26, ఏప్రిల్ 2018, గురువారం

సమస్య - 2661 (...కౌపీనము ధరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"...కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ"
(లేదా...)
"...కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్"
(ఛందోగోపనము)

116 కామెంట్‌లు:

  1. మూలం తరోః కేవలమాశ్రయన్తః
    పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః |
    శ్రియం చ కంథామివ కుత్సయన్తః
    కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ||

    ...యతిపంచకం

    తరువుల నీడను పడుకొని
    కరతల భిక్షను గొనుచును కలిమిని సతినిన్;
    పరివారము వీడుచు కవి
    వర! కౌపీనము ధరించు వాఁడె ధనికుఁడౌ!

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    కౌపీనవంతః ఖలు భాగ్యవంతః....

    తలపన్నేర్వడు శోకమోహముల శాంతశ్రీ ప్రపూర్ణుండునై
    తలపన్నేర్వడు కష్టసౌఖ్యములనాత్మానందసంతృప్తి , నా...
    కలినిన్ దప్పికనెంచబోవడిల భిక్షన్ బొంది సంతుష్టి , ని....
    ర్మల కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధనమా ? పుష్కలమౌ తపోధనము ! వస్త్రాదుల్ గనన్ వల్కలా...
      జినముల్ , శయ్యయు చెట్టునీడ యగు , నాస్తిన్ జూడ దండంబు , భో
      జనమా కందఫలాదు, లైన మదిలో *సంతృప్తి* దీపించు , పా...
      వన కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. శంకరుల పదము.... *కార్తస్వర*.... నచ్చింది... వినియోగించితిని... వారికి ధన్యవాదాలు🙏

      ఇరువురు సన్న్యాసులలో
      ధరియించెనొకండు రాజతంబు , నొకడు బం....
      గరు గోచీలను, కార్త
      స్వర కౌపీనము ధరించు వాడె ధనికుడౌ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    5. ఇవ్వాళ కౌపీనానికి రాచ మర్యాద కలిగించిన అందరకీ లంగోటీల సంఘం వాళ్ళందరూ కలిసి సన్మాన సభ చేయాలని నిర్ణయించుకునేరని అభిజ్ఞ వర్గాల భోగట్టా (ట) :)


      జిలేబి

      తొలగించండి

  3. ఈ కురువృద్దుల చూడ
    న్నా కాంక్షయు తగ్గుచుండె నలమేనిదొరా!
    నాకిక చివ్వి వలదు ! బా
    వా! కౌపీనము ధరించు వాఁడెధ నికుఁడౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. అరిషడ్వర్గములు విడచి
    హరినామము మదిని దలచి యనవరతమ్మున్
    పరికాంక్షితుడై దిరుగుచు
    వర,కౌపీనము ధరించు వాడె ధనికుఁడౌ!!!

    వర = భూమి

    రిప్లయితొలగించండి
  5. 1)
    హరదీక్షాంతర నియమా
    చరణాసక్తున్ గురుండు శాసింపంగన్
    వర రత్నాంచిత కార్త
    స్వర కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ.
    (కార్తస్వరము = బంగారము; శివదీక్షలో ఉన్నవానిని కౌపీనం ధరించి రమ్మని దీక్షాగురువు శాసిస్తే రత్నాలు పొదిగిన బంగారు కౌపీనం ధరించి వచ్చాడట! వాడు ధనికుడు గాక దరిద్రు డౌతాడా?)
    2)
    సకలాన్నార్తుల క్షున్నివారణకళా సాంద్రుండౌనై కర్షకుం
    డకళంకోత్తమ జీవనంబు గడుపున్ హాటంక హారమ్ములం దా
    ల్చక యెల్లప్పుడు శాంతుఁడౌచు వివిధాశాసక్తి లేశమ్ముఁ జూ
    పక కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రెండవ పూరణలోని దోషాలను తెలియజేసిన డా. వెలుదండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    2. నా రెండవ పూరణ (సవరణతో....)
      సకలాన్నార్తుల క్షున్నివారణకళా సాంద్రుండునై కర్షకుం
      డకళంకోత్తమ జీవనంబున సువర్ణాలంకృతుల్ నెమ్మిఁ దా
      ల్చక యెల్లప్పుడు శాంతుఁడౌచు వివిధాశాసక్తి లేశమ్ముఁ జూ
      పక కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్.

