షరాలున్న పదాలకు అర్థాలు:--
    1.పేలను పట్టి తీసే పెద్దసైజు పండ్లు గలిగిన చెక్క దువ్వెనతో 2.ఇచ్చవచ్చినట్టు పెరిగిన తలవెంట్రుకలను 3.పేలయొక్క గ్రుడ్లు 4.ఆపకుండ continuously 5 ఎడమచేయి
    ఇవి అవిభాజ్యమైన మహబూబునగరు జిల్లా ప్రాంతంలో వాడబడుతున్న పదాలు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పరగ *నీర్వెనన్* మగని *తుప్పలను* దువ్వ
    నెంచె *యీపి* యెక్కువయిన
    దంచు మగువ....
    *తియ్యకుండ* క్యాలెండరుఁ ద్రిప్పుచుండ
    మగఁడు; నెల తప్పె నని దువ్వె మగువ; మీస
    ములను దీయడు *పురచేయి*
    ముసలి మగడు.

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  42. మగువకు మూడు మాసముల మధ్యను గర్భము నీయలేనిచో
    నగవుచు తీతు మీసమని నాన్నకు చెప్పగ నవ్వులాటలో...
    దిగులిక నీకు తీరెనని తియ్యగ చెప్పుచు ముద్దులాడుచున్
    మగనికి;...గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్

    రిప్లయితొలగించండి