      తొలగించండి
  6. (కాలడి గ్రామంలోని పెద్దలు ఆర్యాంబతో )
    వెరవకు మార్యాంబా ! శం
    కరు సన్న్యాసము గురించి ; ఘనుడౌ గురువౌ ;
    కరుణావాత్సల్యామృత
    భర ! కౌపీనము ధరించువాడె ధనికుడౌ .

    రిప్లయితొలగించండి


  7. శార్దూలము జిలేబి ఫేవరైట్ :)



    ఓ కౌంతేయ! కిరీటి! కయ్యమిది! ధర్మోద్ధారణంబైన నీ
    దౌ కర్తవ్యము!మానరాదు వినుమా ! దామమ్ము గా సైన్యము
    న్నా కింశారువు కూల్చ గోరితివయా ! నాదర్పమున్బోయె! బా
    వా!కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. అసలే లేని కాలం మిక్కిలి పెరిగిన జాలం
    నాగరిక మూలం
    కండలు చూపే వేలం కొవ్వును పరచగ గాలం
    రంగుల మేళం
    విలువలు లేని సమాజమున పూని కొలువగ
    వలువలనదె లెక్కించగన్
    జ్ఞానమను కౌపీనము దాల్చువాడె కద
    సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
  9. పరము ను గోరు చు నిరతము
    హరి పదము ల నాశ్ర యించి యతులి త భక్తి న్
    ది ర ముగ తప మొన రింప గ
    వర కౌ పీ న ము ధరించు వాడె ధనికుడౌ

    రిప్లయితొలగించండి
  10. కడు చిత్రము వాణిజ్యము !
    గడన గల ధనికుడు పేద గామారు కదా!!
    సుడి తిరుగగ విధి వశమున
    వడి కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ!!!

    రిప్లయితొలగించండి
  11. పరిపరి విధముల పూజలు
    వరమును పొందగ తపములు వ్యామో హమునన్
    హరిసేవ నుముని గినముని
    వర కౌపీనము ధరించు వాఁడె ధనికుఁడౌ

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2661
    సమస్య :: .......’’కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్.’’
    కౌపీనమును అంటే గోచిపాతను ధరించినవాడే సంపద గలవాడు ఔతాడు కదా అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సాక్షాత్తు పరమ శివుని అవతారమైన ఆదిశంకరాచార్యుల వారు కౌపీనపంచకమ్ (యతి పంచకమ్) అంటూ మహత్తరమైన ఐదు శ్లోకాలను రచించారు. వాటిలో

    *వేదాంత వాక్యేషు సదా రమంతః*
    *భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః*
    *అశోకవంతః కరుణైకవంతః*
    *కౌపీనవంతః ఖలు భాగ్యవంతః*

    *మూలం తరోః కేవల మాశ్రయంతః*
    అని తెలిపియున్నారు.
    కాబట్టి *ప్రజ్ఞానం బ్రహ్మ* *అహం బ్రహ్మాస్మి* మొదలైన వేదాంత వాక్యాలను గుఱించి ఆలోచిస్తూ ఆనందిస్తూ, అందరూ సమానమని భావిస్తూ, కారుణ్యాన్ని ప్రదర్శిస్తూ, భిక్షాన్నమును భుజిస్తూ సంతృప్తి పొందుతూ, చెట్టు క్రింద నివసిస్తూ, కౌపీనమును (గోచిపాతను) ధరిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవించేవాడే నిజమైన ధనవంతుడు అని విశదీకరించే సందర్భం.

    వినుడీ శంకరు బోధ, నేడె గనుడీ, వేదాంత వాక్యమ్ములన్
    గని లోలో రమియించువాడె, సముడే, కారుణ్య చిత్తుండె, భి
    క్షను సంతృప్తి భుజించువాడె, సుతరుచ్ఛాయాశ్రితుండే, ఘన
    మ్మని *కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-4-2018)

    రిప్లయితొలగించండి
  13. క్షణికములగు విభవములే
    యనుకొని మనమునను రోసి యానందముగా
    ననయము నట నివశించుచు
    వని,కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ !

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందఱకు నమస్సులు!

    అజుదర్పమ్మునడంచినట్టి స్మరు సంహారమ్ముఁ గావించి, య
    ద్రిజఁ బెండ్లాడియుఁ, దారకాంతకుఁ గనన్ బ్రేమమ్ముఁ జూపించి, వే
    భజనల్ సల్పెడి భక్తసంతతుల కైశ్వర్యమ్ము నందించి, సా
    మజకౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!

    రిప్లయితొలగించండి


  15. వినకోయి జిలేబీ నుడు
    వన,కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ
    యనుచున్ సన్నా సులు పలు
    కన! కష్టేఫలి! మనుగడ కదియే సృతియౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  16. ( ఆశారాం లాంటి బాబా‌‌లను ఉద్దేశించి... .. )
    కం:

    వనితల మానము దోచుచు

    ననయము నక్రమమున పలు యాస్తులను గడిం

    చిన బాబాలను గాంచు మ

    వని! కౌపీనము ధరించువాడె ధనికుడౌ


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి


  17. వినకే సోమరు లెల్ల పల్క, వినకే వీధి‌న్ జిలేబీల క
    ల్పన కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించిన
    న్ననుచున్ !కష్టపడంగ జీవితము నన్నాణ్యంబుగా దక్కునె
    ల్ల నగాధారన నిక్కమిద్ది విను మూలంబిద్ది నీ వృద్ధికిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కరణము లెల్లను గొప్పగ
    వెఱపుట కొఱకై మతించి బేల యొకండున్
    ధరణీశ్వర దీక్షకు బం
    గరు కౌపీనము ధరించు - వాడె ధనికుడౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. బం/ గరు లో బిందు పూర్వ “గ” కు “వా” కు యతి మైత్రి పరిశీలనార్హము.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
      *****
      రాజారావు గారూ,
      చివరిపాదంలో యతిదోషాన్ని సవరించండి.

      తొలగించండి
  19. కందం
    అనయము భోగమునందున
    తనరెడు వేమనకు విశ్వద ప్రమేయముతో
    నొనగూడ విరాగము! భా
    వనఁ గౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ!!

    రిప్లయితొలగించండి
  20. ప్రకటంబౌవివి ధా శ పాశము ల తా వర్జిoచుచు న్ మౌని యై
    సకలార్థ oబుల గడ్డి పోచలను చు న్ సన్యాసి గా మారి యు న్
    నిక ట ంబౌవని కేగి స్వచ్ఛత ప ము న్ నిష్ టా గ రి ష్ టా త్ముడా
    పక కౌ పీ నము దాల్చు వాడె గద సంపన్నుoడుద ర్కి oచిన న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      టైపు చేయడంలో ఇబ్బంది పడినట్లున్నది. "నిష్ఠా గరిష్ఠ" అనండి.

      తొలగించండి
  21. అనిశము సామి తలపులే
    పనిగతలచుచుండు పరమపదకామికులౌ
    జనతకు నేమియు నాశిం
    పని కౌపీనము ధరించువాడె ధనికుడౌ

    రిప్లయితొలగించండి


  22. పనియున్ బోయె జిలేబీ
    మునినయ్యెదనింక ముక్కు మూసుకొనెద ! చు
    వ్వన దస్కము దక్కన్, తె
    వ్వన కౌపీనము ధరించువాడె ధనికుడౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. అనయము సంపా దనకై
    తన సమయము వాడు కొనుచు తనియుచు నెపుడున్
    వినియోగించక ధనము న
    వని కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ

    రిప్లయితొలగించండి
  24. పరమే ధ్యానముగ దలచి
    విరాగ మతియై జనుచును వీధులవెంటన్
    కరమున భిక్షాపాత్రను
    వరకౌపీనము ధరించువాడె ధనికుండౌ

    రిప్లయితొలగించండి
  25. ఒక్క ధనంబది చాలదు
    ప్రక్కన సుగుణమ్ము లుండి పరఁగుచు ధరణిం
    జక్కని దాలిమి, విడుచుచు
    వాక్కౌపీనము, ధరించువాఁడె ధనికుఁడౌ

    [వాక్ +కౌపీనము = వాక్కౌపీనము; కౌపీనము చెడ్డ కార్యము]


    ఆకారమ్మున నద్రి సన్నిభము దివ్యాగార మత్యున్నతం
    బే కంఠాభరణమ్ము లంచితములై యింపారఁ గన్పట్టగం
    బ్రాకారమ్ములు రత్న యుక్తములు తప్తంబైన బంగారమ
    మ్మా కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. మా చిన్నప్పటి విద్యాసంపన్నుడైన బడిపంతులు (1950):

    సరకుల్ లేవని వంటకై సతియు హా! సాధించుచుండంగ తా
    కరువున్ భత్యము జీతమున్ కలిపి లెక్కల్ వేసి భాగించుచున్
    బరువుల్ మోయుచు దించుచున్ కొలది సాపాటున్ భుజించన్ పరం
    పర కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!


    కరువున్ భత్యము = DA
    పరంపర = పదేపదే (అదే అదే)
    కౌపీనము = గోచి పోసి కట్టిన ధోవతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      1972 నుండి 2008 వరకు నా పరిస్థితి అటువంటిదే!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      1972 నుండి 2008 వరకు నా పరిస్థితి అటువంటిదే!

      తొలగించండి
    3. ఇది మా నాన్నగారిని తలచుకొని వ్రాసిన పద్యము సార్!

      తొలగించండి
  27. అతిగా సొమ్ములకై తపించి ప్రజ నన్యాయమ్ముగాదోచుచున్
    సతికై పుత్రులకై ధనమ్ము కడు తోషమ్మొంది యార్జించితిన్
    మతిపోయెన్ గని వారి స్వార్థమును సన్మార్గంమునన్ బోయి స
    న్మతి కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
  28. గురువర్యులకు నమస్సులు.ధన్యవాదములు.అసనారె

    రిప్లయితొలగించండి
  29. తరచుగ కాశీ యాత్రన
    వర కౌపీనము ధరంచు వాడె ధనికుడౌ
    జరిగెడి తంతై పెళ్లిన
    తరతరముల సంప్రదాయ ధర్మము గనగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యాత్రను... పెళ్ళిని' అనండి. అదంతాలకు 'ను', ఇదంతాలకు 'ని', ఉదంతాలకు 'న' చేరతాయి.

      తొలగించండి
  30. బలితో శుక్రాచార్యుని మాటలు గా

    అరుదెంచెన్ గద బాపడై హరియె నిన్నర్థింపనిచ్చోటికిన్
    ధరణిన్ గోరెను గాదె మూడడుగులా దామోదరుండే, యిటన్
    గురువున్ నేననిచెప్పుచుంటి గద సంకోచమ్ముతో నాలకిం
    పరు కౌపీనము దాల్చువాడె కద సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
  31. లోకుల బాధలు తీర్చుచు
    నాకలి యనువారి కెల్ల యన్నమిడుచుచున్
    దా కలిమిని గోరక, నధి
    పా! కౌపీనము ధరించు వాడె ధనికుఁడౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...యన్నము నిడుచున్" అనండి.

      తొలగించండి
  32. సిరులన్ మానియు దానమున్ నడుగు|కాశీ యాత్రసంధర్భమున్
    మరువన్ జాలని మంచి కార్యమది సన్మానంబు లాపై నగున్
    వర కౌపీనము దాల్చువాడెగద సంపన్నుండు దర్కించినన్
    కరుణా పూరిత కన్యాదాత నిడు సంకల్పంబు కళ్యాణమున్|

    రిప్లయితొలగించండి
  33. సౌకర్యము లుండియునూ
    తాఁ కోరి దురాశ చెందు ధనికుని కంటెన్
    కైకొని వరముగ బ్రతుకును
    చౌకౌ పీనము ధరించువాఁడె ధనికుఁడౌ
    (పీనము = ఆనందము, సంతోషము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉండియునూ' అన్నది సాధువు కాదు. 'తాన్ + కోరి = తాఁ గోరి' అన్నపుడే అరసున్న వస్తుంది.

      తొలగించండి
  34. పరివారంబులకెల్ల యన్నమిడుచున్ పాలించునిల్లాలితో
    పరమేశార్చన సల్పుచున్ కొలువునన్ పారాశరాదుల్ సదా
    పరతత్వంబును చింతజేయ జలజాపాలుండు నాప్తుండుగా
    మరి కౌపీనము దాల్చువాడె కద సంపన్నుండు దర్కించినన్


    శివునకు, ఆరణ్యవాసి అయిన ధర్మరజుకు అన్వయము

    పారాశరాదుల్ = పరాసరస్య అపస్యం పుమాన్ పారాశరః

    1) అన్నపూర్ణా సమేతుడై, విష్ణువును ఆరాధన చేస్తు, నిత్యము మునులకు పరబ్రహ్మ జ్ఞానము బోధించుచు, ధనపతి అయిన కుబేరుడు మిత్రునిగ కలిగి కౌపీన ధారి అయిన శివుడు

    2) ఆక్షయ పాత్ర సహాయమున, అందరిని అదరిస్తున్న ద్రౌపతి సమేతుడై ఈశ్వరార్చన చేస్తు, వ్యాసమహర్షి, మర్కండేయదుల చేత సుశిక్షితుడై, లక్ష్మీ పతి అయిన కృష్ణుడు మిత్రునిగా కలిగి వనవాస సమయమున కౌపీన ధారి అయిన ధర్మరాజు

    రిప్లయితొలగించండి
  35. వరమిమ్మన హరి భక్తుడు
    పరమాత్ముని తెలియ గోరి పంతము తపమున్
    చేరగ రాడా హరియే
    మరి కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ


    Dr H Varalakshmi, Bangalore

    రిప్లయితొలగించండి
  36. డా.ఎన్.వి.ఎన్.చారి
    సకలాధీశుడనంచునీపృథివి నాసాం తంబు మ్రింగేయుచున్
    ప్రకటించెన్ తన కాంక్షలన్ తలచి దౌర్భాగ్యంబు నిత్యంబుగా
    వికటించన్విధి తెల్పెసత్యమును సర్వేశాత్ముమార్గంబు ద
    ప్పక కౌపీనము దాల్చువాడెకద సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
  37. మమకారంబును వదలుచు
    రమ! కౌపీనము ధరించువాడె ధనికుడౌ
    నమలినమనసున వేమన
    కుమతులదాజేరకుండ గోచిని బెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  38. తెల్ల దొరల నెదుర్కొని దేశ మాత
    కర యుగళముల కున్న సంకలియ తెంచి
    దేశమునకు స్వాతంత్ర్యము దెచ్చి నట్టి
    గాంధి తాత కౌపీనమే గట్టె, విశ్వ
    మందు గలిగె కీర్తి ధనమ్ము,మన్నికైన
    వాసి కౌపీనము ధరించు వాఁడె ధనికుఁ
    డౌను జనమెల్ల తరఛి చూడ యిలలోన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. సమస్యాపాదాన్ని కందంలో కాకుండా తేటగీతిలో ఇమిడ్చిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
  39. డా.పిట్టా సత్యనారాయణ
    చీరకు బట్టకు జీ యె
    స్టీరుసుములు నైటి బెడద సీ.బీ.యైలున్
    గోరిన గానని రూకలు
    వారక గౌపీన ధారి వర ధనికుండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీ ఈ పద్యం చూసేక బీజేపీ వారు కౌపీనంపైన కూడా జీయెస్టీ వేసెస్తారేమండోయ్ :)


      అదురహో

      జిలేబి

      తొలగించండి
    2. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్య పాదాన్ని మార్చారు.

      తొలగించండి
    3. డా.పిట్టా సత్యనారాయణ
      జిలేబి గారికి మరియు గురువు గారికి ధన్యవాదములు

      తొలగించండి
  40. డా.పిట్టా సత్యనారాయణ
    అరయన్ జీరల పేచి నారిని గొన న్నౌచిత్యమౌ ఖర్చులున్
    వెరచే వాస్తికి దొడ్డవౌ రుసుములౌ వేర్వేరు బండారపుం
    ధరలన్ జీ.యెసుటీల మోత, ఋణముల్ దాగొన్న వడ్డీలు వేల్
    వర కౌపీనము దాల్చువాడెగద సంపన్నుండు దర్కించగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెరచేవు' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  41. శంకల్ క్లేశము తాపమాగ్రహముతో శాపాలు ధూపాలతో
    సంకోచమ్మది లేకయే వడివడిన్ సంతల్ కు రమ్మంచుచున్
    వంకల్ బెట్టక చీరలున్ నగలు లేపండంచు చుండంగ...పా
    పం! కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్

    సంతలు = sale! sale! sale!

    రిప్లయితొలగించండి
  42. అరయన్వేమనయోగి దానెపుడుబాహాటంబుగా గోచినే
    ధరియించున్గద మానవా! తెలియుమో ధాత్రిన్సదా యాతడే
    వరకౌపీనముదాల్చువాడుకద,సంపన్నుండు దర్కించిన
    న్నిరవు న్నొప్పగ నెప్పుడున్ధనము వర్షించున్నతండే యిలన్

    రిప్లయితొలగించండి
  43. ఈ రోజు సమస్య అద్భుతమైనది! పూరణలన్నీ ప్రశస్తముగా ఉన్నాయి!
    గురువుగారికి, సహ కవిమిత్రులకు, విద్వన్మణులకు అందరికీ అభినందనలు! 👏👏👏💐💐💐🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  44. కరమున కమండలముతో
    నరుదెంచెను శ్రీశుడచట నత్యుత్సుకతన్
    వరచేలంబులు వలదని
    వరకౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.


    పిసినారి తనము తోడను
    వసనములను విడిచి తాను వసుధా స్థలిలో
    నసతము నింటనుబయటను
    వెస కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.


    హరియే వచ్చెను బలికడ
    కు రయంబున బిక్షకోరి కువలయమందున్
    నరయగ సతతము తమితో
    వర కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.

    తనువే యశాశ్వత మనుచు
    మనమున నెంచక సతతము మాధవుసేవన్
    వినయంబున గడుపుచు తా
    చిన కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.

    రిప్లయితొలగించండి
  45. (2)
    మ్రొక్కన్ దిక్కయి నిల్చువాఁడునయి, చిద్రూపుండునై, జాలి పెం
    పెక్కంగన్ దమితోడఁ దాపసులకున్ బ్రీతిన్ వరాలిచ్చు వే
    ల్పొక్కండై, తనదౌ విరూపమున కెప్డున్ జింతిలం బోక, తా
    దిక్కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే! ముందుగా సమ్యక్+కౌపీనము అనే విధంగా రాసుకొని, చివరగా, దిక్ అని మార్చినాను. యతిభంగమును గమనించలేకపోయాను. మన్నించండి. తెలిపినందులకు ధన్యవాదములు!

      సవరించిన పూరణము:
      మ్రొక్కన్ దిక్కయి నిల్చువాఁడునయి, చిద్రూపుండునై, జాలి పెం
      పెక్కంగన్ దమితోడఁ దాపసులకున్ బ్రీతిన్ వరాలిచ్చు వే
      ల్పొక్కండై, తనదౌ విరూపమున కెప్డున్ జింతిలం బోక, స
      మ్యక్కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!

      తొలగించండి
    2. ఆర్యా! అద్భుతమైన పూరణ! యతుల గొడవ వదిలేస్తే దిక్కౌపీనము ప్రయోగము నాకు చాల నచ్చినది! దిగంరుడైన ( దిక్కులను అంబరముగా దలవాడు) ( సర్వవ్యాపకత్వము గలవాడు) ఈశ్వర చైతన్యాన్ని దర్శింప జేశారు! 🙏🙏🙏🙏

      తొలగించండి
  46. మత్తేభవిక్రీడితము
    అణుమాత్రంబగు కొండ జూడ హరుడైయాకాశ మంతైన నా 
    యనఁ బ్రీతిన్ స్మరియించి నంతఁ గని మోక్షాదుల్ ప్రసాదించనన్
    దను తీరెన్ రమణుల్ ప్రశాంత తిరువణ్ణామాద్రి ధ్యానంపు భా
    వనఁ గౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్

    రిప్లయితొలగించండి
  47. *26-4-18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. ..సమస్య
    ...కౌపీనము దాల్చువాఁడె కద
    సంపన్నుండు దర్కించినన్
    (ఛందో గోపనం)

    సందర్భము:
    వైశాఖే మాసి కృష్ణాయాం
    దశమీ మంద సంయుతా
    పూర్వ ప్రోష్ఠ ప్రదా యుక్తా
    తథా వైధృతి సంయుతా

    తస్యాం మధ్యాహ్న వేళాయాం
    జనయామాస వై సుతమ్
    వైశాఖమాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు శనివారాన పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో పగటిపూట అంజనీదేవికి సుతుడు (ఆంజనేయుడు) జన్మించినాడు.

    మాణిక్య కుండలధరం
    దివ్య పట్టాంబరాన్వితమ్

    కౌపీన కటిసూత్రాభ్యామ్..
    అతనికి పుట్టినప్పుడే కౌపీనం కటి సూత్రం (మొలతాడు) వున్నవి. మణి కుండలములు, పట్టు బట్టలు ధరించినాడు.

    వజ్ర సంహననం కపిమ్
    వజ్రం వంటి శరీరం కలిగివున్నాడు.

    కౌపీనం వైరాగ్య సంకేతం. స్వర్ణాలంకా రాలు ఐశ్వర్యానికి సంకేతాలు. ఈ రెండూ ఒకటి వున్నచోట మరొక టుండటం అరుదు. హనుమంతునికి రెండూ వున్నాయి. పుట్టినప్పుడే వుండటం ఇంకా విశేషం.
    కాబట్టి ఆంజనేయునికి మించిన సంపన్ను డున్నాడా!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మొల త్రాడున్ గలవాడు, పట్ట పగలే
    పుట్టెన్ గదా పట్టు బ
    ట్టలతో నొప్పెడు వాడు, నంజని యదృ
    ష్టం బౌచు మాణిక్య కుం
    డలముల్ గల్గిన వాడు, వజ్రమయ పిం
    డంబో యనంగా విని
    ర్మల కౌపీనము దాల్చువాఁడె కద సం
    పన్నుండు దర్కించినన్!

    2 వ పూరణము:

    .. .. .. ..సమస్య
    ...కౌపీనము దాల్చువాఁడె కద
    సంపన్నుండు దర్కించినన్
    (ఛందో గోపనం)

    సందర్భము: ఆంజనేయుని జన్మ మాసాదులను గుర్తు పెట్టుకోవడానికి వీలుగా నీ పద్యం కూర్పబడింది.
    వైశాఖే మాసి కృష్ణాయాం
    దశమీ మంద సంయుతా
    పూర్వ ప్రోష్ఠ ప్రదా యుక్తా
    తథా వైధృతి సంయుతా

    తస్యాం మధ్యాహ్న వేళాయాం
    జనయామాస వై సుతమ్
    వైశాఖమాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు శనివారాన పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో పగటిపూట అంజనీదేవికి సుతుడు జన్మించినాడు.
    కాబట్టి ఆంజనేయునికి మించిన సంపన్ను డున్నాడా!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అల వైశాఖము కృష్ణ పక్షము దశ
    మ్యానంద మధ్యాహ్న మం
    ద లస ద్వారమునందు సర్వమయుడై
    తత్త్వజ్ఞుడై శ్రేష్ఠుడై
    బలవంతుండయి యంజనీ తనయుడున్
    ప్రాదుర్భవించెన్ విని
    ర్మల కౌపీనము దాల్చువాఁడె కద సం
    పన్నుండు దర్కించినన్!

    మందవారము=శనివారము
    (మంద లసత్ వారము.. అని వాడబడింది)

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  48. *26-4-18* 3 వ పూరణము:
    .. .. .సమస్య
    *"...కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ"*
    ఛందో గోపనము

    సందర్భము:
    అష్ట సిద్ధి నవ నిధికే దాతా
    అసవరదీన్హ జానకీ మాతా
    అని హనుమాన్ చాలీసాలో తులసీదాసు కొనియాడినాడు.
    అష్టసిద్ధులు నవనిధులు భక్తులైన వారికి ప్రసాదించే శక్తి సీతామాత ఆంజనేయునికి ప్రసాదించిన దట!
    ఇక ఆతడు పుట్టగానే గోచీతో పుట్టినా డంటేమాత్రం కొరత యే మున్నది?
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ధర నష్ట సిద్ధులును, నిధు
    లరసి యొసగు శక్తి సీత యందించెను.. ప
    య్యర కుఱ్ఱనికి కొఱత యెది?
    వర కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ!

    పయ్యర కుఱ్ఱడు= వాయు పుత్రుడు.. ఆంజనేయుడు

    4 వ పూరణము:

    సందర్భము:సులభము.
    శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి "ధనమా పుష్కలమౌ తపోధనము.." అనే పద్య ప్రేరణతో..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    వర సంతృప్తియె ధన మగు..
    ధర నది లేకున్న సంపదలు నెన్నున్నన్
    కొరతయె.. సంతృప్తి కలుగ
    వర కౌపీనము ధరించు వాఁడె ధనికుఁడౌ

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  49. డా. వెలుదండ వారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి